(భక్తివలన అన్నియు సిద్ధించును, సిద్ధించనిదేదియును లేదు).
జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం యత్ బ్రహ్మదర్శనం (శ్రీమద్భాగవతము - 3 - 2 - 23)
(భగవంతుడైన వాసుదేవు నుద్దేశించి చేయు భక్తియోగము వైరాగ్యమును బ్రహ్మ సాక్షాత్కారమును పొందించు జ్ఞానమును శీఘ్రముగా పుట్టించును.).
“సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం |
మదన్యత్తే న జానంతి నాహం తేభ్యో మనాగపి ||“. (శ్రీమద్భావగతం - 2 - 4 - 47)
(బ్రహ్మను తెలుసుకొనినవాడు - బ్రహ్మజ్ఞానముగలవాడు - బ్రహ్మమే యగును అని చెప్పబడియున్నది కనుక భగవంతుని భక్తులు భగవంతుని స్వరూపములే. భగవద్భక్తులసేవచేయువారు భగవంతుని సేవచేయువారే. భక్తులు భగవంతుని హృదయములో నుందురు. భగవంతుడు భక్తుల హృదయములో నుండును - ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగ చెప్పబడినది - సాధువుల హృదయము నాది, సాధుల హృదయమే నేను - నన్నుకానిది వారికి తెలియదు -వారికి తెలిసినదంతయు నేనే - అన్నియు నేనే కనుక - నాకు వారికంటె అన్యము తెలియదు) (యే భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం) (నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు, వారియందు నేనుందును).
“నైసర్గికంబైన నిర్హేతుకమగు భగవత్సేవ మిగుల ముక్తి కంటె గరిష్టంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 873)
“ఈశ్వరుండు గాలత్రయంబునందును జంగమస్థావరాంతర్యామి యగుటంజేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించువారు తాపత్రయనివారణంబుకొఱకు భజియింతురు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 - 994)
“సంసార ప్రవిష్టుండైన వానికి తపోయోగాదులైన మోక్షమార్గంబులు పెక్కులు గలవు. అందు భక్తిమార్గంబుకంటె సులభంబులేదు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 -)
తదహం భక్త్యుపహృతమశ్నామిప్రయతాత్మనః (శ్రీమద్భగవద్గీత - 9 - 26)
(ఆకుగాని, పువ్వుగాని, పండుగాని, నీరుగాని ఎవడు భక్తితో నాకు సమర్పించునో దానిని సంతోషముతో తినెదను)
“క. దళమైన పుష్పమైనను
ఫలమైన సలిలమైనను బాయని భక్తిం
గొలచిన జనులర్పించిన
నెలమి రుచిరాన్నముగనే యేను భుజింతున్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1010)
“అనావృత్తిఫలావ్యాప్త్యై కార్యాభక్తిర్ని కేవలం |
శ్రీహరేః కింత్వనాయాసారాధ్యత్వాదపి సజ్జనైః |
పత్రం పుష్పం ఫలం తోయం అన్యద్వా వస్తు కించన |
యదనాయాస లభ్యం యః కశ్చనాపి నృదేహ భృత్ |
అనంతైశ్వర్యాపతయే మహ్యం శ్రీవిష్ణువే సుధీః |
వాసుదేవాత్పరం నాస్తి కించనేతి మనీషయా |
ప్రీత్యా భృత్యవ దేవా సావీశ్వరాయార్పయ త్యతః |
మత్సత్వా నాస్పద ద్రవ్యా భావత్ సర్వస్య వస్తునః |
మయార్జిత తయా సర్వం మదీయం మే (అ)ర్పయత్యయం |
ప్రీత్యా ప్రయచ్ఛేతస్తస్య శుద్ధ శుద్ధేర్మహాత్మనః |
పుష్పపత్రాది తత్ఫల్గువస్త్వహం పరమేశ్వరః |
స్వీకృత్యాశినవ త్ప్రీత్యా తృప్తాపి ప్రీతి భాక్ హరిః |
యస్మాత్ సమర్పితం ప్రీత్యా మత్స్వీకారే(అ)స్తి కారణం |
శ్రీదామబ్రాహ్మణా నీత తండులాశనవద్య తః |
పరితోషనిమిత్తం మే భక్తిరేవ న వైభవం |
అతో దేవాంతరం హిత్వా మామేవ సతతం యజేత్ ||” (గీతాభావప్రకాశము - 9 - 182 - 184)
వ. - - - పువ్వుగాని, ఆకుగాని, పండుగాని, నీరుగాని ఎవడునాకు భక్తితో సమర్పించునో దానిని నేను ప్రీతితో ఆరగించెదను. ముక్తి కొఱకే భగవంతునియందు భక్తి చేయుటకాదు. సజ్జనులగువారు అనాయసముగా, విశేష ప్రయత్నము చేయనవసరములేకనే ఆరాధించుటకు భక్తి సలుపవలెను. ఎందుచేతననగా, ఆకు, పువ్వు, పండు, నీరు, లేక, అనాయాసముగా (సులభముగా) దొరుకు ఇతర వస్తువేదైనను, అనంతైశ్వర్యమునకు పతియై శ్రీమహా విష్ణువైననాకు, వాసుదేవునికన్న ఉత్కృష్టమైన వస్తువులేదు అను బుద్ధితో, భక్తితో భృత్యునివలె సమర్పించును. అందుచేత అది - అట్లు భక్తుడు అర్పించిన వస్తువు - పుష్పముగాని, ఆకుగాని, ఇతరమైన ఏ చిన్న వస్తువైనను దానినే నేను ప్రీతితో అంగీకరించెదను - నాయందలి ప్రీతితో, భక్తితో సమర్పించబడినదగుటవలన అది నేను స్వీకరించుటకు కారణమైనది. కుచేలుడు నాకు భక్తితో సమర్పించిన అటుకులను నేను ప్రీతితో స్వీకరించినట్లే - నాకు సంతోషము కలిగించుటకు భక్తియే ప్రధానము, సమర్పించువాని వైభవము (గొప్పతనము) కాదు. ఇందుచేతనే - ఏ చిన్నవస్తువునైనను - సునాయాసముగా దొరుకు - ఏ వస్తువైనను భక్తితో సమర్పించి నాదయ సంపాదింపవచ్చును కనుక ఇతర దేవతులను వదలి నన్నే ఎల్లపుడు భజించవలెను - నా యందే భక్తి సలుపవలెను - “అట్టి పురుషోత్తముండు భక్తి నిష్టులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నదియు కోటి గుణితంబుగా గైకొని మన్నించుటకు నిదియ (కుచేలోపాఖ్యానము) దృష్టాంతంబుగాదె - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. - 1031)
(నారద భక్తిసూత్రములు- 58, 59, 60)
(ఇతర ప్రమాణముల అవసరము లేనందు వలనను, అదియే ప్రమాణమగుట వలనను, శాంతిరూపమగుట వలనను, పరమానందరూపమగుటవలనను, ఇతర మోక్ష సాధనముల కన్న భక్తియే సులభమైనది).
(భగవంతుని పాదములనాశ్రయించిన వారికి జన్మ కలుగదు - మోక్షము కలుగును).
