← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవత్తత్త్వము bhagavattattvamu

Original — తెలుగు
  1. భగవాన్ ఏవ తత్వం భగవత్తత్త్వం.

(భగవంతుడే తత్వము - తత్వమనగా భగవంతుడే).

(భగవంతుడనగా ఎవడు, ఎటువంటువాడు, ఎక్కడనుండువాడు, ఏమి చేయుచుండువాడు - ఈ విషయములన్నియు తెలియచేయునది భగవత్తత్త్వము).

  1. తత్ + త్వం = తత్వం - తత్ అనగా అది - మనకు దూరముగా కనబడకుండ నున్నాడు కనుక 'అది' అని చెప్పబడినది.

"ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధస్స్మృతః | (శ్రీభగవద్గీత - 17 - 23)

(ఓం, తత్, సత్, అనునవి మూడున్నూ భగవంతునే నిర్దేశించును - త్వం = నీవు, తత్ + త్వం = భగవంతుడే నీవు, 'తత్వమసి' అను మహావాక్యము యొక్క సారమే భగవత్తత్త్వము - "ఆ నిరాకార పరబ్రహ్మ నీవే అయితివి" అని ఆ మహావాక్యార్థము - 'నీవే' అనగా జీవుడు. ఆ పరమాత్మయే జీవుడయినాడు - లేక నీవే ఆ పరమాత్మవి అనునదే భగవత్తత్త్వము.

  1. "చ. హరి భవదీయతత్వము సమంచిత భక్తి నెఱుంగనేను, నా

సరసిజ సంభవాదులును జాలము, సత్వగుణాశ్రయుండవున్

బరుడవు, నిర్గుణుండవును, బ్రహ్మమునై తగు నీకు నెప్పుడిం

దఱము, జతుర్విదార్థ ఫలదాయక, మ్రొక్కెదమాదరింపవే - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 7 - 195)

  1. భగవత్తత్త్వము ఎటువంటిదో తెలుసుకొనుట చాల కష్టము - ఎందుచేతననగా భగవంతుడు అగమ్యుడు, అగోచరుడు, వాక్కునకు, మనస్సునకు అందనివాడు. అందుచేత అందఱు అనేక రీతులుగా భగవత్తత్త్వము గుఱించి చెప్పియున్నారు -

    1. "వ. నిన్ను పరమాణుకారణవాదులైన కాణ్వ, గౌతమాదులును, బ్రకృతికారణవాదులైన సాంఖ్యులును వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పర తర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు - మహాభాగ్యవంతులైన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షంబయిన నివి యన్నియు నసత్యంబులని కానవచ్చు. వెండియు, గొందఱు సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబును నీవ యగుటం దెలియలేక నిత్యంబనియు ననిత్యంబనియు విపరీత బుద్ధిం దెలియుదురుగాని భవదీయ దివ్యతత్వంబు నిక్కంబుగ దెలియజాలరు - కొందఱు జగచ్ఛరీరుడవుగాన జగద్రూపకుండైన నిన్ను గటక మకుట కర్ణికాది వివిధభూషణ భేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వి కారానుగతుండవయ్యును నిఖిల హేతు ప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుందువని ఆత్మవిదులయినవారు తెలియుదురు".

(శ్రీమదాంధ్రమహాభాగవతము -10 - ఉ. భా - 1220)

  1. "శ్లో||.ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్య వద్వదతి తథైవ చాన్యః |

ఆశ్చర్య వచ్చేనమన్యః శృణోతి| శృత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||". (శ్రీమద్భగవద్గీత - 2 - 29)

(ఈ ఆత్మతత్వమును - భగవత్తత్త్వమును - తెలుసుకొనలేక కొందఱు ఆశ్చర్యముతో చూచెదరు, కొందఱు ఆశ్చర్యముతో చూచితిమి అని చెప్పుదురు, మఱికొందఱు ఆశ్చర్యముతో వింటిమని చెప్పుదురు - వీరు చూచి, విని, చెప్పెదరుగాని వీరెవ్వరికిని భగవత్తత్త్వము - ఆత్మ తత్వము - తెలియదు).

  1. "క. కొందఱు స్వభావమందురు

కొందఱు కర్మంబటండ్రు, కొందఱు కాలం

బందురు, కొందఱు దైవం

బందురు, కొందఱొగిగామమండ్రు, మహత్మా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 11 - 356)

  1. "యేష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే |

గృశ్యతే(అ)గ్ర్యయా ఉద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||".

