← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాగవతోత్తమః bhāgavatōttamaḥ

Original — తెలుగు
  1. భగవతః భక్తేషు ఉత్తమః

(భగవంతుని భక్తులలో ఉత్తముడు)

  1. “గృహీత్వాడీంద్రియై రర్థాన్ యోనద్వేష్టి, నహృష్యతి విష్ణోర్మాయామిదం పశ్యన్ సవై భాగవతోత్తమః |

దేహేంద్రియ ప్రాణమనోధియాం యో జన్మాప్యయ క్షుద్భయ తర్షకృచ్ఛైః |

సంసార ధర్మైః అవిముహ్య యానః స్మృత్యా హరేః భాగవతప్రథానః |

నకాదు కర్మ బీజానాం న వర్ణాశ్రమ జాతిభిః |

సజ్జతేస్మిన్నహం భావో దేహే వై సహరేంద్రియః |

నయస్యస్వః పర ఇతి విత్తేష్వాత్మని వాభిదా |

సర్వభూత సమశ్శాంతః స వై భాగవతోత్తమః |

త్రిభువన విభవ హేతవే అప్యకుంఠ స్మృతి రజితాత్మ సురాదిభిర్విమృగ్యాత్ |

న చలతి భగవత్పాదారవిందాల్లవ నిమిషమపిస్మ వైష్ణవాగ్ర్యః ||“.

(ఇంద్రియములద్వారా అర్థములను గ్రహించుచున్నను ఇదంతయు విష్ణుమాయయని తెలిసి వాటివలన సంతోషముగాని ద్వేషముగాని పొందనివాడు భగవతోత్తముడు. దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి - వీటి వలన కలుగు సంసారధర్మములైన జననమరణములు, ఆకలిదప్పులు మొదలగువాని మోహములో పడక, శ్రీహరిని స్మరించువాడు భాగవతులలో ప్రధానుడు - ముఖ్యుడు, ఉత్తముడు, కోరికలతో కర్మలను చేయక, వాసుదేవినియందే ధ్యానము కలిగియుండువాడు భాగవతోత్తముడు. ఎవనికి జన్మకర్మలు లేవో, వర్ణాశ్రమజాతి భేదములు లేవో, దేహమందు అహంభావము లేదో - ఈ దేహము నేనే అను అభిప్రాయములేదో - అట్టివాడు హరిప్రియుడు - (భగవంతుని యిష్టుడు), భాగవతులలో ఉత్తముడు. ఎవనికి వీడు నావాడు, వీడు పైవాడు అనిగాని, ఇది నాధనము ఇది పైవాడిది అనిగాని, అభిప్రాయము లేదో, (ఎవనికి తన, పర అను భేదములేదో, ఎవనికి అన్ని భూతములు సమానమో, ఎవడు శాంతుడో - ఎట్టి పరిస్థితులలోనైనను కోపము చెందక సహనము కలిగియుండునో - అట్టివాడు భాగవతోత్తముడు - ముల్లోకములగుఱించి అయినను భగవంతుని స్మరణ ఒక నిముషమైనను ఎవడు ఏమరకయుండునో అట్టివాడు భాగవతోత్తముడు)

  1. “ఆత్మనః స్వస్య సర్వభూతేషు భగవద్భావం (బ్రహ్మ భావేన సమన్వయం) యః పశ్యేత్, తథా బ్రహ్మరూపో అధిష్ఠానే ఆత్మని భూతాని చయః పశ్యేత్ - ఆత్మనః శ్రీహరేః సర్వభూతేషు మశకాదిషు అపి నియంతృత్వేన వర్తమానస్య భగవద్భావం నిరతిశయైశ్వర్యమేవ యః పశ్యేత్ - నతు తస్య తారతమ్యం - తథా ఆత్మని హరే ఏవ భూతాని చయః పశ్యేత్ - కథం భూతే భగవతి? అప్రచ్యుతైశ్వర్యాది రూపేన పునర్మలిన భూతాశ్రయత్వేన జాడ్యాది ప్రసక్త్యా ఐశ్వర్యాది ప్రచ్యుతం పశ్యేత్. కింతుసర్వత్ర పరిపూర్ణం భగవత్తత్త్వం పశ్యేత్, సః భాగవతోత్తమః”.

