(భగవంతునియందు భక్తిగల పురుషుడు).
భజనపరః (భగవంతుని భజన చేయుట యందు ఆసక్తి కలవాడు).
సర్వ కర్మణాం ఫలరూపా భక్తిర్యస్య హృదయే విద్యతే స ఏవ భక్తిః, స ఏవ సర్వగుణ సంపన్నః -
(తాను చేయు సమస్త కర్మలఫలమే భగవంతుని యందు భక్తి కలిగియుండుట అని తనహృదయములో తెలుసుకొనువాడు భక్తుడు, అట్టివాడు సమస్త సద్గుణములు గలవాడు).
శరణాగతః (భగవంతుని శరణు పొందినవాడు)
“తిరస్కృతాః విప్రలబ్దాః శప్తాః క్షిప్తా హతాపివా |
నాస్య ప్రతి కుర్వంతి తద్భక్తాః ప్రభవాపివా ||“. (శ్రీమద్భాగవతం -1 - 18 - 48)
(తిరస్కరించినను, తిట్టినను, కొట్టినను, శపించినను, త్రోసివేసినను వాటి వేటికిని మారు చేయనివారు భక్తులు).
క. పొడిచిన దిట్టిన కొట్టిన
బడుచుందురు కాని బరమభాగవతులు దా
రొడబడరు మారు సేయగ, - - ” (శ్రీ మదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 449)
(జన్మాంతరములేమి? స్వర్గమైన విష్ణుభక్తుల సంగంబు వెలకురాదు) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 407)
అర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ | (శ్రీమద్భగవద్గీత - 7 - 16)
“యే జనాః పుణ్యకర్మాణో మాం పరాత్మానమీశ్వరం |
భజంతే తే మహాత్మా నః సంతిలోకే చతుర్విధాః |
ఆర్తో వ్యాధ్యాదినో గ్రస్తస్త న్నివృత్తీచ్చయా సుధీః |
గ్రాహ గ్రస్తో యథాహస్తీ యథాచ దృపదాత్మజా |
జిజ్ఞాసురాత్మ జ్ఞానార్థీ జనకశ్చోద్ధవోయధా |
పరత్ర వేహభోగార్థ మర్థార్థీ సాధనేప్సుకః |
విభీషణశ్చ సుగ్రీవో యథా ముత్ర ధ్రువోయి థా |
స కామాశ్చ త్రయోప్యేతా భగవద్భజనేన చ |
తరంతి మాయాం తత్రాపి జిజ్ఞా సుర్జ్ఞాన లాభతః |
తౌతు జిజ్ఞాసుతాం ప్రాప్య జ్ఞానేనమాం తరంత్యమీ |
ఆర్తస్యార్థార్థ నశ్యాపిజిజ్ఞాసుత్వ సంభవాత్ |
జిజ్ఞోసోరపి బోధోనకరణార్థార్థితా భవేత్ |
అతస్తయోర్ద్వ యోర్మధ్యే జిజ్ఞాసుర్హరిణేరితః |
నిష్కామో భజతే జ్ఞానీ విష్ణుతత్వావబోధవాన్ |
తీర్ణమాయో యధా వ్యాస సనకాది రుధారధీః |
యో నా కేవల నిష్కామో యథా(అ)క్రూరో యుధిష్టిరః (గీతాభావప్రకాశము - 7 - 97 to 105)
(పరమాత్ముడు ఈశ్వరుడైన నన్ను పుణ్యాత్ములు, మహాత్ములు అయిన నాలుగు విధములైన జనులు భజించెదరు - నా భక్తులు నాలుగు విధములుగా నున్నారు - వారు ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తుడు అనగా బాధపడుచున్నవాడు - జిజ్ఞాసువు అనగా బ్రహ్మజ్ఞానము సంపాదించు కోరికగలవాడు. అర్థార్థి అనగా ఏదేని భోగములుమొదలగువాటిని కోరువాడు. జ్ఞాని అనగా బ్రహ్మ తత్వమును తెలిసినవాడు - అనారోగ్యముతో బాధపడుచుండువాడు ఆ బాధ నివారించుటకు నన్ను (భగవంతుని) భజించును. మొసలిచేత పట్టుబడియున్న గజేంద్రుడు వంటివాడు ఆర్తుడు - మాన రక్షణ కొఱకు కౌరవ సభలో ద్రౌపది రక్షించమని కోరినది. జనకమహారాజు, ఉద్ధవుడువలె నన్ను భజించువారు జిజ్ఞాసువులు. ఈ లోకములోకాని పరలోకములోకాని భోగములను అనుభవించవలెనను కోరికగలవారు అర్థార్థులు - ఒక ప్రయోజనముకొఱకు నర్థించువారు, వీరుకాక విభీషణుడు శరణుజొచ్చినవాడు ఆర్తుడు - ధ్రువుడు జిజ్ఞాసువు - భగవత్సాక్షాత్కారము కోరినవాడు. సుగ్రీవుడు అర్థార్థి - రాజ్యమునకు సహాయము కోరినవాడు. ఈ మూడు విధముల భక్తులు కోరికతో నన్ను భజించినవారు - సకాములే అయినను నా భక్తులే యగుటవలన మాయను తరించిరి, సంసారమును విడిచిపెట్టి మాయను తరించిరి. జ్ఞాని యగువాడు - భగవత్ జ్ఞానమును పొందినవాడు కోరికలేకనే నన్ను భజించును - సనక సనందనాదులు, వ్యాసుడు వలె మాయను తరించువారు, అక్రూరుడు ధర్మరాజువలె - కోరికలేనివారు.
“తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినో (అ)త్యర్థమహం స చ మమప్రియః ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 17)
(తేషాం చతుర్విధానాంచ మధ్యే తత్వవిదుత్తమః |
నివృత్త సర్వకామత్వాత్ సుకృతాధిక్య హేతునా |
ప్రేమాధిక్యా షు చోత్కృష్టః సర్వతః సమ్మతో మమ |
యతో భగవతి ప్రత్యగభిన్నే భ్రాంతి హావతః |
సమాహితమనా నిత్యం విక్షేపా భావతో బుధః |
ఏకస్మిం శ్చిద్ఘనే శుద్ధే భగవత్యేవ యస్యహి |
సదానిరక్తి రత్యంతా పరప్రేమాస్పద త్వతః |
విషయాం తరభావాచ్చ నాస్యా న్య విషయే రతిః |
నిరుపాధి పరమ ప్రేమాస్పదత్వేన ప్రియో(అ)స్యచ |
జ్ఞానినః పరమాత్మాహం ప్రత్యగభిన్నాంతరః |
తతోత్యర్థం స చ జ్ఞానీ ప్రియో భగవతో మమ |
ప్రియోహ్మాత్మాస్తి సర్వస్య లోకవేద ప్రసిద్ధతః ||“. (గీతాభావప్రకాశము - 7 - 105 to 111)
(సమస్త కామములను వదలుకున్నవాడగుటవలనను, పుణ్యధిక్యము వలనను, అధికమైన భక్తి కలిగి యుండుటవలనను, జ్ఞానియగువాడు ఈ నాలుగు రకముల భక్తులలోను ఉత్తముడు - ఎందుచేతననగా భ్రాంతిలేక, ఎల్లపుడు సమాహితమైన మనస్సు కలిగి విక్షేపము లేకుండుటవలన, ప్రత్యగాత్మకంటె వేఱుకానటువంటిన్నీ, శుద్ధము, చిద్ఘనము అయిన భగవంతుని ఒక్కనియందే పరమ భక్తికి ఆస్పదమగుటవల్ల నాయందే ఎల్లపుడు మిక్కిలి అనురక్తికలిగియుండి, నేనుకాక ఇతరవిషయములందు అనురక్తిలేకయుండువానికి నేను ప్రియుడను. పరమాత్మ ప్రత్యగభిన్నము అయిన నేను ఈ జ్ఞానికి అంతరుడను. అందుచేత ఈ జ్ఞాని నాకు ప్రియుడు - అందఱికి ఆత్మ ప్రియమైనదని వేదములో చెప్పబడి లోకములో ప్రసిద్ధి అయినదే -).
(భగవద్భక్తులు నాలుగు విధములుగా నున్నారు -
(1). ఏదైన బాధకలిగినపుడు, ప్రమాదము కలిగినపుడుమాత్రము భగవంతుని స్మరించి రక్షించమని వేడెదరు - అంతకుముందు వారికి చేతనయిన ఉపాయములన్నింటిని చేసి, వాటివలన ఫలితము కానక సర్వశక్తిమంతుడైన భగవంతుని శరణు వేడెదరు - ఇట్టివారు ఆర్తులు (బాధలోనున్నవారు బాధపడుటకూడ ఒక తరణోపాయమే.
(2) భగవంతుడనువాడున్నాడా, ఉండిననేమిచేయుచున్నాడు, ఎక్కడున్నాడు ? అను మొదలగు సంశయములు కలిగి వాటిని నివారించుకొనుటకు గురువు నాశ్రయించి శాస్త్రమునధ్యయనముచేసి భగవత్ జ్ఞానమును సంపాదించు కోరికగలవారు - (జ్ఞాతుమిచ్ఛ జిజ్ఞాస) వీరు జిజ్ఞాసువులు
(3) ఏదైనా నొక ప్రయోజనముకొఱకు భగవంతుని భజించువారు, అనగా ధనము కొఱకుగాని, ఐశ్వర్యము కొఱకుగాని దేవుని గుఱించి వ్రతములు చేయువారు, మొక్కుబడి చెల్లించువారు తీర్థయాత్రలు చేయువారు మొదలగువారు అర్థార్థులు - అర్థమును - ప్రయోజనమును - అర్థించువారు - కోరువారు –
(4) పైన చెప్పబడిన మూడు వుధములైన భక్తులు సకాములు - ఏదో యొక కోరికగలవారు - బ్రహ్మజ్ఞానము కలవారు జ్ఞానులు - వీరికి యే కోరికయు నుండదు - కేవలము వారు సంపాదించిన బ్రహ్మజ్ఞానముద్వారా ముక్తిని పొందువారు - ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు తుదకు జ్ఞానులుగామారుటకు అవకాశమున్నది).
“ఉ దారాః సర్వ ఏ వైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం |
ఆస్థితః సః యుక్తాత్మా మామేవా నుత్తమాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 18)
“ఏతే ఆర్తాదయస్సర్వే సకామా అపి మే ప్రియాః |
పూర్వ జన్మార్జితానేక పుణ్యరాశితయోత్తమాః |
అన్యథా న భజేయుర్మాం సర్వ పుణ్యఫలావధిం |
క్షుద్ర దేవాన్ భజంతోపి దృశ్యంతే బహవో జనాః |
ఆర్తాదయస్త్రయోప్యేతే మమభక్తా మమ ప్రియాః |
నహ్య జ్ఞో జ్ఞోపిమద్భక్తః కశ్చి దప్య ప్రియో మమ |
కింతు యస్య ప్రీతిర్యాదృశీమేపి తాదృశీ |
ప్రీతి రస్తీతి స్వా భావ్యా త్తత్రైతే త్రయో మమ |
భక్తాస్తేషాం త్రయాణాం చ కామ్యమానమపి ప్రియం |
ప్రియోహ మపి తస్మాద్యో జ్ఞానీ తస్యతు సర్వతః |
అహమేవ స్రియోత్యంత ప్రేమాస్పదతయాంతరః |
అతః సోపి మమాత్యంత ప్రేమాస్పదతయా ప్రియః |
అన్యథామే కృతజ్ఞత్వం న స్యాత్ సా చ కృతఘ్నతా |
అతో మామాత్మభావేన జ్ఞానదాన్ సానుభూతి తః |
సాక్షాత్కృత్య స్థితో నిత్య చిదానందేయ ఆత్మని |
స ఆత్మైవ న మద్భిన్నః కింత్వహం సర్వ దైవ సః |
యతః సమాహిత మనా మయి జ్ఞానీ నిరంతరం |
భగవంత మనంతంమా మానంద ఘన మద్యయ |
ఆత్మానం పరమోత్కృష్టాం గతిం గంతవ్య మా దరాత్ |
ఫలం స్వీకృతవాన్నైవ మద్భిన్నం మన్యతే ఫలం ||“. (గీతాభావప్రకాశము - 7 - 111 to 120)
(ఆర్తుడు మొదలగువారు కోరికలు గలవారైనను నాకు ప్రియులు - పూర్వ జన్మములలో ఆర్జించిన అనేక పుణ్యములవలన ఉత్తములు - అట్లుగాకున్న సమస్తమైన పుణ్యములకు అవధియైన నన్ను భజించరు - ఆర్తుడు మొదలగు ఈ మూడు విధములవారు క్షుద్రదేవతులను పూజించువారైనను వారు నా భక్తులే, నాకు ప్రియులే. జ్ఞాని అయినను, అజ్ఞాని అయినను నా భక్తుడగువాడు నాకు అప్రియుడుకాడు. కాని ఎవనికి నాయందు ఎటువంటి భక్తియున్నదో వానిని నేను అట్లే చూచెదను - అందుచేత వారు కోరికలు గలవారైనను నాకు ప్రియులే - అందుచేత జ్ఞానియగువానియందు నాకు అత్యంతప్రేమ -అతను నన్ను ఆత్మభావముతో సచ్చిదానందుడనగు నాయందు మనస్సును సాక్షాత్కరించుకొని యుండును. అందుచేత అతను ఆత్మయే, నా కన్న వేరైనవాడుకాడు - నేను ఎల్లపుడు అతనే. భగవంతుడు, అనంతుడు, ఆనందఘనము, అద్వయుడు పొందవలసిన ఉత్కృష్టమైన గతి అయిన నన్ను సమాహితమైన మనస్సుగలవాడగుటచేత, తన బ్రహ్మజ్ఞానమునకు ఫలముగా పొందును - అట్టివాడు అట్టి ఫలమును నాకన్న వేరుగాతలంచడు).
