పూర్వము ఋషులు అనేక సంవత్సరములు అనే కష్టములకోర్చి భగవంతుని గుఱించి తపస్సు చేసిరి. భగవత్సాక్షాత్కారము పొందిరి. ఏ ఋషుకి ఏ రూపములో భగవంతుడు సాక్షాత్కరించెనో ఆ ఋషి ఆ రూపముతో భగవంతుడున్నాడని తెలుసుకొని ఆ రూపములో నున్న భగవంతునికి నమస్కారము అను మంత్రమును వాడెను - ఆ మంత్రమునకు ఆ ఋషి మంత్రగ్రష్ట - ఉదాహరణకు - "ఓం నమో భగవతే వాసుదేవాయ" (భగవతుడైన వాసుదేవుడునకు నమస్కారము). ఈ మంత్రములో భగవంతుడు వాసుదేవుడను పేరుతో చెప్పబడినాడు. వాసుదేవుడనగా - "వసతి నివసతి అసౌ దేవః సర్వ భూతేషు ఇతి వాసుదేవః" (సమస్తమైన భూతములందు వాసుదేవుడను పేరుతో ఈ దేవుడు నివసించియున్నాడు), దీనిని బట్టి భగవతుడెటువంటివాడో మనకు తెలియును. ఇట్లే మిగిలిన నామములు కూడ ఋషులు భగవంతుని లక్షణములను బట్టి వాడిరి. భగవన్నామములు "ఋషిభిః పరి గీతాని" (ఋషులచేత గానము చేయబడినవి) అని చెప్పబడినవి. భగవంతుడనెడివాడు ఒకడే కనుక, అన్ని దేవతా రూపములు అతనివే కనుక, ఏ పేరు పెట్టినను, ఎన్ని పేర్లు పెట్టినను అవన్నియు ఆ ఒక్క భగవంతునికే చెందును.
"ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం |
సర్వదేవ నమస్కారః కేశవ ప్రతిగచ్ఛతి ||".
(ఆకాశమునుండి పడిన వర్షపు నీరు భూమి మీద ఎక్కడ పడినను సముద్రమునకే (పల్లపు స్థలమునకే ఆకర్షింపబడి) చెరునట్లు సమస్త దేవతలకు పెట్టిన నమస్కారము - వారి వారి పేర్లతో పెట్టిన నమస్కారము - (ఆ పేర్లన్నియు ఒకడే అయిన భగవంతునివే కనుక) అతనికే చెందును. ఏ మతమువారైనను, వారి దేవునకు ఏ పేరు పెట్టినను, అతనికి పెట్టిన నమస్కారము ఒకే భగవంతునికి చేరును.
"యేప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధ యాన్వితాః |
తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధి పూర్వకం ||". (శ్రీమద్భగవద్గీత - 9 - 23)
(భగవంతుడైన శ్రీమహావిష్ణువుని కాక ఇతర దేవతలను శ్రద్ధతో కొలిచినవారు - వారు చేసినది శాస్త్ర ప్రకారము కాకపోయినను - నన్నే కొలుచుచున్నారు - "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" (భగవంతుడను వాడు ఒక్కడె - రెండవ భగవంతుడులేడు - రెండవ వస్తువేలేదు).
"జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం |
స్తువన్నామ సహస్రేణ పురుషస్సతతో త్థితః || ". (శ్రీవిష్ణుసహస్రనామములు)
(ఈ జగత్తు అంతటికి ప్రభువైనటువంటిన్నీ, దేశకాల వస్తువులచేత అంతము లేనటువంటిన్నీ, వాడగు పురుషోత్తముని అతని సహస్ర నామములతో స్తోత్రము చేసిన పురుషుడు,సమస్తమైన కష్టములను దాటి పోవును - ముక్తిని పొందును. ఇదియే యుత్తమమైన ధర్మము అని చెప్పెను - భగవంతునికి కోట్లకొలది నామములున్నను, యీ వేయి నామములు ముఖ్యమైనవి యని కూడ చెప్పెను.
