← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాగవతులు bhāgavatulu

Original — తెలుగు
  1. భగవత్సంబధులు; భగవద్భక్తులు.

  2. భగవదుపాసకాః

(భగవంతుని ఉపాసన చేయువారు)

  1. భగవతి భక్తాః భాగవతాః

(భగవంతునియందు భక్తిగలవారు)

(జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అను షడ్గుణములు కలిగి, హేయ గుణములు లేనివాడు భగవంతుడు - అట్టి భగవంతుని యందు భక్తిగలవారు)

  1. “క. వర్ణాశ్రమ ధర్మంబుల

నిర్ణయ కర్మముల జెడక నిఖిల జగత్సం

పూర్ణుడు హరియను నాతడె

వర్ణింపగ భాగవతుడు వసుధా ధీశా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 47)

  1. “తే. సర్వభూతమయుండైన సరసి జాక్షు

డతడె తన యాత్మయందుండు ననెడువాడు

శంఖ చక్ర ధరుండగు సాధుజనుడు

భక్తిభావాభిరతుడు వో భాగవతుడు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 46)

  1. “న చలతి నిజధర్మ వర్ణతో యస్సమమతిరాత్మి సుహృద్విపక్ష పక్షే |

న హరతి, న చహంతి కించి దుచ్ఛెస్సిత మనసం తమేహి విష్ణుభక్తం ||“.

(తన కులధర్మములను విడువక స్వపక్ష సుహృత్పక్ష శతృపక్షములందు సమ బుద్ధితో ప్రవర్తించుచు ఇతరుల ద్రవ్యమునపహరింపక, పరులను హింసింపక స్వచ్ఛమైన హృదయము కలిగియుండువాడు భగవంతుడు).

  1. “భక్తి భావన పరాయణుండై కృపారస తత్పరుండై, మితభాషణుండై బొంకక, కర్మంబులు మదర్పణంబులుగా జేసిన యతండు భాగవతుండనంబరగు. మత్కథలను, మజ్జన్మ కర్మంబులును వినుచు, మత్సేవకులైన భాగవతులం జూచి, తన గృహంబునకుం గొనిపోయి మజ్జన, పూజన, భోజన, శయనాసనాదికంబుల పరితుష్టులంజేసిన యతండైనను భాగవతుండనంబడు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 103)

  1. అస్మదీయ భక్తియుక్తులును, హరిపరాయణులు నగు వారల చరణ రజః పుంజంబు తనశరీరంబు సోకజేయు నతండును, ముద్రాధారణయును హరి దివ్యనామంబులు ధరియించువారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవ భక్తులంగని హర్షించునతండును భాగవతులు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 105)

  2. క. పొడిచిన, దిట్టిన కొట్టిన

బడుచుందురుగాని పరమభాగవతులు దా

రొడబడరు మారు సేయగ

- - - “. (శ్రీమహాభాగవతము - 1 - 18 - 483)

  1. స్వధర్మనిరతుండైన పురుషుండనేక జన్మాంతర సుకృత విశేషంబులం జతుర్ముఖత్వంబు నొంది తదనంతరంబునం బుణ్యాతిరేకంబున నన్నుంబొంది యధికారాంతంబున నేనును దేవతాగణంబులును నవ్యాకృతంబైన యే హరిపదంబును బొందుదుమట్టి పదంబు భాగవతుండు తనంతనె బొందు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 -)

  2. “క. హరియని సంభావించును

హరియని దర్శించు, నంటు నాఘ్రాణించున్

హరియను రుచిగొన దలచు

హరి హరి ఘనునంబరీషు నలవియె పొగడన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 86)

  1. సహనశీలురు, సమస్త ధారులకు సుహృత్తులును, బరమ శాంతులును, గారుణికులునునై పరిత్యక్తకర్మఫల స్వభావులును, విసృష్ట స్వజన బంధు జనులునై మత్పదాశ్రయలును, మద్గుణధ్యాన పారీణులును, మత్కథా ప్రసంగ సంభరిత శ్రవణానందులును నగుచు మదీయ కథలనొడువుచు, వినుచుండు పరమ భాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రయంబు దపింప జేయజాలదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 870)

