← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భక్తి సహాయకములు bhakti sahāyakamulu

Original — తెలుగు

"భక్తి ప్రాప్తే సహాయకానాం కర్మణాం మధ్యే ప్రథానాని –

1. ఆత్మనః వర్ణస్య ఆశ్రమస్య చ ధర్మిణాం యథా సంభవం పూర్ణతయా పాలనం బ్రహ్మచారి వానప్రస్థసన్యాసినాం పక్షే త్యాగపూర్ణమాభరణం, గృహస్థస్య చ పక్షే భగవత్ప్రీత్యర్థం మాతుఃపితుః స్త్రియాః పుత్రాణాం పరివార ప్రభృతీనాం ఆశ్రిత జనానాం ప్రేమ సత్కార పూర్వకం పాలనం, న్యాయ సత్య పురస్సరం జీవన నిర్వాహః, తథా శాస్త్రోక్తాని యజ్ఞ దాన తపాంసి ఇత్యాది.

2. సదాచారస్య పాలనం

3. సత్సంగః తథా భగవద్గుణానువాదస్య శ్రవణం,చింతనం, కీర్తనంచ.

4. భగవన్నామ్నాం జపః, స్మరణం కీర్తనంచ

5. భగవతః పూజనం స్తుతిః ప్రార్థనం, నమస్కరణంచ

6. సతానాం భక్తానాం సేవా, తథా శ్రద్ధా పూర్వకం తేషా మాజ్ఞాయాః పాలనం

7. తీర్థ సేవనం

8. దీనేషు ప్రాణిషు దయా, తథా యథా సంభవం తన్వా, మనసా, ధనేనచ తేషాం సేవా

9. సర్వకర్మణాం భగవతే సమర్పణం

10. సర్వేషు ప్రాణిషు భగవతః దర్శనస్య అభ్యాసః "

(భక్తి కుదురుటకు సహాయపడు కర్మలలో ముఖ్యమైనవి యీ క్రింద చెప్పబడినవి –

(1). తనకు నిర్ణీతమైన వర్ణాశ్రమ ధర్మములను పూర్తిగా ఆచరించుట - బ్రహ్మచర్యాశ్రమమందుండువారికి వాన ప్రస్థాశ్రమ మందుండువారికి, సన్యాసాశ్రమమందుండువారికి త్యాగము ముఖ్యము. గృహస్థాశ్రమ మందుండువారికి భగవంతుని ప్రీతికొఱకు తల్లిని, తండ్రిని, స్త్రీలను, పుత్రులను, పరివారజనులు మొదలగు తన్నాశ్రయించు వారలను ప్రేమతో చూచుట. న్యాయముగాను సత్యముగాను జీవితమును గడుపుట, శాస్త్రములో చెప్పిన యజ్ఞములను, దానములను, తపస్సులను చేయుట మొదలగు కర్మలు.

(2). సదాచారము నవలంభించుట

(3). సత్పురుషుల సంగము, భగవంతుని అనంతకల్యాణగుణముల గుఱించి వినుట, వాటి గురించి చింతించుట, కీర్తించుట,

(4). భగవంతుని నామములను జపించుట, స్మరించుట, కీర్తించుట

(5). భగవంతుని పూజ, స్తోత్రము చేయుట, ప్రార్థన చేయుట, భగవంతునికి నమస్కరించుట

(6). సత్పురుషులను, భగవంతుని భక్తులను సేవించుట, శ్రద్ధతో వారి ఆజ్ఞలను పాలించుట (వారు చెప్పిన పని చేయుట)

(7). తీర్థములను సేవించుట

(8). దీనులయిన ప్రాణులందు దయ కలిగియుండుట, మనోకాయ ధనములతో వారికి చేతనయినంత సహాయము చేయుట

(9). సమస్త ప్రాణులందు భగవద్బుద్ధి కలిగియుండుట,

  1. సమస్త కర్మలను భగవంతుని కర్పించుట. (సమస్త ప్రాణులు భగవంతుడే - భగవంతుని రూపములే వారిని చూచిన భగవంతుని చూచినట్లేయని భావించుట).

