భక్తిం లక్షయతీతి భక్తి లక్షణః. (భక్తి ఎటువంటిదో - ఏమిటో - తెలియచేయునది భక్తి లక్షణము).
భక్తి చిహ్నాని, జ్ఞాపకాని, భక్తియోగపరిపాకావస్థా జ్ఞాపకాని.
(భక్తి చిహ్నములు, భక్తిని సూచించునవి, భక్తిని జ్ఞాపకము చేయునవి, భక్తియోగము పరిపాకము చెందినప్పటి అవస్థను జ్ఞాపకము చేయునది).
(నేత్రములు - అన్ని అంగములు - వికారమును (మార్పును) చెందుట మొదలగునవి. అవయవములన్నియు గగుర్పాటు చెందుట, సంతోషముతో కంఠము గద్గదమగుట, ఇవి మొదలుగా గల చిహ్నములు)
"సీ. శ్రీవల్లభుడు దన్ను జేరినయట్లైన జెలికాండ్ర నెవ్వరి జేరమఱచు
నసురారిదన మ్రోల నాడిన యట్లైన నసుర బాలుర తోడనాడమఱచు
భక్తవత్సలుడు సంభాషించినట్లైన బరభాషలకు మాఱుపలక మఱచు
సురవంద్యు దనలోన చూచిన యట్లైన జొక్కిసమస్తంబు జూడమఱచు
తే. హరి పదాంభోజ యుగ్మచింతనామృతమున
నంతరంగంబు నిండినట్లైన నతడు
నిత్యపరిపూర్ణుడగుచు నన్నియును మఱచి
జడత లేకయునుండును జడును భంగి".
"సీ. వైకుంఠచింతా వివర్జిత చేష్టుడై యొక్కడు నేడుచు నొక్కచోట
విష్ణుడిందియకాని వేఱొండులేదని యొత్తిలినగుచుండు నొక్కచోట
నలినా క్షుడను నిధానము గంటి నేనని యుబ్బిగంతులు వైచు నొక్కచోట
ఆ. బలుకు నొక్కచోట బరమేశు కేశవు
బ్రణయ హర్షజనిత బాష్పసలిల
మిళిత పులకుడై, నిమీలిత నేత్రుడై
యొక్కచోట నిలిచి యూరకుండు"
- - -
"శా. పానీ యంబులు ద్రావుచుం గుడుచుచున్ బాషించుచున్ హస లీ
లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్, సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారి సుతుడేత ద్విశ్వమున్, భూవరా ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 122 to 125).
విని, భక్తుడగు వాడు వేడ్కతో బులకించి కన్నుల హర్షాశ్రుకణము లొలుక
గద్గదస్వరముతో గమలాక్ష, వైకుంఠ, వరద, నారాయణ, వాసుదేవ
యనుచు నొత్తిలిపాడు, నాడు, నాక్రోశించు, నగు, జింతనముసేయు, నతియొనర్చు
తే. మరులుకొనియుండు, దనలోన మాటలాడు
వేల్పు సోకిన పురుషుని వృత్తి తిరుగు
బంధములబాసి యజ్ఞానపటలిగాల్చి
విష్ణు బ్రాపించు దుది భక్తి వివశుడగుచు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 -240)
కరములు విష్ణుమందిర మార్జనములంద, శ్రవణము మాధవ శ్రవణ మంద
చూపులు గోవిందరూపవీక్షణములంద, శిరము గేశవ నమస్కృతుల యంద
పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్య మంద
తే. సంగమచ్యుతజన తను సంగమంద
ఘ్రాణమ సురారి భక్తాంఘ్రిక మలమంద
రసన దులసీదళములంద రతులు పుణ్య
సంగతులయంద యా రాజచంద్రమునకు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 82).
(తనకు ప్రియమైన శ్రీహరియొక్క నామములను కీర్తించుటవలన కలిగిన అనురాగము లేక ప్రేమ కలవాడు భక్తుడు, ధృతచిత్తుడు. ఒక్కొక్క వేళ తన భక్తిచే వశపరచుకొనిన భగవంతుని దర్శించి నట్లైన బిగ్గరగా నవ్వును - అయ్యో ఈ కాలము భగవంతుని భక్తి సలుపక ఉపేక్ష చేసియుంటినో అని రోదనము చేయును - యేడ్చును - ఔత్సుక్యముతో ఆక్రోశించును - విచారించును. " ఓ హరీ, నన్ననుగ్రహించుము " అని ఎక్కువ సంతోషముతో గానము చేయును. “భగవంతునికి జయము జయము అగుగాక " అని నృత్యము చేయును - గెంతులు వేయును - డాంబికునివలె ఇతరులకు తనభక్తి (కోరి, గొప్పకొఱకు) ప్రకటింపచేయడు. పిచ్చి యెత్తినవానివలె, గ్రహము (దయ్యము) పట్టినవానివలె మైమఱచియుండును).