“శృణ్వార్తా విత్త కామాశ్చ జ్ఞానినశ్చ ముముక్షనః |
సకామత్వేన నిష్కామతయా మాం యధేశ్వరం |
సమస్త ఫలదాతారం భజంతే తాం స్త దైవచ |
తదభీష్ట ప్రదానేన త్వనుగృష్ణామ్యహం హరిః |
ఆర్తానార్తి వినాశేన విత్తదానే నార్థినః జిజ్ఞాసూన్ |
జ్ఞానదానేన జ్ఞానినో మోక్షదానతః |
అనుగృష్ణామ్యహం స్వామీ నాన్య కామాయ చాన్యదా |
ఫలార్థిత్వే ముముక్షుత్వే హరిరేవ నృణాంగతిః ||“. (గీతాభావప్రకాశము -)
(ఆర్తులుకాని, విత్తము కోరువారుకాని, మోక్షము కోరువారుకాని, జ్ఞానులు కాని,కోరికకలిగికాని, కోరిక లేకగాని సమస్తమైన ఫలములను ఇచ్చునట్టి నన్ను యేవిధముగా భక్తిసలిపిన వారిని వారి అభీష్టప్రకారము వారి కోరికలను అనుగ్రహించెదను - ఎట్లంటే - ఆర్తులను వారి బాధను పోగొట్టెదను, అర్థార్థులను విత్తమిచ్చి - వారు అర్థించిన దానినిచ్చి - జిజ్ఞాసువులకు జ్ఞానము కలుగచేసి, జ్ఞానులకు మోక్షమిచ్చి అనుగ్రహించెదను - ఇతరములను ఇవ్వను. ఫలమును అర్థించిన మోక్షము కోరినానరులకు విష్ణువే గతి).
“యేప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తేపి మామేవ, కౌంతేయ, యజంత్యవిధిపూర్వకం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 23)
“అన్యదేవతాన్య జంతే యే ఫలార్థం భేదదర్శినః |
ఆస్తికాస్తేపి మామేవ యజంత్య జ్ఞాన పూర్వకం |
సర్వాత్మత్వేన మామీశ మజ్ఞాత్వా భేదవత్తయా |
కల్పయిత్వా చ వస్త్వాదీన్ యజంతీత్యాశయో హరేః ||“. (గీతాభావప్రకాశము - 9 - 153 to 158)
(భక్తితో శ్రద్ధతో ఇతర దేవతలను భజించువారు కూడ, విధి ప్రకారము కాకపోయినను, నన్నేభజించుచున్నారు. వారు నాకున్నూ (మహావిష్ణువునకు), ఇతరదేవతలని భేదము కలదని భావించుచున్నారు - కాని అజ్ఞానము వలన వారిట్లు చేసినను ఆస్తికులే - నేను సర్వాత్ముడనగుటచేత వారు నన్నే భజించుచున్నారు).
సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్య యుక్తా ఉపాసతే |
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుథా విశ్చతో ముఖం ||” (శ్రీమద్భగవద్గీత - 9 - 14, 15)
(దృఢమైన వ్రతముతో కొందఱు నన్ను కీర్తించుచున్నారు. కొందఱి భక్తితో నమస్కరించుచున్నారు. మరికొందఱు జ్ఞానయజ్ఞముచే ఉపాసించుచున్నారు - నేను ఒక్కడినే యని, అనేక దైవములుగాను భజించుచున్నారు).
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చా ప్యహం |
అపి చేత్సు దురాచారో భజతే మామనన్య భాక్ |
సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవస్థితో హి సః |
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం విగచ్ఛతి |
కౌంతేయ ప్రతి జానీహి నమే భక్తః, ప్రణస్యతి |
మాం హి పార్థ, వ్యపాశ్రిత్య యే(అ)పి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యా స్తథా శూద్రా స్తే యాంతి పరామాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 29.to 32)
(సమస్త భూతములను నేను సమముగానే చూచెదను. నాకు ప్రియులుకాని, ద్వేషించతగినవారు గాని లేరు - నన్ను భక్తితో భజించువారిలో నేనుందును, నాలో వారుందురు. అనన్య భక్తితో నన్ను భజించువాడు దురాచారుడైనను - దుర్మార్గములో ప్రవర్తించువాడైనను - సాధువే అని తలంచవలెను - అట్టివాడు వేగముగా ధర్మబుద్ధి గలవాడై శాశ్వతమైన శాంతియగు మోక్షమును పొందును - నా భక్తుడు చెడిపోడు (నశింపడు). నన్ను ఆశ్రయించువారు పాపాత్ములైనను, స్త్రీలు, వైశ్యులు, శూద్రులైనను పరమగతిని - మోక్షమును - పొందుదురు).