  2. "శ్లో||. శ్రద్ధామృతకథాయాం మే శశ్వన్మదను కీర్తనం |

పరినిష్ఠా చ పూజాయాం స్తుతిభిః స్తవనం మమ |

ఆదరః పరిచర్యాయాం సర్వాంగైరభివందనం |

మద్భక్తి పూజాభ్యధికా సర్వభూతేషు మన్మతిః |

మదర్థేష్వంగచేష్టాచ వచసా మద్గుణేరణా |

మయ్యర్పణంచ మనసఃసర్వనామ వివర్జనం |

మదర్థే అర్థ పరిత్యాగే భోగస్య సుఖస్యచ |

ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థం యత్ వ్రతం తపః |

ఏవం ధరైర్మనుష్యాణాం ధవాత్మ నివేదనం |

మయి సంజాయతే భక్తిః కో అన్యో అర్థో అస్యావతిష్యతే ||". (శ్రీమద్భాగవతం 11- 11- 11)

(భగవంతుని అమృతరూపమైన కథలందు శ్రద్ధ కలిగియుండుట, నిత్యము భగవంతుని కీర్తన చేయుట, భగవంతుని పూజయందు నిష్ట కలిగియుండుట; భగవంతుని స్తోత్రములతో స్తుతించుట, భగవంతునికి పరిచర్య - సేవ - చేయుటయందు ఆదరము కలిగియుండుట, భగవంతునికి సాష్టాంగ నమస్కారము చేయుట, నాయందు అధిక భక్తి కలిగి యుండుట, సమస్త భూతములు భగవంతుడే యను అభిప్రాయము కలిగియుండుట, శరీరముతో ఏ పనిచేసినను అది అంతయు భగవంతుని కొఱకే యని తలంచుట, వాక్కుచేత భగవంతుని గుణములను పొగడుట; మనస్సుని భగవంతునియందే, అతని ధ్యానమందే లగ్నము చేసియుంచుట; అన్నిపేర్లను విడిచిపెట్టుట; భోగ్య వస్తువుకాని, సుఖకరమైన వస్తువుకాని దేనినైనను యిచ్చిన అది భగవంతునికొఱకే అనుకొనుట, ఇచ్చినది జపించినను, హోమము చేసినను అది భగవంతునికొఱకేయని చేయుట, ఈ ప్రకారముగా ఆత్మనివేదనము భగవంతుని గుఱించి చేసిన భగవంతునియందు భక్తి కలుగును - అప్పుడు ఆ భక్తునకు మిగిలినవేమియును లేవు - అన్ని పనులు భగవంతునికొఱకేచేయుచుండును.

  1. "శ్రీమద్భాగవతస్య శ్రీమద్భగవద్గీతాయాః శ్రీరామాయణ ప్రభృతీనాం గ్రంధానాం శ్రవణేన పఠనేనచ తధోపర్యుక్త దిశా సత్సంగస్య నామ జపస్య, నామ కీర్తనాదీనాంచ భక్తివర్థకానాం సత్కార్యాణాం భగవత్ప్రీత్యర్థమనుష్టానేన భక్తేర్వృద్ధిర్భవతి".

(శ్రీమద్భాగవతమును, శ్రీమద్భగవద్గీతను, శ్రీమద్రామాయణము మొదలగు గ్రంధములను వినుటచేతను, చదువుటచేతను, సత్సంగము, భగవంతుని నామజపము, నామకీర్తనము మొదలగు భక్తిని వృద్ధిచేయు సత్కర్మలను భగన్వంతునికి ప్రీతి కలిగించువాటిని భగవంతుని ప్రీతికొఱకే అనుష్ఠానము చేసిన యడల భక్తి వృద్ధియగును).