- గౌణాని = గుణేభ్యఃకర్మభ్యశ్చ, నిమిత్త భూతేభ్యం ఆగతాని. యౌగికాని ఇత్యర్థః గుణ శబ్దః కర్మణోపి ప్రదర్శకః. ఏతాని నామాని విఖ్యాతాని - ఛందో భాషయోః ప్రవృత్యాదీనాం ప్రయోగ భూయస్త్వాత్ తవసా ధారణ్యేన ప్రసిద్ధాని, రూఢాని ఇత్యర్థః. ఋషిభిః, అశేష వేదార్థదర్శిభిః, పరిగీతాని ఏవం రూపాణి ఏవం నిమిత్తాని ఏవం వాచకాని, ఇతి పరితః - పరితో దుగ్ధధేనువత్ అభినివేశ మానైః ప్రీత్యా ప్రయుక్తాని యాని నామాని, తేభ్యః. ఏకైకస్మాత్ ఏకైకం మధుకరక్రమేణ సమాహృత్య భగవతా వ్యాసేన స్తోత్ర రూపేణ కీర్తితాని సంప్రదాయ పారంపర్యేణ అస్మత్పర్యంతం సంప్రాప్తాని అనాది సంసార దృష్టి వినష్టాత్మనః పునరుజ్జీవనాయ ఇత్యర్థః.
(భగవంతుని నామములు గౌణములు - గుణములవలన - (కారణభూతమైన కర్మలవలన వచ్చినవి. గూనము అనుమాటకు కర్మయని కూడ అర్థము. ఈ నామములు వ్యుత్పత్యర్థములు కలవికనుక ప్రయోగములోనికి వచ్చినవి, అందుచేత అసాధారణ ప్రసిద్ధి కలవి. ఇవి ఋషులు, అనగా, వేదాంతరహస్య వేదులైనవారు వారి స్తోత్రములతో వాడినవి. ఒక్కొక్క పూవులోనుండి తేనెను తీసుకొను తేనెటీగవలె ఈ నామములను భగవంతుడు (భగవంతుని అవతారములులో నొకటియగు) పూజ్యులైన వ్యాసమహర్షిచేత కీర్తించబడినవి. అవి ఋషి సాంప్రదాయముననుసరించి పరంపరగా - ఒక ఋషి నుండి వారి శిష్యులకు, వారినుండి వారి శిష్యులకు ఇట్లు పరంపరగా మా వఱకు (శ్రీమచ్ఛంకర భగవద్పాదులవఱకు) ఆది అంతము లేని యీ సంసారమును వదలించుకొనువారి కొఱకు వచ్చినవి).
స బ్రహ్మ, స శివస్సహరిస్సేంద్రస్సో క్షరః పరమ స్వరాట్". (మంత్రపుష్పము - 12)
"త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్ర స్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః". (మంత్ర పుష్పము - 27)
పరమాత్మయే బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అక్షరుడు, పరతత్వము, స్వరాట్టు, అనిన్నీ, యజ్ఞము, వషట్కారము, రుద్రుడు, ఇంద్రుడు, విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ, ప్రజాపతి అతనే యని మంత్రపుష్పము చెప్పుచున్నది. విష్ణునామములే కొన్ని శివనామములుగా, శివనామములు కొన్ని విష్ణునామములుగాను చెప్పబడినవి. –
"నామాని తవ గోవింద యాని లోకేమహాంతిచ |
తాన్యేవ మమనామాని నాత్రకార్యా విచారణా |
(గోవిందా ! లోకమందు నీ నామములేవికలవో అవన్నియు నా నామములే. ఇందుగుఱించి విచారించవలసిన - ఆలోచించవలసిన అవసరము లేదు).
"అహం త్వం సర్వగో, దేవ, త్వమేవాహం జనార్థన |
ఆవయోరంతరం నాస్తి శబ్దైరర్థైర్జగత్రయే ||'.
(జనార్దనా, అన్నింటిలోను నున్న నేనే నువ్వు, నువ్వే నేను; మన ఇద్దరిలోను పేరులోగాని, అర్థములోగాని ఈ మూడులోకములందు భేదములేదు).