“మ. అనఘా వీరలనెన్న నేమిటికి? తిర్యగ్జంతునం
తాన పక్షి నిశాహట వికాఘ జీవ నివహ స్త్రీ శూద్రహోణాదులై
నను నారాయణభక్తి యోగమహితానందాత్ములైరేని వా
రనయంబున్ దరియింతు రవ్విభిని మాయావైభవాంభోనిధిన్“. (శ్రీ మదాంధ్రమహాభాగవతము - 1 - 7 - 205)
నాస్తి తేషు జాతివిద్యా రూప కుల ధన
క్రియాది బేదః, యతః తదీయాః ||“. (నారదభక్తిసూత్రములు -67, 70, 72, 73)
(భక్తులలో ఏకాంత భక్తులు ముఖ్యులు, భగవంతుని భక్తిలో తన్మయులయినవారు. వారికి జాతి గుఱించిగాని, విద్య విషయములో గాని, రూపములోగాని, కులము యడలగాని, ధనవంతులనికాని, క్రియలలోగాని భదములేదు - అందుచేత వారు భగవంతులు) - (భగవద్భక్తి పరులు).
సమతు సమతు దేహం సంతతం రామచంద్రం న భవతు మమపాపం జన్మ జన్మాంతరేషు ||“.
(శ్రీరామకర్ణామృతం - 4 - 66)
(ఎల్లపుడు నా వాక్కు రామా, రామా అని పలుకు గాక, శ్రీరామును పాదారవిందములను ఎల్లపుడు నా చిత్తము జపించుగాక, నా దేహము ఎప్పుడును శ్రీరామచంద్రుని గుఱించి నమస్కరించుగాక - ఇట్లయిన జన్మ జన్మములందును నాకు పాపములంటవు) (అట్టివాడు భగవద్భక్తుడు).
తేషు తేష్వచ్యుతా భక్తిస్త్వయ్యచ్యుత, సదాస్తుమే |
యాప్రీతి రవివేకానాంవిషయేష్వనపాయిని |
త్వామనుస్మరతః సాజే మే హృదయాన్నాప సర్పతు“. (శ్రీమద్భాగవతం -)
“మ. - - -
- - భవిష్యజ్జన్మ జన్మంబులన్
హరిచింతారతియున్, హరి ప్రణుతి, భాషా కర్ణనాసక్త్యాక్తియున్
హరిపాదాంబుజసేవ గల్గుటకు మీకర్థిం బ్రసాదింపరే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 19 - 467)
సర్వ వర్ణేషు తే శూద్రాః యేహ్య భక్తాః జనార్ధనే ||“.
(శూద్రులు భగవంతుని భక్తులు కారనిలేదు, విప్రులు భగవంతుని భక్తులు అని లేదు - అన్ని వర్ణములలోను భగవంతునియందు భక్తిలేనివారే శూద్రులు).
న హరతి న చహంతి కించిదుచ్చై స్సితమననం తమవేహి విష్ణు భక్తం ||“.
(ఎవడు తన నిజాశ్రమవర్ణముల ధర్మమునుండి తొలగడో,స్నేహితులందు, వైరులందు సమముగా వర్తించువాడు, ఏ కొంచెమైనను హింసచేయడో, నిర్మలమైన మనస్సు గలవాడు - ఇట్టివానిని భక్తుడని తెలుసుకొనుము).
గిలి కొని పోవుచుండుదుర కిల్బిష బుద్ధి లతా చయంబులన్
నిలువగబెట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభి కైవడిన్
వలలకు చిక్కి భక్త జనవత్సలతన్ జనకుందు తాపసా“.
“భక్తుడెందు జనిన బరతెంతు వెనువెంట
గోవు వెంట తగులు కోడె భంగి|“. (శ్రీమదాంధర్మహాభాగవతము - 4 - 118, 119)
సకల సన్ముఖ యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు
కృష్ణ పరధ్యాన కేవలామృతపాన పరిణామ యుతులు శ్రీభాగవతులు
బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు
తే. భావ తత్వార్థవేదులు భాగవతులు
బ్రహ్మ వాదా వాదులు భాగవతులు
సిరులు దనరంగ నెన్నడు జేటులేని
సదివి నొప్పారువారు వో భాగవతులు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 3 - 186)
దాసులచే యోగ సంవిధానులచేతం
బూని నిబద్ధుండగునే
శ్రీనాధుడు భక్తియుతలచేతం బోలెన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 391)
(భగవంతుని యడల భక్తి గలవారు భక్తులు)
యే భక్తానాం సేవనం కుర్వంతి తే భగవతః ఏవ సేవనం కుర్వంతి. భక్తాః భగవతః హృదయే వసంతి, భగవాంశ్చ భక్తానాం హృదయే -”
సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం |
మదన్యతే న జానంతి నాహం తేభ్యో మనాగపి ||“. (శ్రీమద్భాగవతం - 2 - 4 - 67)
(భగవంతుని భక్తులు భగవంతుని స్చరూపములే (బ్రహ్మజ్ఞానము గలవాడు - బ్రహ్మమే యగును). - భగవద్భక్తులకు సేవ చేయువారు భగవంతుని సేవ చేయువారే యగుదురు, భక్తులు భగవంతుని హృదయములో వసింతురు, భగవంతుడు భక్తులహృదయములో వసించును - ” సాధువుల హృదయము నాది, వారి యొక్క హృదయమే నేను - నా భక్తులు నన్నుగాక ఇతరము నెరుగరు, నేను వారి కంటె నన్యులను చేరదీయను).
“ఏకాంతినః భక్తాః ఏవశ్రేష్టాః - ఎందుచేత ననగా - తన తనువు, మనస్సు, ధనము, సర్వము భగవంతునిదే. అతను పరమాత్మ యొక్క యంత్రమువలె నుండి సంసారమునందున్నాడు; అతని ఆత్మ పరమాత్మతో ఏకమగును; అతని మనస్సుపరమాత్మయందే రతి గలిగి యుండును, అతని నేత్రములు ఎల్లపుడు అంతట పరమాత్మనే చూచును).
