← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భక్తి విధములు bhakti vidhamulu

Original — తెలుగు
  1. భక్తిర్వివిధా - గౌణీ, ముఖ్యా చ ఇతి తత్ర ఈశ్వర విషయికానురాగాఖ్య చిత్తవృత్తి విశేషో ముఖ్య భక్తిః.

(భక్తి రెండు విధములు - గౌణ భక్తి, ముఖ్య భక్తి. అంతరంగమందు - మనస్సులో - ఈశ్వరునికి (భగవంతునికి) సంబంధించిన ప్రేమ కలిగియుండుట ముఖ్యభక్తి. బాహ్యమందు తన ఇష్ట దైవమును గుఱించి చేయు సేవ, భజన, నామస్మరణము మొదలగునవి గౌణీ భక్తి).

  1. భక్తి సామాన్యమనియు విశేషమనియు రెండు విధములు. భగవంతుని పువ్వులతో పూజ చేయుట, ధూప, దీప, నైవేద్యములు మొదలగు షోడశోప చారములు చేయుట, భగవంతుని ఆలయములోని విగ్రహములను దర్శించుట, తీర్థయాత్రలు చేయుట, మొదలగునవి - బాహ్యేంద్రీయములతో చేయుచేష్టలు సామాన్య భక్తి. శ్రీమద్భగవద్గీత - అధ్యాయము - 12 లో చెప్పిన ప్రకారము - "అద్వేష్టా సర్వభూతానాం" అను మొదలగు లక్షణములు గలిగియుండుట విశేష భక్తి). (చూడుము - భక్తి లక్షణములు - 16).

  2. గుణ భేదాన్మనుష్యాణః సాభక్తిః త్రివిధా మతా - మనుష్య సంబంధినాం గుణానాం సత్వరజస్తమో రూపాణాం భేదాత్ భక్తిరపి త్రివిధా

(దేవీభాగవతం)

(మనుష్యులకు సంబంధించిన సత్వరజస్తమములను త్రిగుణముల భేదము ననుసరించి భక్తి మూడు విధములు.

"క. నలినాయతాక్షి, విను, జన

ముల ఫలసంకల్ప భేదమునజేసి మదిం

గల భక్తి యోగ మహిమం

బలవడగ ననేకవిధములనదగు నవియున్".

వ. 'వివరించెద - దామస, రాజస సాత్వికాది భేదంబులన్ ద్రివిధంబై యుండు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 948, 949)

  1. భక్తి మూడు విధములు –

(1) బాహ్య భక్తి - పరోక్షజ్ఞానము కలిగించునది - పరబ్రహ్మ ఉన్నాడను జ్ఞానము కలిగించునది.

(2) అనన్య భక్తి - అపరోక్షజ్ఞానము కలిగించునది, జీవ బ్రహ్మైక్యజ్ఞానమును కలిగించునది

(3) ఏకాంత భక్తి - పరమాత్మ స్వరూపమగు పరమానందము కలుగచేయునది; భగన్వంతుడు, అతని శక్తి ఒకటేయని ధ్యానించుట.

  1. త్రిగుణ నిర్గుణ భేదేన చతుర్విధం -

(పైన చెప్పిన త్రిగుణములకు సంబంధించిన భక్తియే కాక నాలుగవది నిర్గుణ భక్తి - సత్వరజస్తమోగుణములే మూర్తివంతములైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులందుకాక, వారికి పరమమందుండు నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించుట).

  1. భక్తి తొమ్మిది విధములు : -

"శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం పాదసేవనం |

అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యం ఆత్మ నివేదనం ||". (శ్రీమద్భాగవతం - 7 - 23)

“మ. తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా

ర్చనముల్, సేవయు, ఆత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం

బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 52 - 167)

("భగవంతునియొక్క నామరూప లీలా గుణ ప్రభావ తత్వ రహస్యములను గుఱించి చెప్పుచుండగా వినుట శ్రవణ భక్తి, నోటితో భగవంతుని యొక్క కథలు చెప్పుట, కీర్తించుట కీర్తనభక్తి; ఆ ప్రకారముగా మనసులో మననము చేయుట స్మరణ భక్తి; భగవంతునియొక్క సగుణ సాకార స్వరూపము యొక్క పాదుకలను సేవించుట, పాదములను సేవించుట, చరణామృతమును - శ్రీపాదతీర్థమును - సేవించుట పాదధూళి ధరించుటపాదసేవనాభక్తి, భగవంతుడు నా స్వామి, నేను అతని సేవకుడను అని భావించుట దాస్యభక్తి; భగవంతుడు నామిత్రుడు, నేను భగవంతునికి మిత్రుడను అని భావించుట సఖ్య భక్తి; భగవంతునికి తన మనస్సు, ధనము, సర్వస్యము సమర్పించుట ఆత్మ నివేదనము).