(ఈ ఆత్మ - భగవంతుడు - సమస్త భూతములందు గూఢమైన (ఉన్నట్టు పైకి తెలియనీయకుండు నట్టి) రూపముతో నున్నాడు - కాని సూక్ష్మాతి సూక్ష్మమైన - ధర్భకొసవలె సూక్ష్మమైన బుద్ధి కలిగి, సూక్ష్మాతిసూక్ష్మమైన వస్తువులను చూడగలుగు శక్తి గలవారు చూచుచున్నారు. ("తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః = ఆ పరబ్రహ్మయైన విష్ణువు యొక్క ఉత్కృష్టమైన పదము - స్థానమును, వైకుంఠమును - సూరిజనులు - మహాభక్తులు, బ్రహ్మజ్ఞానులు ఎల్లపుడు చూచుచుందురు - వైకుంఠమే వైకుంఠుడు (విష్ణువు; వైకుంఠుడే వైకుంఠము“).

  1. "జానాతి, రామ, తవ తత్వగతిం హనుమాన్". (శ్రీరామకర్ణామృతం - 4 - 17)

(ఓ శ్రీరామా, నీ తత్వవిషయము మహాభక్తుడైన హనుమంతుడెఱుగును - అది యెట్లంటే - శ్రీరామ పట్టాభిషేకమైన తర్వాత శ్రీరాముని నిర్దేశముపైన శ్రీ సీతామహాలక్ష్మి హనుమంతుడు చేసిన సేవకు పారితోషికముగా నేమిచ్చినను చాలదని శ్రీరామచంద్ర పరబ్రహ్మయొక్క తత్వమునునిట్లు బోధించెను –

"మ. సుమతీ, రాముడు నిర్వికారము, సదా శుద్ధంబు, బుద్ధం బచిం

త్యమ వాచ్యంబతులం బతీంద్రియము, సత్తా మాత్రమున్, స్వప్రకా

శము నిర్ద్వందము, నిర్వికల్పమజమున్ సత్సంవిదానంద రూ

పమమూర్తి మజరంబు, కేవల పరబ్రహ్మంబు చింతింపగన్|". (శ్రీ సీతారామాంజనేయ సంవాదము - 1 - 77)

  1. ప్రతివస్తువు సృష్టించబడుటకు తానే కారణముగుటవలనను, ప్రతివస్తువు తనలోనుండియే - ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టుటవలనను - ప్రతివస్తువులోను తానే ప్రవేశించి, వ్యాపించి, దానిచే పని చేయుంచుటవలనను, ప్రతివస్తువు తనరూపమే యగుటవలనను పరబ్రహ్మ అనునదే పరతత్వము - భగవత్తత్త్వము - ఆగమముల ప్రకారము భగవత్తత్త్వము అయిదు రూపములుగనున్నది - పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా. - సత్య, జ్ఞానానందము, సత్స్వరూపము గలిగి అన్నింటికి కారణమైనది పరబ్రహ్మము - పరతత్వము. అదియే వేరు వేరు కార్యములను చేయుటకు వ్యూహములుగా నేర్పడినది - వాసుదేవవ్యూహము, సంకర్షణవ్యూహము, ప్రద్యుమ్న వ్యూహము, అనిరుద్ధవ్యూహము. బహగవంతుడను పదమునకు లక్షణము లైన జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి తేజస్సు అను షడ్గుణైశ్వర్యములు గలవాడు వాసుదేవుడు. వాసుదేవునికంటె యీ గుణములు ఉత్కృష్టముగా గలది ఇంకొకటిలేదు - కనుక పరవాసు దేవ తత్వమని చెప్పబడినది. పైన చెప్పిన ఆరు గుణములలో రెండేసి కలిసి ఒక తత్వముగా మిగిలిన మూడు తత్వములైనవి. అందుచేత పరతత్వమే వ్యూహములుగామారెను - ఈ వ్యూహములందఱికి అందుబాటులోనుండుట కష్టమని పరతత్వము అవతారములుగా మారెను - అట్లు మారుటయే విభవము. ఈ అవతారములుకూడా ఆయా కాలములవారికే చూడనలవి యగుటంజేసి, అందఱికి అందువిడిలో నుండుటకు ప్రతిప్రాణిలోను అంతరాత్మగానుండును. ఇది సూక్ష్మరూపములో నుండుటచేత భగవత్తత్త్వమునకు ప్రతీకగా - బదులుగా - మూర్తులద్వారా (విగ్రహములద్వారా) అర్చన చేయుటవీలుగా నున్నది. ఈ అయిదు విధములుగా నున్నది భగవంతుని తత్వములే - (భగవంతుని ఒకే ఒక తత్వము - భగవంతుడు ప్రతి వస్తువునందు ఉండుటవలన, ఏ వస్తువైనను అతని రూపమే యగుటవలన ఏదో ఒక ప్రతీక తీసుకొని, దాని ఉపాసించుట తప్పుకాదు.
Transliteration
  1. bhagavān ēva tatvaṃ bhagavattattvaṃ.

