ఐశ్వర్యమును, మహాత్మ్యము; వీర్యము (ఐశ్వర్యమనగా సంపద, ఈశ్వరత్వము - అన్నింటి మీద ప్రభుత్వము కలిగియుండుట. మహత్మ్యము అనగా గొప్ప శక్తి కలిగియుండుట; వీర్యము - పటుత్వము కలిగియుండుట. ఇవి కలవాడు భగవంతుడు).
జ్ఞానాది కల్యాణగుణ సంపత్తిం.
(జ్ఞానము - చిత్ర విచిత్రమైన సృష్టిని చేయుటలో అవసరమైన జ్ఞానము. ఇటువంటి జ్ఞానము మొదలగు కల్యాణగుణములు కలిగియుండువాడు).
(ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, వైరాగ్యము - ఈ ఆరు లక్షణములు గలిగి యుండుట భగము అని చెప్పబడుచున్నది. ఇవి కలవాడు భగవంతుడు).
భగవచ్ఛబ్ద వ్యాచ్యాని వినా హే యైర్గుణాదిభిః ||".
"జ్ఞానైశ్వర్య శక్తిబల వీర్యతేజోభిః సదా సంపన్నః". (శ్రీ శంకరః).
"జ్ఞానం జ్ఞప్తిః అర్థ పరిచ్ఛిత్తిః; ఐశ్వర్యం ఈశ్వరత్వం, స్వాతంత్ర్యం; శక్తిః తదర్థ నిర్వర్తన సామర్థ్యం, బలం సహాయ సంపత్తిః; వీర్యం పరాక్రమవత్వం; తేజస్తు ప్రాగలభ్యం అదృష్యత్వం - ఏ తే చ షడ్గుణాః సర్వ విషయాః సర్వదా భగవతి వర్తంతే ". (శ్రీ ఆనందగిరి)
(1. జ్ఞానము అనగా జ్ఞప్తి, అర్థ పరిచ్ఛేదము;
2. ఐశ్వర్యము అనగా ఈశ్వరత్వము, అన్నింటికి ప్రభువై యుండుట, అన్నింటిని శాసించుట, అనగా, తాను ఇతరుల ఆధీనములో లేక స్వతంత్రుడుగా నుండుట.
3. శక్తి - అనగా అన్నింటిని శాసించుటయందు సమర్థత కలిగియుండుట.
4. బలము అనగా సహాయపడుటకు తగిన వాడై యుండుట - అజేయుడు-
5. వీర్యము - అనగా పరాక్రమము కలిగియుండుట - సృష్టిని ఎంత చేసినను - ఎన్ని వస్తువులను సృష్టించినను - వాటిలో తన వీర్యమును (వాటన్నింటిలోను తన చైతన్య శక్తిని) ఉంచినను తరగని బీజము కలవాడు, వీరుడై యుండుట, 6. తేజస్సు - హేయమైన గుణము లేక ఈ ఆరు గుణములు ఎల్లపుడు ఎవనియందు వర్తించునో అట్టివాడు భగవంతుడు).
(ఐశ్వర్యము, ధర్మము, యశస్సు. లక్ష్మి, వైరాగ్యము, మోక్షము - ఈ ఆరు గుణములు భగశబ్దమునకు అర్థములు - ఈ ఆరు గుణములు సమగ్రముగా, ఎల్లపుడు, అడ్డులేకుండునట్లు ఎవనియందు వర్తించునో అతను భగవంతుడు).
జ్ఞానవైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా ||".
"వసంతి యత్ర భూతాని భూతాత్మస్య ఖిలాత్మని |
సర్వభూతేష్వ శేషేషు వకారార్థస్తతో అవ్యయః ||".
(ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, వైరాగ్యము - ఈ ఆరు గుణములు భగ శబ్దమునకర్థము. భూతములన్నింటికి ఆత్మ అయిన ఎవనియందు సమస్త భూతములు నివసించియున్నవో, ఎవడు సమస్త భూతములందు నివసించియున్నాడో, అతడు భగవంతుడు - 'భగ' శబ్దమునకు 'వ' కలియుటవలన ఆ గుణములు కలవాడని అర్థమగుచున్నది.
(పైన చెప్పబడిన ఆరు విధముల ఐశ్వర్యము కలవాడు భగవంతుడు).
"నిరతశయైశ్వర్య సంపన్నః "; సమగ్రైశ్వర్యాది సంపన్నః
(తనకంటె హెచ్చు అగు ఐశ్వర్యము ఇతరులకు లేనివాడు కనుక నిరతిశయైశ్వర్యము కలవాడు). "(నిరతిశయమైన ఐశ్వర్యము మొదలగు గుణములు సమగ్రముగా గలవాడు).
(తనయొక్క జ్ఞాన, శక్తి, వీర్య, బలైశ్వర్య తేజస్సులకు మించిన ఈ ఆరు గుణములు ఇంకెవరకి లేనివాడు అగుటచేత వాటికి తానే నిధి అయినవాడు) - అచింత్తైశ్వర్యః - చింతించుటకు మించిన ఐశ్వర్యము కలవాడు).
వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి||".
"అత్ర భూతానామితి ప్రత్యేకం సంబధ్యతే |
ఉత్పత్తి వినాశశబ్దౌ తత్కారణస్య అపి ఉప లక్షికౌ |
ఆగతీ గతీ ఆగామిన్యౌ సంపదాపదౌ. ఏతాదృశ భగవత్ శబ్దార్థః శ్రీవాసుదేవే ఏవ పర్యవసతి". (శ్రీమధుసూదనః)
(భూతములకు వాటికి కారణములైన మహదాదులకు ఉత్పత్తి వినాశములకు కారణమైనవాడు, వాటిని గుఱించి బాగుగా తెలిసినవాడు, వాటి గుఱించి జ్ఞానము గలవాడు. భూతములకు కలుగు కష్ట సుఖములను తెలిసినవాడు. ఇట్టి లక్షణములు గలవాడు - సర్వ భూతములందు నివసించువాడగు వాసుదే వునియందే కలవు. అందుచేత భగవంతుడనగా వాసుదేవుడే).
విద్యా విద్యాంచ యోవేత్తి స భగవానితి కథ్యతే ||.
(భూతములయొక్క జననమరణములను, గమనా గమనములను, విద్యను అవిద్యను శాస్త్రముద్వారా తెలుసుకొనినవాడు భగవంతుడని చెప్పబడుచున్నాడు -).
(భగము అనగా తేజస్సు, షడ్గుణైశ్వర్యములలో నొకటి, అది కలవాడు భగవంతుడు).