  1. "మద్భక్తజన వాత్సల్యం పూజాయాంచాను మోదనం |

స్వయమభ్యర్చనం చైవ మదర్థేదంభ వర్జనం |

మత్కథా శ్రవణే భక్తిః సర్వ నేత్రాంగ విక్రియా |

మమానుస్మరణం నిత్యమ్యచ్చమాముప జీవతి |

భక్తిరష్ట విధ్యాహ్యేషా యస్మిన్ మ్లేచ్ఛేపి వర్తతే |

స విప్రేంద్రస్సచ శ్రీమాన్ స యతిః స పండితః | (చూడుము - " భక్తి లక్షణములు -7 ").

  1. భక్తి పది విధములు : -

"గుణమహాత్మ్యాసక్తి, రూపాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి, కాంతాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయతాసక్తి, పరమ విరహాసక్తి రూపై కథాప్యేకాదశ థా భవతి ". (నారదభక్తిసూత్రము - 82)

(భక్తి ఒకటే అయినను పదివిధములుగా నున్నది.

1. గుణమహాత్మ్యాసక్తి - భగవంతుని గుణములందు, వాటి మహత్మ్యమునందు ఆసక్తి కలిగియుండుట. ఉదాహరణకు - నారదమహర్షి, వ్యాసమహర్షి - భగవంతుని కల్యాణగుణములను కీర్తించుట.

2. రూపాసక్తి - భగవంతుని దివ్యమంగళ విగ్రహమందు - కోటి కోటి మన్మధుల సౌందర్యముగల శ్రీభగవానుని - శ్రీకృష్ణుని - శరీరమందలి ప్రీతి - ఉదహరణకు - గోపికా స్త్రీలు.

3. పూజాసక్తి - భగవంతుని పూజ యందాసక్తి కలిగియుండుట - ఉదాహరణకు - అంబరీషుడు -

"వైష్ణవార్చనల మేరన్ కాలమున్ పుచ్చుచున్

తృప్తిం బొందక యొప్పె సద్గుణగరిష్టుండంబరీషుండిలన్". (శ్రీమదాంధ్రమభాగవతము - -)

స్మరణా సక్తి - భగవంతుని నిత్యము స్మరించుట యందాసక్తి కలిగియుండుట - ఉదాహరణకు - ప్రహ్లాదుడు,

"చక్రి చింతలేని జన్మంబు జన్మమే" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 170)

దాస్యాసక్తి - భగవంతుని దాసుడుగా నుండుట - ఉదాహరణ - హనుమంతుడు; రుక్మిణి –

"నీకు దాస్యంబు చేయని | జన్మమేల యెన్ని జన్మములకు " - (శ్రీమదాంధ్రమహాభాగవతము - -)

సఖ్యాసక్తి - ఉదాహరణకు ఉద్దవుడు, - బాల్య స్నేహితుడు, అర్జునుడు –

"సుఖేతి మత్వా" - (శ్రీమద్భగవద్గీత - )

వాత్సల్యాసక్తి - పిల్లల యందు తలిదండ్రులకు కలుగు ప్రేమ - ఉదాహరణకు - కౌసల్య, దేవకి. కాంతాసక్తి - భర్తయడల కలుగు ప్రేమ - ఉదాహరణకు - రుక్మిణి-

"వ్రతముల్ దేవ గురుద్విజన్మ బుధ సేవల్, దాన ధర్మాదులున్

గత జన్మంబుల హరి జగత్కల్యాణు కాంక్షించి చేసితినేనిన్

- - - నా చిత్తేశుడౌగాక, ని

ర్జితులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - -)

ఆత్మ నివేదనాసక్తి - ఆత్మార్పణము చేయుట - ఉదాహరణకు - బలిచక్రవర్తి –

"నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలంబైనపో

హరుడైనన్ హరియైన, నీరజ భవుండభ్యాగతుండైననౌ

దిరుగన్నేరదు నాది జిహ్వ వినుమీ, ధీవర్య వేయేటికిన్ ". (శ్రీమదాంధ్రమహాబహాగవతము - - )

