పరంతు, భక్తిరేభ్యస్త్రిభ్యః అపి సర్వతః శ్రేష్టతరా అస్తి. తేషు కర్మాదిషు వర్ణాశ్రమాధికారా దీనాం విచారో అస్తి. సహైవ తత్ర పతనాత్ భయమప్యస్తి. పరంతు సత్యాయాం భక్తౌ భగవతః పూర్ణ సహాయ సత్వాత్ కిమపి భయం నాస్తి. తథా అస్యాం స్త్రియః పురుషస్య బ్రాహ్మణస్య శూద్రాదేశ్చ సర్వేషామేవ అధికారో అస్తి".
(కర్మ, జ్ఞానము, యోగము - కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము - ఈ మూడును భగవతుని చేరుటకు (ముక్తి చెందుటకు) సాధనములు. ఈ మూడింటికంటె భక్తియే అన్ని విధముల ఎక్కువ శ్రేష్టమైనది. కర్మయోగము మొదలగువాటిలో వర్ణాశ్రమములు, అధికారియగుట మొదలగువాటినిగుఱించి ఆలోచించ వలసియున్నది - అడ్డులున్నవి. ఇదికాక ఆ యోగములలో భ్రష్టుడై యుండుటకు - యోగభ్రష్టుడైయుండుటకు అవకాశమున్నది. భక్తియోగములో భగవంతుని సహాయము పూర్తిగా నుండుటవలన ఏ విధమైన భయము ఏ కొంచెమైనను లేదు - ఈ భక్తియోగములో స్త్రీలకు, పురుషులకు, బ్రాహ్మణులకు, శూద్రులకు మొదలగు వారలకు అందఱకును అధికారము కలదు. భక్తియోగము వీరు చేయవచ్చును, వారు చేయకూడదు అను విచక్షణ లేదు).
(తనకు చేయవలసినదని శాస్త్రములో చెప్పబడిన కర్మతో భగవంతుని అర్చించి మానవుడు సిద్ధిని పొందుచున్నాడు).
(జ్ఞానమను - బ్రహ్మజ్ఞానమను - పడవతో భగవత్ప్రాప్తికి అడ్డుతగులు పాపము లన్నింటినీ దాటగలవు).
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప ||
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః |
నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ ||". (శ్రీమద్భగవద్గీత - 11 - 54, 55)
(పరమబ్రహ్మ తత్వమయిన నన్ను ఈ విధముగా విశ్వరూపుడుగానున్న నన్ను, యధార్థముగా తెలుసుకొనుటకు, చూచుటకు, నాలో ప్రవేశించుటకు - ఐక్యమగుటకు అనన్య భక్తి చేతనే వీలగును. నా గుఱించియే కర్మలు చేయువాడు, నాయందే మనస్సునుంచి, నేనే పరమగతియని తలచువాడు, నాభక్తు డైన వాడు, దేనియందును సంగములేనివాడును, సమస్తభూతములందు వైరము లేనివాడు - ఇటువంటివాడు నన్ను పొందగలడు).
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం |
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||.
జన్మ కర్మ చ మే దివ్యమేవమేవం యో వెత్తి తత్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మనైతి, మామేతి సో(అ)ర్జున ||". (శ్రీమద్భగవద్గీత - 4 - 7 to 9)
(ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగునో - ధర్మము క్షీణించునో - అధర్మము పెచ్చు పెరుగునో, అప్పుడు నేను నన్ను సృజించుకొనెదను - స్థూలరూపముతో ఆవిర్భవించుదును - సాధువులను - సత్పురుషులను - రక్షించుటకు, దుష్టులను - పాపాత్ములను - నశింపచేయుటకు ప్రతియుగమందును అవతరించెదను - ఈ విధముగా నేను అవతరించుట, అవతరించు చేయుకార్యములు యదార్థముగా (భగవత్తత్త్వరీత్యా జరుగుచున్నట్లు నన్ను తెలుసుకొనినవాడు - భగవత్తత్త్వము నెఱిగినవాడు ఈ వర్తమాన దేహమును విడిచిన తర్వాత మరల జన్మించడు - నన్నే పొందును - సంసారమును వదలి ముక్తిని పొందును).