"సృష్టి స్థిత్యంతకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సంజ్ఙాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్థనః ||".
(భగవానుడగు జనార్థనుడొక్కడే సృష్టిస్థితిలయములు చేయువాడై బ్రహ్మ, విష్ణు, శివుడు అనెడి నామములు కలవాడగుచున్నాడు).
"శ్రీరామ రామేతి రమే రామే, మనోరమే |
సహస్రనామ తస్తుల్యం రామానామ, వరాననే||".
('శ్రీరామ రామ రామ' అని నేను నిత్యము రమించుదును - తదేక ధ్యానముతో ఆ నామమునే ఉచ్చరించెదను. ఎందుచేత ననగా రామ అను పరబ్రహ్మయొక్క నామము. అతని ఇతర నామములు వేయింటితో సమానము. అని శివుడు పార్వతితో చెప్పెను. అంద్చుహేత శ్రీమహావిష్ణు సహ్స్రనామములు జపించలేనివారు 'రాం' అను నామము ఒక్కమారు జపించిన చాలును. సహస్రనామములు జపించిన ఫలము కలుగును). (చూడుము - "రామః").
"జానాతి రామ, తవ నామరుచిం మహేశో" (శ్రీరామ కర్ణామృతం - 1 - 36)
("తారకనామ మంత్ర రుచి దక్షసుతా రమణుండెఱుంగు" -).
(ఇంద్రుడనియు, మిత్రవరుణ అగ్నిదేవ గరుత్మంతాది బహువిధ నామములచేత ఒకడైన భగ వంతుడే చెప్పబడెను).
(నామములన్నియు ముఖ్యముగా భగవంతుని గూర్చియే చెప్పుచున్నవి).
(వేదమందుగల సర్వనామములచేతను ఆయాలింగములననుసరించి భగవంతుడే వర్ణింపబడుచున్నాడు).
కేళినైన, మిగుల కేళినైన
బద్య, గద్య, గీత భావార్థములనైన
గమలనయనుదలప గలుషహరము". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - )
జెందినదని తలంపవలవదు శ్రీపతిపేరే
చందముననైన బలికిన
నదకధరుడందుగలడు నాధుండగుచున్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - )
నామ్నాం బహుత్వం లోకానా ముపకారకరం శ్రుణు ||". (విష్ణుధర్మే)
(ఓ ద్విజోత్తమా!
(ఏకస్యైవ సమస్తస్య బ్రహ్మణో ద్విజసత్తమ |).
ఏకమును, అయినప్పటికి సర్వము తానే అయిన బ్రహ్మ యొక్క అనేక నామములు లోకమునకు - లోకులకు - ఉపకారము చేయునవే).
"అక్షాంతవర్ణం" (అకారము మొదలు 'క్ష' కారమువరకుగల అక్షరముల స్వరూపుడైనవాడు, అక్షరములు తానే అయినవాడు
(శ్రీరామకర్ణామృతం - 2 - 3)
"ఓం నమో నారాయాణాయ" అనుమంత్రములో 'రా' అను అక్షరమున్నూ, "ఓం నమశ్శివాయ" అను మంత్రములో 'మః' అను అక్షరము శక్తివంతమైనవని తెలుసుకొని, ఆ రెండు అక్షరములను (రా + మః) కలిపి 'రామః' అను నామముతో మంత్రము చేయగా అది తారక మంత్రమైనది – (చూడుము – రామః ).
దీనిని బట్టి ప్రతి అక్షరములోను భగవంతుని శక్తి యున్నది, అట్టి అక్షరములతో కూడిన భగవన్నామమునకు కూడ భగవంతుని శక్తి యున్నదని గ్రహించ బడినది.
(ఓ ద్విజశ్రేష్టా! ఈ నామములను వేర్వేరుగా విభజించుటకు వీటికి గల వివిధ శక్తులే కారణము. కావున ఈ నామములను ఉచ్చరించుటవలన వేర్వేరు ఫలములు సిద్ధించుచున్నవి).