Transliteration

"bhakti prāptē sahāyakānāṃ karmaṇāṃ madhyē prathānāni –

1. ātmanaḥ varṇasya āśramasya ca dharmiṇāṃ yathā saṃbhavaṃ pūrṇatayā pālanaṃ brahmacāri vānaprasthasanyāsināṃ pakṣē tyāgapūrṇamābharaṇaṃ, gṛhasthasya ca pakṣē bhagavatprītyarthaṃ mātuḥpituḥ striyāḥ putrāṇāṃ parivāra prabhṛtīnāṃ āśrita janānāṃ prēma satkāra pūrvakaṃ pālanaṃ, nyāya satya purassaraṃ jīvana nirvāhaḥ, tathā śāstrōktāni yajña dāna tapāṃsi ityādi.

2. sadācārasya pālanaṃ

3. satsaṃgaḥ tathā bhagavadguṇānuvādasya śravaṇaṃ,ciṃtanaṃ, kīrtanaṃca.

4. bhagavannāmnāṃ japaḥ, smaraṇaṃ kīrtanaṃca

5. bhagavataḥ pūjanaṃ stutiḥ prārthanaṃ, namaskaraṇaṃca

6. satānāṃ bhaktānāṃ sēvā, tathā śraddhā pūrvakaṃ tēṣā mājñāyāḥ pālanaṃ

7. tīrtha sēvanaṃ

8. dīnēṣu prāṇiṣu dayā, tathā yathā saṃbhavaṃ tanvā, manasā, dhanēnaca tēṣāṃ sēvā

9. sarvakarmaṇāṃ bhagavatē samarpaṇaṃ

10. sarvēṣu prāṇiṣu bhagavataḥ darśanasya abhyāsaḥ "

(bhakti kuduruṭaku sahāyapaḍu karmalalō mukhyamainavi yī kriṃda ceppabaḍinavi –

(1). tanaku nirṇītamaina varṇāśrama dharmamulanu pūrtigā ācariṃcuṭa - brahmacaryāśramamaṃduṃḍuvāriki vāna prasthāśrama maṃduṃḍuvāriki, sanyāsāśramamaṃduṃḍuvāriki tyāgamu mukhyamu. gṛhasthāśrama maṃduṃḍuvāriki bhagavaṃtuni prītikoṟaku tallini, taṃḍrini, strīlanu, putrulanu, parivārajanulu modalagu tannāśrayiṃcu vāralanu prēmatō cūcuṭa. nyāyamugānu satyamugānu jīvitamunu gaḍupuṭa, śāstramulō ceppina yajñamulanu, dānamulanu, tapassulanu cēyuṭa modalagu karmalu.

(2). sadācāramu navalaṃbhiṃcuṭa

(3). satpuruṣula saṃgamu, bhagavaṃtuni anaṃtakalyāṇaguṇamula guṟiṃci vinuṭa, vāṭi guriṃci ciṃtiṃcuṭa, kīrtiṃcuṭa,

(4). bhagavaṃtuni nāmamulanu japiṃcuṭa, smariṃcuṭa, kīrtiṃcuṭa

(5). bhagavaṃtuni pūja, stōtramu cēyuṭa, prārthana cēyuṭa, bhagavaṃtuniki namaskariṃcuṭa

(6). satpuruṣulanu, bhagavaṃtuni bhaktulanu sēviṃcuṭa, śraddhatō vāri ājñalanu pāliṃcuṭa (vāru ceppina pani cēyuṭa)

(7). tīrthamulanu sēviṃcuṭa

(8). dīnulayina prāṇulaṃdu daya kaligiyuṃḍuṭa, manōkāya dhanamulatō vāriki cētanayinaṃta sahāyamu cēyuṭa

(9). samasta prāṇulaṃdu bhagavadbuddhi kaligiyuṃḍuṭa,

  1. samasta karmalanu bhagavaṃtuni karpiṃcuṭa. (samasta prāṇulu bhagavaṃtuḍē - bhagavaṃtuni rūpamulē vārini cūcina bhagavaṃtuni cūcinaṭlēyani bhāviṃcuṭa).