ఉత్తమః పురుషస్త్వస్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య భిభర్త్యవ్యయ ఈశ్వరః |
యస్మాత్ క్షరమతీతో (అ)హమక్షరాదపి చోత్తమః |
అతో(అ)స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః |
యో మామేవమ సం మూఢో జానాతి పురుషోత్తమం |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ||". (శ్రీమద్భగవద్గీత - 15 - 16 to 19)
(సమస్తమైన భూతములు క్షీణించి నశించునవి. కూటస్థుడు (జీవుడు) అక్షరుడు, నశింపనివాడు. వీటికంటె ఉత్తముడైన పురుషుడింకొకడున్నాడు - అతనే పరమాత్మయని చెప్పబడుచున్నాడు - అతను ఈ మూడులోకములను (పదునాలుగు లోకములను) వ్యాపించి వాటిని భరించుచున్నాడు. అతని అవ్యయుడు, ఈశ్వరుడు, క్షరముకంటె, అక్షరుడైన జీవునికంటె అతీతుడైన జీవునికంటె అతీతుడై యుండుటచేత ఆ పరమాత్మ అయిన నేను లోకములోను వేదములోను పురుషోత్తముడని చెప్పబడుచున్నాను - ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తముడని - ఉత్తమపురుషుడని - తెలుసుకొనినవాడు నన్నే అన్ని విధముల- అన్నీ నేనే యని నమ్మకముతో - భజించును - అట్టివాడు నన్ను చేరును).
"సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||". (శ్రీమద్భగవద్గీత - 18 - 66)
(భగవంతుని పొందుటకు చెప్పబడిన మిగిలిన సాధనములను - మోక్షసాధనములను -వదలివేసి, సృష్టి అంతటిలోనున్న ఒక్కడినే అయిన నన్ను శరణు పొందుము - నేను నిన్ను సమస్త పాపములనుండి - వాటి ఫలమునుండి విముక్తుడుగ చేయుదును - మోక్షమునిచ్చెదను, నన్ను పొందునట్లు చెసెదను - మరల జన్మ లేకుండునట్లు చేసెదను).
మామే వైష్యసి యుక్త్యెవమాత్మానం మత్పరాయణం || ".
(శ్రీమద్భగవద్గీత - 9 - 34). (చూడుము - 'భక్తి ప్రకారము - 6')
"మఱియుం బెక్కండ్రు కామద్వేష భయస్నేహ, సేవాతి రేకంబుల చిత్తంబు హరిపరాయత్తంబుగా చేసి తద్గతిం జెందిరి"
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 18, 19)
నైన బాంధవముననైన, భీతి
నైన దగిలి తలప నఖిలాత్ముడగు హరి
చేరవచ్చు; వేఱుసేయడతడు".
"క. వైరానుబంధినంబున
జేరిన చందమున విష్ణు జిరతరభక్తిం
జేరగరాదని తోచును
నారాయణభక్తియుక్తి నా చిత్తమునన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 14, 15)
విని భక్తుడగువాడు వేడ్కతో బులకించి కన్నుల హర్షాశ్రుకణములొలుక
గద్గద స్వరముతో గమలాక్ష, వైకుంఠ, వరదనారాయణ వాసుదేవ
యనుచు నొత్తిలిపాడు, నాడు, నాక్రోశించు, నగు, జింతనము సేయునతి యొనర్చు
తే. మరులుకొనియుండు దనలోన మాటలాడు
వేల్పు సోకిన పురుషుని వృత్తి దిరుగు
బంధములబాసి యజ్ఞాన పటలి గాల్చి
విష్ణు బ్రాపించుదురి భక్తి వివశుడగుచు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 240)
paraṃtu, bhaktirēbhyastribhyaḥ api sarvataḥ śrēṣṭatarā asti. tēṣu karmādiṣu varṇāśramādhikārā dīnāṃ vicārō asti. sahaiva tatra patanāt bhayamapyasti. paraṃtu satyāyāṃ bhaktau bhagavataḥ pūrṇa sahāya satvāt kimapi bhayaṃ nāsti. tathā asyāṃ striyaḥ puruṣasya brāhmaṇasya śūdrādēśca sarvēṣāmēva adhikārō asti".