సాధికం, పురుషవ్యాఘ్ర, సౌమ్యే క్రూరేషువస్తుషు ||“. (విష్ణు ధర్మే)
(ఓ పురుషశ్రేష్టా! భగవంతునియొక్క ఏ నామమునకు ఏ శక్తి కలదో అది అట్టి కార్యమును సాధించును - క్రూరమై క్రూరమైన విషయములను, సౌమ్యమై సౌమ్యమైన విషయములను సాధించునదగును).
“ఇతి విష్ణు ధర్మవచనాత్ యద్యపి పరస్య బ్రహ్మణః షష్టీ గుణక్రియా జాతి రూఢీనాం శబ్దప్రవృత్తి హేతు భూతానాం నిమిత్త శక్తినాం చా సంభవః, తథాపి సగుణే బ్రహ్మణి సవికారేచ సర్వాత్మకత్వాత్ తేషాం శబ్ద ప్రవృత్తి హేతూనాం సంభవాత్ సర్వే శబ్దాః పరస్మిన్ పుంసే వర్తంతే” (శ్రీశంకరః)
(షష్టిగుణము, క్రియ, జాతి, రూఢి అనునవి శబ్ద ప్రవృత్తికి హేతువులుగా నున్నవి. ఈ నిమిత్త శక్తులు నిర్గుణమగు పరబ్రహ్మమందు సంభవింపకున్నను, సర్వాత్మకుడగుటవలన - అన్నీ తానే యగుటవలన సోపాధికుడైన సగుణబ్రహ్మయందు ఇవి సంభవించుచున్నవి. కాన సమస్త శబ్దములును ఇట్లు ఆ ఒక్క పురుషోత్తమునియందే వర్తించునవగును).
(ఈ సహస్రనామములందు ఆదిత్యాదిశబ్దములకు అర్థాంతర ప్రసిద్ధమైన సూర్యాద్యర్థములు గూడ యీ భగవానుని విభూతులే యగుటచేత అవి దీనికి భిన్నములు కాజాలవుగాన నాయా శబ్దముల ప్రసిద్ధమైన అర్థములనే గ్రహించినను వాని స్తుతి యీ భగవానుని స్తుతియే యగుచున్నది, ఎట్లనగా - “భూతాత్మా చేంద్రియాత్మాచ - -” etc. “తదేవాగ్నిః, తదాదిత్యః తద్వాయుః, తదుచంద్రమాః, తదేవ శుక్రం, తద్బ్రహ్మా, ఆపస్తత్ప్రజాపతిః” ఇతి శ్రుతిః. (శుక్ల యజుర్వేదే)
(అగ్ని, ఆదిత్య, వాయు, చంద్ర, తేజ, ఆప, ప్రజాపతి శబ్దములచేత నా పరబ్రహ్మయే చెప్పబడెను).
చ్యారు గుణంబు రోగముల జయ్యన బాపెడు మాడ్కి బుణ్య ని
స్ఫారు ని, నంబుజోదరుని బామరుడజ్ఞుడనజ్ఞ బల్కినన్
వారక తత్ప్రభావము ధ్రువంబుగ నాత్మగుణంబు జూపదే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 -)
(శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రహమునకు, అతని దివ్యనామములకు నిత్యము శుభమగుగాక - ఈ సృష్టిలో ప్రతివస్తువు భగవంతునిలోనుండి - ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవే కనుక ఆ వస్తువులన్నియు అతని రూపములే, వాటి నామములన్నీ అతని నామములే - “సహస్ర శీర్షం దేవం”; “సహస్ర శీర్షా పురుషః” “సహస్రాక్షః సహస్రపాద్”; “సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే” - అని చెప్పినట్లే - అందుచేత శ్రీరామచంద్రుని రూపములకు, నామములకు మంగళమగుగాక అనగా, సృష్టిలోనున్న సమస్త వస్తురూపములకు, వాటి నామములకు శుభమంగళమగుగాక అనియే భావించవలెను).