“సర్వకర్మణాం ఫలరూపా భక్తిర్యస్య హృదయే విద్యతే స ఏవ భక్తః, స ఏవ సర్వగుణ సంపన్నః.
(సర్వకర్మ ఫలరూపమైన భక్తి ఎవని హృదయమందు కలుగునో అతనే భక్తుడు, అతనే సమస్త గుణములు కలవాడు).
(bhagavaṃtuniyaṃdu bhaktigala puruṣuḍu).
bhajanaparaḥ (bhagavaṃtuni bhajana cēyuṭa yaṃdu āsakti kalavāḍu).
sarva karmaṇāṃ phalarūpā bhaktiryasya hṛdayē vidyatē sa ēva bhaktiḥ, sa ēva sarvaguṇa saṃpannaḥ -
(tānu cēyu samasta karmalaphalamē bhagavaṃtuni yaṃdu bhakti kaligiyuṃḍuṭa ani tanahṛdayamulō telusukonuvāḍu bhaktuḍu, aṭṭivāḍu samasta sadguṇamulu galavāḍu).
śaraṇāgataḥ (bhagavaṃtuni śaraṇu poṃdinavāḍu)
“tiraskṛtāḥ vipralabdāḥ śaptāḥ kṣiptā hatāpivā |
nāsya prati kurvaṃti tadbhaktāḥ prabhavāpivā ||“. (śrīmadbhāgavataṃ -1 - 18 - 48)
(tiraskariṃcinanu, tiṭṭinanu, koṭṭinanu, śapiṃcinanu, trōsivēsinanu vāṭi vēṭikini māru cēyanivāru bhaktulu).
ka. poḍicina diṭṭina koṭṭina
baḍucuṃduru kāni baramabhāgavatulu dā
roḍabaḍaru māru sēyaga, - - ” (śrī madāṃdhramahābhāgavatamu - 1 - 18 - 449)
(janmāṃtaramulēmi? svargamaina viṣṇubhaktula saṃgaṃbu velakurādu) (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 18 - 407)
artō jijñāsurarthārthī jñānī ca bharatarṣabha | (śrīmadbhagavadgīta - 7 - 16)
“yē janāḥ puṇyakarmāṇō māṃ parātmānamīśvaraṃ |
bhajaṃtē tē mahātmā naḥ saṃtilōkē caturvidhāḥ |
ārtō vyādhyādinō grastasta nnivṛttīccayā sudhīḥ |
grāha grastō yathāhastī yathāca dṛpadātmajā |
jijñāsurātma jñānārthī janakaścōddhavōyadhā |
paratra vēhabhōgārtha marthārthī sādhanēpsukaḥ |
vibhīṣaṇaśca sugrīvō yathā mutra dhruvōyi thā |
sa kāmāśca trayōpyētā bhagavadbhajanēna ca |
taraṃti māyāṃ tatrāpi jijñā surjñāna lābhataḥ |
tautu jijñāsutāṃ prāpya jñānēnamāṃ taraṃtyamī |
ārtasyārthārtha naśyāpijijñāsutva saṃbhavāt |
jijñōsōrapi bōdhōnakaraṇārthārthitā bhavēt |
atastayōrdva yōrmadhyē jijñāsurhariṇēritaḥ |
niṣkāmō bhajatē jñānī viṣṇutatvāvabōdhavān |
tīrṇamāyō yadhā vyāsa sanakādi rudhāradhīḥ |
yō nā kēvala niṣkāmō yathā(a)krūrō yudhiṣṭiraḥ (gītābhāvaprakāśamu - 7 - 97 to 105)
(paramātmuḍu īśvaruḍaina nannu puṇyātmulu, mahātmulu ayina nālugu vidhamulaina janulu bhajiṃcedaru - nā bhaktulu nālugu vidhamulugā nunnāru - vāru ārtuḍu, jijñāsuvu, arthārthi, jñāni. ārtuḍu anagā bādhapaḍucunnavāḍu - jijñāsuvu anagā brahmajñānamu saṃpādiṃcu kōrikagalavāḍu. arthārthi anagā ēdēni bhōgamulumodalaguvāṭini kōruvāḍu. jñāni anagā brahma tatvamunu telisinavāḍu - anārōgyamutō bādhapaḍucuṃḍuvāḍu ā bādha nivāriṃcuṭaku nannu (bhagavaṃtuni) bhajiṃcunu. mosalicēta paṭṭubaḍiyunna gajēṃdruḍu vaṃṭivāḍu ārtuḍu - māna rakṣaṇa koṟaku kaurava sabhalō draupadi rakṣiṃcamani kōrinadi. janakamahārāju, uddhavuḍuvale nannu bhajiṃcuvāru jijñāsuvulu. ī lōkamulōkāni paralōkamulōkāni bhōgamulanu anubhaviṃcavalenanu kōrikagalavāru arthārthulu - oka prayōjanamukoṟaku narthiṃcuvāru, vīrukāka vibhīṣaṇuḍu śaraṇujoccinavāḍu ārtuḍu - dhruvuḍu jijñāsuvu - bhagavatsākṣātkāramu kōrinavāḍu. sugrīvuḍu arthārthi - rājyamunaku sahāyamu kōrinavāḍu. ī mūḍu vidhamula bhaktulu kōrikatō nannu bhajiṃcinavāru - sakāmulē ayinanu nā bhaktulē yaguṭavalana māyanu tariṃciri, saṃsāramunu viḍicipeṭṭi māyanu tariṃciri. jñāni yaguvāḍu - bhagavat jñānamunu poṃdinavāḍu kōrikalēkanē nannu bhajiṃcunu - sanaka sanaṃdanādulu, vyāsuḍu vale māyanu tariṃcuvāru, akrūruḍu dharmarājuvale - kōrikalēnivāru.