  2. "ślō||. śraddhāmṛtakathāyāṃ mē śaśvanmadanu kīrtanaṃ |

pariniṣṭhā ca pūjāyāṃ stutibhiḥ stavanaṃ mama |

ādaraḥ paricaryāyāṃ sarvāṃgairabhivaṃdanaṃ |

madbhakti pūjābhyadhikā sarvabhūtēṣu manmatiḥ |

madarthēṣvaṃgacēṣṭāca vacasā madguṇēraṇā |

mayyarpaṇaṃca manasaḥsarvanāma vivarjanaṃ |

madarthē artha parityāgē bhōgasya sukhasyaca |

iṣṭaṃ dattaṃ hutaṃ japtaṃ madarthaṃ yat vrataṃ tapaḥ |

ēvaṃ dharairmanuṣyāṇāṃ dhavātma nivēdanaṃ |

mayi saṃjāyatē bhaktiḥ kō anyō arthō asyāvatiṣyatē ||". (śrīmadbhāgavataṃ 11- 11- 11)

(bhagavaṃtuni amṛtarūpamaina kathalaṃdu śraddha kaligiyuṃḍuṭa, nityamu bhagavaṃtuni kīrtana cēyuṭa, bhagavaṃtuni pūjayaṃdu niṣṭa kaligiyuṃḍuṭa; bhagavaṃtuni stōtramulatō stutiṃcuṭa, bhagavaṃtuniki paricarya - sēva - cēyuṭayaṃdu ādaramu kaligiyuṃḍuṭa, bhagavaṃtuniki sāṣṭāṃga namaskāramu cēyuṭa, nāyaṃdu adhika bhakti kaligi yuṃḍuṭa, samasta bhūtamulu bhagavaṃtuḍē yanu abhiprāyamu kaligiyuṃḍuṭa, śarīramutō ē panicēsinanu adi aṃtayu bhagavaṃtuni koṟakē yani talaṃcuṭa, vākkucēta bhagavaṃtuni guṇamulanu pogaḍuṭa; manassuni bhagavaṃtuniyaṃdē, atani dhyānamaṃdē lagnamu cēsiyuṃcuṭa; annipērlanu viḍicipeṭṭuṭa; bhōgya vastuvukāni, sukhakaramaina vastuvukāni dēninainanu yiccina adi bhagavaṃtunikoṟakē anukonuṭa, iccinadi japiṃcinanu, hōmamu cēsinanu adi bhagavaṃtunikoṟakēyani cēyuṭa, ī prakāramugā ātmanivēdanamu bhagavaṃtuni guṟiṃci cēsina bhagavaṃtuniyaṃdu bhakti kalugunu - appuḍu ā bhaktunaku migilinavēmiyunu lēvu - anni panulu bhagavaṃtunikoṟakēcēyucuṃḍunu.

  1. "śrīmadbhāgavatasya śrīmadbhagavadgītāyāḥ śrīrāmāyaṇa prabhṛtīnāṃ graṃdhānāṃ śravaṇēna paṭhanēnaca tadhōparyukta diśā satsaṃgasya nāma japasya, nāma kīrtanādīnāṃca bhaktivarthakānāṃ satkāryāṇāṃ bhagavatprītyarthamanuṣṭānēna bhaktērvṛddhirbhavati".

(śrīmadbhāgavatamunu, śrīmadbhagavadgītanu, śrīmadrāmāyaṇamu modalagu graṃdhamulanu vinuṭacētanu, caduvuṭacētanu, satsaṃgamu, bhagavaṃtuni nāmajapamu, nāmakīrtanamu modalagu bhaktini vṛddhicēyu satkarmalanu bhaganvaṃtuniki prīti kaligiṃcuvāṭini bhagavaṃtuni prītikoṟakē anuṣṭhānamu cēsina yaḍala bhakti vṛddhiyagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.