(bhagavaṃtuḍē tatvamu - tatvamanagā bhagavaṃtuḍē).

(bhagavaṃtuḍanagā evaḍu, eṭuvaṃṭuvāḍu, ekkaḍanuṃḍuvāḍu, ēmi cēyucuṃḍuvāḍu - ī viṣayamulanniyu teliyacēyunadi bhagavattattvamu).

  1. tat + tvaṃ = tatvaṃ - tat anagā adi - manaku dūramugā kanabaḍakuṃḍa nunnāḍu kanuka 'adi' ani ceppabaḍinadi.

"ōṃ tatsat iti nirdēśō brahmaṇa strividhassmṛtaḥ | (śrībhagavadgīta - 17 - 23)

(ōṃ, tat, sat, anunavi mūḍunnū bhagavaṃtunē nirdēśiṃcunu - tvaṃ = nīvu, tat + tvaṃ = bhagavaṃtuḍē nīvu, 'tatvamasi' anu mahāvākyamu yokka sāramē bhagavattattvamu - "ā nirākāra parabrahma nīvē ayitivi" ani ā mahāvākyārthamu - 'nīvē' anagā jīvuḍu. ā paramātmayē jīvuḍayināḍu - lēka nīvē ā paramātmavi anunadē bhagavattattvamu.

  1. "ca. hari bhavadīyatatvamu samaṃcita bhakti neṟuṃganēnu, nā

sarasija saṃbhavādulunu jālamu, satvaguṇāśrayuṃḍavun

baruḍavu, nirguṇuṃḍavunu, brahmamunai tagu nīku neppuḍiṃ

daṟamu, jaturvidārtha phaladāyaka, mrokkedamādariṃpavē - (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 7 - 195)

  1. bhagavattattvamu eṭuvaṃṭidō telusukonuṭa cāla kaṣṭamu - eṃducētananagā bhagavaṃtuḍu agamyuḍu, agōcaruḍu, vākkunaku, manassunaku aṃdanivāḍu. aṃducēta aṃdaṟu anēka rītulugā bhagavattattvamu guṟiṃci ceppiyunnāru -

    1. "va. ninnu paramāṇukāraṇavādulaina kāṇva, gautamādulunu, brakṛtikāraṇavādulaina sāṃkhyulunu vividhaṃbulaina kutarkaṃbulacētaṃ baraspara tarkavādaṃbula samarthiṃcucu ninnuṃ deliyalēru - mahābhāgyavaṃtulaina yōgīṃdrulaku nīvu pratyakṣaṃbayina nivi yanniyu nasatyaṃbulani kānavaccu. veṃḍiyu, goṃdaṟu sacarācara vastujātaṃbulaku naṃtaryāmivai sarvaṃbunu nīva yaguṭaṃ deliyalēka nityaṃbaniyu nanityaṃbaniyu viparīta buddhiṃ deliyudurugāni bhavadīya divyatatvaṃbu nikkaṃbuga deliyajālaru - koṃdaṟu jagaccharīruḍavugāna jagadrūpakuṃḍaina ninnu gaṭaka makuṭa karṇikādi vividhabhūṣaṇa bhēdaṃbulaṃ ganakaṃbu nijasvarūpaṃbu viḍuvaka vartiṃcu caṃdaṃbuna jagadvi kārānugatuṃḍavayyunu nikhila hētu pratyanīka kalyāṇaguṇātmakuṃḍavai yuṃduvani ātmavidulayinavāru teliyuduru".

(śrīmadāṃdhramahābhāgavatamu -10 - u. bhā - 1220)

  1. "ślō||.āścarya vatpaśyati kaścidēnamāścarya vadvadati tathaiva cānyaḥ |

āścarya vaccēnamanyaḥ śṛṇōti| śṛtvāpyēnaṃ vēda na caiva kaścit ||". (śrīmadbhagavadgīta - 2 - 29)

(ī ātmatatvamunu - bhagavattattvamunu - telusukonalēka koṃdaṟu āścaryamutō cūcedaru, koṃdaṟu āścaryamutō cūcitimi ani ceppuduru, maṟikoṃdaṟu āścaryamutō viṃṭimani ceppuduru - vīru cūci, vini, ceppedarugāni vīrevvarikini bhagavattattvamu - ātma tatvamu - teliyadu).

  1. "ka. koṃdaṟu svabhāvamaṃduru

koṃdaṟu karmaṃbaṭaṃḍru, koṃdaṟu kālaṃ

baṃduru, koṃdaṟu daivaṃ

baṃduru, koṃdaṟogigāmamaṃḍru, mahatmā". (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 11 - 356)

  1. "yēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmā na prakāśatē |

gṛśyatē(a)gryayā uddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||".