  2. సర్వసంగపరిత్యక్తుండై, నిఖిలాంతరాత్ముండైన పరమేశ్వరుండు అరుణగభస్తికిరణ సహస్రంబుల లోకత్రయంబుల బావనంబు సేయు చందంబునం దన చరణారవింద రజః పుంజంబు చేతం బవిత్రంబు సేయుచు, సురాసుర జేగీయమాన సేవ్యంబైన జనార్థన పాదారవిందంబులకు వందనాభిలాషుడై, భక్తియు లవమాత్రంబునుం జలింపనీక, సుధాకరోదయంబున దివాకర జనిత తాపనివారణంబైన భంగి నారాయణాంఘ్రి నఖ మణిచంద్రికా నిరస్త హృదయతాపుండై యాత్మీయు భక్తి రశనానుబంధ బంధురంబైన వాసుదేవ చరణ సరోరుహ ధ్యానానంద పరవశుడగునతండు భాగవత ప్రధానుండు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 49)

  3. “ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగ దార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి ||”.

(ప్రహ్లాదుడు, నారదుడు పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, భీష్ముడు, దాల్భ్యుడు, రుక్మాంగదుడు, అర్జునుడు, వసిష్టుడు, విభీషణుడు మొదలగు పుణ్యులను, పరమభాగవతులను స్మరించెదను -).

  1. “నశూద్రా భగవద్భక్తాః విప్రాః భాగవతాస్మృతః |

సర్వ వర్ణేషుయే శూద్రయేహ్య భక్తాః జనార్దనే ||“.

(శూద్రులైనను భగవద్భక్తులైన యడలశూద్రులు కారు; విప్రులైన మాత్రమున భగవద్భక్తులుకారు. అన్ని వర్ణములందు అయినను జనార్దనునియందు భక్తి లేనివారు శూద్రులు).

  1. భాగవతులు మూడు విధములు - భాగవతోత్తముడు, భాగవతమధ్యముడు - ప్రాకృత భాగవతుడు.
Transliteration
  1. bhagavatsaṃbadhulu; bhagavadbhaktulu.

  2. bhagavadupāsakāḥ

(bhagavaṃtuni upāsana cēyuvāru)

  1. bhagavati bhaktāḥ bhāgavatāḥ

(bhagavaṃtuniyaṃdu bhaktigalavāru)

(jñānaśakti, bala, aiśvarya, vīrya, tējassulu anu ṣaḍguṇamulu kaligi, hēya guṇamulu lēnivāḍu bhagavaṃtuḍu - aṭṭi bhagavaṃtuni yaṃdu bhaktigalavāru)

  1. “ka. varṇāśrama dharmaṃbula

nirṇaya karmamula jeḍaka nikhila jagatsaṃ

pūrṇuḍu hariyanu nātaḍe

varṇiṃpaga bhāgavatuḍu vasudhā dhīśā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 47)

  1. “tē. sarvabhūtamayuṃḍaina sarasi jākṣu

ḍataḍe tana yātmayaṃduṃḍu naneḍuvāḍu

śaṃkha cakra dharuṃḍagu sādhujanuḍu

bhaktibhāvābhiratuḍu vō bhāgavatuḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 46)

  1. “na calati nijadharma varṇatō yassamamatirātmi suhṛdvipakṣa pakṣē |

na harati, na cahaṃti kiṃci ducchessita manasaṃ tamēhi viṣṇubhaktaṃ ||“.

(tana kuladharmamulanu viḍuvaka svapakṣa suhṛtpakṣa śatṛpakṣamulaṃdu sama buddhitō pravartiṃcucu itarula dravyamunapahariṃpaka, parulanu hiṃsiṃpaka svacchamaina hṛdayamu kaligiyuṃḍuvāḍu bhagavaṃtuḍu).

  1. “bhakti bhāvana parāyaṇuṃḍai kṛpārasa tatparuṃḍai, mitabhāṣaṇuṃḍai boṃkaka, karmaṃbulu madarpaṇaṃbulugā jēsina yataṃḍu bhāgavatuṃḍanaṃbaragu. matkathalanu, majjanma karmaṃbulunu vinucu, matsēvakulaina bhāgavatulaṃ jūci, tana gṛhaṃbunakuṃ gonipōyi majjana, pūjana, bhōjana, śayanāsanādikaṃbula parituṣṭulaṃjēsina yataṃḍainanu bhāgavatuṃḍanaṃbaḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 103)