(karma, jñānamu, yōgamu - karmayōgamu, jñānayōgamu, haṭhayōgamu - ī mūḍunu bhagavatuni cēruṭaku (mukti ceṃduṭaku) sādhanamulu. ī mūḍiṃṭikaṃṭe bhaktiyē anni vidhamula ekkuva śrēṣṭamainadi. karmayōgamu modalaguvāṭilō varṇāśramamulu, adhikāriyaguṭa modalaguvāṭiniguṟiṃci ālōciṃca valasiyunnadi - aḍḍulunnavi. idikāka ā yōgamulalō bhraṣṭuḍai yuṃḍuṭaku - yōgabhraṣṭuḍaiyuṃḍuṭaku avakāśamunnadi. bhaktiyōgamulō bhagavaṃtuni sahāyamu pūrtigā nuṃḍuṭavalana ē vidhamaina bhayamu ē koṃcemainanu lēdu - ī bhaktiyōgamulō strīlaku, puruṣulaku, brāhmaṇulaku, śūdrulaku modalagu vāralaku aṃdaṟakunu adhikāramu kaladu. bhaktiyōgamu vīru cēyavaccunu, vāru cēyakūḍadu anu vicakṣaṇa lēdu).
(tanaku cēyavalasinadani śāstramulō ceppabaḍina karmatō bhagavaṃtuni arciṃci mānavuḍu siddhini poṃducunnāḍu).
(jñānamanu - brahmajñānamanu - paḍavatō bhagavatprāptiki aḍḍutagulu pāpamu lanniṃṭinī dāṭagalavu).
jñātuṃ draṣṭuṃ ca tatvēna pravēṣṭuṃ ca paraṃtapa ||
matkarmakṛnmatparamō madbhaktaḥ saṃgavarjitaḥ |
nirvairaḥ sarvabhūtēṣu yaḥ samāmēti pāṃḍava ||". (śrīmadbhagavadgīta - 11 - 54, 55)
(paramabrahma tatvamayina nannu ī vidhamugā viśvarūpuḍugānunna nannu, yadhārthamugā telusukonuṭaku, cūcuṭaku, nālō pravēśiṃcuṭaku - aikyamaguṭaku ananya bhakti cētanē vīlagunu. nā guṟiṃciyē karmalu cēyuvāḍu, nāyaṃdē manassunuṃci, nēnē paramagatiyani talacuvāḍu, nābhaktu ḍaina vāḍu, dēniyaṃdunu saṃgamulēnivāḍunu, samastabhūtamulaṃdu vairamu lēnivāḍu - iṭuvaṃṭivāḍu nannu poṃdagalaḍu).
abhyutthānamadharmasya tadātmānaṃ sṛjāmyahaṃ |
paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkṛtāṃ
dharma saṃsthāpanārthāya saṃbhavāmi yugē yugē ||.
janma karma ca mē divyamēvamēvaṃ yō vetti tatvataḥ |
tyaktvā dēhaṃ punarjanmanaiti, māmēti sō(a)rjuna ||". (śrīmadbhagavadgīta - 4 - 7 to 9)
(eppuḍeppuḍu dharmamunaku hāni kalugunō - dharmamu kṣīṇiṃcunō - adharmamu peccu perugunō, appuḍu nēnu nannu sṛjiṃcukonedanu - sthūlarūpamutō āvirbhaviṃcudunu - sādhuvulanu - satpuruṣulanu - rakṣiṃcuṭaku, duṣṭulanu - pāpātmulanu - naśiṃpacēyuṭaku pratiyugamaṃdunu avatariṃcedanu - ī vidhamugā nēnu avatariṃcuṭa, avatariṃcu cēyukāryamulu yadārthamugā (bhagavattattvarītyā jarugucunnaṭlu nannu telusukoninavāḍu - bhagavattattvamu neṟiginavāḍu ī vartamāna dēhamunu viḍicina tarvāta marala janmiṃcaḍu - nannē poṃdunu - saṃsāramunu vadali muktini poṃdunu).