(భూతములకు - జీవులకు - నాయందు కలుగు భక్తివలన మోక్షమును - మరణము లేని స్థితిని - కలుగచేయును).
పోతభూతం శరణ్యం యే శ్రితాస్తే మోక్షభాగినః |
సాధనం కర్మయోగాది హరిభజనమపేక్ష్యతే |
ముక్తేః కృష్ణాం ఘ్రి భక్తిస్తు నిరపేక్షక సాధనం |
హరిభక్తిం వినా యద్యత్సాధన దుష్కరం నృభిః |
క్రియతే తద్వృధా తస్మాద్ధరిం సర్వాత్మనాశ్రయేత్ |
మహాపుణ్యఫలం కృష్ణభక్తా విశ్వాస ఆదరాత్ |
తద్విహీనాస్తు నింద్యంతే పాపినో హరిణా స్వయం ||” (గీతాభావప్రకాశము - 7 - 88 to 92)
(మఆయ యను సంసారసాగరమును తరించుటకు (దాటుటకు) భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములే తెప్పవంటివి, శరణమైనవి. అట్లు భగవంతుని పాదపద్మముల నాశ్రయించిన భక్తులు మోక్షమును పొందుదురు. కర్మయోగము మొదలగు మోక్షసాధనములు హరిభక్తినపేక్షించునవి. శ్రీకృష్ణునియొక్క పాదపద్మములందు భక్తి ముక్తి కొఱకు ఇతర సాధనములనపేక్షింపదు - భగవంతునియందు భక్తిలేక ఎంత దుష్కరమైన సాధనము చేసినను అది వ్యర్థమే - అందుచేత భగవంతుడైన హరిని ఆశ్రయించవలెను - అతని భక్తి చేయవలెను).
నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యాతు తోష భగవాన్ గజయూథపాయ ||” (శ్రీమద్భాగవతం - 7 - 93)
“మ. తపమున్ వంశము తేజమున్, శ్రుతము, సౌందర్యంబునుద్యోగమున్
నిపుణత్వంబు, ప్రతాప పౌరుషములున్ నిష్ఠా బల ప్రజ్ఞలున్
జప యజ్ఞంబులు జాలవీశ్వర, చ వత్సంతుష్టికై, దంతయూ
ధ ప్రచందంబున భక్తిసేయ వలయుం దాత్పర్య సం యుక్తుడై - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )
(గొప్ప తపస్సుగాని, వేదాధ్యయనముగాని, తేజస్సుగాని, ప్రభావము, బలము, పౌరుషముగాని, జ్ఞానయోగముకాని పరబ్రహ్మయైన పురుషోత్తముని ఆరాధించుటకు చాలవు. గజేంద్రునివలె - “అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” (నీవే తప్ప యితఃపరంబెరుగ) అని ఆపదలోనున్న నన్ను రక్షించమని భక్తిచేత భగవంతుని మెచ్చింపవలెను - “దంతియూధపు చందంబున భక్తి సేయవలయున్” -)
న స్వాధ్యాయ స్త పస్త్యాగోయథా భక్తిర్మ మోర్జితా |
భక్త్యాహమేక యా గ్రాహ్యః శ్రద్ధయా (ఆ)త్మ ప్రియః సతాం |
భక్తిఃపునాతి మన్నిష్టాం శ్వపాకానపి సంభవాత్ ||“. (శ్రీమద్భాగవతం - 11 -14 - 21)
“యధా మద్విషయా దృఢ భక్తిర్మాం వశీకరోతి, తథా యోగో జ్ఞానం ధర్మః స్వాధ్యాయః తపస్త్యా గశ్చ మాం వశీభూతం కర్తుం నశక్నువంతి. సతాం ప్రియః ఆత్మా హమేక యా శ్రద్ధాయుక్త యాభక్త్యా వశీకర్తుం శక్యః.మన్నిష్టా భక్తిః చండాలాదీనపి పవిత్రహృదయాన్ కర్తుం సమర్థోస్తి”
(నాయందు కలుగు ధృఢమైన భక్తి నన్ను వశము చేసికొనినట్లు యోగముగాని. జ్ఞానము గాని, ధర్మముగాని, స్వాధ్యాయముకాని, తపస్సుగాని, త్యాగముకాని నన్ను వశము చేసుకొనలేదు - సత్పురుషులకు ప్రియమైనవాడను నేను - శ్రద్ధతోకూడిన ఒక్క భక్తిచేతనే నేను వశము చేసుకొనుటకు వీలగువాడను - నాయందు నిష్టకలిగిన భక్తి చండాలుడు మొదలగువారిని కూడ పవిత్రమైన హృదయము గలవారుగా చేయగలదు).
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్ట వానపిమాం యధా ||
భక్త్యా త్వనన్యయా శక్య ః అహమేవం విధోర్జున |
జ్ఞాయం ద్రష్టుంచ తత్త్వేన ప్రవేష్టుం చ పరం తప ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 53, 54)
“హే అర్జున, యథామాం త్వం దృష్టవాన్ తథా వేదైః తపసా, దాసేన, యజ్ఞాదినా చాహం ద్రష్టుం శక్యః హే పరంతప, అర్జున, అనన్య భక్త్యైవ ఇత్థమహం ద్రష్టుం, తత్వేన జ్ఞాతుం, తథా ప్రవేష్టుం శక్యోస్మి” .
(ఓ, అర్జునా, విశ్వమంతయు నేనే, అందులోని సమస్త వస్తువులు కూడ నేనే అని నేను నీకు చూపించిన ఈ విశ్వరూపమును వేదాధ్యయనము చేయుటవలనగాని, తపస్సు వలనగాని, దానము చేయుటవలనగాని, యజ్ఞముచేయుటవలనగాని, చూచుటకు శక్యము కానిది. నా భగవత్తత్త్వమైన యీ విశ్వరూపమును ఒక్క నాయందే కలుగు అనన్య భక్తిచేతనే చూచుటకు వీలగును, తెలుసుకొనుటకు శక్యమగును, అట్టి నాయందు ఐక్యమగుటకు నాతో కలిసిపోయి ముక్తినొందుటకును శక్యమగును).
కలౌ తు కేవలా భక్తిర్బ్రహ్మ సాయుజ్యకారిణీ ||’. (పద్మపురాణము - ఉత్తరఖండము - 2 - 4)
(సత్యయుగము మొదలగు మూడు యుగములలోను బ్రహ్మజ్ఞానము వైరాగ్యము ముక్తికి సాధకములుగా నుండెను. కలియుగములో మాత్రము భగవంతుని యందలి భక్తియే మోక్షమును కూర్చు సులభమైన సాధనము).