(తను సమస్త భూతములు భగవంతుడే - అన్నియు భగవంతుని రూపములే యని చూచువాడు, తనలోను, దోమ మొదలగు సమస్త భూతములలోను బ్రహ్మ అధిష్ఠించి యున్నాడని ఎవడు చూచునో (తెలుసుకొనునో), ఇటువంటి ఐశ్వర్యము (ఈశ్వరత్వము, నియతృత్వము కలిగియున్నాడని తెలియునో) - అందుచేత భూతములలోగాని, భగవంతునికి, భూతములకు గాని, తారతమ్యము లేదని ఎవడు తెలుసుకొనునో, భగవంతునియందు సమస్త భూతములను ఎవడు చూచునో, (భగవంతుని విశ్వరూపములో బ్రహ్మ మొదలగు దేవతలను, కురుపాండవ సైన్యములను మొదలగు వాటినన్నింటిని అర్జునుడు చూచునట్లు చూచునో, సృష్టి ప్రారంభము కాకముందు ఈ సమస్త భూతములు సూక్ష్మరూపములో భగవంతునియందు ఇమిడియున్నవని ఎవడు తెలుసుకొనునో, ప్రపంచములోని సమస్త భూతములలోను తానుండుటవలన తానున్న ఉపాధికి సంబంధించిన జడత్వము, మలినత్వము (దోషములు) తనకిలేక, వాటిని అంటకుండనుండుట వలన తన తొల్లింటి ఐశ్వర్యము ఇసుమంతయు తగ్గిపోకుండునట్టి వైభవము (ఐశ్వర్యము) గలవానినిగా ఎవడు భగవంతుని తెలుసుకొనునో, అనేక ఉపాధులలో తాను వేఱు వేఱుగ నున్నప్పటికీ భగవంతుడు పరిపూర్తిగా నుండుటను తెలుసుకొనునో, అట్టివాడు భాగవతోత్తముడు) (చూడుము - శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 54)

Transliteration
  1. bhagavataḥ bhaktēṣu uttamaḥ

(bhagavaṃtuni bhaktulalō uttamuḍu)

  1. “gṛhītvāḍīṃdriyai rarthān yōnadvēṣṭi, nahṛṣyati viṣṇōrmāyāmidaṃ paśyan savai bhāgavatōttamaḥ |

dēhēṃdriya prāṇamanōdhiyāṃ yō janmāpyaya kṣudbhaya tarṣakṛcchaiḥ |

saṃsāra dharmaiḥ avimuhya yānaḥ smṛtyā harēḥ bhāgavataprathānaḥ |

nakādu karma bījānāṃ na varṇāśrama jātibhiḥ |

sajjatēsminnahaṃ bhāvō dēhē vai saharēṃdriyaḥ |

nayasyasvaḥ para iti vittēṣvātmani vābhidā |

sarvabhūta samaśśāṃtaḥ sa vai bhāgavatōttamaḥ |

tribhuvana vibhava hētavē apyakuṃṭha smṛti rajitātma surādibhirvimṛgyāt |

na calati bhagavatpādāraviṃdāllava nimiṣamapisma vaiṣṇavāgryaḥ ||“.

