అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు |
జ్ఞానంతే (అ)హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యత్ జ్ఞాత్వా నేహ భూయో(అ)న్యత్ జ్ఞాతస్య మవశిష్యతే ||
- - - భూమిరాపో(అ)నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా |
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ |
ఏతద్యోనీనిభూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా |
మత్తః పరతరం నాన్యత్ కించిత్ అస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||
- - - బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం |
- - - త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం ||
- - - అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం ||
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |
మూఢో(అ)యం నాభిజానాతి లోకోమామజమవ్యయం ||
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో(అ)ర్జున |
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ||
సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాంతాం తే(అ)హోరాత్రవిదో జనాః ||
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞికే ||
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే(అ)వశః పార్థ ప్రభవత్యహరాగమే ||
పరస్తస్మాత్తు భావో(అ)న్యో (అ)వ్యక్తో (అ)వ్యక్తాత్ సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||
అవ్యక్తో(అ)క్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం |
యం ప్రాప్య న నివర్తంతే తద్థామ పరమం మమ ||.
(శ్రీమద్భగవద్గీత - 7 - 1,2,4,5,6,7,10,13, 24 & 25, and 8 - 16 to 21)
(విజ్ఞానంతో సహా జ్ఞానముగుఱించి పూర్తిగా చెప్పుచున్నాను. ఇది తెలుసుకొనిన తర్వాత ఇంకను తెలుసుకోవలసినది మఱియుండదు. భూమి, జలము, అగ్ని, వాయువు ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి ఎనిమిది విధములుగానున్నది. ఇది అపరాప్రకృతి - దీని కంటె వేరైనది, జీవభూతమైనది, జగత్తును ధరించునది నా పరాప్రకృతి - సమస్తమైన భూతములకు ఈ ప్రకృతి యోనివంటిది. ఈ జగత్తునంతటినీ పుట్టించువాడను, సమ్హరించువాడను నేనే నాకంటె ఉత్కృష్టమైనది లేదు - దారంతో మణులు గుచ్చబడి (వదలుకుండ నుండునట్లు) నాలో ఈ జగత్తు అంతయు పట్టుబడియున్నది. - - - సమస్త భూతములకు నేను బీజమని తెలుసుకొనుము - (వాటి జన్మకు నేనే కారణమని - నానుండే అవి పుట్టినవని తెలుసుకొనుము) - - - సత్వరజస్తమోగుణములను త్రిగుణములచేత - ప్రకృతి గుణములచేత - యీ జగత్తు (జగత్తులోని వస్తువులన్నియు) మోహము చెందినవి. అందుచేత క్షీణించి నశించనివాడను, అన్నింటికంటె ఉత్కృష్టుడను అయిన నన్ను తెలుసుకొనలేకున్నది. నాయొక్క అవ్యయమైనదిన్నీ, ఉత్కృష్టమైనదిన్నీ అయిన తత్వమును తెలియలేనందున, సాధారణముగా వ్యక్తముగానటువంటిది (వస్తువు) కంటికికనబడని వస్తువు, కనబడినదని అజ్ఞానులు - బ్రహ్మతత్వము తెలియనివారు - తలంచెదరు. నేను (ప్రకృతియను) యోగమాయచేత కప్పబడి యుండుటచేత అందఱికి కనబడను - అందుచేతనే మూఢులైన ఈ లోకులు జన్మలేని నన్ను తెలుసుకొనలేరు. - - - బ్రహ్మలోకము మొదలగు లోకములన్నియు నశించి, మరల పుట్టవలసినవే. నన్ను పొందినయడల మరల జన్మించుట కలుగదు. ఇది యెట్లంటే బ్రహ్మకు పగలు సహస్రయుగములు, రాత్రి సహస్రయుగములు కాలపరిమాణమని బ్రహ్మకాలమునెఱిగిన మహాత్ములు తెలుసుకొనిరి (చెప్పుదురు). బ్రహ్మకు పగలు - పగటి కాలము - ప్రారంభముకాగానే, అప్పటివరకువ్యక్తముగాక - కంటికి కనబడక, సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలోనున్నవన్నియు వాటివలనే వ్యక్తముగాక నుండు స్థితిలోనున్నందుచేత అవ్యక్తమను చెప్పబడిన ప్రకృతినుండి వ్యక్తమగుచున్నవి. కంటికి కనబడునట్టివిగా అగుచున్నవి - పుట్టుచున్నవి. అవ్యక్తమనగా పైన చెప్పబడిన బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ) - ఆ బ్రహ్మకు రాత్రికాలములో (ఇట్లు వ్యక్తమైనవెల్లను) ఆ బ్రహ్మలోనే - అవ్యక్తములోనే - లీనమగుచున్నవి. ఈ ప్రకారముగా అవే భూతములు బ్రహ్మ పగటికాలమందు పుట్టుచు, అవశులై - చేయునదిలేక రాత్రికాలమందు అందులోనే - అవ్యక్తమగు బ్రహ్మలోనే - లీనమగుచున్నవి (లయమగుచున్నవి) - స్థూలరూపము వదలి సూక్ష్మాతి సూక్ష్మరూపముతో కలియుచున్నవి. దీనినే సృష్టి ప్రళయములందురు. ఈ అవ్యక్తమని చెప్పబడు బ్రహ్మ (ప్రకృతి) కంటెను అవ్యక్తమైనదిన్నీ ఉత్కృష్టమైనదిన్నీ, అంతకంటె సూక్ష్మమైనదిన్నీ సనాతనమైనదిన్నీ (ఎప్పటినుండి యున్నదో తెలియనిదిన్నీ), ఈ భూతములన్నియు నశించినను తాను నశించనిదిన్నీ అయిన అక్షరమను (క్షీణించనిదని) చెప్పబడుచున్నది యొకటి కలదు - దానిని పరమగతి - పరమపదము - అని చెప్పుదురు - దానిని పొందినవారు మరల జన్మించరు. అదియే నా పరమధామము - నేనుండుస్థానము - మోక్షస్థానము - తేజఃపుంజమైన స్థానము - (ఆ మోక్షస్థానము నేనే - దానికి నాకు భేదములేదు - అదియే నేను నేనే అది).
(పైన చెప్పినదానిలో బ్రహ్మజ్ఞానము సంక్షిప్తముగా చెప్పబడినది).
కర్మజ్ఞానాది యోగ్యానాం సహశ్రేషు నృ జన్మనాం |
మధ్యేకశ్చిత్ వివేకోనన్ యతతే చిత్తశుద్ధయే |
జ్ఞానాయ యతమానానాం సిద్ధానాం చ విపశ్చితాం |
మధ్యేకశ్చిన్మహానేకః సమ్యక్ జ్ఞానేన మాం హరిం |
సాక్షాత్కరోతి తత్వేన ప్రత్యగ్రూపేణ చిద్ఘనం |
మత్తత్త్వ జ్ఞోస్తి సర్వజ్ఞో దుర్లభో జగతీ తరే |
కిం వాచ్యం జ్ఞాన మహాత్మ్యం శ్రీహరేరయమాశయం ||". (గీతాభావప్రకాశము - 7 - 23 to 26)
(భగవంతుని కృపలేనిదే భగవత్ జ్ఞానము (బ్రహ్మజ్ఞానము కలుగదు - కర్మయోగులు జ్ఞానయోగులు వేలకొలది యున్నను ఏ ఒక్కడో చిత్త శుద్ధి కొఱకు యత్నము (కర్మయోగము) చేయును - జ్ఞానయోగులు మధ్యకూడ ఏ ఒకడో భగవంతుని సమ్యక్ జ్ఞానము కలవాడై భగవంతుని సాక్షాత్కరించుకొనును. భగవత్తత్త్వవము తెలిసినవాడు లభించుట కష్టము.అందుచేత భగవత్ జ్ఞానము యొక్క మహాత్మ్యము చెప్పుట కష్టమని శ్రీకృష్ణభగవానుని ఆశయము).