సత్వస్య శుద్ధిం పరమాత్మ భక్తిం జ్ఞానంచ విజ్ఞాన విరాగయుక్తం ||“. (శ్రీమద్భాగవతం - 12 - 12 - 54)
తద్దూరస్థం ఫలం; యదౌపనిషదజ్ఞానోప లభ్యం పునః |
తత్వక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాత్ విభో |
త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాధీయసీ ప్రేయసీ ||“. (శ్రీమన్నారాయణీయము)
(నిష్కామముగా స్వధర్మము నాచరించుట కర్మయోగము. దాని ఫలము దూరస్థము - ఎన్ని జన్మల కర్మయోగమువలననో ఫలము ప్రాప్తించును. ఉపనిషత్తులవలన కలుగు జ్ఞానము - బ్రహ్మజ్ఞానము -, ఆ జ్ఞానమే యోగముగా గలది జ్ఞానయోగము - దానివలన పొందతగినది నిర్గుణపరబ్రహ్మ తత్వము. నిర్గుణ పరబ్రహ్మ అవ్యక్తమైనది. సూక్ష్మాతి సూక్ష్మమైనది అగుటచేత నిష్కామకర్మయోగముకంటె దూరస్థము - కనుక భగవంతుడవగు నీయందు ప్రేమాతిశయరూపమగు భక్తి (ప్రమీ భక్తి) యే మనోహరమైనది, శ్రేయస్కరమైనది, సులభమైనది).
(ఎంతదూరము భగవంతుని నామము యొక్క ధ్వని ప్రసరించునో అంతదూరములోనున్న వాతావరణము (గాలి) పవిత్రమగును. చనిపోవుకాలమందు ఎవని ముఖమునుండి భగవంతుని నామము ఆఖరిశ్వాసతో నుచ్చరించబడునో అట్టివానికి పరమపదమను చెప్పబడు వైకుంఠము ప్రాప్తించును)
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 66)
(మోక్షప్రాప్తికి చెప్పబడిన ధర్మములన్నింటిని - సాధనములన్నింటిని వదలివేసి నన్నే భక్తితో శరణు పొందుము. నేను నిన్ను సమస్తమైన పాపములనుండి - పాపముల ఫలమునుండి - విముక్తినిగ చేసెదను - శోకించకు - నన్నొక్కడినే - ఉన్నదంతా నేనొక్కడినైన నన్ను శరణు పొందుము).
మహి దలపోయ నిమ్న ప్రదేశములకు ననయంబుచేరు తోయముల పగిది
- - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 311)
న్నామము చింతసేసిన ననంత సుఖస్థితి నొందకుండునే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 116)
ధనపశుమిత్ర పుత్ర వనితా తతిపై దగులంబు మాని న
న్ననఘని విశ్వతోముఖ నన్యగతిన్ భజియించెనేని వా
నిని ఘన మృత్యురూపభవ నీరధినే దరియింప జేయుదున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 881)
“యోగిజనులు పరతత్వసిద్ధి కొఱకు నిఖిలాత్మకుండైన నారాయణునందు నియుజ్యమాగంబయిన భక్తి భావంబువలన నుదయించిన మార్గంబునకు నితరమార్గంబులు సరిగావండ్రు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 -
“భగవంతుడు నిజయోగమాయా మహిమంబునంజేసి స్వేచ్ఛాపరికల్పిత చిద్ఘనలీలా విగ్రహుండుగావున భగవంతుడయిన ఈశ్వరుండు స్వభజనము ముక్తి సాధన జ్ఞానార్థంబుకల్పితంబని చతుర్ముఖునకు దదీయ నిష్కపట తపశ్చర్యాది సేవితుండై నిజ జ్ఞాననంద ఘనంబయిన స్వస్వరూపంబు సూపుచు నానతిచ్చెను -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 224)
“శ్లో||. శ్రీరామ భద్రాశ్రిత సద్గురూణాం పాదారవిందం భజతాం నరాణాం |
ఆరోగ్యమైశ్వర్య మనంతకీర్తి రంతేచ విష్ణో ః పదమస్తి సత్యం ||“. (శ్రీరామకర్ణామృతం - 4 - 89)
(శ్రీరామచంద్రుని ఆశ్రయించిన సద్గురువుల పాదారవిందములను భజియించు నరులకు ఆరోగ్యము, ఐశ్వర్యము. అనంతకీర్తి కలిగి అంతమందు విష్ణుపదమగు పరమపదము - వైకుంఠము - కూడ తప్పక ప్రాప్తించును).
(శ్రీమద్భాగవతం - 1 - 6 - 35)
“యమనియమాది యోగముల నాత్మనియంత్రితమయ్యు కామరో|షముల బ్రచోదితంబయగు, శాంతి వహింపదు, విష్ణు సేవచే | గ్రమమున శాంతి గైకొనిన కైవడి - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 6 - 95)
శ్రేష్టా పంచవిధాముక్తేర్హరి భక్తిర్గరీయసీ |
బ్రహ్మత్వాదపి దేవత్వాదింద్రత్వాదమరాదపి |
అమృతాత్ సిద్ధి లాభాచ్చ హరిదాస్యం సు దుర్లభం ||“. (బ్రహ్మదైవర్తము)
“సర్వేషు వరేషు శ్రేష్టతమో వరః శ్రీకృష్ణభక్తిః శ్రీకృష్ణదాస్యమే వాస్తి. పంచవిధాఖ్య భక్తిభ్యో హరిభక్తిరేవ శ్రేష్టా గురుతరాచాస్తి బ్రహ్మత్వాత్, అమృతత్వ ప్రాప్తేః,సిద్ధి లాభాత్,ఏభ్యః సర్వేభ్యః ఏవ శ్రీహరేర్దాస్య ప్రాప్తిః సుదుర్లభాస్తి”.
(శ్రీకృష్ణుని యందలి భక్తి ఉత్తమమైనవాటన్నింటికంటె ఉత్తమమైనది, ఉత్కృష్టమైన వాటన్నింటికంటె ఉత్కృష్టమైనది. సాలోక్య సామీప్య సారూప్యములు మొదలగు అయిదువిధ ముల ముక్తికంటె భక్తియే గొప్పది, ఉత్కృష్టమైనది. బ్రహ్మత్వముకంటె, అమృతత్వప్రాప్తికంటె, ఇంద్రపదవికంటె, దేవత్వముకంటె, అష్టసిద్ధులుకంటె భగవంతుని సేవ - భక్తి - మిక్కిలి దుర్లభము).
నిరస్య పాపాని మమాఖిలా ని |
త్వయ్యేవ భక్తిం సుదృఢాం ప్రయచ్చ |
సైవ ప్రసూతేహ్యఖిలా న భీష్టాన్ ||“. (శ్రీరామకర్ణామృతం - 3 - 99)
(దయాసముద్రుడవైన ఓ శ్రీరామచంద్రా | నేను చేసిన పాపములన్నింటిని పోగొట్టి నీయందుధృడమైన భక్తిని కలుగచేయుము - అదియే అన్ని విధములైన నా కోరికలను సమకూర్చును).
అలం జ్ఞానకలాపైః భక్తిరేకైవ ముక్తిదా ||.
(వ్రతములు, తీర్థసేవలు, యోగములు, యజ్ఞములు, జ్ఞానము, కధాలాపము, చాలును. వీటివలన ముక్తి దొరకదు. అందుచేత వాటిని విడిచిపెట్టుము - భక్తి యొక్కటియే మోక్షము నిచ్చునది).