మైత్రేయ భగవచ్ఛబ్ద సర్వకారణ కారణే |
సంభర్తేతి తథా భర్తా భకారార్థో(అ)న్వయాన్వితం |
నేతా గమయితా స్రష్టా గకారార్థః తథా మునే |
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ శ్శ్రియః |
జ్ఞాన వైరాగ్య యోశ్చైవషణ్ణాం భగ ఇతీరణా |
వసంతి యత్ర భూతాని భూతాత్మన్యఖిలాత్మని |
స చ భూతేష్వ శేషేషు వ కారార్థః త త అవ్యయః |
జ్ఞానశక్తి బలైశ్వర్యవీర్య తేజాంస్యశేషతః |
భగవచ్ఛబ్ద వాచ్యాని వినా హే యైర్గుణాదిభిః |
ఇత్యాదినా శ్రీమత్పరాశరోక్త ప్రత్యక్షర సముదాయ నిర్వచనావగతాః సంభర్తృత్వ, భర్తౄత్వ, నేతృత్వ,గమయితృత్వ, స్రష్టృత్వ, సర్వ శరీరకత్వ, సర్వ భూతాంతరాత్మత్వ, నిరస్త నిఖిలదోషత్వ, షాడ్గుణ్య పూర్ణత్వాదయః అర్థాః అత్ర వివక్షితాః. తత్ర సంభరణం నామోపకరణ సంవిధానం, తచ్చ ప్రకృతి పురుష కాలానాం కార్యోత్పత్తి యోగ్య తా సాధనరూపం భర్తృత్వం నిరుపాధిక స్వామిత్వం, నేతృత్వం గమయితృత్వరూపం స్థితి కర్తృత్వం, గమ యితృత్వం సంగమ యితృత్వ రూపః సృష్టికర్తృత్వం యశో గుణవత్తాప్రదా; శ్రీః భోగ్య సంపత్; వైరాగ్యం విరక్తిః, సా చ పరిపూర్ణత్వాత్ అనాదర రూపా. ఏవంచ అనుష్టితైః ధర్మైః ప్రాప్యస్య భగవతః ఏవం విధిత్వాత్, తత్ప్రాప్తేశ్చ నిఃశ్రేయసరూపత్వాత్ తత్ప్రాప్తి సాధన భూతా ధర్మాః పరమపురుషార్థిభిః అవశ్యం అనుష్టేయాః".
(శుద్ధుడు - నిర్మలుడు, ప్రకృతి కలియనివాడు - మహాభూతము, సమస్తమైన కారణవస్తువులకు కారణమైనవాడు, పరుడు అయిన పరబ్రహ్మమే భగవంతుడని చెప్పబడుచున్నాడు - భగవంతుడను శబ్దమునకు నిర్వచనమీ క్రింద చెప్పబడిన విధముగా నున్నది : - భగవంతుడను శబ్దములోని 'భ' కారము ‘సంభర్త, భర్త' అని తెలియచేయును; 'గ' కారము "నేత, గమయితా" (పొందించువాడు - పరమపదమును పొందించువాడు, శరీరములోపలనుండి తన శక్తిచేత కార్యములను చేయించువాడు), స్రష్టా (సృష్టి చేయువాడు) అని తెలియ చేయును "ఐశ్వర్యస్య" అని మొదలుకొని " హే యైర్గుణాదిభిః" వరకు గల శ్లోకములకు అర్థమునకు పైన చెప్పిన 1 నుండి 5 వరకు గలవి చూడవలెను - ఈ శ్లోకముల వ్యాఖ్యానము ప్రకారము పరబ్రహ్మయొక్క సంభర్తృత్వము, భర్తృత్వము, నేతృత్వము, గమయితృత్వము, స్రష్టృత్వము, (సృష్టి చేయుట), సర్వ శరీరకత్వము (అందఱి శరీరములు తానే యగుట - విశ్వరూపత్వము), సర్వభూతాంతరాత్మత్వము, (సమస్త భూతములలోను తానే అంతరాత్మగా నుండుట), నిరస్త నిఖిల దోషత్వము (ఏ విధమైన దోషము లేకుండుట - నిర్మలత్వము, శుద్ధత్వము) ఐశ్వర్యము మొదలగు షడ్గుణములు కలిగియుండుట యను లక్షణములు తెలుప బడినవి. ఇవి కలవాడు భగవంతుడు. పైన చెప్పిన లక్షణములలో 'సంభరణ’ మనగా ఉపకరణ సంవిధానము - ప్రకృతి పురుషుల సం యోగమువలన, కాలానుక్ర మమువలన కారణవస్తువునుండి కార్యవస్తువును పుట్టింప చేయుట. 'భర్తృత్వము’ (అన్నింటికి భర్త, ప్రభువు అయి యుండుట) అనగా, అన్నింటిలో నున్నప్పటికీ ఏ విధమైన ఉపాధి లేకనే అన్నింటికీ స్వామి, ప్రభువుగా నుండుట. "నేతృత్వము", "గమయితృత్వము" అనగా స్థితికర్త యగుట - ప్రపంచము యొక్క స్థితి కాలములో దానిని. దానిలోని వస్తువులను, క్రమముగా నడుపుట. "గమయితృత్వము" అనగా సంగమము చేయుట - ప్రతి వస్తువులోనున్న ప్రకృతి పురుష అంశలను కలుపుట. "సంహర్తృత్వము" అనగా సంహారము చేయుట - ప్రతి వస్తువును దాని కాలపరిమితి గడిచిన తర్వాత దాని కారణ వస్తువులో లయింపచేయుట. ఆ ప్రకారముగానే ప్రళయకాలమందు ప్రపంచ మంతటిని - దానిలోనున్న అన్ని వస్తువులతో గూడ తనలోనికి లయింపచేయుట. "స్రష్టృత్వము" అనగా కారణ వస్తువులో నుండి కార్య వస్తువులను ఉద్గమించునట్లు, పుట్టినట్లు చేయుట - లేక సృష్టింపచేయుట - అంతము లేకుండ చేయుచుండుట, 'శ్రీ' అనగా భోగించవలసిన వస్తువులు." "వైరాగ్య" మనగా దేనియందును అనురాగము లేకుండుట - అన్నింటి యందును విరక్తి పొందుట. భగవంతుడీ విధమైన ధర్మములు గలవాడు అగుటచేత అతనిని పొందుటయే నిఃశ్రేయసము).