తన్మయతాసక్తి - ఉదాహరణకు - సనకసనందనాదులు - నిత్యము హరిభక్తియందు తన్మయులై యుండువారు. పరమవిరహాసక్తి - ఉదాహరణకు - గోపికలు శ్రీకృష్ణుడు అదృశ్యుడైనప్పుడు –

"మ. అని ఇబ్భంగి లతాంగులందఱును బృందారణ్యమందీశ్వరున్

వనజాక్షుం బరికించి కానక విభున్ వర్ణించుచున్ బాడుచున్

మనముల్ మాటలు జేష్టలుం గ్రియలు యమ్మానాదుపై జేర్చి, వే

చనిరయ్యామున సైకతాగ్రమునకున్ సత్యక్త గేహేచ్ఛలై". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. 1037).

  1. "శ్లో||. కథాశ్రుతేః పరీక్షిచ్చ, కథ గానాచ్చ నారదః |

నామ స్మృతేచ్చ ప్రహ్లాదో, గురుత్మాన్ వందనేనచ |

పాదసేవేన సౌమిత్రిః అంబరీషో (అ)ర్చనేనచ |

దాస్యేన చ హనుమాన్, బద్ధ సఖ్యేన చ ధనంజయః |

ఆత్మార్పణేన గోప్యశ్చ క్రమాన్ ముక్తిముపా గతిః ||".

(భగవంతుని యొక్క కథలు వినుటచేత పరీక్షిత్తు, హరికథలను గానము చేయుటచేత నారదుడు, భగవంతుని నామము కీర్తించుటచేత ప్రహ్లాదుడు, వందనముచే గరుత్మంతుడు, పాదసేవచే లక్ష్మణుడు, భగవంతుని అర్చించుటచేత అంబరీషుడు, దాస్యముచే హనుమంతుడు, సఖ్యముచే అర్జునుడు, ఆత్మ సమర్పణచే గోపికలు ముక్తిపొందిరి).

  1. "తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరిః సర్వత్రి సర్వదా |

శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ, స్మర్తివ్యో భగవాన్ నృణాం ||". (శ్రీమద్భాగవతం - 2 - 2 - 26)

(ఎల్లపుడు, ఎక్కడున్నను భగవంతుని చరిత్రను వినవలెను, కీర్తించవలెను, స్మరణము చేసుకొనవలెను).

  1. "భక్తిః ప్రేమలక్షణా పరేశాను భవః - ప్రేమాస్పద భగవద్రూపస్య స్ఫూర్తిః - తయా నిర్వృతస్య తతో అన్యత్ర గృహాదిషు విరక్తిః ఇత్యేషః త్రికః ఏక కాలః భజనసమకాల ఏవస్యాత్ - యథా అశ్నితం భుం జానస్య తుష్టిః సుఖం పుష్టిః ఉదరపూరణం క్షుదపాయః క్షున్ని వృత్తిశ్చ ప్రతిగ్రాసం స్యాత్, తద్వత్, ఏకైకస్మిన్ భజనే కించిత్ కించిత్ ప్రేమాది త్రికే జాయమానే అనువృత్యా భజతః పరమ ప్రేమాదిసర్వం జాయతే, బహుగ్రాసభోజన ఇవ పరమతుష్ట్యాది ".

(భగవంతుని యందు ప్రేమరూపమైన భక్తి, అట్టి ప్రేమకు ఆస్పదుడైన భగవంతుని రూపము స్ఫురించుట (అనుభవించుట), భగవంతునిమీద కాక గృహము మొదలగువాటియందు విరక్తి పొందుట - ఈ మూడును భజనకాలమందే - ఒకే కాలమందు, ఒకే మాటు, కలుగును, - ఎట్లనగా - భోజనము చేయునపుడు, భోజనమువలన కలుగు సుఖము, కడుపునిండుట, ఆకలి తీరుట అనునవి మూడును ఒకేమాటు కలుగునట్లు. ఒక్కొక్క మారు భజనచేయునపుడు కొంచెము, కొంచెము భగవంతుని మీద ప్రేమ మొదలగు నీ మూడును భోజనమువలన కలుగు తుష్టి, పుష్టి, ఆకలితీరుట వలనేకలుగుచుండును).

  1. "ప్రణవపూర్వకంబుగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణానిరుద్ధ మూర్తి నామంబులునాలుగు భక్తిం బలికి, నమస్కారంబు సేసి, మంత్రిమూర్తియు, మూర్తి శూన్యుండు నయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు ".