“tēṣāṃ jñānī nityayuktaḥ ēka bhaktirviśiṣyatē |
priyō hi jñāninō (a)tyarthamahaṃ sa ca mamapriyaḥ ||“. (śrīmadbhagavadgīta - 7 - 17)
(tēṣāṃ caturvidhānāṃca madhyē tatvaviduttamaḥ |
nivṛtta sarvakāmatvāt sukṛtādhikya hētunā |
prēmādhikyā ṣu cōtkṛṣṭaḥ sarvataḥ sammatō mama |
yatō bhagavati pratyagabhinnē bhrāṃti hāvataḥ |
samāhitamanā nityaṃ vikṣēpā bhāvatō budhaḥ |
ēkasmiṃ ścidghanē śuddhē bhagavatyēva yasyahi |
sadānirakti ratyaṃtā paraprēmāspada tvataḥ |
viṣayāṃ tarabhāvācca nāsyā nya viṣayē ratiḥ |
nirupādhi parama prēmāspadatvēna priyō(a)syaca |
jñāninaḥ paramātmāhaṃ pratyagabhinnāṃtaraḥ |
tatōtyarthaṃ sa ca jñānī priyō bhagavatō mama |
priyōhmātmāsti sarvasya lōkavēda prasiddhataḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 105 to 111)
(samasta kāmamulanu vadalukunnavāḍaguṭavalananu, puṇyadhikyamu valananu, adhikamaina bhakti kaligi yuṃḍuṭavalananu, jñāniyaguvāḍu ī nālugu rakamula bhaktulalōnu uttamuḍu - eṃducētananagā bhrāṃtilēka, ellapuḍu samāhitamaina manassu kaligi vikṣēpamu lēkuṃḍuṭavalana, pratyagātmakaṃṭe vēṟukānaṭuvaṃṭinnī, śuddhamu, cidghanamu ayina bhagavaṃtuni okkaniyaṃdē parama bhaktiki āspadamaguṭavalla nāyaṃdē ellapuḍu mikkili anuraktikaligiyuṃḍi, nēnukāka itaraviṣayamulaṃdu anuraktilēkayuṃḍuvāniki nēnu priyuḍanu. paramātma pratyagabhinnamu ayina nēnu ī jñāniki aṃtaruḍanu. aṃducēta ī jñāni nāku priyuḍu - aṃdaṟiki ātma priyamainadani vēdamulō ceppabaḍi lōkamulō prasiddhi ayinadē -).
(bhagavadbhaktulu nālugu vidhamulugā nunnāru -
(1). ēdaina bādhakaliginapuḍu, pramādamu kaliginapuḍumātramu bhagavaṃtuni smariṃci rakṣiṃcamani vēḍedaru - aṃtakumuṃdu vāriki cētanayina upāyamulanniṃṭini cēsi, vāṭivalana phalitamu kānaka sarvaśaktimaṃtuḍaina bhagavaṃtuni śaraṇu vēḍedaru - iṭṭivāru ārtulu (bādhalōnunnavāru bādhapaḍuṭakūḍa oka taraṇōpāyamē.
(2) bhagavaṃtuḍanuvāḍunnāḍā, uṃḍinanēmicēyucunnāḍu, ekkaḍunnāḍu ? anu modalagu saṃśayamulu kaligi vāṭini nivāriṃcukonuṭaku guruvu nāśrayiṃci śāstramunadhyayanamucēsi bhagavat jñānamunu saṃpādiṃcu kōrikagalavāru - (jñātumiccha jijñāsa) vīru jijñāsuvulu
(3) ēdainā noka prayōjanamukoṟaku bhagavaṃtuni bhajiṃcuvāru, anagā dhanamu koṟakugāni, aiśvaryamu koṟakugāni dēvuni guṟiṃci vratamulu cēyuvāru, mokkubaḍi celliṃcuvāru tīrthayātralu cēyuvāru modalaguvāru arthārthulu - arthamunu - prayōjanamunu - arthiṃcuvāru - kōruvāru –
(4) paina ceppabaḍina mūḍu vudhamulaina bhaktulu sakāmulu - ēdō yoka kōrikagalavāru - brahmajñānamu kalavāru jñānulu - vīriki yē kōrikayu nuṃḍadu - kēvalamu vāru saṃpādiṃcina brahmajñānamudvārā muktini poṃduvāru - ārtulu, jijñāsuvulu, arthārthulu tudaku jñānulugāmāruṭaku avakāśamunnadi).
“u dārāḥ sarva ē vaitē jñānī tvātmaiva mē mataṃ |
āsthitaḥ saḥ yuktātmā māmēvā nuttamāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 18)
“ētē ārtādayassarvē sakāmā api mē priyāḥ |
pūrva janmārjitānēka puṇyarāśitayōttamāḥ |
anyathā na bhajēyurmāṃ sarva puṇyaphalāvadhiṃ |
kṣudra dēvān bhajaṃtōpi dṛśyaṃtē bahavō janāḥ |
ārtādayastrayōpyētē mamabhaktā mama priyāḥ |
nahya jñō jñōpimadbhaktaḥ kaści dapya priyō mama |
kiṃtu yasya prītiryādṛśīmēpi tādṛśī |
prīti rastīti svā bhāvyā ttatraitē trayō mama |
bhaktāstēṣāṃ trayāṇāṃ ca kāmyamānamapi priyaṃ |
priyōha mapi tasmādyō jñānī tasyatu sarvataḥ |
ahamēva sriyōtyaṃta prēmāspadatayāṃtaraḥ |
ataḥ sōpi mamātyaṃta prēmāspadatayā priyaḥ |
anyathāmē kṛtajñatvaṃ na syāt sā ca kṛtaghnatā |
atō māmātmabhāvēna jñānadān sānubhūti taḥ |
sākṣātkṛtya sthitō nitya cidānaṃdēya ātmani |
sa ātmaiva na madbhinnaḥ kiṃtvahaṃ sarva daiva saḥ |
yataḥ samāhita manā mayi jñānī niraṃtaraṃ |
bhagavaṃta manaṃtaṃmā mānaṃda ghana madyaya |
ātmānaṃ paramōtkṛṣṭāṃ gatiṃ gaṃtavya mā darāt |
phalaṃ svīkṛtavānnaiva madbhinnaṃ manyatē phalaṃ ||“. (gītābhāvaprakāśamu - 7 - 111 to 120)
(ārtuḍu modalaguvāru kōrikalu galavārainanu nāku priyulu - pūrva janmamulalō ārjiṃcina anēka puṇyamulavalana uttamulu - aṭlugākunna samastamaina puṇyamulaku avadhiyaina nannu bhajiṃcaru - ārtuḍu modalagu ī mūḍu vidhamulavāru kṣudradēvatulanu pūjiṃcuvārainanu vāru nā bhaktulē, nāku priyulē. jñāni ayinanu, ajñāni ayinanu nā bhaktuḍaguvāḍu nāku apriyuḍukāḍu. kāni evaniki nāyaṃdu eṭuvaṃṭi bhaktiyunnadō vānini nēnu aṭlē cūcedanu - aṃducēta vāru kōrikalu galavārainanu nāku priyulē - aṃducēta jñāniyaguvāniyaṃdu nāku atyaṃtaprēma -atanu nannu ātmabhāvamutō saccidānaṃduḍanagu nāyaṃdu manassunu sākṣātkariṃcukoni yuṃḍunu. aṃducēta atanu ātmayē, nā kanna vērainavāḍukāḍu - nēnu ellapuḍu atanē. bhagavaṃtuḍu, anaṃtuḍu, ānaṃdaghanamu, advayuḍu poṃdavalasina utkṛṣṭamaina gati ayina nannu samāhitamaina manassugalavāḍaguṭacēta, tana brahmajñānamunaku phalamugā poṃdunu - aṭṭivāḍu aṭṭi phalamunu nākanna vērugātalaṃcaḍu).
