(భగవంతునికి సంబంధించినవి, భగవంతుని పొందుటకు సాధనములైన ధర్మములు - నిశ్రేయసరూపములగుట వలన భగవంతుని పొందుటకు సాధనములైన ధర్మములు).
“మ. కలలోనం దను మున్నెఱుంగని మహా కష్టాత్ముడైనట్టి దు
ర్బలు డాపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబు లుల్లంబులో
దలపన్నంతనమెచ్చి యార్తిహరుడై తన్నైన నిచ్చున్, సుని
శ్చలభక్తిం భజియించువారికిడడే సంపద్విశేషోన్నతుల్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. 971)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -)
“వ. సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు వాయువు క్షీణంబునొంద దేహ కళత్ర మిత్ర భ్రాతృ మమత్వపాశబద్ధులై విడివడు నుపాయంబుగానక, సంసారాంధకారమగ్నులయి గతాగత్మబుల నెఱుంగక దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మ జరా రోగ విపత్తి మరణంబులందియు, శరీరంబు మేలనుచు బ్రమోద మోహ మదిరాపానమత్తులై విషయాసక్తతం జిక్కి తమ్ము దారెఱుంగకయుండి, విరక్తి మార్గంబు దెలియక వర్తించు మూఢులగు జనంబుల పొంతల బోవక, కేవల నారాయణ భక్తి భావంబుగల సద్గురుం బ్రతిదినంబును భజియించి, సాత్వికంబును, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్య వ్రతంబును, విషయంబుల మనంబు చేరకుండుటయు, సాధు సంగమంబును, సజ్జనమైత్రియు, వినయ సంపత్తియు, శుచిత్వంబును, క్షమయు, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును, నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వ సహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షత్వంబును, జననంగ వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛా లాభసంతుష్టియు, వేదాంత శాస్త్రార్థ జిజ్ఞాసయును, దేవతాంతరనిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాది గుణ విశిష్టత్వంబును, గృహారామక్షేత్ర కళత్ర, పుత్ర విత్తాదుల హరికర్పణంబు సేయుటయు, నితరదర్శన వర్జనంబు సేయుటయును భాగవతోత్తమ ధర్మంబులు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 54)
“సీ. నిత్యనైమిత్తిక నిజధర్మమున గురుశ్రద్ధా గరిష్టత జతుర పాంచ
రాత్రోక్త హరి సమారాధన క్రియలను నిష్కామంబున నెఱి మదీయ
విగ్రహ దర్శన వినుతి పూజావందనధ్యాన సంశ్రవవణముల గర్మ
సంగి గాకుండుట, సజ్జన ప్రకరాభిమానంబు నొందుట, హీనులంది
తే . జాలనను కంపసేయుట, సములయందు
మైత్రి నెఱపుట, యమ క్రియాది
యైన యోగంబుచేత నాధ్యాత్మికాది
భౌతికాదుల దెలియుట, పలుకుటయును.
వ. మఱియును –
“క. హరిగుణమంగళ కీర్తన
పరుడై తగనార్జవమున భగవత్పరులం
గరమనురక్తి భజించుట
నిరహంకారమున నుంట, నిశ్చలుడగుటన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 956 to 958.)
(bhagavaṃtuniki saṃbaṃdhiṃcinavi, bhagavaṃtuni poṃduṭaku sādhanamulaina dharmamulu - niśrēyasarūpamulaguṭa valana bhagavaṃtuni poṃduṭaku sādhanamulaina dharmamulu).
“ma. kalalōnaṃ danu munneṟuṃgani mahā kaṣṭātmuḍainaṭṭi du
rbalu ḍāpatsamayaṃbunan nija padābjātaṃbu lullaṃbulō
dalapannaṃtanamecci yārtiharuḍai tannaina niccun, suni
ścalabhaktiṃ bhajiyiṃcuvārikiḍaḍē saṃpadviśēṣōnnatul. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. 971)
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 -)
“va. sūryōdayāstamayaṃbulaṃ bratidinaṃbu vāyuvu kṣīṇaṃbunoṃda dēha kaḷatra mitra bhrātṛ mamatvapāśabaddhulai viḍivaḍu nupāyaṃbugānaka, saṃsārāṃdhakāramagnulayi gatāgatmabula neṟuṃgaka divāṃdhaṃbulagu jaṃtujālaṃbula bhaṃgi janma jarā rōga vipatti maraṇaṃbulaṃdiyu, śarīraṃbu mēlanucu bramōda mōha madirāpānamattulai viṣayāsaktataṃ jikki tammu dāreṟuṃgakayuṃḍi, virakti mārgaṃbu deliyaka vartiṃcu mūḍhulagu janaṃbula poṃtala bōvaka, kēvala nārāyaṇa bhakti bhāvaṃbugala sadguruṃ bratidinaṃbunu bhajiyiṃci, sātvikaṃbunu, bhūtadayayunu, harikathāmṛtapānaṃbunu, brahmacarya vrataṃbunu, viṣayaṃbula manaṃbu cērakuṃḍuṭayu, sādhu saṃgamaṃbunu, sajjanamaitriyu, vinaya saṃpattiyu, śucitvaṃbunu, kṣamayu, maunavrataṃbunu, vēdaśāstrādhyayana tadarthānuṣṭhānaṃbulunu, nahiṃsayu, sukhaduḥkhādi dvaṃdva sahiṣṇutayu, nīśvaruni sarvagatuniṃgā bhāviṃcuṭayu, mumukṣatvaṃbunu, jananaṃga varjanaṃbunu, valkalādi dhāraṇaṃbunu, yadṛcchā lābhasaṃtuṣṭiyu, vēdāṃta śāstrārtha jijñāsayunu, dēvatāṃtaraniṃdā varjanaṃbunu, garaṇatraya śikṣaṇaṃbunu, satyavākyatayu, śamadamādi guṇa viśiṣṭatvaṃbunu, gṛhārāmakṣētra kaḷatra, putra vittādula harikarpaṇaṃbu sēyuṭayu, nitaradarśana varjanaṃbu sēyuṭayunu bhāgavatōttama dharmaṃbulu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 54)
“sī. nityanaimittika nijadharmamuna guruśraddhā gariṣṭata jatura pāṃca
rātrōkta hari samārādhana kriyalanu niṣkāmaṃbuna neṟi madīya
vigraha darśana vinuti pūjāvaṃdanadhyāna saṃśravavaṇamula garma
saṃgi gākuṃḍuṭa, sajjana prakarābhimānaṃbu noṃduṭa, hīnulaṃdi
tē . jālananu kaṃpasēyuṭa, samulayaṃdu
maitri neṟapuṭa, yama kriyādi
yaina yōgaṃbucēta nādhyātmikādi
bhautikādula deliyuṭa, palukuṭayunu.
va. maṟiyunu –
“ka. hariguṇamaṃgaḷa kīrtana
paruḍai taganārjavamuna bhagavatparulaṃ
garamanurakti bhajiṃcuṭa
nirahaṃkāramuna nuṃṭa, niścaluḍaguṭan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 956 to 958.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.