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - )

  1. "జ్ఞానమార్గీయ, భక్తిమార్గీయ యోః అనావృత్తౌ తుల్యత్వేపి ఫలప్రాప్తే వైలక్షణ్యాత్".

(జ్ఞానాదేః సకాశాత్ భక్తిమార్గే ఫలతోప్యుత్కర్ష మాహ. జ్ఞానాది సాధనవత్సు అనుగ్రహో ముక్తి పర్యంత ఏవ. భక్తి మార్గేతు విశేషణరూపో ముక్తాది భ్యోపి భక్తానాం వ్యావర్తికో భగవదనుగ్రహః స్మర్యతే - ").

(పునర్జన్మ లేకుండ చేయుటలో జ్ఞానమార్గము భక్తి మార్గము సమానమే అయినను ఫలప్రాప్తి లక్షణము వేరు. ఇట్లు చెప్పుటవలన జ్ఞానమార్గముకన్న భక్తిమార్గము ఫలమునిచ్చుటలో గొప్పదియని చెప్పబడినది. జ్ఞానమార్గము మొదలగు సాధనములందు ముక్తి వరకే అనుగ్రహము - భక్తిమార్గమందు విశేషముకలదు - ముక్తులయిన భక్తులకు కూడ భగవంతుని అనుగ్రహము కలదు).

  1. "యథా అద్రేః సకాశాత్ సర్వతః ప్రభవంతియాః నద్యః తాః పునః పర్జన్యేనాపూరితాః బహు శ్రోతసః సత్య ః సర్వతః సిందుమేవ విశంతి, తద్వత్ సర్వభక్తిమార్గాః సర్వగతయః అంతతః భగవంతమేవ విశంతి".

(కొండనుండి అనేకచోట్లనుండి పుట్టిన నదులు మేఘములవలన నిండినవై అనేకనదులుగా మారి - వేరు వేరు మార్గములుగా పారి సముద్రమునే కలియు చున్నవి. ఆ ప్రకారముగానే అనేక విధములుగా నున్నను భక్తిమార్గ ములన్నియు ఆఖరున భగవంతునేచేరుచున్నవి. భక్తిమార్గము లన్నింటికి ధ్యేయమగు వస్తువు ఒకటే యైన భగవంతుడు).

  1. "ధర్మార్థకామమోక్షేషు నేచ్ఛామమ కదాచన |

త్వత్పాద పంకజాస్వాద జీవితం దీయతాం మమ ||". (నారదపాంచరాత్రము)

(ధర్మము, అర్థము, కామము, మోక్షము అను నాలుగు విధములగు పురుషార్థములందును నాకు కోరిక లేదు - నీ పాదపద్మముల నాస్వాదించు జీవితమునే నాకిమ్ము - నీ భక్తుడుగా నుండుటయే నా కోరిక).

"చ. అమలిన భక్తి గొందఱు మహాత్ములు మచ్చరణారవింద యు

గ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై యితరేతాను లా

పముల మదీయ దివ్యతను పౌరుషముల్ గొనియాడుచుండి, మో

క్షము మదిగోరనొల్ల రనిశంబు మదర్పిత సర్వ కర్ములై". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 874)

(కొందఱు భక్తులు మోక్షము నొల్లక భక్తులుగానే యుండుట కోరుదురు).

  1. "యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామీయాత్ |

న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితామతిః ||". (శ్రీమద్భాగవతం - - )

(నీపై వైరము కలిగియుండుటవలన, నిన్నే నిత్యము తలచుచుండుటవలన నీ వైరులగు కంస, హిరణ్యకశిపముఖ్యులకు - నీ తన్మయత్వము కలిగినట్లు భక్తియోగముచేత భక్తులకు కలుగదని నా అభిప్రాయము).

  1. "శ్లో|. గోప్యః కామాత్ భయాత్ కంసో ద్వేషా చ్ఛేద్యాదయో నృపాః |

సంబంధా ద్వృష్ణయః స్నేహా ద్యూయం భక్త్యావయం విభో ||". (శ్రీమద్భాగవతం - - )

"కామోత్కంఠిత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా

సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్.సంబంధులైవృష్ణులుం

బ్రేమన్ మీరలు, భక్తినేమునిదె చక్రిం గంటి మెట్లైన ను

ద్ధామ ధ్యాన గరిష్టుడైన హరిచెందన్ వచ్చు, ధాత్రీశ్వరా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 18)

  1. "క. నీపాదకమలసేవయు,

నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాం

తాపాత భూతదయ యును

తాపసమందార, నాకు దయసేయ గదే ||".