(ఐశ్వర్యము మొదలగు ఆరు గుణములకు ఈ క్రింద విధముగా కూడ అర్థము చెప్పబడినది : -
’ఐశ్వర్యమ’నగా చరాచర రూపములు తానే యగుట. (విభూతి). 'వీర్య' మనగా ఇంద్రియములన్నింటిని వాటి వాటి పనులలో ప్రేరేపించుట. 'కీర్తి' యనగా వేదములద్వారా భగవత్తత్వమును బోధించుట. 'శ్రీ' యనగా సచ్చిదానందములు మూడును ఒకటే అయి యుండు సంపద. 'జ్ఞానము' అనగా, పరతత్వము ఒకటేయని, జీవ బ్రహ్మలకు భేదములేదని, బోధించుట. 'వైరాగ్యము' అనగా, అన్నింటియందును, అన్ని ప్రదేశములందును సాక్షియైయు యుండుట, దేనితో నైనను సంబంధములేక తటస్థుడై యుండుట - ఈ ఐశ్వర్యము మొదలగు గుణములు అన్నియు భగవచ్చబ్ధ వాచ్యములు - భగవంతుని చెప్పు శబ్దములే).
(సర్వజ్ఞత్వము, నిత్య తృప్తి, అనాదిబోధ, సర్వ స్వతంత్రము, నిత్యమలుప్తము, అనంతము అను ఆరు శక్తులు గలవాడు భగవంతుడు - లేక - మహత్వ, ధైర్య, కీర్తి, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములు అను ఆరు విధముల ఐశ్వర్యము గలవాడు భగవంతుడు).
(వేదములచే ఇంద్రుడు మొదలగు రూపములు గలవాడనిన్నీ, ఉపనిషత్తులచేత బ్రహ్మానిన్నీ, సాంఖ్యులచేత పురుషుడనిన్నీ, యోగులచేత పరమాత్మయనిన్నీ, సాత్వతులచేతభగవంతుడనిన్నీ చెప్పబడుచున్నవాడే భగవంతుడు). (ఇన్ని విధములుగా చెప్పబడినవాడొక్కడే అతడే భగవంతుడు).
"త్రయ్యా అపూర్వ భావరూపయా తత్కర్మారాధ్యత్వేన, ఉపనిషద్భిః బ్రహ్మభావైః (భాగైః) సర్వ కారణత్వాదినా, సాంఖ్యైః పురుషత్వేన, యోగైః సర్వోపాస్యత్వేన, సాత్వతైః పరమై కాంతిభిః ప్రాప్యప్రాసకతయా చ ఉపగీయమానం మహాత్మ్యం యస్యసః ".
(వేదముననుసరించువారు అందులోని కర్మకాండలో చెప్పబడిన ఇంద్రాదులున్నూ, ఉపనిషత్తులలో చెప్పబడినట్లు అన్నింటికి కారణమైన బ్రహ్మ అని చెప్పబడువాడున్నూ, యోగులు ఎవరి గుఱించి ఉపాసన చేయుదురో, ఆ దేవతయు, పరమైకాంతికులైన సాత్వతులు ప్రాప్యప్రాపక భావముతో కొలుచు భగవంతుడున్నూ (భగవంతుడు ప్రాప్యుడు - పొందతగినవాడు, భక్తులు ప్రాపకులు, భగవంతుని పొందువారు) - ఈ అందఱూ - ఎవరెన్నివిధములుగా ఆరాధించినా, ఏ పేరు పెట్టినా - ఒకడే అతనే భగవంతుడు).
బ్రహ్మేతి పరమాత్మేతి చ భగవానితి కధ్యతే ||.
(తత్వమును తెలిసినవారు - బ్రహ్మజ్ఞానము కలవారు - తత్వమే - అన్నింటిలోనున్న ఒకేతత్వము బ్రహ్మయని, పరమాత్మయని, భగవంతుడు అని చెప్పుదురు -)
జ్ఞాన వైరాగ్య యోశ్చాపి షణ్ణాం భగ ఇతీంగనా |
నిత్యమ ప్రతిబంధేన వర్తతే యత్ర షడ్విధం |
సమగ్రైశ్వర్య ముఖ్యం తద్భగాఖ్యం భగవానితి |
శుద్ధే మహావిభూత్యాఖ్యే పరబ్రహ్మణివర్తతే |
శ్రీకృష్ణే భగవచ్ఛబ్దః సర్వకారాణ కారణే |
అన్యత్ర భగవచ్ఛబ్దః ఉపచారేణ వర్తతే ||". (గీతాభావప్రకాశము - 2 - 12 to 15)
(ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము - ఈ ఆరు గుణములు సమగ్రముగానుండుట భగశబ్దమునకర్థము - అవి అడ్డులేకుణ్డ ఎక్కడ ఉండునో అది భగవంతుడు - అవి శుద్ధము, మహావిభూతి, సర్వకారణ కారణుడు అగు పరబ్రహ్మముండు వర్తించును. అట్టివాడు సమస్త కారణవస్తువులకు కారణమైనవాడు శ్రీకృష్ణుడు కనుక భగవంతుడనగా శ్రీకృష్ణుడు - ఇతరములను భగవంతుడని చెప్పుట ఔపచారికమే).
తస్మిన్నేవ బ్రహ్మ శబ్దో ముఖ్యోవృత్తో, మహామునే ||".
(వేదములో పరమాత్మయే భగవంతుడని చెప్పబడియుండుటవలనను, ఐశ్వర్యము మొదలగు ఆరు గుణములు కలిగియుండుటవలనను, శ్రీమహావిష్ణువే భగవంతుడని ఆ భగచ్ఛబ్దము ముఖ్య వృత్తిగా ఉపయోగించబడినది).
"యస్మిన్ ప్రయుజ్యమానే తు గుణయోగః సుపుష్కలః తత్రైవముఖ్యవృత్తో(అ)యమన్యత్రహ్యుపచారితః ||". (ఇతి గరుడపురాణే)
(భగము అనుమాటకు అర్థమైన షడ్గుణైశ్వర్యములు అన్నియు పుష్కలముగా ఒకేదానియందు - దేనియందుండునో అదే భగవంతుడు అను పదమునకు ముఖ్యవృత్తి - ఇతరములగుఱించి ఈ శబ్దము వాడినప్పుడు అక్కడ అది ఔపచారికమే యగును).