pūrvamu ṛṣulu anēka saṃvatsaramulu anē kaṣṭamulakōrci bhagavaṃtuni guṟiṃci tapassu cēsiri. bhagavatsākṣātkāramu poṃdiri. ē ṛṣuki ē rūpamulō bhagavaṃtuḍu sākṣātkariṃcenō ā ṛṣi ā rūpamutō bhagavaṃtuḍunnāḍani telusukoni ā rūpamulō nunna bhagavaṃtuniki namaskāramu anu maṃtramunu vāḍenu - ā maṃtramunaku ā ṛṣi maṃtragraṣṭa - udāharaṇaku - "ōṃ namō bhagavatē vāsudēvāya" (bhagavatuḍaina vāsudēvuḍunaku namaskāramu). ī maṃtramulō bhagavaṃtuḍu vāsudēvuḍanu pērutō ceppabaḍināḍu. vāsudēvuḍanagā - "vasati nivasati asau dēvaḥ sarva bhūtēṣu iti vāsudēvaḥ" (samastamaina bhūtamulaṃdu vāsudēvuḍanu pērutō ī dēvuḍu nivasiṃciyunnāḍu), dīnini baṭṭi bhagavatuḍeṭuvaṃṭivāḍō manaku teliyunu. iṭlē migilina nāmamulu kūḍa ṛṣulu bhagavaṃtuni lakṣaṇamulanu baṭṭi vāḍiri. bhagavannāmamulu "ṛṣibhiḥ pari gītāni" (ṛṣulacēta gānamu cēyabaḍinavi) ani ceppabaḍinavi. bhagavaṃtuḍaneḍivāḍu okaḍē kanuka, anni dēvatā rūpamulu atanivē kanuka, ē pēru peṭṭinanu, enni pērlu peṭṭinanu avanniyu ā okka bhagavaṃtunikē ceṃdunu.
"ākāśātpatitaṃ tōyaṃ yathāgacchati sāgaraṃ |
sarvadēva namaskāraḥ kēśava pratigacchati ||".
(ākāśamunuṃḍi paḍina varṣapu nīru bhūmi mīda ekkaḍa paḍinanu samudramunakē (pallapu sthalamunakē ākarṣiṃpabaḍi) cerunaṭlu samasta dēvatalaku peṭṭina namaskāramu - vāri vāri pērlatō peṭṭina namaskāramu - (ā pērlanniyu okaḍē ayina bhagavaṃtunivē kanuka) atanikē ceṃdunu. ē matamuvārainanu, vāri dēvunaku ē pēru peṭṭinanu, ataniki peṭṭina namaskāramu okē bhagavaṃtuniki cērunu.
"yēpyanya dēvatā bhaktā yajaṃtē śraddha yānvitāḥ |
tēpi māmēva kauṃtēya yajaṃtyavidhi pūrvakaṃ ||". (śrīmadbhagavadgīta - 9 - 23)
(bhagavaṃtuḍaina śrīmahāviṣṇuvuni kāka itara dēvatalanu śraddhatō kolicinavāru - vāru cēsinadi śāstra prakāramu kākapōyinanu - nannē kolucucunnāru - "ēkamēvā dvitīyaṃ brahma" (bhagavaṃtuḍanu vāḍu okkaḍe - reṃḍava bhagavaṃtuḍulēḍu - reṃḍava vastuvēlēdu).
"jagatprabhuṃ dēvadēvaṃ anaṃtaṃ puruṣōttamaṃ |
stuvannāma sahasrēṇa puruṣassatatō tthitaḥ || ". (śrīviṣṇusahasranāmamulu)
(ī jagattu aṃtaṭiki prabhuvainaṭuvaṃṭinnī, dēśakāla vastuvulacēta aṃtamu lēnaṭuvaṃṭinnī, vāḍagu puruṣōttamuni atani sahasra nāmamulatō stōtramu cēsina puruṣuḍu,samastamaina kaṣṭamulanu dāṭi pōvunu - muktini poṃdunu. idiyē yuttamamaina dharmamu ani ceppenu - bhagavaṃtuniki kōṭlakoladi nāmamulunnanu, yī vēyi nāmamulu mukhyamainavi yani kūḍa ceppenu.