“śṛṇvārtā vitta kāmāśca jñāninaśca mumukṣanaḥ |
sakāmatvēna niṣkāmatayā māṃ yadhēśvaraṃ |
samasta phaladātāraṃ bhajaṃtē tāṃ sta daivaca |
tadabhīṣṭa pradānēna tvanugṛṣṇāmyahaṃ hariḥ |
ārtānārti vināśēna vittadānē nārthinaḥ jijñāsūn |
jñānadānēna jñāninō mōkṣadānataḥ |
anugṛṣṇāmyahaṃ svāmī nānya kāmāya cānyadā |
phalārthitvē mumukṣutvē harirēva nṛṇāṃgatiḥ ||“. (gītābhāvaprakāśamu -)
(ārtulukāni, vittamu kōruvārukāni, mōkṣamu kōruvārukāni, jñānulu kāni,kōrikakaligikāni, kōrika lēkagāni samastamaina phalamulanu iccunaṭṭi nannu yēvidhamugā bhaktisalipina vārini vāri abhīṣṭaprakāramu vāri kōrikalanu anugrahiṃcedanu - eṭlaṃṭē - ārtulanu vāri bādhanu pōgoṭṭedanu, arthārthulanu vittamicci - vāru arthiṃcina dāninicci - jijñāsuvulaku jñānamu kalugacēsi, jñānulaku mōkṣamicci anugrahiṃcedanu - itaramulanu ivvanu. phalamunu arthiṃcina mōkṣamu kōrinānarulaku viṣṇuvē gati).
“yēpyanya dēvatā bhaktā yajaṃtē śraddhayānvitāḥ |
tēpi māmēva, kauṃtēya, yajaṃtyavidhipūrvakaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 23)
“anyadēvatānya jaṃtē yē phalārthaṃ bhēdadarśinaḥ |
āstikāstēpi māmēva yajaṃtya jñāna pūrvakaṃ |
sarvātmatvēna māmīśa majñātvā bhēdavattayā |
kalpayitvā ca vastvādīn yajaṃtītyāśayō harēḥ ||“. (gītābhāvaprakāśamu - 9 - 153 to 158)
(bhaktitō śraddhatō itara dēvatalanu bhajiṃcuvāru kūḍa, vidhi prakāramu kākapōyinanu, nannēbhajiṃcucunnāru. vāru nākunnū (mahāviṣṇuvunaku), itaradēvatalani bhēdamu kaladani bhāviṃcucunnāru - kāni ajñānamu valana vāriṭlu cēsinanu āstikulē - nēnu sarvātmuḍanaguṭacēta vāru nannē bhajiṃcucunnāru).
samasyaṃtaśca māṃ bhaktyā nitya yuktā upāsatē |
jñānayajñēna cāpyanyē yajaṃtō māmupāsatē |
ēkatvēna pṛthaktvēna bahuthā viścatō mukhaṃ ||” (śrīmadbhagavadgīta - 9 - 14, 15)
(dṛḍhamaina vratamutō koṃdaṟu nannu kīrtiṃcucunnāru. koṃdaṟi bhaktitō namaskariṃcucunnāru. marikoṃdaṟu jñānayajñamucē upāsiṃcucunnāru - nēnu okkaḍinē yani, anēka daivamulugānu bhajiṃcucunnāru).
yē bhajaṃti tu māṃ bhaktyā mayi tē tēṣu cā pyahaṃ |
api cētsu durācārō bhajatē māmananya bhāk |
sādhurēva samaṃtavyaḥ samyagvyavasthitō hi saḥ |
kṣipraṃ bhavati dharmātmā śaśvaccāṃtiṃ vigacchati |
kauṃtēya prati jānīhi namē bhaktaḥ, praṇasyati |
māṃ hi pārtha, vyapāśritya yē(a)pi syuḥ pāpayōnayaḥ |
striyō vaiśyā stathā śūdrā stē yāṃti parāmāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 29.to 32)
(samasta bhūtamulanu nēnu samamugānē cūcedanu. nāku priyulukāni, dvēṣiṃcataginavāru gāni lēru - nannu bhaktitō bhajiṃcuvārilō nēnuṃdunu, nālō vāruṃduru. ananya bhaktitō nannu bhajiṃcuvāḍu durācāruḍainanu - durmārgamulō pravartiṃcuvāḍainanu - sādhuvē ani talaṃcavalenu - aṭṭivāḍu vēgamugā dharmabuddhi galavāḍai śāśvatamaina śāṃtiyagu mōkṣamunu poṃdunu - nā bhaktuḍu ceḍipōḍu (naśiṃpaḍu). nannu āśrayiṃcuvāru pāpātmulainanu, strīlu, vaiśyulu, śūdrulainanu paramagatini - mōkṣamunu - poṃduduru).