గుణాః సాకల్యేన ప్రభవతిసదా యత్ర విమలాః |
ప్రతిష్టాం సంప్రాప్తా భగవతి పదే తం నిరుపమం |
శ్రయే కృష్ణం లక్ష్మ్యాశ్రితమిమర పూజ్యైశ్చ మునిభిః ||". (గీతాభావప్రకాశము - 8 - 1)
(యశము - కీర్తి, ఐశ్వర్యము - ఈశ్వరత్వము, అన్నింటినీ తన వశములోనుంచికొని వాటిని వాటివాటి పనులలో నుండునట్లు నడిపించుట -; ధర్మమున - సన్మార్గమున - నడిపింపచేయుశక్తి; విషయములందు అనురాగము లేకుండుట, విషయాతీత్వము, విరాగము లేక వైరాగ్యము; శ్రీ - ఐశ్వర్యము; వేదమితి - జ్ఞానము - అను యీ ఆరు గుణములు (శక్తులు) (శుద్ధమైన గుణములు - ఏ విధమైన దోషములు లేని శక్తులు - అన్నియు కలిసి స్వచ్ఛముగా పరమాత్మయందు ప్రతిష్టింపబడియుండుటచేత - కలిగియుండుటచేత పరమాత్మ భగవంతుడని చెప్పబడుచున్నాడు). అట్టి యీ ఆరుగుణములు కలిగినటువంటిన్నీ, శ్రీలక్ష్మీ దేవిచేతను, మునులచేతను దేవతాశ్రేష్టులచేతను పూజింపబడువాడగు శ్రీకృష్ణుని ఆశ్రయించుచున్నాను).
(నిర్గుణవాదులు - బ్రహ్మ సత్వరజస్తమోగుణములు లేనివాడని వాదించువారు - ఏ భగవంతుని రూపము శుద్ధమని, సచ్చిదానందఘనమని చెప్పుచున్నారో అట్లే వేదములు 'ఇదికాదు, ఇదికాదు' (ఇది పరబ్రహ్మకాదు, ఇది పరబ్రహ్మకాదు) అని అన్నింటిని త్రోసివేసి, సంకేతముగా దేనిని చెప్పుచున్నవో, అతనే మాయచేత కప్పబడి విజ్ఞానఘనుడు అయిన పరమాత్మయే భక్తులకు అత్యంతము ప్రియుడై భగవంతుడని చెప్పబడుచున్నాడు).
"యః సర్వాన్ స్వాంశజాన్ సర్వాన్. భావాన్ జీవాన్ మత్స్వరూపమేవ సర్వం మదతిరిక్తం నేతీతి నిరీక్షిత్య, పునస్తేషామపి పరమేశ్వరో అస్తీతి ఆత్మజ్ఞానం వినీక్షయతి ప్రత్యక్ పరిచితోః యోగం ఐక్యజ్ఞానం గమయతి స భగవానితి అర్థః ".
(నా అంశవలన పుట్టిన సమస్త జీవులు నా రూపమే, నేనుకానిది యేదియును లేదు అని చూచి వాటికి పరమేశ్వరుండన్నవాడున్నాడు అను ఆత్మజ్ఞానము కలిగించి, జీవాత్మపరమాత్మలు ఒకటేయను జ్ఞానము కలిగించి, జీవాత్మ పరమాత్మయొక్క అంశయే, వేఱుకాదు అని తెలియచేయువాడు కనుక భగవంతుడని చెప్పబడుచున్నాడు).
(సూర్యుడు మేఘములచేతను, మంచు చేతను, ధూళిచేతను కప్పబడియుండి కనబడకుండు నట్లు, తనవలనే కలిగిన రాగద్వేషములు మొదలగునవి వాటికి కారణమైన కర్మలు పండి ఫలరూపములగు సుఖ దుఃఖములు (ప్రవాహరూపముగా వచ్చునవి),వాటిచేత కప్పబడియున్నాడు - తెలియబడకుండ భగవంతుడున్నాడు).
(కట్టెల యందుండు అగ్ని కట్టె వంపుగానున్న వంపుగానున్నట్లు కనబడును. పాత్రలు చిన్నవి గాను, పెద్దవిగాను గుండ్రముగాను, చదరముగాను, అనేక రూపములలోనున్న వాటియందున్న నీరు పాత్రలు ఏ రూపముతోనున్న ఆ రూపముతోనే యున్నట్లు కనబడును, కుండలలో కనబడు ఆకాశము కుండ యొక్క ఆకారమును బట్టి అట్టి యాకారముకలదిగానే కనబడును. ఆ ప్రకారము గానే ఉపాధులనుబట్టి (ఉపాధుల ఆకారమును బట్టి) భగవంతుడు అనేక రూపములతోనున్నట్లు కనబడును - అంతేకాని దానికన్న వేరుగానున్నట్లు కనబడడు - సూర్యకాంతి మొదలగు వాటియందుండు దహింపు శక్తివలన వెలుగు కలిగినట్లు, గంధమువలన వాయువును తెలుసుకొనినట్లు మాయవలన భగవంతునికి వైషమ్యము కలుగుచున్నది. అది అతనైకి స్వాభావికముకాదు. భగవంతుడు తన మాయా గుణమువలన కట్టెలు మొదలగు వాటిలో ప్రవేశించి ఆ కట్టెల దోషము లైన వంకరలు మొదలగు వాటితో సంబంధము లేక యుండును - కట్టెలు ఏ విధమైనవైనను ఆ కట్టెలు వలెనే కలిగియుండును కాని వేరుగా కానట్లు తనకు ఉపాధియైన దేహము మొదలగు వాటియందు ప్రవేశించియుండు భగవంతుడు ఆ ఉపాధులవలెనే యుండును కాని వాటికంటె వేరుగా కనబడడు).
జగముల కల్పించుకొఱకు చతురత మాయా
సగుణుండగు, గావున హరి
భగవంతుడనగ బరగె భవ్య చరిత్రా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 99)
(నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మ సృష్టిచేయుటకు మాయయను చెప్పబడి త్రిగుణములుగల (సత్వరజస్తమోగుణములుగల) ప్రకృతితో కలియగానే రూపముగలవాడాయెను - నిరాకారుడు సాకారుడాయెను - రూపములేని పరబ్రహ్మకు రూపము కలిగెను; ఆ రూపములో పరబ్రహ్మ తత్వము, ప్రకృతి తత్వము కలిసియే యున్నవి. అట్టి ప్రకృతి పురుష సం యోగమువల్లనే సృష్టి ప్రారంభమై యిప్పటి వరకును అట్లే, ప్రకృతి పురుషు తత్వముల సం యోగమువలననే సృష్టి కలుగుచూ వచ్చుచున్నది - (creation is the result of the combination of matter and energy). ఇట్లు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సృష్టిచేయుటకు ఆకారము (రూపము) దాల్చుటవలననే భగవంతుండని చెప్పబడెను - భగ శబ్దము యొక్క గుణములు గలవాడుగా మారుటచేత భగవంతుడను చెప్పబడెను).