అష్టథా లక్షణం ప్రాహుర్మమ ధర్మాదికారిణాం |
మద్భక్త జన వాత్సల్యం, పూజాయాంచాను మోదనం |
స్వయమభ్యర్చనం చైవ, మదర్థేచాంగ చేష్టనం |
మత్కథా శ్రవణా చైవ, స్వరనేత్రాంగ విక్రియా |
మమాను స్మరణం నిత్యం యశ్చ మాంచోపజీవతి |
ఏ తదష్టవిధం చిహ్నం యస్మిన్ మ్లేచ్ఛపి వర్తతే |
స విప్రేంద్రో మునిః శ్రీమాన్ సయతిః స చ పండితః |
నమే ప్రియశ్చ తుర్వేదీ మద్భక్తః స్వపచోపి యః |
తస్మై దేయం, తతో గ్రాహ్యం, స చ పూజ్యో యథాహ్యహం ||". (వాయువీయ సమ్హితాయాం)
(భగవంతునియందే మనస్సు నిలిపి భగనతుని తప్ప ఇతరము తెలియని మహాత్ములైన భక్తుల లక్షణములు ఎనిమిది విధములుగా చెప్పబడినవి -
1. భగవద్భక్త జనుల యడల వాత్సల్యము కలిగి యుండుట.
2. భగవంతుని పూజయందు సంతోషము కలిగి యుండుట
3. స్వయముగా భగవంతుని అర్చించుట - పూజ చేయుట
4. భగవంతుని గుఱించియే అన్ని శరీరాయవముల చేష్టలు సలుపుట
5. భగవంతుని గుఱించి అయిన కథలు వినుట
6. కంఠస్వరము, నేత్రములు మార్పు చెందుచుండుట
7. నిత్యము భగవంతుని స్మరించుచుండుట.
ఈ ఎనిమిది విధముల లక్షణములు ఎవని యందుండునో అతను మ్లేచ్చుడైనను అతనే బ్రాహ్మణ శ్రేష్టుడు, అతడే ముని, శ్రీమంతుడు, యతి, పండితుడున్నూ. చండాలుడైనను అట్టివాడు నాకు ప్రియుడు, నా భక్తుడు - భగవంతుని కర్పించినట్లే అతనికర్పించ వలెను, భగవంతునినుండి పరిగ్రహించినట్లే అతనినుండి పరిగ్రహించవలెను).
భస్మోద్ధూళిత సర్వాంగాః త్రిపుండ్రాంకిత మస్తకాః |
రుద్రాక్షమాలాభరణాః శివపూజా పరాయణాః |
బాహ్యలక్షణసం యుక్తాః పూజ్యా సర్వేత్వయా యమ |
ప్రణవాభ్యాస నిరతాః, త్రయీసార పరాయణాః |
శివసూక్త జపాసక్తాః, శతరుద్రీయ పాఠకాః |
అధర్వణీం సుఖాం యే చ పఠంతి శిరసాశ్రితాం |
పౌరుషేయం పఠేత్సూక్తం పావమానం చ యః పఠేత్ |
త్వరితం నీలరుద్రం వా శివ సంకల్ప మేవవా |
నమకం చమకం చాపియే పఠంతి ద్విజాతయః |
మహాదేవాది నామాని యేషామాస్యే భవంతిహి |
మమ ప్రియతరాహ్యేతే పూజ్యాః సర్వే త్వయానఘ |
త్రికాల మేకకాలంవా యే మాం ధ్యాయంతి శంకరం |
నృత్యమానం, త్రయీనేత్రం, చంద్రార్థకృత శేఖరం |
ఉమామహేశ్వరం, దేవం, నీలకంఠమథాపివా |
పంచానన మయీం మూర్తిం హృదిధ్యాయంతియే జనాః |
మమపూజ్య మాహ్యేతే యది పాపాన్వితా అపి ||". (శివరాత్రి మాహాత్మ్యం)
(భక్తుల లక్షణములు చెప్పుచున్నాను వినుము - శరీరమంతటను భస్మము పూసుకొని,త్రిపుండ్రము ధరించి, రుద్రాక్షమాల ఆభరణముగా ధరించి, శివపూజా పరాయణులై - ఇటువంటి బాహ్య లక్షణములు గలవారు (భక్తులు). ఓ యముడా, నీకు పూజ్యులు. ఓంకారము నభ్యసించుటయందు నిరతులై యుండువారు, వేద త్రయమును పారాయణ చేయువారు, శివసూక్తమును జపము చేయుటయందాసక్తి కలవారు, శత రుద్రీయమును పఠించువారును, అధర్వణ శిఖను పఠించువారును, పౌరుషేయమైన పవమానసూత్రమును పఠించు వారును, నీలరుద్రముగాని శివసంకల్పము పఠించువారును, నమకము చమకము పఠించు బ్రాహ్మణులను, మహాదేవుడు మొదలగు భగవన్నా మములు పలుకు వారు వీరందఱు ప్రియులు, నాకు ప్రియులు మూడు పూటలందు, లేక ఒక కాలమందైన నృత్యము చేయుచుండువారు, త్రినేత్రుడు (మూడు కన్నులు గలవాడు), చంద్రవంకశిరోభూషణముగా ధరించువాడు, నీలకంఠుడు -(విషము కంఠమందు కలవాడు) -పంచ ముఖేశ్వరుడు అయిన ఉమామహే శ్వరుని ధ్యానించు జనులు పాపత్ములైనను పూజించ తగినవారే).
నంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావ మైనవాని
మాతృగర్భము సొచ్చిమన్నదిమొదలుగా చిత్తమచ్యుతమీద జేర్చువాని
నంకించి తనలోన నఖిల ప్రపంచంబు శ్రీవిష్ణుమయమని చెలగువాని - - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 150)
నీ పేరం బనిసేయు హస్త యుగముల్, నీ మూర్తిపై జూపులున్
నీ పాదంబులపొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 409)
నీ కరాబ్జంబులు నెఱినంటితివగాని తక్కిన పనికి హస్తములు సొరవు
నీ వాగమృతదారనిండగ్రోలగగాని చెవులన్యభాషలు సేరి వినవు
నీ సుందరాకృతి నియతి జూడగగాని చూడవన్యంబుల జూడ్కికములు
ఆ. నిన్న కాని పలుకనేరవు మా జిహ్వలు - - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. 991)
దెఱపు నారాయణ విముఖ కార్యములంద, పారవశ్యము విష్ణుభక్తియంద
బాష్పనిర్గతి చక్రి పద్యసంస్తుతులంద పక్షపాతము శార్జి భక్తులంద
లేమి గోవిందాన్య లీలాచరణమంద శ్రమము గోవింద పూజనములంద
తే. బంధ మచ్యుతేతర దుష్టపథములంద
జ్వరము మాధవ విరహిత లక్షణములంద
మత్సరము లీశు కైంకర్య మతములంద
నరవరోత్తమ! వినుము తన్నాగరులకు|". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా - 1614)
వాచాగాయంతి తల్లీలాం, కర్ణే శృణ్వంతి తద్యశః |
పద్భ్యః గచ్చంతి క్షేత్రాణి, కరైర్మందిర మార్జనం |
పశ్యంతిరూపం చక్షుభ్యాం, గంధం జిఘ్రంతి నాసయా |
హరేర్నిర్మాల్య పుష్పస్యా సేవనం చైవకుర్వతే |
భక్త్యా పాదోదకం పీత్వా యాంతి సంతర్పణం హృది |
మానసే చరణం విష్ణోః, నైవేద్యముదరం తథా |
నిర్మాల్యం చందనం ఫాలే, మస్తకే తులసీదళం ||". (ఆదిత్య పురాణం - 4 - 10 to 13)
(ఎల్లపుడు శ్రీకృష్ణుని కథలు వినుట, కీర్తించుట, కృష్ణలీలలు నోటితో గానము చేయుట, అతని కీర్తిని చెవులతో వినుట, క్షేత్రములకు నడచివెళ్ళుట, భగవంతుని ఆలయము తుడుచుట - శుభ్రము చేయుట, భగవంతుని రూపము - విగ్రహమును - కనులార చూచుట, ముక్కుతో వాసన పీల్చుట, భగవంతుని నిర్మాల్యమును - పూజ చేసిన పుష్పములను - సేవించుట (శిరస్సునందు ధరించుట), (భగవంతుని పాద తీర్థమును భక్తితో త్రాగుట, మనస్సులో భగవంతుని పాదపద్మమును స్మరించుట, భగవంతుని ప్రసాదమును (నైవేద్యమును) తినుట, ఫాలమందు చందనము ధరించుట, శిరస్సుమీద తులసీదళము నుంచుకొనుట - ఈ కార్యములు చేయుట భగవంతునుకి ప్రీతికరములు, ఇష్టమైనవి, భక్తిలక్షణములు, భక్తులు చేయవలసినవి)
పావనంబో,వనమాలికాకరణమో, వాల్యభ్య లభ్యధ్వజ |
గ్రహణంబో, వ్యజనాత పత్రిధృతియో, ప్రాగ్దీపికారోపమో |
నృహరీవాదములేల వేరె ఇతరుల్ నీలీలకుం బాత్రముల్ ||".