asaṃśayaṃ samagraṃ māṃ yathā jñāsyasi tacchṛṇu |
jñānaṃtē (a)haṃ savijñānamidaṃ vakṣyāmyaśēṣataḥ |
yat jñātvā nēha bhūyō(a)nyat jñātasya mavaśiṣyatē ||
- - - bhūmirāpō(a)nalō vāyuḥ khaṃ manō buddhirēva ca |
ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛtiraṣṭadhā |
aparēyamitastvanyāṃ prakṛtiṃ viddhi mē parāṃ |
jīvabhūtāṃ mahābāhō yayēdaṃ dhāryatē jagat |
ētadyōnīnibhūtāni sarvāṇītyupadhāraya |
ahaṃ kṛtsnasya jagataḥ prabhavaḥ praḷayastadā |
mattaḥ parataraṃ nānyat kiṃcit asti dhanaṃjaya |
mayi sarvamidaṃ prōtaṃ sūtrē maṇigaṇā iva ||
- - - bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha sanātanaṃ |
- - - tribhirguṇamayairbhāvairēbhiḥ sarvamidaṃ jagat |
mōhitaṃ nābhijānāti māmēbhyaḥ paramavyayaṃ ||
- - - avyaktaṃ vyaktimāpannaṃ manyaṃtē māmabuddhayaḥ |
paraṃ bhāvamajānaṃtō mamāvyayamanuttamaṃ ||
nāhaṃ prakāśaḥ sarvasya yōgamāyāsamāvṛtaḥ |
mūḍhō(a)yaṃ nābhijānāti lōkōmāmajamavyayaṃ ||
ābrahmabhuvanāllōkāḥ punarāvartinō(a)rjuna |
māmupētya tu kauṃtēya punarjanma na vidyatē ||
sahasrayugaparyaṃtamaharyadbrahmaṇō viduḥ |
rātriṃ yugasahasrāṃtāṃ tē(a)hōrātravidō janāḥ ||
avyaktādvyaktayaḥ sarvāḥ prabhavaṃtyaharāgamē |
rātryāgamē pralīyaṃtē tatraivā vyakta saṃjñikē ||
bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē |
rātryāgamē(a)vaśaḥ pārtha prabhavatyaharāgamē ||
parastasmāttu bhāvō(a)nyō (a)vyaktō (a)vyaktāt sanātanaḥ |
yaḥ sa sarvēṣu bhūtēṣu naśyatsu na vinaśyati ||
avyaktō(a)kṣara ityuktastamāhuḥ paramāṃ gatiṃ |
yaṃ prāpya na nivartaṃtē tadthāma paramaṃ mama ||.
(śrīmadbhagavadgīta - 7 - 1,2,4,5,6,7,10,13, 24 & 25, and 8 - 16 to 21)
(vijñānaṃtō sahā jñānamuguṟiṃci pūrtigā ceppucunnānu. idi telusukonina tarvāta iṃkanu telusukōvalasinadi maṟiyuṃḍadu. bhūmi, jalamu, agni, vāyuvu ākāśamu, manassu, buddhi, ahaṃkāramu ani nā prakṛti enimidi vidhamulugānunnadi. idi aparāprakṛti - dīni kaṃṭe vērainadi, jīvabhūtamainadi, jagattunu dhariṃcunadi nā parāprakṛti - samastamaina bhūtamulaku ī prakṛti yōnivaṃṭidi. ī jagattunaṃtaṭinī puṭṭiṃcuvāḍanu, samhariṃcuvāḍanu nēnē nākaṃṭe utkṛṣṭamainadi lēdu - dāraṃtō maṇulu guccabaḍi (vadalukuṃḍa nuṃḍunaṭlu) nālō ī jagattu aṃtayu paṭṭubaḍiyunnadi. - - - samasta bhūtamulaku nēnu bījamani telusukonumu - (vāṭi janmaku nēnē kāraṇamani - nānuṃḍē avi puṭṭinavani telusukonumu) - - - satvarajastamōguṇamulanu triguṇamulacēta - prakṛti guṇamulacēta - yī jagattu (jagattulōni vastuvulanniyu) mōhamu ceṃdinavi. aṃducēta kṣīṇiṃci naśiṃcanivāḍanu, anniṃṭikaṃṭe utkṛṣṭuḍanu ayina nannu telusukonalēkunnadi. nāyokka avyayamainadinnī, utkṛṣṭamainadinnī ayina tatvamunu teliyalēnaṃduna, sādhāraṇamugā vyaktamugānaṭuvaṃṭidi (vastuvu) kaṃṭikikanabaḍani