"ఉ. కాలము, దేశమున్, క్రతువు, గర్మము, గర్తయు భోక్తయుం జగ
జ్జాలము, దైవమున్, గురువు సాంఖ్యము మంత్రము నగ్ని, యాహుతుల్
వేళలు విప్రులుం జనవృద్ధి లయంబుల హేతుభూతముల్
లీలలు దానయై తగవెలింగెడి నెక్కటి తేజ మీశుడున్"."
వ. "ఇతడే". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా - 778)
aiśvaryamunu, mahātmyamu; vīryamu (aiśvaryamanagā saṃpada, īśvaratvamu - anniṃṭi mīda prabhutvamu kaligiyuṃḍuṭa. mahatmyamu anagā goppa śakti kaligiyuṃḍuṭa; vīryamu - paṭutvamu kaligiyuṃḍuṭa. ivi kalavāḍu bhagavaṃtuḍu).
jñānādi kalyāṇaguṇa saṃpattiṃ.
(jñānamu - citra vicitramaina sṛṣṭini cēyuṭalō avasaramaina jñānamu. iṭuvaṃṭi jñānamu modalagu kalyāṇaguṇamulu kaligiyuṃḍuvāḍu).
(aiśvaryamu, vīryamu, yaśassu, lakṣmi, jñānamu, vairāgyamu - ī āru lakṣaṇamulu galigi yuṃḍuṭa bhagamu ani ceppabaḍucunnadi. ivi kalavāḍu bhagavaṃtuḍu).
bhagavacchabda vyācyāni vinā hē yairguṇādibhiḥ ||".
"jñānaiśvarya śaktibala vīryatējōbhiḥ sadā saṃpannaḥ". (śrī śaṃkaraḥ).
"jñānaṃ jñaptiḥ artha paricchittiḥ; aiśvaryaṃ īśvaratvaṃ, svātaṃtryaṃ; śaktiḥ tadartha nirvartana sāmarthyaṃ, balaṃ sahāya saṃpattiḥ; vīryaṃ parākramavatvaṃ; tējastu prāgalabhyaṃ adṛṣyatvaṃ - ē tē ca ṣaḍguṇāḥ sarva viṣayāḥ sarvadā bhagavati vartaṃtē ". (śrī ānaṃdagiri)
(1. jñānamu anagā jñapti, artha paricchēdamu;
2. aiśvaryamu anagā īśvaratvamu, anniṃṭiki prabhuvai yuṃḍuṭa, anniṃṭini śāsiṃcuṭa, anagā, tānu itarula ādhīnamulō lēka svataṃtruḍugā nuṃḍuṭa.
3. śakti - anagā anniṃṭini śāsiṃcuṭayaṃdu samarthata kaligiyuṃḍuṭa.
4. balamu anagā sahāyapaḍuṭaku tagina vāḍai yuṃḍuṭa - ajēyuḍu-
5. vīryamu - anagā parākramamu kaligiyuṃḍuṭa - sṛṣṭini eṃta cēsinanu - enni vastuvulanu sṛṣṭiṃcinanu - vāṭilō tana vīryamunu (vāṭanniṃṭilōnu tana caitanya śaktini) uṃcinanu taragani bījamu kalavāḍu, vīruḍai yuṃḍuṭa, 6. tējassu - hēyamaina guṇamu lēka ī āru guṇamulu ellapuḍu evaniyaṃdu vartiṃcunō aṭṭivāḍu bhagavaṃtuḍu).
(aiśvaryamu, dharmamu, yaśassu. lakṣmi, vairāgyamu, mōkṣamu - ī āru guṇamulu bhagaśabdamunaku arthamulu - ī āru guṇamulu samagramugā, ellapuḍu, aḍḍulēkuṃḍunaṭlu evaniyaṃdu vartiṃcunō atanu bhagavaṃtuḍu).
jñānavairāgya yōścaiva ṣaṇṇāṃ bhaga itīraṇā ||".
"vasaṃti yatra bhūtāni bhūtātmasya khilātmani |
sarvabhūtēṣva śēṣēṣu vakārārthastatō avyayaḥ ||".
(aiśvaryamu, vīryamu, yaśassu, lakṣmi, jñānamu, vairāgyamu - ī āru guṇamulu bhaga śabdamunakarthamu. bhūtamulanniṃṭiki ātma ayina evaniyaṃdu samasta bhūtamulu nivasiṃciyunnavō, evaḍu samasta bhūtamulaṃdu nivasiṃciyunnāḍō, ataḍu bhagavaṃtuḍu - 'bhaga' śabdamunaku 'va' kaliyuṭavalana ā guṇamulu kalavāḍani arthamagucunnadi.
(paina ceppabaḍina āru vidhamula aiśvaryamu kalavāḍu bhagavaṃtuḍu).
"nirataśayaiśvarya saṃpannaḥ "; samagraiśvaryādi saṃpannaḥ
(tanakaṃṭe heccu agu aiśvaryamu itarulaku lēnivāḍu kanuka niratiśayaiśvaryamu kalavāḍu). "(niratiśayamaina aiśvaryamu modalagu guṇamulu samagramugā galavāḍu).
(tanayokka jñāna, śakti, vīrya, balaiśvarya tējassulaku miṃcina ī āru guṇamulu iṃkevaraki lēnivāḍu aguṭacēta vāṭiki tānē nidhi ayinavāḍu) - aciṃttaiśvaryaḥ - ciṃtiṃcuṭaku miṃcina aiśvaryamu kalavāḍu).
vētti vidyāmavidyāṃca savācyō bhagavāniti||".
"atra bhūtānāmiti pratyēkaṃ saṃbadhyatē |
utpatti vināśaśabdau tatkāraṇasya api upa lakṣikau |
āgatī gatī āgāminyau saṃpadāpadau. ētādṛśa bhagavat śabdārthaḥ śrīvāsudēvē ēva paryavasati". (śrīmadhusūdanaḥ)
(bhūtamulaku vāṭiki kāraṇamulaina mahadādulaku utpatti vināśamulaku kāraṇamainavāḍu, vāṭini guṟiṃci bāgugā telisinavāḍu, vāṭi guṟiṃci jñānamu galavāḍu. bhūtamulaku kalugu kaṣṭa sukhamulanu telisinavāḍu. iṭṭi lakṣaṇamulu galavāḍu - sarva bhūtamulaṃdu nivasiṃcuvāḍagu vāsudē vuniyaṃdē kalavu. aṃducēta bhagavaṃtuḍanagā vāsudēvuḍē).
vidyā vidyāṃca yōvētti sa bhagavāniti kathyatē ||.
(bhūtamulayokka jananamaraṇamulanu, gamanā gamanamulanu, vidyanu avidyanu śāstramudvārā telusukoninavāḍu bhagavaṃtuḍani ceppabaḍucunnāḍu -).