- gauṇāni = guṇēbhyaḥkarmabhyaśca, nimitta bhūtēbhyaṃ āgatāni. yaugikāni ityarthaḥ guṇa śabdaḥ karmaṇōpi pradarśakaḥ. ētāni nāmāni vikhyātāni - chaṃdō bhāṣayōḥ pravṛtyādīnāṃ prayōga bhūyastvāt tavasā dhāraṇyēna prasiddhāni, rūḍhāni ityarthaḥ. ṛṣibhiḥ, aśēṣa vēdārthadarśibhiḥ, parigītāni ēvaṃ rūpāṇi ēvaṃ nimittāni ēvaṃ vācakāni, iti paritaḥ - paritō dugdhadhēnuvat abhinivēśa mānaiḥ prītyā prayuktāni yāni nāmāni, tēbhyaḥ. ēkaikasmāt ēkaikaṃ madhukarakramēṇa samāhṛtya bhagavatā vyāsēna stōtra rūpēṇa kīrtitāni saṃpradāya pāraṃparyēṇa asmatparyaṃtaṃ saṃprāptāni anādi saṃsāra dṛṣṭi vinaṣṭātmanaḥ punarujjīvanāya ityarthaḥ.
(bhagavaṃtuni nāmamulu gauṇamulu - guṇamulavalana - (kāraṇabhūtamaina karmalavalana vaccinavi. gūnamu anumāṭaku karmayani kūḍa arthamu. ī nāmamulu vyutpatyarthamulu kalavikanuka prayōgamulōniki vaccinavi, aṃducēta asādhāraṇa prasiddhi kalavi. ivi ṛṣulu, anagā, vēdāṃtarahasya vēdulainavāru vāri stōtramulatō vāḍinavi. okkokka pūvulōnuṃḍi tēnenu tīsukonu tēneṭīgavale ī nāmamulanu bhagavaṃtuḍu (bhagavaṃtuni avatāramululō nokaṭiyagu) pūjyulaina vyāsamaharṣicēta kīrtiṃcabaḍinavi. avi ṛṣi sāṃpradāyamunanusariṃci paraṃparagā - oka ṛṣi nuṃḍi vāri śiṣyulaku, vārinuṃḍi vāri śiṣyulaku iṭlu paraṃparagā mā vaṟaku (śrīmacchaṃkara bhagavadpādulavaṟaku) ādi aṃtamu lēni yī saṃsāramunu vadaliṃcukonuvāri koṟaku vaccinavi).
sa brahma, sa śivassaharissēṃdrassō kṣaraḥ parama svarāṭ". (maṃtrapuṣpamu - 12)
"tvaṃ yajñastvaṃ vaṣaṭkārastvamiṃdra stvaṃ rudrastvaṃ viṣṇustvaṃ brahmatvaṃ prajāpatiḥ". (maṃtra puṣpamu - 27)
paramātmayē brahma, śivuḍu, viṣṇuvu, iṃdruḍu, akṣaruḍu, paratatvamu, svarāṭṭu, aninnī, yajñamu, vaṣaṭkāramu, rudruḍu, iṃdruḍu, viṣṇuvu, caturmukha brahma, prajāpati atanē yani maṃtrapuṣpamu ceppucunnadi. viṣṇunāmamulē konni śivanāmamulugā, śivanāmamulu konni viṣṇunāmamulugānu ceppabaḍinavi. –
"nāmāni tava gōviṃda yāni lōkēmahāṃtica |
tānyēva mamanāmāni nātrakāryā vicāraṇā |
(gōviṃdā ! lōkamaṃdu nī nāmamulēvikalavō avanniyu nā nāmamulē. iṃduguṟiṃci vicāriṃcavalasina - ālōciṃcavalasina avasaramu lēdu).