(iṃdriyamuladvārā arthamulanu grahiṃcucunnanu idaṃtayu viṣṇumāyayani telisi vāṭivalana saṃtōṣamugāni dvēṣamugāni poṃdanivāḍu bhagavatōttamuḍu. dēhamu, iṃdriyamulu, prāṇamu, manassu, buddhi - vīṭi valana kalugu saṃsāradharmamulaina jananamaraṇamulu, ākalidappulu modalaguvāni mōhamulō paḍaka, śrīharini smariṃcuvāḍu bhāgavatulalō pradhānuḍu - mukhyuḍu, uttamuḍu, kōrikalatō karmalanu cēyaka, vāsudēviniyaṃdē dhyānamu kaligiyuṃḍuvāḍu bhāgavatōttamuḍu. evaniki janmakarmalu lēvō, varṇāśramajāti bhēdamulu lēvō, dēhamaṃdu ahaṃbhāvamu lēdō - ī dēhamu nēnē anu abhiprāyamulēdō - aṭṭivāḍu haripriyuḍu - (bhagavaṃtuni yiṣṭuḍu), bhāgavatulalō uttamuḍu. evaniki vīḍu nāvāḍu, vīḍu paivāḍu anigāni, idi nādhanamu idi paivāḍidi anigāni, abhiprāyamu lēdō, (evaniki tana, para anu bhēdamulēdō, evaniki anni bhūtamulu samānamō, evaḍu śāṃtuḍō - eṭṭi paristhitulalōnainanu kōpamu ceṃdaka sahanamu kaligiyuṃḍunō - aṭṭivāḍu bhāgavatōttamuḍu - mullōkamulaguṟiṃci ayinanu bhagavaṃtuni smaraṇa oka nimuṣamainanu evaḍu ēmarakayuṃḍunō aṭṭivāḍu bhāgavatōttamuḍu)

  1. “ātmanaḥ svasya sarvabhūtēṣu bhagavadbhāvaṃ (brahma bhāvēna samanvayaṃ) yaḥ paśyēt, tathā brahmarūpō adhiṣṭhānē ātmani bhūtāni cayaḥ paśyēt - ātmanaḥ śrīharēḥ sarvabhūtēṣu maśakādiṣu api niyaṃtṛtvēna vartamānasya bhagavadbhāvaṃ niratiśayaiśvaryamēva yaḥ paśyēt - natu tasya tāratamyaṃ - tathā ātmani harē ēva bhūtāni cayaḥ paśyēt - kathaṃ bhūtē bhagavati? apracyutaiśvaryādi rūpēna punarmalina bhūtāśrayatvēna jāḍyādi prasaktyā aiśvaryādi pracyutaṃ paśyēt. kiṃtusarvatra paripūrṇaṃ bhagavattattvaṃ paśyēt, saḥ bhāgavatōttamaḥ”.

(tanu samasta bhūtamulu bhagavaṃtuḍē - anniyu bhagavaṃtuni rūpamulē yani cūcuvāḍu, tanalōnu, dōma modalagu samasta bhūtamulalōnu brahma adhiṣṭhiṃci yunnāḍani evaḍu cūcunō (telusukonunō), iṭuvaṃṭi aiśvaryamu (īśvaratvamu, niyatṛtvamu kaligiyunnāḍani teliyunō) - aṃducēta bhūtamulalōgāni, bhagavaṃtuniki, bhūtamulaku gāni, tāratamyamu lēdani evaḍu telusukonunō, bhagavaṃtuniyaṃdu samasta bhūtamulanu evaḍu cūcunō, (bhagavaṃtuni viśvarūpamulō brahma modalagu dēvatalanu, kurupāṃḍava sainyamulanu modalagu vāṭinanniṃṭini arjunuḍu cūcunaṭlu cūcunō, sṛṣṭi prāraṃbhamu kākamuṃdu ī samasta bhūtamulu sūkṣmarūpamulō bhagavaṃtuniyaṃdu imiḍiyunnavani evaḍu telusukonunō, prapaṃcamulōni samasta bhūtamulalōnu tānuṃḍuṭavalana tānunna upādhiki saṃbaṃdhiṃcina jaḍatvamu, malinatvamu (dōṣamulu) tanakilēka, vāṭini aṃṭakuṃḍanuṃḍuṭa valana tana tolliṃṭi aiśvaryamu isumaṃtayu taggipōkuṃḍunaṭṭi vaibhavamu (aiśvaryamu) galavāninigā evaḍu bhagavaṃtuni telusukonunō, anēka upādhulalō tānu vēṟu vēṟuga nunnappaṭikī bhagavaṃtuḍu paripūrtigā nuṃḍuṭanu telusukonunō, aṭṭivāḍu bhāgavatōttamuḍu) (cūḍumu - śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 54)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.