(bhagamu anagā tējassu, ṣaḍguṇaiśvaryamulalō nokaṭi, adi kalavāḍu bhagavaṃtuḍu).
maitrēya bhagavacchabda sarvakāraṇa kāraṇē |
saṃbhartēti tathā bhartā bhakārārthō(a)nvayānvitaṃ |
nētā gamayitā sraṣṭā gakārārthaḥ tathā munē |
aiśvaryasya samagrasya vīryasya yaśaśa śśriyaḥ |
jñāna vairāgya yōścaivaṣaṇṇāṃ bhaga itīraṇā |
vasaṃti yatra bhūtāni bhūtātmanyakhilātmani |
sa ca bhūtēṣva śēṣēṣu va kārārthaḥ ta ta avyayaḥ |
jñānaśakti balaiśvaryavīrya tējāṃsyaśēṣataḥ |
bhagavacchabda vācyāni vinā hē yairguṇādibhiḥ |
ityādinā śrīmatparāśarōkta pratyakṣara samudāya nirvacanāvagatāḥ saṃbhartṛtva, bhartṝtva, nētṛtva,gamayitṛtva, sraṣṭṛtva, sarva śarīrakatva, sarva bhūtāṃtarātmatva, nirasta nikhiladōṣatva, ṣāḍguṇya pūrṇatvādayaḥ arthāḥ atra vivakṣitāḥ. tatra saṃbharaṇaṃ nāmōpakaraṇa saṃvidhānaṃ, tacca prakṛti puruṣa kālānāṃ kāryōtpatti yōgya tā sādhanarūpaṃ bhartṛtvaṃ nirupādhika svāmitvaṃ, nētṛtvaṃ gamayitṛtvarūpaṃ sthiti kartṛtvaṃ, gama yitṛtvaṃ saṃgama yitṛtva rūpaḥ sṛṣṭikartṛtvaṃ yaśō guṇavattāpradā; śrīḥ bhōgya saṃpat; vairāgyaṃ viraktiḥ, sā ca paripūrṇatvāt anādara rūpā. ēvaṃca anuṣṭitaiḥ dharmaiḥ prāpyasya bhagavataḥ ēvaṃ vidhitvāt, tatprāptēśca niḥśrēyasarūpatvāt tatprāpti sādhana bhūtā dharmāḥ paramapuruṣārthibhiḥ avaśyaṃ anuṣṭēyāḥ".
(śuddhuḍu - nirmaluḍu, prakṛti kaliyanivāḍu - mahābhūtamu, samastamaina kāraṇavastuvulaku kāraṇamainavāḍu, paruḍu ayina parabrahmamē bhagavaṃtuḍani ceppabaḍucunnāḍu - bhagavaṃtuḍanu śabdamunaku nirvacanamī kriṃda ceppabaḍina vidhamugā nunnadi : - bhagavaṃtuḍanu śabdamulōni 'bha' kāramu ‘saṃbharta, bharta' ani teliyacēyunu; 'ga' kāramu "nēta, gamayitā" (poṃdiṃcuvāḍu - paramapadamunu poṃdiṃcuvāḍu, śarīramulōpalanuṃḍi tana śakticēta kāryamulanu cēyiṃcuvāḍu), sraṣṭā (sṛṣṭi cēyuvāḍu) ani teliya cēyunu "aiśvaryasya" ani modalukoni " hē yairguṇādibhiḥ" varaku gala ślōkamulaku arthamunaku paina ceppina 1 nuṃḍi 5 varaku galavi cūḍavalenu - ī ślōkamula vyākhyānamu prakāramu parabrahmayokka saṃbhartṛtvamu, bhartṛtvamu, nētṛtvamu, gamayitṛtvamu, sraṣṭṛtvamu, (sṛṣṭi cēyuṭa), sarva śarīrakatvamu (aṃdaṟi śarīramulu tānē yaguṭa - viśvarūpatvamu), sarvabhūtāṃtarātmatvamu, (samasta bhūtamulalōnu tānē aṃtarātmagā nuṃḍuṭa), nirasta nikhila dōṣatvamu (ē vidhamaina dōṣamu lēkuṃḍuṭa - nirmalatvamu, śuddhatvamu) aiśvaryamu modalagu ṣaḍguṇamulu kaligiyuṃḍuṭa yanu lakṣaṇamulu telupa baḍinavi. ivi kalavāḍu bhagavaṃtuḍu. paina ceppina lakṣaṇamulalō 'saṃbharaṇa’ managā upakaraṇa saṃvidhānamu - prakṛti puruṣula saṃ yōgamuvalana, kālānukra mamuvalana kāraṇavastuvunuṃḍi kāryavastuvunu puṭṭiṃpa cēyuṭa. 'bhartṛtvamu’ (anniṃṭiki bharta, prabhuvu ayi yuṃḍuṭa) anagā, anniṃṭilō nunnappaṭikī ē vidhamaina upādhi lēkanē anniṃṭikī svāmi, prabhuvugā nuṃḍuṭa. "nētṛtvamu", "gamayitṛtvamu" anagā sthitikarta yaguṭa - prapaṃcamu yokka sthiti kālamulō dānini. dānilōni vastuvulanu, kramamugā naḍupuṭa. "gamayitṛtvamu" anagā saṃgamamu cēyuṭa - prati vastuvulōnunna prakṛti puruṣa aṃśalanu kalupuṭa. "saṃhartṛtvamu" anagā saṃhāramu cēyuṭa - prati vastuvunu dāni kālaparimiti gaḍicina tarvāta dāni kāraṇa vastuvulō layiṃpacēyuṭa. ā prakāramugānē praḷayakālamaṃdu prapaṃca maṃtaṭini - dānilōnunna anni vastuvulatō gūḍa tanalōniki layiṃpacēyuṭa. "sraṣṭṛtvamu" anagā kāraṇa vastuvulō nuṃḍi kārya vastuvulanu udgamiṃcunaṭlu, puṭṭinaṭlu cēyuṭa - lēka sṛṣṭiṃpacēyuṭa - aṃtamu lēkuṃḍa cēyucuṃḍuṭa, 'śrī' anagā bhōgiṃcavalasina vastuvulu." "vairāgya" managā dēniyaṃdunu anurāgamu lēkuṃḍuṭa - anniṃṭi yaṃdunu virakti poṃduṭa. bhagavaṃtuḍī vidhamaina dharmamulu galavāḍu aguṭacēta atanini poṃduṭayē niḥśrēyasamu).