(దేవాలయమునూడ్చుట, నీళ్ళు తెచ్చుట, దేవుని పల్లకిని మోయుట, పూలదండను తయారుచేయుట, ధ్వజమును మోయుట, వింజామరము వీచుట, దీపము వెలిగించుట మొదలగునవి చేయుట భక్తి లక్షణములు).
న్యాన్యం స్మరామి, నభజామి, నచాశ్రయామి |
భక్త్వాత్యదీయ చరణాంబుజమంతరేణ |
శ్రీ శ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యం ||".
(నీ గుఱించియేకాని ఇతరముగుఱించి పలుకను, వినను, చింతింపను, స్మరింపను, భజించను, ఆశ్రయించను, నీ చరణారవింద భజనమే నా మనసులో నుండునట్లు కృపచేయుము).
bhaktiṃ lakṣayatīti bhakti lakṣaṇaḥ. (bhakti eṭuvaṃṭidō - ēmiṭō - teliyacēyunadi bhakti lakṣaṇamu).
bhakti cihnāni, jñāpakāni, bhaktiyōgaparipākāvasthā jñāpakāni.
(bhakti cihnamulu, bhaktini sūciṃcunavi, bhaktini jñāpakamu cēyunavi, bhaktiyōgamu paripākamu ceṃdinappaṭi avasthanu jñāpakamu cēyunadi).
(nētramulu - anni aṃgamulu - vikāramunu (mārpunu) ceṃduṭa modalagunavi. avayavamulanniyu gagurpāṭu ceṃduṭa, saṃtōṣamutō kaṃṭhamu gadgadamaguṭa, ivi modalugā gala cihnamulu)
"sī. śrīvallabhuḍu dannu jērinayaṭlaina jelikāṃḍra nevvari jēramaṟacu
nasurāridana mrōla nāḍina yaṭlaina nasura bālura tōḍanāḍamaṟacu
bhaktavatsaluḍu saṃbhāṣiṃcinaṭlaina barabhāṣalaku māṟupalaka maṟacu
suravaṃdyu danalōna cūcina yaṭlaina jokkisamastaṃbu jūḍamaṟacu
tē. hari padāṃbhōja yugmaciṃtanāmṛtamuna
naṃtaraṃgaṃbu niṃḍinaṭlaina nataḍu
nityaparipūrṇuḍagucu nanniyunu maṟaci
jaḍata lēkayunuṃḍunu jaḍunu bhaṃgi".
"sī. vaikuṃṭhaciṃtā vivarjita cēṣṭuḍai yokkaḍu nēḍucu nokkacōṭa
viṣṇuḍiṃdiyakāni vēṟoṃḍulēdani yottilinagucuṃḍu nokkacōṭa
nalinā kṣuḍanu nidhānamu gaṃṭi nēnani yubbigaṃtulu vaicu nokkacōṭa
ā. baluku nokkacōṭa baramēśu kēśavu
braṇaya harṣajanita bāṣpasalila
miḷita pulakuḍai, nimīlita nētruḍai
yokkacōṭa nilici yūrakuṃḍu"
- - -
"śā. pānī yaṃbulu drāvucuṃ guḍucucun bāṣiṃcucun hasa lī
lā nidrādulu sēyucuṃ dirugucun lakṣiṃcucun, saṃtata
śrīnārāyaṇa pādapadma yugaḷī ciṃtāmṛtāsvāda saṃ
dhānuṃḍai maṟacen surāri sutuḍēta dviśvamun, bhūvarā ". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 122 to 125).