“ma. anaghā vīralanenna nēmiṭiki? tiryagjaṃtunaṃ
tāna pakṣi niśāhaṭa vikāgha jīva nivaha strī śūdrahōṇādulai
nanu nārāyaṇabhakti yōgamahitānaṃdātmulairēni vā
ranayaṃbun dariyiṃtu ravvibhini māyāvaibhavāṃbhōnidhin”. (śrī madāṃdhramahābhāgavatamu - 1 - 7 - 205)
nāsti tēṣu jātividyā rūpa kula dhana
kriyādi bēdaḥ, yataḥ tadīyāḥ ||“. (nāradabhaktisūtramulu -67, 70, 72, 73)
(bhaktulalō ēkāṃta bhaktulu mukhyulu, bhagavaṃtuni bhaktilō tanmayulayinavāru. vāriki jāti guṟiṃcigāni, vidya viṣayamulō gāni, rūpamulōgāni, kulamu yaḍalagāni, dhanavaṃtulanikāni, kriyalalōgāni bhadamulēdu - aṃducēta vāru bhagavaṃtulu) - (bhagavadbhakti parulu).
samatu samatu dēhaṃ saṃtataṃ rāmacaṃdraṃ na bhavatu mamapāpaṃ janma janmāṃtarēṣu ||“.
(śrīrāmakarṇāmṛtaṃ - 4 - 66)
(ellapuḍu nā vākku rāmā, rāmā ani paluku gāka, śrīrāmunu pādāraviṃdamulanu ellapuḍu nā cittamu japiṃcugāka, nā dēhamu eppuḍunu śrīrāmacaṃdruni guṟiṃci namaskariṃcugāka - iṭlayina janma janmamulaṃdunu nāku pāpamulaṃṭavu) (aṭṭivāḍu bhagavadbhaktuḍu).
tēṣu tēṣvacyutā bhaktistvayyacyuta, sadāstumē |
yāprīti ravivēkānāṃviṣayēṣvanapāyini |
tvāmanusmarataḥ sājē mē hṛdayānnāpa sarpatu”. (śrīmadbhāgavataṃ -)
“ma. - - -
- - bhaviṣyajjanma janmaṃbulan
hariciṃtāratiyun, hari praṇuti, bhāṣā karṇanāsaktyāktiyun
haripādāṃbujasēva galguṭaku mīkarthiṃ brasādiṃparē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 19 - 467)
sarva varṇēṣu tē śūdrāḥ yēhya bhaktāḥ janārdhanē ||“.
(śūdrulu bhagavaṃtuni bhaktulu kāranilēdu, viprulu bhagavaṃtuni bhaktulu ani lēdu - anni varṇamulalōnu bhagavaṃtuniyaṃdu bhaktilēnivārē śūdrulu).
na harati na cahaṃti kiṃciduccai ssitamananaṃ tamavēhi viṣṇu bhaktaṃ ||“.
(evaḍu tana nijāśramavarṇamula dharmamunuṃḍi tolagaḍō,snēhitulaṃdu, vairulaṃdu samamugā vartiṃcuvāḍu, ē koṃcemainanu hiṃsacēyaḍō, nirmalamaina manassu galavāḍu - iṭṭivānini bhaktuḍani telusukonumu).
gili koni pōvucuṃḍudura kilbiṣa buddhi latā cayaṃbulan
niluvagabeṭṭi kaṭṭuduru nēruputō madakuṃbhi kaivaḍin
valalaku cikki bhakta janavatsalatan janakuṃdu tāpasā”.
“bhaktuḍeṃdu janina barateṃtu venuveṃṭa
gōvu veṃṭa tagulu kōḍe bhaṃgi|“. (śrīmadāṃdharmahābhāgavatamu - 4 - 118, 119)
sakala sanmukha yōgi jana sadānaṃdaika parama bhāgyōdayul bhāgavatulu
kṛṣṇa paradhyāna kēvalāmṛtapāna pariṇāma yutulu śrībhāgavatulu
bahupātakānīka paribhava prakriyā puruṣōgramūrtulu bhāgavatulu
tē. bhāva tatvārthavēdulu bhāgavatulu
brahma vādā vādulu bhāgavatulu
sirulu danaraṃga nennaḍu jēṭulēni
sadivi noppāruvāru vō bhāgavatulu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 3 - 186)
dāsulacē yōga saṃvidhānulacētaṃ
būni nibaddhuṃḍagunē
śrīnādhuḍu bhaktiyutalacētaṃ bōlen”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 391)
(bhagavaṃtuni yaḍala bhakti galavāru bhaktulu)
yē bhaktānāṃ sēvanaṃ kurvaṃti tē bhagavataḥ ēva sēvanaṃ kurvaṃti. bhaktāḥ bhagavataḥ hṛdayē vasaṃti, bhagavāṃśca bhaktānāṃ hṛdayē -”
sādhavō hṛdayaṃ mahyaṃ sādhūnāṃ hṛdayaṃ tvahaṃ |
madanyatē na jānaṃti nāhaṃ tēbhyō manāgapi ||“. (śrīmadbhāgavataṃ - 2 - 4 - 67)
(bhagavaṃtuni bhaktulu bhagavaṃtuni scarūpamulē (brahmajñānamu galavāḍu - brahmamē yagunu). - bhagavadbhaktulaku sēva cēyuvāru bhagavaṃtuni sēva cēyuvārē yaguduru, bhaktulu bhagavaṃtuni hṛdayamulō vasiṃturu, bhagavaṃtuḍu bhaktulahṛdayamulō vasiṃcunu - ” sādhuvula hṛdayamu nādi, vāri yokka hṛdayamē nēnu - nā bhaktulu nannugāka itaramu nerugaru, nēnu vāri kaṃṭe nanyulanu cēradīyanu).
“ēkāṃtinaḥ bhaktāḥ ēvaśrēṣṭāḥ - eṃducēta nanagā - tana tanuvu, manassu, dhanamu, sarvamu bhagavaṃtunidē. atanu paramātma yokka yaṃtramuvale nuṃḍi saṃsāramunaṃdunnāḍu; atani ātma paramātmatō ēkamagunu; atani manassuparamātmayaṃdē rati galigi yuṃḍunu, atani nētramulu ellapuḍu aṃtaṭa paramātmanē cūcunu).
“sarvakarmaṇāṃ phalarūpā bhaktiryasya hṛdayē vidyatē sa ēva bhaktaḥ, sa ēva sarvaguṇa saṃpannaḥ.
(sarvakarma phalarūpamaina bhakti evani hṛdayamaṃdu kalugunō atanē bhaktuḍu, atanē samasta guṇamulu kalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.