(ī ātma - bhagavaṃtuḍu - samasta bhūtamulaṃdu gūḍhamaina (unnaṭṭu paiki teliyanīyakuṃḍu naṭṭi) rūpamutō nunnāḍu - kāni sūkṣmāti sūkṣmamaina - dharbhakosavale sūkṣmamaina buddhi kaligi, sūkṣmātisūkṣmamaina vastuvulanu cūḍagalugu śakti galavāru cūcucunnāru. ("tadviṣṇōḥ paramaṃ padaṃ sadā paśyaṃti sūrayaḥ = ā parabrahmayaina viṣṇuvu yokka utkṛṣṭamaina padamu - sthānamunu, vaikuṃṭhamunu - sūrijanulu - mahābhaktulu, brahmajñānulu ellapuḍu cūcucuṃduru - vaikuṃṭhamē vaikuṃṭhuḍu (viṣṇuvu; vaikuṃṭhuḍē vaikuṃṭhamu”).

  1. "jānāti, rāma, tava tatvagatiṃ hanumān". (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 17)

(ō śrīrāmā, nī tatvaviṣayamu mahābhaktuḍaina hanumaṃtuḍeṟugunu - adi yeṭlaṃṭē - śrīrāma paṭṭābhiṣēkamaina tarvāta śrīrāmuni nirdēśamupaina śrī sītāmahālakṣmi hanumaṃtuḍu cēsina sēvaku pāritōṣikamugā nēmiccinanu cāladani śrīrāmacaṃdra parabrahmayokka tatvamununiṭlu bōdhiṃcenu –

"ma. sumatī, rāmuḍu nirvikāramu, sadā śuddhaṃbu, buddhaṃ baciṃ

tyama vācyaṃbatulaṃ batīṃdriyamu, sattā mātramun, svaprakā

śamu nirdvaṃdamu, nirvikalpamajamun satsaṃvidānaṃda rū

pamamūrti majaraṃbu, kēvala parabrahmaṃbu ciṃtiṃpagan|". (śrī sītārāmāṃjanēya saṃvādamu - 1 - 77)

  1. prativastuvu sṛṣṭiṃcabaḍuṭaku tānē kāraṇamuguṭavalananu, prativastuvu tanalōnuṃḍiyē - okadānilōnuṃḍi okaṭigā puṭṭuṭavalananu - prativastuvulōnu tānē pravēśiṃci, vyāpiṃci, dānicē pani cēyuṃcuṭavalananu, prativastuvu tanarūpamē yaguṭavalananu parabrahma anunadē paratatvamu - bhagavattattvamu - āgamamula prakāramu bhagavattattvamu ayidu rūpamuluganunnadi - para, vyūha, vibhava, aṃtaryāmi, arcā. - satya, jñānānaṃdamu, satsvarūpamu galigi anniṃṭiki kāraṇamainadi parabrahmamu - paratatvamu. adiyē vēru vēru kāryamulanu cēyuṭaku vyūhamulugā nērpaḍinadi - vāsudēvavyūhamu, saṃkarṣaṇavyūhamu, pradyumna vyūhamu, aniruddhavyūhamu. bahagavaṃtuḍanu padamunaku lakṣaṇamu laina jñānamu, balamu, aiśvaryamu, vīryamu, śakti tējassu anu ṣaḍguṇaiśvaryamulu galavāḍu vāsudēvuḍu. vāsudēvunikaṃṭe yī guṇamulu utkṛṣṭamugā galadi iṃkokaṭilēdu - kanuka paravāsu dēva tatvamani ceppabaḍinadi. paina ceppina āru guṇamulalō reṃḍēsi kalisi oka tatvamugā migilina mūḍu tatvamulainavi. aṃducēta paratatvamē vyūhamulugāmārenu - ī vyūhamulaṃdaṟiki aṃdubāṭulōnuṃḍuṭa kaṣṭamani paratatvamu avatāramulugā mārenu - aṭlu māruṭayē vibhavamu. ī avatāramulukūḍā āyā kālamulavārikē cūḍanalavi yaguṭaṃjēsi, aṃdaṟiki aṃduviḍilō nuṃḍuṭaku pratiprāṇilōnu aṃtarātmagānuṃḍunu. idi sūkṣmarūpamulō nuṃḍuṭacēta bhagavattattvamunaku pratīkagā - badulugā - mūrtuladvārā (vigrahamuladvārā) arcana cēyuṭavīlugā nunnadi. ī ayidu vidhamulugā nunnadi bhagavaṃtuni tatvamulē - (bhagavaṃtuni okē oka tatvamu - bhagavaṃtuḍu prati vastuvunaṃdu uṃḍuṭavalana, ē vastuvainanu atani rūpamē yaguṭavalana ēdō oka pratīka tīsukoni, dāni upāsiṃcuṭa tappukādu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.