vini, bhaktuḍagu vāḍu vēḍkatō bulakiṃci kannula harṣāśrukaṇamu loluka
gadgadasvaramutō gamalākṣa, vaikuṃṭha, varada, nārāyaṇa, vāsudēva
yanucu nottilipāḍu, nāḍu, nākrōśiṃcu, nagu, jiṃtanamusēyu, natiyonarcu
tē. marulukoniyuṃḍu, danalōna māṭalāḍu
vēlpu sōkina puruṣuni vṛtti tirugu
baṃdhamulabāsi yajñānapaṭaligālci
viṣṇu brāpiṃcu dudi bhakti vivaśuḍagucu". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 -240)
karamulu viṣṇumaṃdira mārjanamulaṃda, śravaṇamu mādhava śravaṇa maṃda
cūpulu gōviṃdarūpavīkṣaṇamulaṃda, śiramu gēśava namaskṛtula yaṃda
padamulīśvara gēha parisarpaṇamulaṃda kāmaṃbu cakri kaiṃkarya maṃda
tē. saṃgamacyutajana tanu saṃgamaṃda
ghrāṇama surāri bhaktāṃghrika malamaṃda
rasana dulasīdaḷamulaṃda ratulu puṇya
saṃgatulayaṃda yā rājacaṃdramunaku". (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 82).
(tanaku priyamaina śrīhariyokka nāmamulanu kīrtiṃcuṭavalana kaligina anurāgamu lēka prēma kalavāḍu bhaktuḍu, dhṛtacittuḍu. okkokka vēḷa tana bhakticē vaśaparacukonina bhagavaṃtuni darśiṃci naṭlaina biggaragā navvunu - ayyō ī kālamu bhagavaṃtuni bhakti salupaka upēkṣa cēsiyuṃṭinō ani rōdanamu cēyunu - yēḍcunu - autsukyamutō ākrōśiṃcunu - vicāriṃcunu. " ō harī, nannanugrahiṃcumu " ani ekkuva saṃtōṣamutō gānamu cēyunu. “bhagavaṃtuniki jayamu jayamu agugāka " ani nṛtyamu cēyunu - geṃtulu vēyunu - ḍāṃbikunivale itarulaku tanabhakti (kōri, goppakoṟaku) prakaṭiṃpacēyaḍu. picci yettinavānivale, grahamu (dayyamu) paṭṭinavānivale maimaṟaciyuṃḍunu).
aṣṭathā lakṣaṇaṃ prāhurmama dharmādikāriṇāṃ |
madbhakta jana vātsalyaṃ, pūjāyāṃcānu mōdanaṃ |
svayamabhyarcanaṃ caiva, madarthēcāṃga cēṣṭanaṃ |
matkathā śravaṇā caiva, svaranētrāṃga vikriyā |
mamānu smaraṇaṃ nityaṃ yaśca māṃcōpajīvati |
ē tadaṣṭavidhaṃ cihnaṃ yasmin mlēcchapi vartatē |
sa viprēṃdrō muniḥ śrīmān sayatiḥ sa ca paṃḍitaḥ |
namē priyaśca turvēdī madbhaktaḥ svapacōpi yaḥ |
tasmai dēyaṃ, tatō grāhyaṃ, sa ca pūjyō yathāhyahaṃ ||". (vāyuvīya samhitāyāṃ)
(bhagavaṃtuniyaṃdē manassu nilipi bhaganatuni tappa itaramu teliyani mahātmulaina bhaktula lakṣaṇamulu enimidi vidhamulugā ceppabaḍinavi -
1. bhagavadbhakta janula yaḍala vātsalyamu kaligi yuṃḍuṭa.
2. bhagavaṃtuni pūjayaṃdu saṃtōṣamu kaligi yuṃḍuṭa
3. svayamugā bhagavaṃtuni arciṃcuṭa - pūja cēyuṭa
4. bhagavaṃtuni guṟiṃciyē anni śarīrāyavamula cēṣṭalu salupuṭa
5. bhagavaṃtuni guṟiṃci ayina kathalu vinuṭa
6. kaṃṭhasvaramu, nētramulu mārpu ceṃducuṃḍuṭa
7. nityamu bhagavaṃtuni smariṃcucuṃḍuṭa.
