← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాగవతమహాత్మ్యము bhāgavatamahātmyamu

Original — తెలుగు
  1. విద్వాంశ్చ క్రే సాత్వత సంహితం |

యస్యాం వైశ్రూయ మాణాయాం కృష్ణే పరమపూరుషే |

భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ జరాపహ |

స సంహితాం, భగవతీం కృత్వా - - - ||“. (శ్రీమద్భాగవతము - 1 - 6,7)

(ఈ భాగవతమను సంహితను - పురాణమును - వ్యాసమహర్షి వ్రాసెను - ఈ పురాణమును వినుచున్నపుడు నరునకు పరమ పురుషుడైన శ్రీకృష్ణునియందు శోక మోహములు పోగొట్టునట్టి భక్తి కలుగును).

  1. సీ. ఈ భాగవతము వలను విష్ణుసేవా బుద్ధి విస్తరిల్లు

ఆ. మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు

భవభయంబులెల్ల బాసి పోవు

యోగి సంఘమునకు నుత్తమ వ్రతములు

వాసుదేవ నామ వర్ణములు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 7)

  1. “పిబంతి యే భాగవత సతాం కథామృతం శ్రవణ పుటేషు సంభృతం |

ప్రనంతితే విషయ విధూతాశయః వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం ||“. (శ్రీమద్భాగవతం - 2 - 2 - 37)

(భాగవతులగు సత్పురుషులు కథలుగల భాగవతమను అమృతమున చెవులార గ్రోలినవారు విషయములను కర్మఫలములను బాసి భగవంతుని చరణ సన్నిధిని చేరుదురు).

  1. “శ్రీమద్భాగవతం పురాణ తిలకం యద్వైష్ణవనాం ధనం |

యస్మిన్ పారమ హంస్య మేవ మమలం జ్ఞానం పరం గీయతే |

యత్రిజ్ఞాన విరాగభక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం |

తచ్ఛృణ్వన్ ప్రపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యేన్నరః ||“. (పద్మపురాణము - ఉత్తరఖండము - 6 - 81,83)

(పురాణములలో తిలకము వంటిదిన్నీ, వైష్ణవులకు - విష్ణు భక్తులకు - ధనము వంటిదిన్నీ పరమహంస గుఱించి - పరమాత్మ గుఱించి అయిన జ్ఞానము చెప్పునదియు, జ్ఞానము, విరాగము, భక్తి, ఈ మూడింటితో కూడిన నైష్కర్మ్యమును బోధించునదియు నగు శ్రీమద్భాగవతము వినుచు, చదువుచు విచారణ చేయువాడు భక్తిద్వారా ముక్తిని పొందును).

  1. “శ్రీమద్భాగవతాన్ముక్తిః, సప్తాహం వాచనం కురు” ఇతి సూర్యవచః“. (పద్మపురాణము - ఉత్తరఖండము)

(ఏడురోజులు శ్రీమద్భాగవతమును పఠించుము - అందువలన ముక్తి కలుగును)

  1. “క. నిగమములు వేయి జదివిన

సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్

సుగమంబు భాగవతమను

నిగమంబు పఠింప ముక్తినివసనము, బుధా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 7 - 103)

  1. “మ. అవనీ చక్రములోన నే పురుషుడు యామ్నాయమున్ విన్న మా

ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపగా జాలు భ

క్తి విశేషంబు జనించు నట్టి భువనక్షేమకరంబైన భా

గవతామ్నాయము బాదరాయణుడు దా గల్పించె నేర్పొప్పగన్|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 7 - 99)

  1. “సీ. శ్రీమంతమై మునిశ్రేష్ట కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ

వినగోరు వారల విమలచిత్తంబుల జెచ్చెర నీశుండు సిక్కుగాక

యితర శాస్త్రంబుల నీశుండు సిక్కునే మంచివారలకు నిర్మత్సురులకు

కపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును దగిలియుండుట మహాతత్వబుద్ధి

తే. బరగ నాధ్యాత్మికాది తాపత్రయంబు

నడచి పరమార్థ భూతమై యధిక సుఖద

మై సమస్తంబుగాకయు, నయ్యునుండు

వస్తువెఱగంగదగు భాగవతమునందు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 36)