Transliteration
  1. bhaktirvividhā - gauṇī, mukhyā ca iti tatra īśvara viṣayikānurāgākhya cittavṛtti viśēṣō mukhya bhaktiḥ.

(bhakti reṃḍu vidhamulu - gauṇa bhakti, mukhya bhakti. aṃtaraṃgamaṃdu - manassulō - īśvaruniki (bhagavaṃtuniki) saṃbaṃdhiṃcina prēma kaligiyuṃḍuṭa mukhyabhakti. bāhyamaṃdu tana iṣṭa daivamunu guṟiṃci cēyu sēva, bhajana, nāmasmaraṇamu modalagunavi gauṇī bhakti).

  1. bhakti sāmānyamaniyu viśēṣamaniyu reṃḍu vidhamulu. bhagavaṃtuni puvvulatō pūja cēyuṭa, dhūpa, dīpa, naivēdyamulu modalagu ṣōḍaśōpa cāramulu cēyuṭa, bhagavaṃtuni ālayamulōni vigrahamulanu darśiṃcuṭa, tīrthayātralu cēyuṭa, modalagunavi - bāhyēṃdrīyamulatō cēyucēṣṭalu sāmānya bhakti. śrīmadbhagavadgīta - adhyāyamu - 12 lō ceppina prakāramu - "advēṣṭā sarvabhūtānāṃ" anu modalagu lakṣaṇamulu galigiyuṃḍuṭa viśēṣa bhakti). (cūḍumu - bhakti lakṣaṇamulu - 16).

  2. guṇa bhēdānmanuṣyāṇaḥ sābhaktiḥ trividhā matā - manuṣya saṃbaṃdhināṃ guṇānāṃ satvarajastamō rūpāṇāṃ bhēdāt bhaktirapi trividhā

(dēvībhāgavataṃ)

(manuṣyulaku saṃbaṃdhiṃcina satvarajastamamulanu triguṇamula bhēdamu nanusariṃci bhakti mūḍu vidhamulu.

"ka. nalināyatākṣi, vinu, jana

mula phalasaṃkalpa bhēdamunajēsi madiṃ

gala bhakti yōga mahimaṃ

balavaḍaga nanēkavidhamulanadagu naviyun".

va. 'vivariṃceda - dāmasa, rājasa sātvikādi bhēdaṃbulan drividhaṃbai yuṃḍu" (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 948, 949)

  1. bhakti mūḍu vidhamulu –

(1) bāhya bhakti - parōkṣajñānamu kaligiṃcunadi - parabrahma unnāḍanu jñānamu kaligiṃcunadi.

(2) ananya bhakti - aparōkṣajñānamu kaligiṃcunadi, jīva brahmaikyajñānamunu kaligiṃcunadi

(3) ēkāṃta bhakti - paramātma svarūpamagu paramānaṃdamu kalugacēyunadi; bhaganvaṃtuḍu, atani śakti okaṭēyani dhyāniṃcuṭa.

  1. triguṇa nirguṇa bhēdēna caturvidhaṃ -

(paina ceppina triguṇamulaku saṃbaṃdhiṃcina bhaktiyē kāka nālugavadi nirguṇa bhakti - satvarajastamōguṇamulē mūrtivaṃtamulaina brahma viṣṇu mahēśvarulaṃdukāka, vāriki paramamaṃduṃḍu nirguṇa parabrahmanu dhyāniṃcuṭa).

  1. bhakti tommidi vidhamulu : -

"śravaṇaṃ, kīrtanaṃ, viṣṇōḥ smaraṇaṃ pādasēvanaṃ |

arcanaṃ, vaṃdanaṃ, dhyānaṃ, sakhyaṃ ātma nivēdanaṃ ||". (śrīmadbhāgavataṃ - 7 - 23)

“ma. tanuhṛdbhāṣala sakhyamun, śravaṇamun, dāsatvamun, vaṃdanā

rcanamul, sēvayu, ātmalō neṟukayun, saṃkīrtanal, ciṃtanaṃ

banu nī tommidi bhakti mārgamula sarvātmun harinnammi - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 52 - 167)

