(భగవంతుని భక్తి చేయుట చాలా సులభము - ఎందుచేతననగా - భక్తి కుదురుటకు జ్ఞానము (భగవత్ జ్ఞానము) అవసరములేదు, - ధనము అవసరములేదు; శ్రేష్టులకులములోనే పుట్టవలసిన అవసరములేదు. గొప్పవర్ణమందు పుట్టవలసిన అవసరములేదు, - గొప్ప ఆశ్రయమందుండవలసిన అవసరములేదు, - వేదాధ్యయనము చేయవలసిన అవసరములేదు, - కఠోరమైన తపస్సు చేయనక్కరలేదు, - ఆత్మానాత్మ వివేకము గాని, కఠిన వైరాగ్యముకాని అవసరములేదు. కేవలము సరల భావముతో భగవంతుని యొక్క మితిలేని దయయందు నమ్మకముంచి అతనిని ఎల్లపుడు ప్రేమ భావముతో స్మరించువానికి భగవంతుని యొక్క భక్తి యెంత సులభమో ప్రత్యక్షముగానే తెలియును - భగవంతుని దయ అందరియందును ఎల్లపుడు వర్షమువలె కురియును - మనుష్యునకు దానియందు మట్టుకు విశ్వాసములేదు. కనుకనే మనుష్యుడు వంచింపబడును - సమస్త భూతములకు సుహృదుడు - సమస్త భూతములయడల మంచి హృదయముకలవాడు - స్నేహభావము గలవాడు, దయగలవాడు భగవంతుడు అని తెలుసుకొనినయడల శాంతిని పొందును - శాశ్వతమైన సుఖరూపమైన మోక్షమును పొందును).
("నామీద భగవంతుని దయ అన్నిచోట్లను, అన్ని కాలములందు పూర్తిగా నున్నది : అని యీ ప్రకారముగా భగవంతుని దయయందు నిశ్చయమైన నమ్మకము కలిగి, ఇతరముమాని, భగవంతుని స్మరణయే అభ్యాసము చేసుకొని, ఏ సమయములోనైనను, ఏ అవస్థలోనున్నను బాలుడుగాని, వృద్ధుడుగాని, యువకుడుగాని, స్త్రీగాని, పురుషుడుకాని, బ్రాహ్మణుడుకాని, శూద్రుడుకాని ఎవరైనను చేయవచ్చును - ఈ విషయములో ఇది గ్రహించతగినది, ఇది గ్రహించతగనిది యనునది లేదు).
భగవంతునియందు భక్తి సలుపుటకు ధనవంతుడగుట అవసరములేదు - ఎంత బీదవాడైనను, అతనికి అనాయాసముగా దొరుకు వస్తువేదైన - ఫలమైనను, పుష్పమైనను, జలము అయినను, ఆకు, అలము, మరేదైనను భక్తితో సమర్పించినచాలును. భక్తి ముఖ్యముకాని, భగవంతునికిచ్చు వస్తువుయొక్క విలువ ముఖ్యముకాదు - అందుచేత భగవంతునియందు భక్తి సలుపుట చాల సులభము - (చూడుము - "భక్తి మహాత్మ్యము - 6").
ఏ పని చేసినను దానిని "కృష్ణార్పణమని" చెప్పిన చాలును - (చూడుము - భక్తి ప్రకారము - 2).
" రామాన్నాస్తి జగత్రయైక శులభో " (శ్రీరామకర్ణామృతం - 1 - 24)
(bhagavaṃtuni bhakti cēyuṭa cālā sulabhamu - eṃducētananagā - bhakti kuduruṭaku jñānamu (bhagavat jñānamu) avasaramulēdu, - dhanamu avasaramulēdu; śrēṣṭulakulamulōnē puṭṭavalasina avasaramulēdu. goppavarṇamaṃdu puṭṭavalasina avasaramulēdu, - goppa āśrayamaṃduṃḍavalasina avasaramulēdu, - vēdādhyayanamu cēyavalasina avasaramulēdu, - kaṭhōramaina tapassu cēyanakkaralēdu, - ātmānātma vivēkamu gāni, kaṭhina vairāgyamukāni avasaramulēdu. kēvalamu sarala bhāvamutō bhagavaṃtuni yokka mitilēni dayayaṃdu nammakamuṃci atanini ellapuḍu prēma bhāvamutō smariṃcuvāniki bhagavaṃtuni yokka bhakti yeṃta sulabhamō pratyakṣamugānē teliyunu - bhagavaṃtuni daya aṃdariyaṃdunu ellapuḍu varṣamuvale kuriyunu - manuṣyunaku dāniyaṃdu maṭṭuku viśvāsamulēdu. kanukanē manuṣyuḍu vaṃciṃpabaḍunu - samasta bhūtamulaku suhṛduḍu - samasta bhūtamulayaḍala maṃci hṛdayamukalavāḍu - snēhabhāvamu galavāḍu, dayagalavāḍu bhagavaṃtuḍu ani telusukoninayaḍala śāṃtini poṃdunu - śāśvatamaina sukharūpamaina mōkṣamunu poṃdunu).
("nāmīda bhagavaṃtuni daya annicōṭlanu, anni kālamulaṃdu pūrtigā nunnadi : ani yī prakāramugā bhagavaṃtuni dayayaṃdu niścayamaina nammakamu kaligi, itaramumāni, bhagavaṃtuni smaraṇayē abhyāsamu cēsukoni, ē samayamulōnainanu, ē avasthalōnunnanu bāluḍugāni, vṛddhuḍugāni, yuvakuḍugāni, strīgāni, puruṣuḍukāni, brāhmaṇuḍukāni, śūdruḍukāni evarainanu cēyavaccunu - ī viṣayamulō idi grahiṃcataginadi, idi grahiṃcataganidi yanunadi lēdu).
bhagavaṃtuniyaṃdu bhakti salupuṭaku dhanavaṃtuḍaguṭa avasaramulēdu - eṃta bīdavāḍainanu, ataniki anāyāsamugā doruku vastuvēdaina - phalamainanu, puṣpamainanu, jalamu ayinanu, āku, alamu, marēdainanu bhaktitō samarpiṃcinacālunu. bhakti mukhyamukāni, bhagavaṃtunikiccu vastuvuyokka viluva mukhyamukādu - aṃducēta bhagavaṃtuniyaṃdu bhakti salupuṭa cāla sulabhamu - (cūḍumu - "bhakti mahātmyamu - 6").
ē pani cēsinanu dānini "kṛṣṇārpaṇamani" ceppina cālunu - (cūḍumu - bhakti prakāramu - 2).
" rāmānnāsti jagatrayaika śulabhō " (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 24)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.