"ahaṃ tvaṃ sarvagō, dēva, tvamēvāhaṃ janārthana |
āvayōraṃtaraṃ nāsti śabdairarthairjagatrayē ||'.
(janārdanā, anniṃṭilōnu nunna nēnē nuvvu, nuvvē nēnu; mana iddarilōnu pērulōgāni, arthamulōgāni ī mūḍulōkamulaṃdu bhēdamulēdu).
"sṛṣṭi sthityaṃtakaraṇīṃ brahma viṣṇu śivātmikāṃ saṃjṅāṃ yāti bhagavān ēka ēva janārthanaḥ ||".
(bhagavānuḍagu janārthanuḍokkaḍē sṛṣṭisthitilayamulu cēyuvāḍai brahma, viṣṇu, śivuḍu aneḍi nāmamulu kalavāḍagucunnāḍu).
"śrīrāma rāmēti ramē rāmē, manōramē |
sahasranāma tastulyaṃ rāmānāma, varānanē||".
('śrīrāma rāma rāma' ani nēnu nityamu ramiṃcudunu - tadēka dhyānamutō ā nāmamunē uccariṃcedanu. eṃducēta nanagā rāma anu parabrahmayokka nāmamu. atani itara nāmamulu vēyiṃṭitō samānamu. ani śivuḍu pārvatitō ceppenu. aṃdcuhēta śrīmahāviṣṇu sahsranāmamulu japiṃcalēnivāru 'rāṃ' anu nāmamu okkamāru japiṃcina cālunu. sahasranāmamulu japiṃcina phalamu kalugunu). (cūḍumu - "rāmaḥ").
"jānāti rāma, tava nāmaruciṃ mahēśō" (śrīrāma karṇāmṛtaṃ - 1 - 36)
("tārakanāma maṃtra ruci dakṣasutā ramaṇuṃḍeṟuṃgu" -).
(iṃdruḍaniyu, mitravaruṇa agnidēva garutmaṃtādi bahuvidha nāmamulacēta okaḍaina bhaga vaṃtuḍē ceppabaḍenu).
(nāmamulanniyu mukhyamugā bhagavaṃtuni gūrciyē ceppucunnavi).
(vēdamaṃdugala sarvanāmamulacētanu āyāliṃgamulananusariṃci bhagavaṃtuḍē varṇiṃpabaḍucunnāḍu).
kēḷinaina, migula kēḷinaina
badya, gadya, gīta bhāvārthamulanaina
gamalanayanudalapa galuṣaharamu". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - )
jeṃdinadani talaṃpavalavadu śrīpatipērē
caṃdamunanaina balikina
nadakadharuḍaṃdugalaḍu nādhuṃḍagucun". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - )
nāmnāṃ bahutvaṃ lōkānā mupakārakaraṃ śruṇu ||". (viṣṇudharmē)
(ō dvijōttamā!
(ēkasyaiva samastasya brahmaṇō dvijasattama |).
ēkamunu, ayinappaṭiki sarvamu tānē ayina brahma yokka anēka nāmamulu lōkamunaku - lōkulaku - upakāramu cēyunavē).
"akṣāṃtavarṇaṃ" (akāramu modalu 'kṣa' kāramuvarakugala akṣaramula svarūpuḍainavāḍu, akṣaramulu tānē ayinavāḍu
(śrīrāmakarṇāmṛtaṃ - 2 - 3)
"ōṃ namō nārāyāṇāya" anumaṃtramulō 'rā' anu akṣaramunnū, "ōṃ namaśśivāya" anu maṃtramulō 'maḥ' anu akṣaramu śaktivaṃtamainavani telusukoni, ā reṃḍu akṣaramulanu (rā + maḥ) kalipi 'rāmaḥ' anu nāmamutō maṃtramu cēyagā adi tāraka maṃtramainadi – (cūḍumu – rāmaḥ ).
dīnini baṭṭi prati akṣaramulōnu bhagavaṃtuni śakti yunnadi, aṭṭi akṣaramulatō kūḍina bhagavannāmamunaku kūḍa bhagavaṃtuni śakti yunnadani grahiṃca baḍinadi.