“అలం శాస్త్రాభ్యాసై రల మసకృదామ్నాయ పఠనైః |
అలం తీర్థస్నానై రల మఖిల యాగవ్రత జపైః |
అలం యోగాభ్యాసైరలమపి మహాపాతకభియా |
య దస్మాకం రామస్మరణ మహిమా సో విజయతే ||“. (శ్రీరామకర్ణామృతం - 1 – 59)
(మాకు శాస్త్రములనభ్యసించనక్కరలేదు, వేదములను పఠించునవసరములేదు, తీర్థములందు స్నానము చేయవలసిన పనిలేదు, ఏ యాగములు, వ్రతములు, జపములు చేయవలసిన పనిలేదు, యోగాభ్యాసము చేయవలసిన అవసరములేదు - మహాపాతకములు చేసిన వీటి అవసరముండును - కాని నాకు శ్రీరామచంద్రుని స్మరణయే చాలును. అదియే పాపములన్నింటిని జయించి భద్రమును చేకూర్చును).
దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్నప్రణామీ న పునర్భావాయ”. (మహాభారతము - శాంతిపర్వము - 47 - 92)
(శ్రీకృష్ణుని గుఱించి ఒకమారు చేసిన ప్రణామము పది అశ్వమేధయాగములు చేసిన దానితో సమానము. పది అశ్వమేధములు చేసినవాడు తిరిగి జన్మించును - సంసారములో పడి తిరుగుచుండును - శ్రీకృష్ణప్రణామము చేసినవాడు - శ్రీకృష్ణభక్తుడు - తిరిగి జన్మించడు - మోక్షమును చెందును).
సంకీర్తితమఘం పుంసో దహే దేఘో యధానలః ||“. (శ్రీమద్భాగవతం - 6 - 2)
(ఉత్తమకీర్తిగల శ్రీ భగవంతుని యొక్క నామము తెలిసికాని, తెలియకకాని ఎవరు కీర్తించెదరో అట్టివారి పాపములు, అగ్ని దూదిని కాల్చివేయునట్లు, దహించివేయబడును).
(అగ్నిలో కాల్చినననేగాని బంగారములోని మలము ఎట్లు పోకుండునో, కడుగుటవలన ఎట్లు పోకయుండునో, అట్లే ఆత్మ భగవంతునియందలి భక్తివలననే కర్మవాసనలను పోగొట్టుకొనును).
(పరబ్రహ్మ అవ్యక్తుడైనప్పటికీ - బ్రహ్మజ్ఞానులకు తప్ప ఇతరులకు కనబడనివాడైనప్పటికీ - భక్తిచేత ప్రత్యక్షమగును).
మామే వైష్యసి యక్త్యైవ మాత్మానం మత్పరాయణం || (శ్రీ మద్భగవద్గీత - 9 - 34)
(నాయందే మనస్సు గలిగి యుండుము, నా భక్తుడవు గమ్ము, నా గుఱించియే యజ్ఞము చేయుము - కర్మలన్నియు చేయుము - నాకు నమస్కరించుము - ఈ ప్రకారముగా - ఇదే యోగముగా - చేసితివేని, (నేనే పరమ మోక్షస్థానము, పొందవలసిన స్థానము, అయనము, గా భావించి చేసితివేని) నీవు నన్నే పొందుదువు - అనగా, ముక్తిని పొందెదవు).
తస్మాద్విమోచకః శ్రీమానుమాపతిరితి శ్రుతిః |
- - స్వర్గార్థినాం ముముక్షూణాం బ్రహ్మత్వమభి కాంక్షితాం |
భక్తిరేవిరూపాక్షే నాన్యః పంథా ఇతి శ్రుతిః ||“. (ఆదిత్య పురాణే)
(చావు పుట్టుకలతో నిండి యుండు సంసారములో నుండి భయపడుచున్న భీరువులకు (భయముచెందివారికి) ఆ సంసారమునుండి విడుదలచేయువాడు - తరింపచేయువాడు - శ్రీపరమేశ్వరుడే యని శ్రుతి చెప్పుచున్నది. ంఒక్షమును కోరువారికి, బ్రహ్మత్వమును -బ్రాహ్మీస్థితిని కోరువారికి - పరమేశ్వరునియందు భక్తియే సాధనము - మఱియొకమార్గము లేదు).
తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్ ||” (పద్మపురాణము - 1 - 68)
(తపస్సు వలనగాని, యోగమువలనగాని, సమాధివలనగాని ఫలించనిది కలికాలమందుకేశవును కీర్తించుటవలన - కేశవునియందు భక్తి సలుపుట వలననే ఫలించును).
తథాపి భక్తాన్ భజతే యథాతథా సురద్రుమో యద్వదుపాశ్రితోర్థః ||“. (శ్రీమద్భాగవతం - 10 - 37 - 22)
(భగవంతునికి దయిత యనికాని, సుహృత్ అనికాని, ప్రియుడనికాని, అప్రియుడనికాని, ద్వేషించతగినవాడనికాని ఉపేక్షించ తగినవాడనికాని ఎవడూలేడు - అయినను కల్పవృక్షము తనను ఆశ్రయించినవారికి కోరిన కోర్కెలనిచ్చునట్లు, తనను భక్తి యేరీతిగా భజించెదరో ఆ రీతిగనే - దానికనుగుణముగనే - వారిని భగవంతుడనుగ్రహించును - ఆదరించును).
నారదుడు పూర్వజన్మలో వేగవాదులదాసికి పుత్రుడై జన్మించి, వారు భగవత్తత్త్వమును చర్చించుచుండగా విని, భగవంతునియందు భక్తికలిగి, తర్వాత జన్మలో మహాభక్తులలో నొకడైన నారదుడుగా జన్మించెను).
గజేంద్రుడు మొసలిచే పట్టువడి, శల్యావశిష్టమై చేయునదిలేక భగవంతుని శరణువేడగా భగవంతుడు ఉన్నపాటున లేచివచ్చి అతనిని రక్షించెను - అట్లు వచ్చినపుడేవిధమైన పరికరము తొందఱలో తెచ్చుకొనలేదు - కాని - ” తనవెంటన్ సిరి, లచ్చివెంటనవరోధవ్రాతమున్ | దాని వెన్కను పక్షీంద్రుడు, దాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, నారదుండు, ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాలగోపాలమున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
(దీని పరమార్థమేమనగా - అనన్యభక్తితో భగవంతుని శరణుజొచ్చిన అతను శరణిచ్చుటయేకాక, దానితోపాటు లక్ష్మిని (ఐశ్వర్యమును) దాసదాసీజనమును, వాహనములు, రక్షణచేయు ఆయుధములు, వందిమాగధులు, - సకల సౌభాగ్యములు కలుగును - కుచేలునకు కలిగినట్లు).
తస్యై తేకధితాన్యార్థాః ప్రకాశం తే మహాత్మనః ||“.
(ఎవనికి దేవునియందు గొప్ప భక్తి కలుగునో దేవునియందు వలెనే గురువునందుకూడాకలుగునో అట్టివానికి దేవునిగుఱించి గురువుచే బోధించబడిన వేదాంతవాక్యముల పరమార్థము, గూఢార్థము, స్పష్టముగా బోధపడును).