("bhagavaṃtuniyokka nāmarūpa līlā guṇa prabhāva tatva rahasyamulanu guṟiṃci ceppucuṃḍagā vinuṭa śravaṇa bhakti, nōṭitō bhagavaṃtuni yokka kathalu ceppuṭa, kīrtiṃcuṭa kīrtanabhakti; ā prakāramugā manasulō mananamu cēyuṭa smaraṇa bhakti; bhagavaṃtuniyokka saguṇa sākāra svarūpamu yokka pādukalanu sēviṃcuṭa, pādamulanu sēviṃcuṭa, caraṇāmṛtamunu - śrīpādatīrthamunu - sēviṃcuṭa pādadhūḷi dhariṃcuṭapādasēvanābhakti, bhagavaṃtuḍu nā svāmi, nēnu atani sēvakuḍanu ani bhāviṃcuṭa dāsyabhakti; bhagavaṃtuḍu nāmitruḍu, nēnu bhagavaṃtuniki mitruḍanu ani bhāviṃcuṭa sakhya bhakti; bhagavaṃtuniki tana manassu, dhanamu, sarvasyamu samarpiṃcuṭa ātma nivēdanamu).

  1. "madbhaktajana vātsalyaṃ pūjāyāṃcānu mōdanaṃ |

svayamabhyarcanaṃ caiva madarthēdaṃbha varjanaṃ |

matkathā śravaṇē bhaktiḥ sarva nētrāṃga vikriyā |

mamānusmaraṇaṃ nityamyaccamāmupa jīvati |

bhaktiraṣṭa vidhyāhyēṣā yasmin mlēcchēpi vartatē |

sa viprēṃdrassaca śrīmān sa yatiḥ sa paṃḍitaḥ | (cūḍumu - " bhakti lakṣaṇamulu -7 ").

  1. bhakti padi vidhamulu : -

"guṇamahātmyāsakti, rūpāsakti, smaraṇāsakti, dāsyāsakti, sakhyāsakti, vātsalyāsakti, kāṃtāsakti, ātmanivēdanāsakti, tanmayatāsakti, parama virahāsakti rūpai kathāpyēkādaśa thā bhavati ". (nāradabhaktisūtramu - 82)

(bhakti okaṭē ayinanu padividhamulugā nunnadi.

1. guṇamahātmyāsakti - bhagavaṃtuni guṇamulaṃdu, vāṭi mahatmyamunaṃdu āsakti kaligiyuṃḍuṭa. udāharaṇaku - nāradamaharṣi, vyāsamaharṣi - bhagavaṃtuni kalyāṇaguṇamulanu kīrtiṃcuṭa.

2. rūpāsakti - bhagavaṃtuni divyamaṃgaḷa vigrahamaṃdu - kōṭi kōṭi manmadhula sauṃdaryamugala śrībhagavānuni - śrīkṛṣṇuni - śarīramaṃdali prīti - udaharaṇaku - gōpikā strīlu.

3. pūjāsakti - bhagavaṃtuni pūja yaṃdāsakti kaligiyuṃḍuṭa - udāharaṇaku - aṃbarīṣuḍu -

"vaiṣṇavārcanala mēran kālamun puccucun

tṛptiṃ boṃdaka yoppe sadguṇagariṣṭuṃḍaṃbarīṣuṃḍilan". (śrīmadāṃdhramabhāgavatamu - -)

smaraṇā sakti - bhagavaṃtuni nityamu smariṃcuṭa yaṃdāsakti kaligiyuṃḍuṭa - udāharaṇaku - prahlāduḍu,

"cakri ciṃtalēni janmaṃbu janmamē" (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 170)

dāsyāsakti - bhagavaṃtuni dāsuḍugā nuṃḍuṭa - udāharaṇa - hanumaṃtuḍu; rukmiṇi –

"nīku dāsyaṃbu cēyani | janmamēla yenni janmamulaku " - (śrīmadāṃdhramahābhāgavatamu - -)

sakhyāsakti - udāharaṇaku uddavuḍu, - bālya snēhituḍu, arjunuḍu –

"sukhēti matvā" - (śrīmadbhagavadgīta - )

vātsalyāsakti - pillala yaṃdu talidaṃḍrulaku kalugu prēma - udāharaṇaku - kausalya, dēvaki. kāṃtāsakti - bhartayaḍala kalugu prēma - udāharaṇaku - rukmiṇi-

"vratamul dēva gurudvijanma budha sēval, dāna dharmādulun

gata janmaṃbula hari jagatkalyāṇu kāṃkṣiṃci cēsitinēnin

- - - nā cittēśuḍaugāka, ni

rjitulai pōdurugāka saṃgaramulō cēdīśa mukhyādhamul". (śrīmadāṃdhramahābhāgavatamu - -)