ī enimidi vidhamula lakṣaṇamulu evani yaṃduṃḍunō atanu mlēccuḍainanu atanē brāhmaṇa śrēṣṭuḍu, ataḍē muni, śrīmaṃtuḍu, yati, paṃḍituḍunnū. caṃḍāluḍainanu aṭṭivāḍu nāku priyuḍu, nā bhaktuḍu - bhagavaṃtuni karpiṃcinaṭlē atanikarpiṃca valenu, bhagavaṃtuninuṃḍi parigrahiṃcinaṭlē ataninuṃḍi parigrahiṃcavalenu).
bhasmōddhūḷita sarvāṃgāḥ tripuṃḍrāṃkita mastakāḥ |
rudrākṣamālābharaṇāḥ śivapūjā parāyaṇāḥ |
bāhyalakṣaṇasaṃ yuktāḥ pūjyā sarvētvayā yama |
praṇavābhyāsa niratāḥ, trayīsāra parāyaṇāḥ |
śivasūkta japāsaktāḥ, śatarudrīya pāṭhakāḥ |
adharvaṇīṃ sukhāṃ yē ca paṭhaṃti śirasāśritāṃ |
pauruṣēyaṃ paṭhētsūktaṃ pāvamānaṃ ca yaḥ paṭhēt |
tvaritaṃ nīlarudraṃ vā śiva saṃkalpa mēvavā |
namakaṃ camakaṃ cāpiyē paṭhaṃti dvijātayaḥ |
mahādēvādi nāmāni yēṣāmāsyē bhavaṃtihi |
mama priyatarāhyētē pūjyāḥ sarvē tvayānagha |
trikāla mēkakālaṃvā yē māṃ dhyāyaṃti śaṃkaraṃ |
nṛtyamānaṃ, trayīnētraṃ, caṃdrārthakṛta śēkharaṃ |
umāmahēśvaraṃ, dēvaṃ, nīlakaṃṭhamathāpivā |
paṃcānana mayīṃ mūrtiṃ hṛdidhyāyaṃtiyē janāḥ |
mamapūjya māhyētē yadi pāpānvitā api ||". (śivarātri māhātmyaṃ)
(bhaktula lakṣaṇamulu ceppucunnānu vinumu - śarīramaṃtaṭanu bhasmamu pūsukoni,tripuṃḍramu dhariṃci, rudrākṣamāla ābharaṇamugā dhariṃci, śivapūjā parāyaṇulai - iṭuvaṃṭi bāhya lakṣaṇamulu galavāru (bhaktulu). ō yamuḍā, nīku pūjyulu. ōṃkāramu nabhyasiṃcuṭayaṃdu niratulai yuṃḍuvāru, vēda trayamunu pārāyaṇa cēyuvāru, śivasūktamunu japamu cēyuṭayaṃdāsakti kalavāru, śata rudrīyamunu paṭhiṃcuvārunu, adharvaṇa śikhanu paṭhiṃcuvārunu, pauruṣēyamaina pavamānasūtramunu paṭhiṃcu vārunu, nīlarudramugāni śivasaṃkalpamu paṭhiṃcuvārunu, namakamu camakamu paṭhiṃcu brāhmaṇulanu, mahādēvuḍu modalagu bhagavannā mamulu paluku vāru vīraṃdaṟu priyulu, nāku priyulu mūḍu pūṭalaṃdu, lēka oka kālamaṃdaina nṛtyamu cēyucuṃḍuvāru, trinētruḍu (mūḍu kannulu galavāḍu), caṃdravaṃkaśirōbhūṣaṇamugā dhariṃcuvāḍu, nīlakaṃṭhuḍu -(viṣamu kaṃṭhamaṃdu kalavāḍu) -paṃca mukhēśvaruḍu ayina umāmahē śvaruni dhyāniṃcu janulu pāpatmulainanu pūjiṃca taginavārē).