(aiśvaryamu modalagu āru guṇamulaku ī kriṃda vidhamugā kūḍa arthamu ceppabaḍinadi : -
’aiśvaryama’nagā carācara rūpamulu tānē yaguṭa. (vibhūti). 'vīrya' managā iṃdriyamulanniṃṭini vāṭi vāṭi panulalō prērēpiṃcuṭa. 'kīrti' yanagā vēdamuladvārā bhagavattatvamunu bōdhiṃcuṭa. 'śrī' yanagā saccidānaṃdamulu mūḍunu okaṭē ayi yuṃḍu saṃpada. 'jñānamu' anagā, paratatvamu okaṭēyani, jīva brahmalaku bhēdamulēdani, bōdhiṃcuṭa. 'vairāgyamu' anagā, anniṃṭiyaṃdunu, anni pradēśamulaṃdunu sākṣiyaiyu yuṃḍuṭa, dēnitō nainanu saṃbaṃdhamulēka taṭasthuḍai yuṃḍuṭa - ī aiśvaryamu modalagu guṇamulu anniyu bhagavaccabdha vācyamulu - bhagavaṃtuni ceppu śabdamulē).
(sarvajñatvamu, nitya tṛpti, anādibōdha, sarva svataṃtramu, nityamaluptamu, anaṃtamu anu āru śaktulu galavāḍu bhagavaṃtuḍu - lēka - mahatva, dhairya, kīrti, śrī, jñāna, vairāgyamulu anu āru vidhamula aiśvaryamu galavāḍu bhagavaṃtuḍu).
(vēdamulacē iṃdruḍu modalagu rūpamulu galavāḍaninnī, upaniṣattulacēta brahmāninnī, sāṃkhyulacēta puruṣuḍaninnī, yōgulacēta paramātmayaninnī, sātvatulacētabhagavaṃtuḍaninnī ceppabaḍucunnavāḍē bhagavaṃtuḍu). (inni vidhamulugā ceppabaḍinavāḍokkaḍē ataḍē bhagavaṃtuḍu).
"trayyā apūrva bhāvarūpayā tatkarmārādhyatvēna, upaniṣadbhiḥ brahmabhāvaiḥ (bhāgaiḥ) sarva kāraṇatvādinā, sāṃkhyaiḥ puruṣatvēna, yōgaiḥ sarvōpāsyatvēna, sātvataiḥ paramai kāṃtibhiḥ prāpyaprāsakatayā ca upagīyamānaṃ mahātmyaṃ yasyasaḥ ".
(vēdamunanusariṃcuvāru aṃdulōni karmakāṃḍalō ceppabaḍina iṃdrādulunnū, upaniṣattulalō ceppabaḍinaṭlu anniṃṭiki kāraṇamaina brahma ani ceppabaḍuvāḍunnū, yōgulu evari guṟiṃci upāsana cēyudurō, ā dēvatayu, paramaikāṃtikulaina sātvatulu prāpyaprāpaka bhāvamutō kolucu bhagavaṃtuḍunnū (bhagavaṃtuḍu prāpyuḍu - poṃdataginavāḍu, bhaktulu prāpakulu, bhagavaṃtuni poṃduvāru) - ī aṃdaṟū - evarennividhamulugā ārādhiṃcinā, ē pēru peṭṭinā - okaḍē atanē bhagavaṃtuḍu).
brahmēti paramātmēti ca bhagavāniti kadhyatē ||.
(tatvamunu telisinavāru - brahmajñānamu kalavāru - tatvamē - anniṃṭilōnunna okētatvamu brahmayani, paramātmayani, bhagavaṃtuḍu ani ceppuduru -)
jñāna vairāgya yōścāpi ṣaṇṇāṃ bhaga itīṃganā |
nityama pratibaṃdhēna vartatē yatra ṣaḍvidhaṃ |
samagraiśvarya mukhyaṃ tadbhagākhyaṃ bhagavāniti |
śuddhē mahāvibhūtyākhyē parabrahmaṇivartatē |
śrīkṛṣṇē bhagavacchabdaḥ sarvakārāṇa kāraṇē |
anyatra bhagavacchabdaḥ upacārēṇa vartatē ||". (gītābhāvaprakāśamu - 2 - 12 to 15)
(aiśvaryamu, vīryamu, yaśassu, śrī, jñānamu, vairāgyamu - ī āru guṇamulu samagramugānuṃḍuṭa bhagaśabdamunakarthamu - avi aḍḍulēkuṇḍa ekkaḍa uṃḍunō adi bhagavaṃtuḍu - avi śuddhamu, mahāvibhūti, sarvakāraṇa kāraṇuḍu agu parabrahmamuṃḍu vartiṃcunu. aṭṭivāḍu samasta kāraṇavastuvulaku kāraṇamainavāḍu śrīkṛṣṇuḍu kanuka bhagavaṃtuḍanagā śrīkṛṣṇuḍu - itaramulanu bhagavaṃtuḍani ceppuṭa aupacārikamē).
tasminnēva brahma śabdō mukhyōvṛttō, mahāmunē ||".
(vēdamulō paramātmayē bhagavaṃtuḍani ceppabaḍiyuṃḍuṭavalananu, aiśvaryamu modalagu āru guṇamulu kaligiyuṃḍuṭavalananu, śrīmahāviṣṇuvē bhagavaṃtuḍani ā bhagacchabdamu mukhya vṛttigā upayōgiṃcabaḍinadi).
"yasmin prayujyamānē tu guṇayōgaḥ supuṣkalaḥ tatraivamukhyavṛttō(a)yamanyatrahyupacāritaḥ ||". (iti garuḍapurāṇē)
(bhagamu anumāṭaku arthamaina ṣaḍguṇaiśvaryamulu anniyu puṣkalamugā okēdāniyaṃdu - dēniyaṃduṃḍunō adē bhagavaṃtuḍu anu padamunaku mukhyavṛtti - itaramulaguṟiṃci ī śabdamu vāḍinappuḍu akkaḍa adi aupacārikamē yagunu).
guṇāḥ sākalyēna prabhavatisadā yatra vimalāḥ |
pratiṣṭāṃ saṃprāptā bhagavati padē taṃ nirupamaṃ |
śrayē kṛṣṇaṃ lakṣmyāśritamimara pūjyaiśca munibhiḥ ||". (gītābhāvaprakāśamu - 8 - 1)
(yaśamu - kīrti, aiśvaryamu - īśvaratvamu, anniṃṭinī tana vaśamulōnuṃcikoni vāṭini vāṭivāṭi panulalō nuṃḍunaṭlu naḍipiṃcuṭa -; dharmamuna - sanmārgamuna - naḍipiṃpacēyuśakti; viṣayamulaṃdu anurāgamu lēkuṃḍuṭa, viṣayātītvamu, virāgamu lēka vairāgyamu; śrī - aiśvaryamu; vēdamiti - jñānamu - anu yī āru guṇamulu (śaktulu) (śuddhamaina guṇamulu - ē vidhamaina dōṣamulu lēni śaktulu - anniyu kalisi svacchamugā paramātmayaṃdu pratiṣṭiṃpabaḍiyuṃḍuṭacēta - kaligiyuṃḍuṭacēta paramātma bhagavaṃtuḍani ceppabaḍucunnāḍu). aṭṭi yī āruguṇamulu kaliginaṭuvaṃṭinnī, śrīlakṣmī dēvicētanu, munulacētanu dēvatāśrēṣṭulacētanu pūjiṃpabaḍuvāḍagu śrīkṛṣṇuni āśrayiṃcucunnānu).