ātma nivēdanāsakti - ātmārpaṇamu cēyuṭa - udāharaṇaku - balicakravarti –

"nirayaṃbaina nibaddhamaina dharaṇī nirmūlaṃbainapō

haruḍainan hariyaina, nīraja bhavuṃḍabhyāgatuṃḍainanau

dirugannēradu nādi jihva vinumī, dhīvarya vēyēṭikin ". (śrīmadāṃdhramahābahāgavatamu - - )

tanmayatāsakti - udāharaṇaku - sanakasanaṃdanādulu - nityamu haribhaktiyaṃdu tanmayulai yuṃḍuvāru. paramavirahāsakti - udāharaṇaku - gōpikalu śrīkṛṣṇuḍu adṛśyuḍainappuḍu –

"ma. ani ibbhaṃgi latāṃgulaṃdaṟunu bṛṃdāraṇyamaṃdīśvarun

vanajākṣuṃ barikiṃci kānaka vibhun varṇiṃcucun bāḍucun

manamul māṭalu jēṣṭaluṃ griyalu yammānādupai jērci, vē

canirayyāmuna saikatāgramunakun satyakta gēhēcchalai". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. 1037).

  1. "ślō||. kathāśrutēḥ parīkṣicca, katha gānācca nāradaḥ |

nāma smṛtēcca prahlādō, gurutmān vaṃdanēnaca |

pādasēvēna saumitriḥ aṃbarīṣō (a)rcanēnaca |

dāsyēna ca hanumān, baddha sakhyēna ca dhanaṃjayaḥ |

ātmārpaṇēna gōpyaśca kramān muktimupā gatiḥ ||".

(bhagavaṃtuni yokka kathalu vinuṭacēta parīkṣittu, harikathalanu gānamu cēyuṭacēta nāraduḍu, bhagavaṃtuni nāmamu kīrtiṃcuṭacēta prahlāduḍu, vaṃdanamucē garutmaṃtuḍu, pādasēvacē lakṣmaṇuḍu, bhagavaṃtuni arciṃcuṭacēta aṃbarīṣuḍu, dāsyamucē hanumaṃtuḍu, sakhyamucē arjunuḍu, ātma samarpaṇacē gōpikalu muktipoṃdiri).

  1. "tasmāt sarvātmanā rājan hariḥ sarvatri sarvadā |

śrōtavyaḥ kīrtitavyaśca, smartivyō bhagavān nṛṇāṃ ||". (śrīmadbhāgavataṃ - 2 - 2 - 26)

(ellapuḍu, ekkaḍunnanu bhagavaṃtuni caritranu vinavalenu, kīrtiṃcavalenu, smaraṇamu cēsukonavalenu).

  1. "bhaktiḥ prēmalakṣaṇā parēśānu bhavaḥ - prēmāspada bhagavadrūpasya sphūrtiḥ - tayā nirvṛtasya tatō anyatra gṛhādiṣu viraktiḥ ityēṣaḥ trikaḥ ēka kālaḥ bhajanasamakāla ēvasyāt - yathā aśnitaṃ bhuṃ jānasya tuṣṭiḥ sukhaṃ puṣṭiḥ udarapūraṇaṃ kṣudapāyaḥ kṣunni vṛttiśca pratigrāsaṃ syāt, tadvat, ēkaikasmin bhajanē kiṃcit kiṃcit prēmādi trikē jāyamānē anuvṛtyā bhajataḥ parama prēmādisarvaṃ jāyatē, bahugrāsabhōjana iva paramatuṣṭyādi ".

(bhagavaṃtuni yaṃdu prēmarūpamaina bhakti, aṭṭi prēmaku āspaduḍaina bhagavaṃtuni rūpamu sphuriṃcuṭa (anubhaviṃcuṭa), bhagavaṃtunimīda kāka gṛhamu modalaguvāṭiyaṃdu virakti poṃduṭa - ī mūḍunu bhajanakālamaṃdē - okē kālamaṃdu, okē māṭu, kalugunu, - eṭlanagā - bhōjanamu cēyunapuḍu, bhōjanamuvalana kalugu sukhamu, kaḍupuniṃḍuṭa, ākali tīruṭa anunavi mūḍunu okēmāṭu kalugunaṭlu. okkokka māru bhajanacēyunapuḍu koṃcemu, koṃcemu bhagavaṃtuni mīda prēma modalagu nī mūḍunu bhōjanamuvalana kalugu tuṣṭi, puṣṭi, ākalitīruṭa valanēkalugucuṃḍunu).