  1. చ. - - - శ్రుతి శాస్త్రసార కలితాత్ముడైన నరుండు పద్మలో

చన చరణారవిందయుగ సంగము గల్గిన సజ్జనుండు పొం

దిన ఫలమెఉందు భాగవత దివ్యకథా శ్రవణానురక్తి చేన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -13 - 393)

  1. “ఉ. ఎయ్యది కర్మబంధములనెల్ల హరించు, విభూతికారణం

బెయ్యది, సన్మునీంద్రు లకు నెల్ల గవిత్వసమాశ్రయంబు ము

న్నెయ్యది, సర్వమంత్రములనేలిన దెయ్యది, మోక్షలక్ష్మి రూ

పమెయ్యది, దాని బల్కెదను హృద్యము భాగవతాఖ్య మంత్రమున్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 -)

  1. “తే. పుష్కరంబందు ద్వారకాపురమునందు

మధురయందును రవిదినమందెవడు

పఠనసేయును రమణతో భాగవతము

వాడు దరియించు సంసారవార్థినపుడు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము 12 - 46)

  1. “సదా సేవ్యా సదాసేవ్యా శ్రీమద్భాగవతీకథా |

యస్యాం శ్రవణ మాత్రేణ హరిశ్చిత్తం సమాశ్రయేత్ ||” (పద్మపురాణము - ఉత్తరఖండము - 3)

(భాగవతమును వినినంత మాత్రమున వినువారి చెవిలో శ్రీహరి ఆశ్రయించియుండును. అందుచేత శ్రీమద్భాగవతము - నెల్లపుడు సేవించవలసినదే)

  1. కలికాల దోషాంధకారంబున నష్ట దర్శనులయిన జనులకు నిప్పుడి ప్పురాణంబు కమలబంధుని భంగి నున్నది.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 33)

Transliteration
  1. vidvāṃśca krē sātvata saṃhitaṃ |

yasyāṃ vaiśrūya māṇāyāṃ kṛṣṇē paramapūruṣē |

bhaktirutpadyatē puṃsaḥ śōkamōha jarāpaha |

sa saṃhitāṃ, bhagavatīṃ kṛtvā - - - ||“. (śrīmadbhāgavatamu - 1 - 6,7)

(ī bhāgavatamanu saṃhitanu - purāṇamunu - vyāsamaharṣi vrāsenu - ī purāṇamunu vinucunnapuḍu narunaku parama puruṣuḍaina śrīkṛṣṇuniyaṃdu śōka mōhamulu pōgoṭṭunaṭṭi bhakti kalugunu).

  1. sī. ī bhāgavatamu valanu viṣṇusēvā buddhi vistarillu

ā. mōkṣakāmunakunu mōkṣaṃbu siddhiṃcu

bhavabhayaṃbulella bāsi pōvu

yōgi saṃghamunaku nuttama vratamulu

vāsudēva nāma varṇamulu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 7)

  1. “pibaṃti yē bhāgavata satāṃ kathāmṛtaṃ śravaṇa puṭēṣu saṃbhṛtaṃ |

pranaṃtitē viṣaya vidhūtāśayaḥ vrajaṃti taccaraṇa sarōruhāṃtikaṃ ||“. (śrīmadbhāgavataṃ - 2 - 2 - 37)

(bhāgavatulagu satpuruṣulu kathalugala bhāgavatamanu amṛtamuna cevulāra grōlinavāru viṣayamulanu karmaphalamulanu bāsi bhagavaṃtuni caraṇa sannidhini cēruduru).

  1. “śrīmadbhāgavataṃ purāṇa tilakaṃ yadvaiṣṇavanāṃ dhanaṃ |

yasmin pārama haṃsya mēva mamalaṃ jñānaṃ paraṃ gīyatē |

yatrijñāna virāgabhakti sahitaṃ naiṣkarmyamāviṣkṛtaṃ |

tacchṛṇvan prapaṭhan vicāraṇa parō bhaktyā vimucyēnnaraḥ ||“. (padmapurāṇamu - uttarakhaṃḍamu - 6 - 81,83)

(purāṇamulalō tilakamu vaṃṭidinnī, vaiṣṇavulaku - viṣṇu bhaktulaku - dhanamu vaṃṭidinnī paramahaṃsa guṟiṃci - paramātma guṟiṃci ayina jñānamu ceppunadiyu, jñānamu, virāgamu, bhakti, ī mūḍiṃṭitō kūḍina naiṣkarmyamunu bōdhiṃcunadiyu nagu śrīmadbhāgavatamu vinucu, caduvucu vicāraṇa cēyuvāḍu bhaktidvārā muktini poṃdunu).