(చూడుము - శ్రీమదాంధ్రమహాభాగవతం - 11 - 102 to 107), (శ్రీమద్భాగవతము - 11 - )
(bhaktivalana anniyu siddhiṃcunu, siddhiṃcanidēdiyunu lēdu).
janayatyāsu vairāgyaṃ jñānaṃ yat brahmadarśanaṃ (śrīmadbhāgavatamu - 3 - 2 - 23)
(bhagavaṃtuḍaina vāsudēvu nuddēśiṃci cēyu bhaktiyōgamu vairāgyamunu brahma sākṣātkāramunu poṃdiṃcu jñānamunu śīghramugā puṭṭiṃcunu.).
“sādhavō hṛdayaṃ mahyaṃ sādhūnāṃ hṛdayaṃ tvahaṃ |
madanyattē na jānaṃti nāhaṃ tēbhyō manāgapi ||“. (śrīmadbhāvagataṃ - 2 - 4 - 47)
(brahmanu telusukoninavāḍu - brahmajñānamugalavāḍu - brahmamē yagunu ani ceppabaḍiyunnadi kanuka bhagavaṃtuni bhaktulu bhagavaṃtuni svarūpamulē. bhagavadbhaktulasēvacēyuvāru bhagavaṃtuni sēvacēyuvārē. bhaktulu bhagavaṃtuni hṛdayamulō nuṃduru. bhagavaṃtuḍu bhaktula hṛdayamulō nuṃḍunu - ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamuga ceppabaḍinadi - sādhuvula hṛdayamu nādi, sādhula hṛdayamē nēnu - nannukānidi vāriki teliyadu -vāriki telisinadaṃtayu nēnē - anniyu nēnē kanuka - nāku vārikaṃṭe anyamu teliyadu) (yē bhajaṃti tu māṃ bhaktyā mayitē tēṣu cāpyahaṃ) (nannu bhaktitō bhajiṃcuvāru nāyaṃdē yuṃduru, vāriyaṃdu nēnuṃdunu).
“naisargikaṃbaina nirhētukamagu bhagavatsēva migula mukti kaṃṭe gariṣṭaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 873)
“īśvaruṃḍu gālatrayaṃbunaṃdunu jaṃgamasthāvarāṃtaryāmi yaguṭaṃjēsi jīvakarma mārgaṃbulaṃ bravartiṃcuvāru tāpatrayanivāraṇaṃbukoṟaku bhajiyiṃturu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 - 994)
“saṃsāra praviṣṭuṃḍaina vāniki tapōyōgādulaina mōkṣamārgaṃbulu pekkulu galavu. aṃdu bhaktimārgaṃbukaṃṭe sulabhaṃbulēdu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 -)
tadahaṃ bhaktyupahṛtamaśnāmiprayatātmanaḥ (śrīmadbhagavadgīta - 9 - 26)
(ākugāni, puvvugāni, paṃḍugāni, nīrugāni evaḍu bhaktitō nāku samarpiṃcunō dānini saṃtōṣamutō tinedanu)
“ka. daḷamaina puṣpamainanu
phalamaina salilamainanu bāyani bhaktiṃ
golacina janularpiṃcina
nelami rucirānnamuganē yēnu bhujiṃtun ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1010)
“anāvṛttiphalāvyāptyai kāryābhaktirni kēvalaṃ |
śrīharēḥ kiṃtvanāyāsārādhyatvādapi sajjanaiḥ |
patraṃ puṣpaṃ phalaṃ tōyaṃ anyadvā vastu kiṃcana |
yadanāyāsa labhyaṃ yaḥ kaścanāpi nṛdēha bhṛt |
anaṃtaiśvaryāpatayē mahyaṃ śrīviṣṇuvē sudhīḥ |
vāsudēvātparaṃ nāsti kiṃcanēti manīṣayā |
prītyā bhṛtyava dēvā sāvīśvarāyārpaya tyataḥ |
matsatvā nāspada dravyā bhāvat sarvasya vastunaḥ |
mayārjita tayā sarvaṃ madīyaṃ mē (a)rpayatyayaṃ |
prītyā prayacchētastasya śuddha śuddhērmahātmanaḥ |
puṣpapatrādi tatphalguvastvahaṃ paramēśvaraḥ |
svīkṛtyāśinava tprītyā tṛptāpi prīti bhāk hariḥ |
yasmāt samarpitaṃ prītyā matsvīkārē(a)sti kāraṇaṃ |
śrīdāmabrāhmaṇā nīta taṃḍulāśanavadya taḥ |
paritōṣanimittaṃ mē bhaktirēva na vaibhavaṃ |
atō dēvāṃtaraṃ hitvā māmēva satataṃ yajēt ||” (gītābhāvaprakāśamu - 9 - 182 - 184)
va. - - - puvvugāni, ākugāni, paṃḍugāni, nīrugāni evaḍunāku bhaktitō samarpiṃcunō dānini nēnu prītitō āragiṃcedanu. mukti koṟakē bhagavaṃtuniyaṃdu bhakti cēyuṭakādu. sajjanulaguvāru anāyasamugā, viśēṣa prayatnamu cēyanavasaramulēkanē ārādhiṃcuṭaku bhakti salupavalenu. eṃducētananagā, āku, puvvu, paṃḍu, nīru, lēka, anāyāsamugā (sulabhamugā) doruku itara vastuvēdainanu, anaṃtaiśvaryamunaku patiyai śrīmahā viṣṇuvainanāku, vāsudēvunikanna utkṛṣṭamaina vastuvulēdu anu buddhitō, bhaktitō bhṛtyunivale samarpiṃcunu. aṃducēta adi - aṭlu bhaktuḍu arpiṃcina vastuvu - puṣpamugāni, ākugāni, itaramaina ē cinna vastuvainanu dāninē nēnu prītitō aṃgīkariṃcedanu - nāyaṃdali prītitō, bhaktitō samarpiṃcabaḍinadaguṭavalana adi nēnu svīkariṃcuṭaku kāraṇamainadi. kucēluḍu nāku bhaktitō samarpiṃcina aṭukulanu nēnu prītitō svīkariṃcinaṭlē - nāku saṃtōṣamu kaligiṃcuṭaku bhaktiyē pradhānamu, samarpiṃcuvāni vaibhavamu (goppatanamu) kādu. iṃducētanē - ē cinnavastuvunainanu - sunāyāsamugā doruku - ē vastuvainanu bhaktitō samarpiṃci nādaya saṃpādiṃpavaccunu kanuka itara dēvatulanu vadali nannē ellapuḍu bhajiṃcavalenu - nā yaṃdē bhakti salupavalenu - “aṭṭi puruṣōttamuṃḍu bhakti niṣṭulaina sajjanulu lēśamātraṃbagu padārthaṃbaina bhakti pūrvakaṃbugā samarpiṃcina nadiyu kōṭi guṇitaṃbugā gaikoni manniṃcuṭaku nidiya (kucēlōpākhyānamu) dṛṣṭāṃtaṃbugāde - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. - 1031)
(nārada bhaktisūtramulu- 58, 59, 60)
(itara pramāṇamula avasaramu lēnaṃdu valananu, adiyē pramāṇamaguṭa valananu, śāṃtirūpamaguṭa valananu, paramānaṃdarūpamaguṭavalananu, itara mōkṣa sādhanamula kanna bhaktiyē sulabhamainadi).