vastuvu, kanabaḍinadani ajñānulu - brahmatatvamu teliyanivāru - talaṃcedaru. nēnu (prakṛtiyanu) yōgamāyacēta kappabaḍi yuṃḍuṭacēta aṃdaṟiki kanabaḍanu - aṃducētanē mūḍhulaina ī lōkulu janmalēni nannu telusukonalēru. - - - brahmalōkamu modalagu lōkamulanniyu naśiṃci, marala puṭṭavalasinavē. nannu poṃdinayaḍala marala janmiṃcuṭa kalugadu. idi yeṭlaṃṭē brahmaku pagalu sahasrayugamulu, rātri sahasrayugamulu kālaparimāṇamani brahmakālamuneṟigina mahātmulu telusukoniri (ceppuduru). brahmaku pagalu - pagaṭi kālamu - prāraṃbhamukāgānē, appaṭivarakuvyaktamugāka - kaṃṭiki kanabaḍaka, sūkṣmāti sūkṣma sthitilōnunnavanniyu vāṭivalanē vyaktamugāka nuṃḍu sthitilōnunnaṃducēta avyaktamanu ceppabaḍina prakṛtinuṃḍi vyaktamagucunnavi. kaṃṭiki kanabaḍunaṭṭivigā agucunnavi - puṭṭucunnavi. avyaktamanagā paina ceppabaḍina brahma (caturmukha brahma) - ā brahmaku rātrikālamulō (iṭlu vyaktamainavellanu) ā brahmalōnē - avyaktamulōnē - līnamagucunnavi. ī prakāramugā avē bhūtamulu brahma pagaṭikālamaṃdu puṭṭucu, avaśulai - cēyunadilēka rātrikālamaṃdu aṃdulōnē - avyaktamagu brahmalōnē - līnamagucunnavi (layamagucunnavi) - sthūlarūpamu vadali sūkṣmāti sūkṣmarūpamutō kaliyucunnavi. dīninē sṛṣṭi praḷayamulaṃduru. ī avyaktamani ceppabaḍu brahma (prakṛti) kaṃṭenu avyaktamainadinnī utkṛṣṭamainadinnī, aṃtakaṃṭe sūkṣmamainadinnī sanātanamainadinnī (eppaṭinuṃḍi yunnadō teliyanidinnī), ī bhūtamulanniyu naśiṃcinanu tānu naśiṃcanidinnī ayina akṣaramanu (kṣīṇiṃcanidani) ceppabaḍucunnadi yokaṭi kaladu - dānini paramagati - paramapadamu - ani ceppuduru - dānini poṃdinavāru marala janmiṃcaru. adiyē nā paramadhāmamu - nēnuṃḍusthānamu - mōkṣasthānamu - tējaḥpuṃjamaina sthānamu - (ā mōkṣasthānamu nēnē - dāniki nāku bhēdamulēdu - adiyē nēnu nēnē adi).
(paina ceppinadānilō brahmajñānamu saṃkṣiptamugā ceppabaḍinadi).
karmajñānādi yōgyānāṃ sahaśrēṣu nṛ janmanāṃ |
madhyēkaścit vivēkōnan yatatē cittaśuddhayē |
jñānāya yatamānānāṃ siddhānāṃ ca vipaścitāṃ |
madhyēkaścinmahānēkaḥ samyak jñānēna māṃ hariṃ |
sākṣātkarōti tatvēna pratyagrūpēṇa cidghanaṃ |
mattattva jñōsti sarvajñō durlabhō jagatī tarē |
kiṃ vācyaṃ jñāna mahātmyaṃ śrīharērayamāśayaṃ ||". (gītābhāvaprakāśamu - 7 - 23 to 26)
(bhagavaṃtuni kṛpalēnidē bhagavat jñānamu (brahmajñānamu kalugadu - karmayōgulu jñānayōgulu vēlakoladi yunnanu ē okkaḍō citta śuddhi koṟaku yatnamu (karmayōgamu) cēyunu - jñānayōgulu madhyakūḍa ē okaḍō bhagavaṃtuni samyak jñānamu kalavāḍai bhagavaṃtuni sākṣātkariṃcukonunu. bhagavattattvavamu telisinavāḍu labhiṃcuṭa kaṣṭamu.aṃducēta bhagavat jñānamu yokka mahātmyamu ceppuṭa kaṣṭamani śrīkṛṣṇabhagavānuni āśayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.