  1. “śrīmadbhāgavatānmuktiḥ, saptāhaṃ vācanaṃ kuru” iti sūryavacaḥ”. (padmapurāṇamu - uttarakhaṃḍamu)

(ēḍurōjulu śrīmadbhāgavatamunu paṭhiṃcumu - aṃduvalana mukti kalugunu)

  1. “ka. nigamamulu vēyi jadivina

sugamaṃbulu kāvu mukti subhagatvaṃbul

sugamaṃbu bhāgavatamanu

nigamaṃbu paṭhiṃpa muktinivasanamu, budhā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 7 - 103)

  1. “ma. avanī cakramulōna nē puruṣuḍu yāmnāyamun vinna mā

dhavupai lōkaśaraṇyupai bhavamulaṃ dappiṃpagā jālu bha

kti viśēṣaṃbu janiṃcu naṭṭi bhuvanakṣēmakaraṃbaina bhā

gavatāmnāyamu bādarāyaṇuḍu dā galpiṃce nērpoppagan|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 7 - 99)

  1. “sī. śrīmaṃtamai muniśrēṣṭa kṛtaṃbaina bhāgavataṃbu sadbhaktitōḍa

vinagōru vārala vimalacittaṃbula jeccera nīśuṃḍu sikkugāka

yitara śāstraṃbula nīśuṃḍu sikkunē maṃcivāralaku nirmatsurulaku

kapaṭa nirmuktulai kāṃkṣa sēyakayunu dagiliyuṃḍuṭa mahātatvabuddhi

tē. baraga nādhyātmikādi tāpatrayaṃbu

naḍaci paramārtha bhūtamai yadhika sukhada

mai samastaṃbugākayu, nayyunuṃḍu

vastuveṟagaṃgadagu bhāgavatamunaṃdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 36)

  1. ca. - - - śruti śāstrasāra kalitātmuḍaina naruṃḍu padmalō

cana caraṇāraviṃdayuga saṃgamu galgina sajjanuṃḍu poṃ

dina phalameuṃdu bhāgavata divyakathā śravaṇānurakti cēn”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 -13 - 393)

  1. “u. eyyadi karmabaṃdhamulanella hariṃcu, vibhūtikāraṇaṃ

beyyadi, sanmunīṃdru laku nella gavitvasamāśrayaṃbu mu

nneyyadi, sarvamaṃtramulanēlina deyyadi, mōkṣalakṣmi rū

pameyyadi, dāni balkedanu hṛdyamu bhāgavatākhya maṃtramun ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 -)

  1. “tē. puṣkaraṃbaṃdu dvārakāpuramunaṃdu

madhurayaṃdunu ravidinamaṃdevaḍu

paṭhanasēyunu ramaṇatō bhāgavatamu

vāḍu dariyiṃcu saṃsāravārthinapuḍu “. (śrīmadāṃdhramahābhāgavatamu 12 - 46)

  1. “sadā sēvyā sadāsēvyā śrīmadbhāgavatīkathā |

yasyāṃ śravaṇa mātrēṇa hariścittaṃ samāśrayēt ||” (padmapurāṇamu - uttarakhaṃḍamu - 3)

(bhāgavatamunu vininaṃta mātramuna vinuvāri cevilō śrīhari āśrayiṃciyuṃḍunu. aṃducēta śrīmadbhāgavatamu - nellapuḍu sēviṃcavalasinadē)

  1. kalikāla dōṣāṃdhakāraṃbuna naṣṭa darśanulayina janulaku nippuḍi ppurāṇaṃbu kamalabaṃdhuni bhaṃgi nunnadi.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 33)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.