(bhagavaṃtuni pādamulanāśrayiṃcina vāriki janma kalugadu - mōkṣamu kalugunu).
(bhūtamulaku - jīvulaku - nāyaṃdu kalugu bhaktivalana mōkṣamunu - maraṇamu lēni sthitini - kalugacēyunu).
pōtabhūtaṃ śaraṇyaṃ yē śritāstē mōkṣabhāginaḥ |
sādhanaṃ karmayōgādi haribhajanamapēkṣyatē |
muktēḥ kṛṣṇāṃ ghri bhaktistu nirapēkṣaka sādhanaṃ |
haribhaktiṃ vinā yadyatsādhana duṣkaraṃ nṛbhiḥ |
kriyatē tadvṛdhā tasmāddhariṃ sarvātmanāśrayēt |
mahāpuṇyaphalaṃ kṛṣṇabhaktā viśvāsa ādarāt |
tadvihīnāstu niṃdyaṃtē pāpinō hariṇā svayaṃ ||” (gītābhāvaprakāśamu - 7 - 88 to 92)
(maāya yanu saṃsārasāgaramunu tariṃcuṭaku (dāṭuṭaku) bhagavaṃtuḍaina śrīkṛṣṇuni yokka pādapadmamulē teppavaṃṭivi, śaraṇamainavi. aṭlu bhagavaṃtuni pādapadmamula nāśrayiṃcina bhaktulu mōkṣamunu poṃduduru. karmayōgamu modalagu mōkṣasādhanamulu haribhaktinapēkṣiṃcunavi. śrīkṛṣṇuniyokka pādapadmamulaṃdu bhakti mukti koṟaku itara sādhanamulanapēkṣiṃpadu - bhagavaṃtuniyaṃdu bhaktilēka eṃta duṣkaramaina sādhanamu cēsinanu adi vyarthamē - aṃducēta bhagavaṃtuḍaina harini āśrayiṃcavalenu - atani bhakti cēyavalenu).
nārādhanāya hi bhavaṃti parasya puṃsō bhaktyātu tōṣa bhagavān gajayūthapāya ||” (śrīmadbhāgavataṃ - 7 - 93)
“ma. tapamun vaṃśamu tējamun, śrutamu, sauṃdaryaṃbunudyōgamun
nipuṇatvaṃbu, pratāpa pauruṣamulun niṣṭhā bala prajñalun
japa yajñaṃbulu jālavīśvara, ca vatsaṃtuṣṭikai, daṃtayū
dha pracaṃdaṃbuna bhaktisēya valayuṃ dātparya saṃ yuktuḍai - (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )
(goppa tapassugāni, vēdādhyayanamugāni, tējassugāni, prabhāvamu, balamu, pauruṣamugāni, jñānayōgamukāni parabrahmayaina puruṣōttamuni ārādhiṃcuṭaku cālavu. gajēṃdrunivale - “anyathā śaraṇaṃ nāsti tvamēva śaraṇaṃ mama” (nīvē tappa yitaḥparaṃberuga) ani āpadalōnunna nannu rakṣiṃcamani bhakticēta bhagavaṃtuni mecciṃpavalenu - “daṃtiyūdhapu caṃdaṃbuna bhakti sēyavalayun” -)
na svādhyāya sta pastyāgōyathā bhaktirma mōrjitā |
bhaktyāhamēka yā grāhyaḥ śraddhayā (ā)tma priyaḥ satāṃ |
bhaktiḥpunāti manniṣṭāṃ śvapākānapi saṃbhavāt ||“. (śrīmadbhāgavataṃ - 11 -14 - 21)
“yadhā madviṣayā dṛḍha bhaktirmāṃ vaśīkarōti, tathā yōgō jñānaṃ dharmaḥ svādhyāyaḥ tapastyā gaśca māṃ vaśībhūtaṃ kartuṃ naśaknuvaṃti. satāṃ priyaḥ ātmā hamēka yā śraddhāyukta yābhaktyā vaśīkartuṃ śakyaḥ.manniṣṭā bhaktiḥ caṃḍālādīnapi pavitrahṛdayān kartuṃ samarthōsti”
(nāyaṃdu kalugu dhṛḍhamaina bhakti nannu vaśamu cēsikoninaṭlu yōgamugāni. jñānamu gāni, dharmamugāni, svādhyāyamukāni, tapassugāni, tyāgamukāni nannu vaśamu cēsukonalēdu - satpuruṣulaku priyamainavāḍanu nēnu - śraddhatōkūḍina okka bhakticētanē nēnu vaśamu cēsukonuṭaku vīlaguvāḍanu - nāyaṃdu niṣṭakaligina bhakti caṃḍāluḍu modalaguvārini kūḍa pavitramaina hṛdayamu galavārugā cēyagaladu).
śakya ēvaṃ vidhō draṣṭuṃ dṛṣṭa vānapimāṃ yadhā ||
bhaktyā tvananyayā śakya ḥ ahamēvaṃ vidhōrjuna |
jñāyaṃ draṣṭuṃca tattvēna pravēṣṭuṃ ca paraṃ tapa ||“. (śrīmadbhagavadgīta - 11 - 53, 54)
“hē arjuna, yathāmāṃ tvaṃ dṛṣṭavān tathā vēdaiḥ tapasā, dāsēna, yajñādinā cāhaṃ draṣṭuṃ śakyaḥ hē paraṃtapa, arjuna, ananya bhaktyaiva itthamahaṃ draṣṭuṃ, tatvēna jñātuṃ, tathā pravēṣṭuṃ śakyōsmi” .
(ō, arjunā, viśvamaṃtayu nēnē, aṃdulōni samasta vastuvulu kūḍa nēnē ani nēnu nīku cūpiṃcina ī viśvarūpamunu vēdādhyayanamu cēyuṭavalanagāni, tapassu valanagāni, dānamu cēyuṭavalanagāni, yajñamucēyuṭavalanagāni, cūcuṭaku śakyamu kānidi. nā bhagavattattvamaina yī viśvarūpamunu okka nāyaṃdē kalugu ananya bhakticētanē cūcuṭaku vīlagunu, telusukonuṭaku śakyamagunu, aṭṭi nāyaṃdu aikyamaguṭaku nātō kalisipōyi muktinoṃduṭakunu śakyamagunu).
kalau tu kēvalā bhaktirbrahma sāyujyakāriṇī ||’. (padmapurāṇamu - uttarakhaṃḍamu - 2 - 4)
(satyayugamu modalagu mūḍu yugamulalōnu brahmajñānamu vairāgyamu muktiki sādhakamulugā nuṃḍenu. kaliyugamulō mātramu bhagavaṃtuni yaṃdali bhaktiyē mōkṣamunu kūrcu sulabhamaina sādhanamu).