uttamaḥ puruṣastvasyaḥ paramātmētyudāhṛtaḥ |
yō lōkatrayamāviśya bhibhartyavyaya īśvaraḥ |
yasmāt kṣaramatītō (a)hamakṣarādapi cōttamaḥ |
atō(a)smi lōkē vēdē ca prathitaḥ puruṣōttamaḥ |
yō māmēvama saṃ mūḍhō jānāti puruṣōttamaṃ |
sa sarvavidbhajati māṃ sarvabhāvēna bhārata ||". (śrīmadbhagavadgīta - 15 - 16 to 19)
(samastamaina bhūtamulu kṣīṇiṃci naśiṃcunavi. kūṭasthuḍu (jīvuḍu) akṣaruḍu, naśiṃpanivāḍu. vīṭikaṃṭe uttamuḍaina puruṣuḍiṃkokaḍunnāḍu - atanē paramātmayani ceppabaḍucunnāḍu - atanu ī mūḍulōkamulanu (padunālugu lōkamulanu) vyāpiṃci vāṭini bhariṃcucunnāḍu. atani avyayuḍu, īśvaruḍu, kṣaramukaṃṭe, akṣaruḍaina jīvunikaṃṭe atītuḍaina jīvunikaṃṭe atītuḍai yuṃḍuṭacēta ā paramātma ayina nēnu lōkamulōnu vēdamulōnu puruṣōttamuḍani ceppabaḍucunnānu - ī prakāramugā nannu puruṣōttamuḍani - uttamapuruṣuḍani - telusukoninavāḍu nannē anni vidhamula- annī nēnē yani nammakamutō - bhajiṃcunu - aṭṭivāḍu nannu cērunu).
"sarvadharmān parityajya māmēkaṃ śaraṇaṃ vraja |
ahaṃ tvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śucaḥ ||". (śrīmadbhagavadgīta - 18 - 66)
(bhagavaṃtuni poṃduṭaku ceppabaḍina migilina sādhanamulanu - mōkṣasādhanamulanu -vadalivēsi, sṛṣṭi aṃtaṭilōnunna okkaḍinē ayina nannu śaraṇu poṃdumu - nēnu ninnu samasta pāpamulanuṃḍi - vāṭi phalamunuṃḍi vimuktuḍuga cēyudunu - mōkṣamuniccedanu, nannu poṃdunaṭlu cesedanu - marala janma lēkuṃḍunaṭlu cēsedanu).
māmē vaiṣyasi yuktyevamātmānaṃ matparāyaṇaṃ || ".
(śrīmadbhagavadgīta - 9 - 34). (cūḍumu - 'bhakti prakāramu - 6')
"maṟiyuṃ bekkaṃḍru kāmadvēṣa bhayasnēha, sēvāti rēkaṃbula cittaṃbu hariparāyattaṃbugā cēsi tadgatiṃ jeṃdiri"
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 18, 19)
naina bāṃdhavamunanaina, bhīti
naina dagili talapa nakhilātmuḍagu hari
cēravaccu; vēṟusēyaḍataḍu".
"ka. vairānubaṃdhinaṃbuna
jērina caṃdamuna viṣṇu jiratarabhaktiṃ
jēragarādani tōcunu
nārāyaṇabhaktiyukti nā cittamunan". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 14, 15)
vini bhaktuḍaguvāḍu vēḍkatō bulakiṃci kannula harṣāśrukaṇamuloluka
gadgada svaramutō gamalākṣa, vaikuṃṭha, varadanārāyaṇa vāsudēva
yanucu nottilipāḍu, nāḍu, nākrōśiṃcu, nagu, jiṃtanamu sēyunati yonarcu
tē. marulukoniyuṃḍu danalōna māṭalāḍu
vēlpu sōkina puruṣuni vṛtti dirugu
baṃdhamulabāsi yajñāna paṭali gālci
viṣṇu brāpiṃcuduri bhakti vivaśuḍagucu". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 240)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.