(nirguṇavādulu - brahma satvarajastamōguṇamulu lēnivāḍani vādiṃcuvāru - ē bhagavaṃtuni rūpamu śuddhamani, saccidānaṃdaghanamani ceppucunnārō aṭlē vēdamulu 'idikādu, idikādu' (idi parabrahmakādu, idi parabrahmakādu) ani anniṃṭini trōsivēsi, saṃkētamugā dēnini ceppucunnavō, atanē māyacēta kappabaḍi vijñānaghanuḍu ayina paramātmayē bhaktulaku atyaṃtamu priyuḍai bhagavaṃtuḍani ceppabaḍucunnāḍu).
"yaḥ sarvān svāṃśajān sarvān. bhāvān jīvān matsvarūpamēva sarvaṃ madatiriktaṃ nētīti nirīkṣitya, punastēṣāmapi paramēśvarō astīti ātmajñānaṃ vinīkṣayati pratyak paricitōḥ yōgaṃ aikyajñānaṃ gamayati sa bhagavāniti arthaḥ ".
(nā aṃśavalana puṭṭina samasta jīvulu nā rūpamē, nēnukānidi yēdiyunu lēdu ani cūci vāṭiki paramēśvaruṃḍannavāḍunnāḍu anu ātmajñānamu kaligiṃci, jīvātmaparamātmalu okaṭēyanu jñānamu kaligiṃci, jīvātma paramātmayokka aṃśayē, vēṟukādu ani teliyacēyuvāḍu kanuka bhagavaṃtuḍani ceppabaḍucunnāḍu).
(sūryuḍu mēghamulacētanu, maṃcu cētanu, dhūḷicētanu kappabaḍiyuṃḍi kanabaḍakuṃḍu naṭlu, tanavalanē kaligina rāgadvēṣamulu modalagunavi vāṭiki kāraṇamaina karmalu paṃḍi phalarūpamulagu sukha duḥkhamulu (pravāharūpamugā vaccunavi),vāṭicēta kappabaḍiyunnāḍu - teliyabaḍakuṃḍa bhagavaṃtuḍunnāḍu).
(kaṭṭela yaṃduṃḍu agni kaṭṭe vaṃpugānunna vaṃpugānunnaṭlu kanabaḍunu. pātralu cinnavi gānu, peddavigānu guṃḍramugānu, cadaramugānu, anēka rūpamulalōnunna vāṭiyaṃdunna nīru pātralu ē rūpamutōnunna ā rūpamutōnē yunnaṭlu kanabaḍunu, kuṃḍalalō kanabaḍu ākāśamu kuṃḍa yokka ākāramunu baṭṭi aṭṭi yākāramukaladigānē kanabaḍunu. ā prakāramu gānē upādhulanubaṭṭi (upādhula ākāramunu baṭṭi) bhagavaṃtuḍu anēka rūpamulatōnunnaṭlu kanabaḍunu - aṃtēkāni dānikanna vērugānunnaṭlu kanabaḍaḍu - sūryakāṃti modalagu vāṭiyaṃduṃḍu dahiṃpu śaktivalana velugu kaliginaṭlu, gaṃdhamuvalana vāyuvunu telusukoninaṭlu māyavalana bhagavaṃtuniki vaiṣamyamu kalugucunnadi. adi atanaiki svābhāvikamukādu. bhagavaṃtuḍu tana māyā guṇamuvalana kaṭṭelu modalagu vāṭilō pravēśiṃci ā kaṭṭela dōṣamu laina vaṃkaralu modalagu vāṭitō saṃbaṃdhamu lēka yuṃḍunu - kaṭṭelu ē vidhamainavainanu ā kaṭṭelu valenē kaligiyuṃḍunu kāni vērugā kānaṭlu tanaku upādhiyaina dēhamu modalagu vāṭiyaṃdu pravēśiṃciyuṃḍu bhagavaṃtuḍu ā upādhulavalenē yuṃḍunu kāni vāṭikaṃṭe vērugā kanabaḍaḍu).
jagamula kalpiṃcukoṟaku caturata māyā
saguṇuṃḍagu, gāvuna hari
bhagavaṃtuḍanaga barage bhavya caritrā". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 99)
(nirguṇuḍu, nirākāruḍu ayina parabrahma sṛṣṭicēyuṭaku māyayanu ceppabaḍi triguṇamulugala (satvarajastamōguṇamulugala) prakṛtitō kaliyagānē rūpamugalavāḍāyenu - nirākāruḍu sākāruḍāyenu - rūpamulēni parabrahmaku rūpamu kaligenu; ā rūpamulō parabrahma tatvamu, prakṛti tatvamu kalisiyē yunnavi. aṭṭi prakṛti puruṣa saṃ yōgamuvallanē sṛṣṭi prāraṃbhamai yippaṭi varakunu aṭlē, prakṛti puruṣu tatvamula saṃ yōgamuvalananē sṛṣṭi kalugucū vaccucunnadi - (creation is the result of the combination of matter and energy). iṭlu nirguṇa nirākāra parabrahma sṛṣṭicēyuṭaku ākāramu (rūpamu) dālcuṭavalananē bhagavaṃtuṃḍani ceppabaḍenu - bhaga śabdamu yokka guṇamulu galavāḍugā māruṭacēta bhagavaṃtuḍanu ceppabaḍenu).
"u. kālamu, dēśamun, kratuvu, garmamu, gartayu bhōktayuṃ jaga
jjālamu, daivamun, guruvu sāṃkhyamu maṃtramu nagni, yāhutul
vēḷalu vipruluṃ janavṛddhi layaṃbula hētubhūtamul
līlalu dānayai tagaveliṃgeḍi nekkaṭi tēja mīśuḍun"."
va. "itaḍē". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā - 778)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.