satvasya śuddhiṃ paramātma bhaktiṃ jñānaṃca vijñāna virāgayuktaṃ ||“. (śrīmadbhāgavataṃ - 12 - 12 - 54)
taddūrasthaṃ phalaṃ; yadaupaniṣadajñānōpa labhyaṃ punaḥ |
tatvaktatayā sudurgamataraṃ cittasya tasmāt vibhō |
tvatprēmātmaka bhaktirēva satataṃ svādhīyasī prēyasī ||“. (śrīmannārāyaṇīyamu)
(niṣkāmamugā svadharmamu nācariṃcuṭa karmayōgamu. dāni phalamu dūrasthamu - enni janmala karmayōgamuvalananō phalamu prāptiṃcunu. upaniṣattulavalana kalugu jñānamu - brahmajñānamu -, ā jñānamē yōgamugā galadi jñānayōgamu - dānivalana poṃdataginadi nirguṇaparabrahma tatvamu. nirguṇa parabrahma avyaktamainadi. sūkṣmāti sūkṣmamainadi aguṭacēta niṣkāmakarmayōgamukaṃṭe dūrasthamu - kanuka bhagavaṃtuḍavagu nīyaṃdu prēmātiśayarūpamagu bhakti (pramī bhakti) yē manōharamainadi, śrēyaskaramainadi, sulabhamainadi).
(eṃtadūramu bhagavaṃtuni nāmamu yokka dhvani prasariṃcunō aṃtadūramulōnunna vātāvaraṇamu (gāli) pavitramagunu. canipōvukālamaṃdu evani mukhamunuṃḍi bhagavaṃtuni nāmamu ākhariśvāsatō nuccariṃcabaḍunō aṭṭivāniki paramapadamanu ceppabaḍu vaikuṃṭhamu prāptiṃcunu)
ahaṃ tvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śuca ||“. (śrīmadbhagavadgīta - 18 - 66)
(mōkṣaprāptiki ceppabaḍina dharmamulanniṃṭini - sādhanamulanniṃṭini vadalivēsi nannē bhaktitō śaraṇu poṃdumu. nēnu ninnu samastamaina pāpamulanuṃḍi - pāpamula phalamunuṃḍi - vimuktiniga cēsedanu - śōkiṃcaku - nannokkaḍinē - unnadaṃtā nēnokkaḍinaina nannu śaraṇu poṃdumu).
mahi dalapōya nimna pradēśamulaku nanayaṃbucēru tōyamula pagidi
- - - (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 311)
nnāmamu ciṃtasēsina nanaṃta sukhasthiti noṃdakuṃḍunē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 116)
dhanapaśumitra putra vanitā tatipai dagulaṃbu māni na
nnanaghani viśvatōmukha nanyagatin bhajiyiṃcenēni vā
nini ghana mṛtyurūpabhava nīradhinē dariyiṃpa jēyudun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 881)
“yōgijanulu paratatvasiddhi koṟaku nikhilātmakuṃḍaina nārāyaṇunaṃdu niyujyamāgaṃbayina bhakti bhāvaṃbuvalana nudayiṃcina mārgaṃbunaku nitaramārgaṃbulu sarigāvaṃḍru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 -
“bhagavaṃtuḍu nijayōgamāyā mahimaṃbunaṃjēsi svēcchāparikalpita cidghanalīlā vigrahuṃḍugāvuna bhagavaṃtuḍayina īśvaruṃḍu svabhajanamu mukti sādhana jñānārthaṃbukalpitaṃbani caturmukhunaku dadīya niṣkapaṭa tapaścaryādi sēvituṃḍai nija jñānanaṃda ghanaṃbayina svasvarūpaṃbu sūpucu nānaticcenu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 224)
“ślō||. śrīrāma bhadrāśrita sadgurūṇāṃ pādāraviṃdaṃ bhajatāṃ narāṇāṃ |
ārōgyamaiśvarya manaṃtakīrti raṃtēca viṣṇō ḥ padamasti satyaṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 89)
(śrīrāmacaṃdruni āśrayiṃcina sadguruvula pādāraviṃdamulanu bhajiyiṃcu narulaku ārōgyamu, aiśvaryamu. anaṃtakīrti kaligi aṃtamaṃdu viṣṇupadamagu paramapadamu - vaikuṃṭhamu - kūḍa tappaka prāptiṃcunu).
(śrīmadbhāgavataṃ - 1 - 6 - 35)
“yamaniyamādi yōgamula nātmaniyaṃtritamayyu kāmarō|ṣamula bracōditaṃbayagu, śāṃti vahiṃpadu, viṣṇu sēvacē | gramamuna śāṃti gaikonina kaivaḍi - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 6 - 95)
śrēṣṭā paṃcavidhāmuktērhari bhaktirgarīyasī |
brahmatvādapi dēvatvādiṃdratvādamarādapi |
amṛtāt siddhi lābhācca haridāsyaṃ su durlabhaṃ ||“. (brahmadaivartamu)
“sarvēṣu varēṣu śrēṣṭatamō varaḥ śrīkṛṣṇabhaktiḥ śrīkṛṣṇadāsyamē vāsti. paṃcavidhākhya bhaktibhyō haribhaktirēva śrēṣṭā gurutarācāsti brahmatvāt, amṛtatva prāptēḥ,siddhi lābhāt,ēbhyaḥ sarvēbhyaḥ ēva śrīharērdāsya prāptiḥ sudurlabhāsti”.
(śrīkṛṣṇuni yaṃdali bhakti uttamamainavāṭanniṃṭikaṃṭe uttamamainadi, utkṛṣṭamaina vāṭanniṃṭikaṃṭe utkṛṣṭamainadi. sālōkya sāmīpya sārūpyamulu modalagu ayiduvidha mula muktikaṃṭe bhaktiyē goppadi, utkṛṣṭamainadi. brahmatvamukaṃṭe, amṛtatvaprāptikaṃṭe, iṃdrapadavikaṃṭe, dēvatvamukaṃṭe, aṣṭasiddhulukaṃṭe bhagavaṃtuni sēva - bhakti - mikkili durlabhamu).
nirasya pāpāni mamākhilā ni |
tvayyēva bhaktiṃ sudṛḍhāṃ prayacca |
saiva prasūtēhyakhilā na bhīṣṭān ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 99)
(dayāsamudruḍavaina ō śrīrāmacaṃdrā | nēnu cēsina pāpamulanniṃṭini pōgoṭṭi nīyaṃdudhṛḍamaina bhaktini kalugacēyumu - adiyē anni vidhamulaina nā kōrikalanu samakūrcunu).
alaṃ jñānakalāpaiḥ bhaktirēkaiva muktidā ||.
(vratamulu, tīrthasēvalu, yōgamulu, yajñamulu, jñānamu, kadhālāpamu, cālunu. vīṭivalana mukti dorakadu. aṃducēta vāṭini viḍicipeṭṭumu - bhakti yokkaṭiyē mōkṣamu niccunadi).