naṃbhōja garbhādulabhyasiṃpagalēni haribhakti puṃbhāva mainavāni
mātṛgarbhamu soccimannadimodalugā cittamacyutamīda jērcuvāni
naṃkiṃci tanalōna nakhila prapaṃcaṃbu śrīviṣṇumayamani celaguvāni - - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 150)
nī pēraṃ banisēyu hasta yugamul, nī mūrtipai jūpulun
nī pādaṃbulapoṃta mrokku śiramul nī sēvapai jittamul
nī pai buddhulu māku nimmu karuṇan nīrējapatrēkṣaṇā". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 409)
nī karābjaṃbulu neṟinaṃṭitivagāni takkina paniki hastamulu soravu
nī vāgamṛtadāraniṃḍagrōlagagāni cevulanyabhāṣalu sēri vinavu
nī suṃdarākṛti niyati jūḍagagāni cūḍavanyaṃbula jūḍkikamulu
ā. ninna kāni palukanēravu mā jihvalu - - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. 991)
deṟapu nārāyaṇa vimukha kāryamulaṃda, pāravaśyamu viṣṇubhaktiyaṃda
bāṣpanirgati cakri padyasaṃstutulaṃda pakṣapātamu śārji bhaktulaṃda
lēmi gōviṃdānya līlācaraṇamaṃda śramamu gōviṃda pūjanamulaṃda
tē. baṃdha macyutētara duṣṭapathamulaṃda
jvaramu mādhava virahita lakṣaṇamulaṃda
matsaramu līśu kaiṃkarya matamulaṃda
naravarōttama! vinumu tannāgarulaku|". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā - 1614)
vācāgāyaṃti tallīlāṃ, karṇē śṛṇvaṃti tadyaśaḥ |
padbhyaḥ gaccaṃti kṣētrāṇi, karairmaṃdira mārjanaṃ |
paśyaṃtirūpaṃ cakṣubhyāṃ, gaṃdhaṃ jighraṃti nāsayā |
harērnirmālya puṣpasyā sēvanaṃ caivakurvatē |
bhaktyā pādōdakaṃ pītvā yāṃti saṃtarpaṇaṃ hṛdi |
mānasē caraṇaṃ viṣṇōḥ, naivēdyamudaraṃ tathā |
nirmālyaṃ caṃdanaṃ phālē, mastakē tulasīdaḷaṃ ||". (āditya purāṇaṃ - 4 - 10 to 13)
(ellapuḍu śrīkṛṣṇuni kathalu vinuṭa, kīrtiṃcuṭa, kṛṣṇalīlalu nōṭitō gānamu cēyuṭa, atani kīrtini cevulatō vinuṭa, kṣētramulaku naḍaciveḷḷuṭa, bhagavaṃtuni ālayamu tuḍucuṭa - śubhramu cēyuṭa, bhagavaṃtuni rūpamu - vigrahamunu - kanulāra cūcuṭa, mukkutō vāsana pīlcuṭa, bhagavaṃtuni nirmālyamunu - pūja cēsina puṣpamulanu - sēviṃcuṭa (śirassunaṃdu dhariṃcuṭa), (bhagavaṃtuni pāda tīrthamunu bhaktitō trāguṭa, manassulō bhagavaṃtuni pādapadmamunu smariṃcuṭa, bhagavaṃtuni prasādamunu (naivēdyamunu) tinuṭa, phālamaṃdu caṃdanamu dhariṃcuṭa, śirassumīda tulasīdaḷamu nuṃcukonuṭa - ī kāryamulu cēyuṭa bhagavaṃtunuki prītikaramulu, iṣṭamainavi, bhaktilakṣaṇamulu, bhaktulu cēyavalasinavi)
pāvanaṃbō,vanamālikākaraṇamō, vālyabhya labhyadhvaja |
grahaṇaṃbō, vyajanāta patridhṛtiyō, prāgdīpikārōpamō |
nṛharīvādamulēla vēre itarul nīlīlakuṃ bātramul ||".
(dēvālayamunūḍcuṭa, nīḷḷu teccuṭa, dēvuni pallakini mōyuṭa, pūladaṃḍanu tayārucēyuṭa, dhvajamunu mōyuṭa, viṃjāmaramu vīcuṭa, dīpamu veligiṃcuṭa modalagunavi cēyuṭa bhakti lakṣaṇamulu).
nyānyaṃ smarāmi, nabhajāmi, nacāśrayāmi |
bhaktvātyadīya caraṇāṃbujamaṃtarēṇa |
śrī śrīnivāsa puruṣōttama dēhi dāsyaṃ ||".
(nī guṟiṃciyēkāni itaramuguṟiṃci palukanu, vinanu, ciṃtiṃpanu, smariṃpanu, bhajiṃcanu, āśrayiṃcanu, nī caraṇāraviṃda bhajanamē nā manasulō nuṃḍunaṭlu kṛpacēyumu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.