  1. asmadīya bhaktiyuktulunu, hariparāyaṇulu nagu vārala caraṇa rajaḥ puṃjaṃbu tanaśarīraṃbu sōkajēyu nataṃḍunu, mudrādhāraṇayunu hari divyanāmaṃbulu dhariyiṃcuvāralaku nannōdakaṃbula niḍu nataṃḍunu, vāsudēva bhaktulaṃgani harṣiṃcunataṃḍunu bhāgavatulu. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 105)

  2. ka. poḍicina, diṭṭina koṭṭina

baḍucuṃdurugāni paramabhāgavatulu dā

roḍabaḍaru māru sēyaga

- - - “. (śrīmahābhāgavatamu - 1 - 18 - 483)

  1. svadharmaniratuṃḍaina puruṣuṃḍanēka janmāṃtara sukṛta viśēṣaṃbulaṃ jaturmukhatvaṃbu noṃdi tadanaṃtaraṃbunaṃ buṇyātirēkaṃbuna nannuṃboṃdi yadhikārāṃtaṃbuna nēnunu dēvatāgaṇaṃbulunu navyākṛtaṃbaina yē haripadaṃbunu boṃdudumaṭṭi padaṃbu bhāgavatuṃḍu tanaṃtane boṃdu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 -)

  2. “ka. hariyani saṃbhāviṃcunu

hariyani darśiṃcu, naṃṭu nāghrāṇiṃcun

hariyanu rucigona dalacu

hari hari ghanunaṃbarīṣu nalaviye pogaḍan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 86)

  1. sahanaśīluru, samasta dhārulaku suhṛttulunu, barama śāṃtulunu, gāruṇikulununai parityaktakarmaphala svabhāvulunu, visṛṣṭa svajana baṃdhu janulunai matpadāśrayalunu, madguṇadhyāna pārīṇulunu, matkathā prasaṃga saṃbharita śravaṇānaṃdulunu nagucu madīya kathalanoḍuvucu, vinucuṃḍu parama bhāgavatōttamula nādhyātmikādi tāpatrayaṃbu dapiṃpa jēyajāladu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 870)

  2. sarvasaṃgaparityaktuṃḍai, nikhilāṃtarātmuṃḍaina paramēśvaruṃḍu aruṇagabhastikiraṇa sahasraṃbula lōkatrayaṃbula bāvanaṃbu sēyu caṃdaṃbunaṃ dana caraṇāraviṃda rajaḥ puṃjaṃbu cētaṃ bavitraṃbu sēyucu, surāsura jēgīyamāna sēvyaṃbaina janārthana pādāraviṃdaṃbulaku vaṃdanābhilāṣuḍai, bhaktiyu lavamātraṃbunuṃ jaliṃpanīka, sudhākarōdayaṃbuna divākara janita tāpanivāraṇaṃbaina bhaṃgi nārāyaṇāṃghri nakha maṇicaṃdrikā nirasta hṛdayatāpuṃḍai yātmīyu bhakti raśanānubaṃdha baṃdhuraṃbaina vāsudēva caraṇa sarōruha dhyānānaṃda paravaśuḍagunataṃḍu bhāgavata pradhānuṃḍu. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 49)

  3. “prahlāda nārada parāśara puṃḍarīka vyāsāṃbarīṣa śuka śaunaka bhīṣma dālbhyān rukmāṃga dārjuna vaśiṣṭa vibhīṣaṇādīn puṇyānimān parama bhāgavatān smarāmi ||”.

(prahlāduḍu, nāraduḍu parāśaruḍu, puṃḍarīkuḍu, vyāsuḍu, aṃbarīṣuḍu, śukuḍu, śaunakuḍu, bhīṣmuḍu, dālbhyuḍu, rukmāṃgaduḍu, arjunuḍu, vasiṣṭuḍu, vibhīṣaṇuḍu modalagu puṇyulanu, paramabhāgavatulanu smariṃcedanu -).

  1. “naśūdrā bhagavadbhaktāḥ viprāḥ bhāgavatāsmṛtaḥ |

sarva varṇēṣuyē śūdrayēhya bhaktāḥ janārdanē ||“.

(śūdrulainanu bhagavadbhaktulaina yaḍalaśūdrulu kāru; viprulaina mātramuna bhagavadbhaktulukāru. anni varṇamulaṃdu ayinanu janārdanuniyaṃdu bhakti lēnivāru śūdrulu).

  1. bhāgavatulu mūḍu vidhamulu - bhāgavatōttamuḍu, bhāgavatamadhyamuḍu - prākṛta bhāgavatuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.