“alaṃ śāstrābhyāsai rala masakṛdāmnāya paṭhanaiḥ |
alaṃ tīrthasnānai rala makhila yāgavrata japaiḥ |
alaṃ yōgābhyāsairalamapi mahāpātakabhiyā |
ya dasmākaṃ rāmasmaraṇa mahimā sō vijayatē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 – 59)
(māku śāstramulanabhyasiṃcanakkaralēdu, vēdamulanu paṭhiṃcunavasaramulēdu, tīrthamulaṃdu snānamu cēyavalasina panilēdu, ē yāgamulu, vratamulu, japamulu cēyavalasina panilēdu, yōgābhyāsamu cēyavalasina avasaramulēdu - mahāpātakamulu cēsina vīṭi avasaramuṃḍunu - kāni nāku śrīrāmacaṃdruni smaraṇayē cālunu. adiyē pāpamulanniṃṭini jayiṃci bhadramunu cēkūrcunu).
daśāśvamēdhī punarēti janma kṛṣnapraṇāmī na punarbhāvāya”. (mahābhāratamu - śāṃtiparvamu - 47 - 92)
(śrīkṛṣṇuni guṟiṃci okamāru cēsina praṇāmamu padi aśvamēdhayāgamulu cēsina dānitō samānamu. padi aśvamēdhamulu cēsinavāḍu tirigi janmiṃcunu - saṃsāramulō paḍi tirugucuṃḍunu - śrīkṛṣṇapraṇāmamu cēsinavāḍu - śrīkṛṣṇabhaktuḍu - tirigi janmiṃcaḍu - mōkṣamunu ceṃdunu).
saṃkīrtitamaghaṃ puṃsō dahē dēghō yadhānalaḥ ||“. (śrīmadbhāgavataṃ - 6 - 2)
(uttamakīrtigala śrī bhagavaṃtuni yokka nāmamu telisikāni, teliyakakāni evaru kīrtiṃcedarō aṭṭivāri pāpamulu, agni dūdini kālcivēyunaṭlu, dahiṃcivēyabaḍunu).
(agnilō kālcinananēgāni baṃgāramulōni malamu eṭlu pōkuṃḍunō, kaḍuguṭavalana eṭlu pōkayuṃḍunō, aṭlē ātma bhagavaṃtuniyaṃdali bhaktivalananē karmavāsanalanu pōgoṭṭukonunu).
(parabrahma avyaktuḍainappaṭikī - brahmajñānulaku tappa itarulaku kanabaḍanivāḍainappaṭikī - bhakticēta pratyakṣamagunu).
māmē vaiṣyasi yaktyaiva mātmānaṃ matparāyaṇaṃ || (śrī madbhagavadgīta - 9 - 34)
(nāyaṃdē manassu galigi yuṃḍumu, nā bhaktuḍavu gammu, nā guṟiṃciyē yajñamu cēyumu - karmalanniyu cēyumu - nāku namaskariṃcumu - ī prakāramugā - idē yōgamugā - cēsitivēni, (nēnē parama mōkṣasthānamu, poṃdavalasina sthānamu, ayanamu, gā bhāviṃci cēsitivēni) nīvu nannē poṃduduvu - anagā, muktini poṃdedavu).
tasmādvimōcakaḥ śrīmānumāpatiriti śrutiḥ |
- - svargārthināṃ mumukṣūṇāṃ brahmatvamabhi kāṃkṣitāṃ |
bhaktirēvirūpākṣē nānyaḥ paṃthā iti śrutiḥ ||“. (āditya purāṇē)
(cāvu puṭṭukalatō niṃḍi yuṃḍu saṃsāramulō nuṃḍi bhayapaḍucunna bhīruvulaku (bhayamuceṃdivāriki) ā saṃsāramunuṃḍi viḍudalacēyuvāḍu - tariṃpacēyuvāḍu - śrīparamēśvaruḍē yani śruti ceppucunnadi. ṃokṣamunu kōruvāriki, brahmatvamunu -brāhmīsthitini kōruvāriki - paramēśvaruniyaṃdu bhaktiyē sādhanamu - maṟiyokamārgamu lēdu).
tatphalaṃ labhatē samyak kalau kēśava kīrtanāt ||” (padmapurāṇamu - 1 - 68)
(tapassu valanagāni, yōgamuvalanagāni, samādhivalanagāni phaliṃcanidi kalikālamaṃdukēśavunu kīrtiṃcuṭavalana - kēśavuniyaṃdu bhakti salupuṭa valananē phaliṃcunu).
tathāpi bhaktān bhajatē yathātathā suradrumō yadvadupāśritōrthaḥ ||“. (śrīmadbhāgavataṃ - 10 - 37 - 22)
(bhagavaṃtuniki dayita yanikāni, suhṛt anikāni, priyuḍanikāni, apriyuḍanikāni, dvēṣiṃcataginavāḍanikāni upēkṣiṃca taginavāḍanikāni evaḍūlēḍu - ayinanu kalpavṛkṣamu tananu āśrayiṃcinavāriki kōrina kōrkelaniccunaṭlu, tananu bhakti yērītigā bhajiṃcedarō ā rītiganē - dānikanuguṇamuganē - vārini bhagavaṃtuḍanugrahiṃcunu - ādariṃcunu).
nāraduḍu pūrvajanmalō vēgavāduladāsiki putruḍai janmiṃci, vāru bhagavattattvamunu carciṃcucuṃḍagā vini, bhagavaṃtuniyaṃdu bhaktikaligi, tarvāta janmalō mahābhaktulalō nokaḍaina nāraduḍugā janmiṃcenu).
gajēṃdruḍu mosalicē paṭṭuvaḍi, śalyāvaśiṣṭamai cēyunadilēka bhagavaṃtuni śaraṇuvēḍagā bhagavaṃtuḍu unnapāṭuna lēcivacci atanini rakṣiṃcenu - aṭlu vaccinapuḍēvidhamaina parikaramu toṃdaṟalō teccukonalēdu - kāni - ” tanaveṃṭan siri, lacciveṃṭanavarōdhavrātamun | dāni venkanu pakṣīṃdruḍu, dāni poṃtanu dhanuḥkaumōdakī śaṃkha cakra nikāyaṃbunu, nāraduṃḍu, dhvajanīkāṃtuṃḍu rāvacci royyana vaikuṃṭhapuraṃbunaṃ galugu vārābālagōpālamun”. (śrīmadāṃdhramahābhāgavatamu -)
(dīni paramārthamēmanagā - ananyabhaktitō bhagavaṃtuni śaraṇujoccina atanu śaraṇiccuṭayēkāka, dānitōpāṭu lakṣmini (aiśvaryamunu) dāsadāsījanamunu, vāhanamulu, rakṣaṇacēyu āyudhamulu, vaṃdimāgadhulu, - sakala saubhāgyamulu kalugunu - kucēlunaku kaliginaṭlu).
tasyai tēkadhitānyārthāḥ prakāśaṃ tē mahātmanaḥ ||“.
(evaniki dēvuniyaṃdu goppa bhakti kalugunō dēvuniyaṃdu valenē guruvunaṃdukūḍākalugunō aṭṭivāniki dēvuniguṟiṃci guruvucē bōdhiṃcabaḍina vēdāṃtavākyamula paramārthamu, gūḍhārthamu, spaṣṭamugā bōdhapaḍunu).
(cūḍumu - śrīmadāṃdhramahābhāgavataṃ - 11 - 102 to 107), (śrīmadbhāgavatamu - 11 - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.