(ō dvijaśrēṣṭā! ī nāmamulanu vērvērugā vibhajiṃcuṭaku vīṭiki gala vividha śaktulē kāraṇamu. kāvuna ī nāmamulanu uccariṃcuṭavalana vērvēru phalamulu siddhiṃcucunnavi).
sādhikaṃ, puruṣavyāghra, saumyē krūrēṣuvastuṣu ||“. (viṣṇu dharmē)
(ō puruṣaśrēṣṭā! bhagavaṃtuniyokka ē nāmamunaku ē śakti kaladō adi aṭṭi kāryamunu sādhiṃcunu - krūramai krūramaina viṣayamulanu, saumyamai saumyamaina viṣayamulanu sādhiṃcunadagunu).
“iti viṣṇu dharmavacanāt yadyapi parasya brahmaṇaḥ ṣaṣṭī guṇakriyā jāti rūḍhīnāṃ śabdapravṛtti hētu bhūtānāṃ nimitta śaktināṃ cā saṃbhavaḥ, tathāpi saguṇē brahmaṇi savikārēca sarvātmakatvāt tēṣāṃ śabda pravṛtti hētūnāṃ saṃbhavāt sarvē śabdāḥ parasmin puṃsē vartaṃtē” (śrīśaṃkaraḥ)
(ṣaṣṭiguṇamu, kriya, jāti, rūḍhi anunavi śabda pravṛttiki hētuvulugā nunnavi. ī nimitta śaktulu nirguṇamagu parabrahmamaṃdu saṃbhaviṃpakunnanu, sarvātmakuḍaguṭavalana - annī tānē yaguṭavalana sōpādhikuḍaina saguṇabrahmayaṃdu ivi saṃbhaviṃcucunnavi. kāna samasta śabdamulunu iṭlu ā okka puruṣōttamuniyaṃdē vartiṃcunavagunu).
(ī sahasranāmamulaṃdu ādityādiśabdamulaku arthāṃtara prasiddhamaina sūryādyarthamulu gūḍa yī bhagavānuni vibhūtulē yaguṭacēta avi dīniki bhinnamulu kājālavugāna nāyā śabdamula prasiddhamaina arthamulanē grahiṃcinanu vāni stuti yī bhagavānuni stutiyē yagucunnadi, eṭlanagā - “bhūtātmā cēṃdriyātmāca - -” etc. “tadēvāgniḥ, tadādityaḥ tadvāyuḥ, taducaṃdramāḥ, tadēva śukraṃ, tadbrahmā, āpastatprajāpatiḥ” iti śrutiḥ. (śukla yajurvēdē)
(agni, āditya, vāyu, caṃdra, tēja, āpa, prajāpati śabdamulacēta nā parabrahmayē ceppabaḍenu).
cyāru guṇaṃbu rōgamula jayyana bāpeḍu māḍki buṇya ni
sphāru ni, naṃbujōdaruni bāmaruḍajñuḍanajña balkinan
vāraka tatprabhāvamu dhruvaṃbuga nātmaguṇaṃbu jūpadē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 -)
(śrīrāmacaṃdruni divyamaṃgaḷa vigrahamunaku, atani divyanāmamulaku nityamu śubhamagugāka - ī sṛṣṭilō prativastuvu bhagavaṃtunilōnuṃḍi - okadānilōnuṃḍi okaṭigā puṭṭinavē kanuka ā vastuvulanniyu atani rūpamulē, vāṭi nāmamulannī atani nāmamulē - “sahasra śīrṣaṃ dēvaṃ”; “sahasra śīrṣā puruṣaḥ” “sahasrākṣaḥ sahasrapād”; “sahasranāmnē puruṣāya śāśvatē” - ani ceppinaṭlē - aṃducēta śrīrāmacaṃdruni rūpamulaku, nāmamulaku maṃgaḷamagugāka anagā, sṛṣṭilōnunna samasta vasturūpamulaku, vāṭi nāmamulaku śubhamaṃgaḷamagugāka aniyē bhāviṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.