  1. "praṇavapūrvakaṃbugā vāsudēva, pradyumna, saṃkarṣaṇāniruddha mūrti nāmaṃbulunālugu bhaktiṃ baliki, namaskāraṃbu sēsi, maṃtrimūrtiyu, mūrti śūnyuṃḍu nayina yajñapuruṣuṃ būjiṃcu puruṣuṃḍu samyagdarśanuṃḍagu ".

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - )

  1. "jñānamārgīya, bhaktimārgīya yōḥ anāvṛttau tulyatvēpi phalaprāptē vailakṣaṇyāt".

(jñānādēḥ sakāśāt bhaktimārgē phalatōpyutkarṣa māha. jñānādi sādhanavatsu anugrahō mukti paryaṃta ēva. bhakti mārgētu viśēṣaṇarūpō muktādi bhyōpi bhaktānāṃ vyāvartikō bhagavadanugrahaḥ smaryatē - ").

(punarjanma lēkuṃḍa cēyuṭalō jñānamārgamu bhakti mārgamu samānamē ayinanu phalaprāpti lakṣaṇamu vēru. iṭlu ceppuṭavalana jñānamārgamukanna bhaktimārgamu phalamuniccuṭalō goppadiyani ceppabaḍinadi. jñānamārgamu modalagu sādhanamulaṃdu mukti varakē anugrahamu - bhaktimārgamaṃdu viśēṣamukaladu - muktulayina bhaktulaku kūḍa bhagavaṃtuni anugrahamu kaladu).

  1. "yathā adrēḥ sakāśāt sarvataḥ prabhavaṃtiyāḥ nadyaḥ tāḥ punaḥ parjanyēnāpūritāḥ bahu śrōtasaḥ satya ḥ sarvataḥ siṃdumēva viśaṃti, tadvat sarvabhaktimārgāḥ sarvagatayaḥ aṃtataḥ bhagavaṃtamēva viśaṃti".

(koṃḍanuṃḍi anēkacōṭlanuṃḍi puṭṭina nadulu mēghamulavalana niṃḍinavai anēkanadulugā māri - vēru vēru mārgamulugā pāri samudramunē kaliyu cunnavi. ā prakāramugānē anēka vidhamulugā nunnanu bhaktimārga mulanniyu ākharuna bhagavaṃtunēcērucunnavi. bhaktimārgamu lanniṃṭiki dhyēyamagu vastuvu okaṭē yaina bhagavaṃtuḍu).

  1. "dharmārthakāmamōkṣēṣu nēcchāmama kadācana |

tvatpāda paṃkajāsvāda jīvitaṃ dīyatāṃ mama ||". (nāradapāṃcarātramu)

(dharmamu, arthamu, kāmamu, mōkṣamu anu nālugu vidhamulagu puruṣārthamulaṃdunu nāku kōrika lēdu - nī pādapadmamula nāsvādiṃcu jīvitamunē nākimmu - nī bhaktuḍugā nuṃḍuṭayē nā kōrika).

"ca. amalina bhakti goṃdaṟu mahātmulu maccaraṇāraviṃda yu

gmamu hṛdayaṃbunan nilipi kautukulai yitarētānu lā

pamula madīya divyatanu pauruṣamul goniyāḍucuṃḍi, mō

kṣamu madigōranolla raniśaṃbu madarpita sarva karmulai". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 874)

(koṃdaṟu bhaktulu mōkṣamu nollaka bhaktulugānē yuṃḍuṭa kōruduru).

  1. "yathā vairānubaṃdhēna martyastanmayatāmīyāt |

na tathā bhaktiyōgēna iti mē niścitāmatiḥ ||". (śrīmadbhāgavataṃ - - )

(nīpai vairamu kaligiyuṃḍuṭavalana, ninnē nityamu talacucuṃḍuṭavalana nī vairulagu kaṃsa, hiraṇyakaśipamukhyulaku - nī tanmayatvamu kaliginaṭlu bhaktiyōgamucēta bhaktulaku kalugadani nā abhiprāyamu).

  1. "ślō|. gōpyaḥ kāmāt bhayāt kaṃsō dvēṣā cchēdyādayō nṛpāḥ |

saṃbaṃdhā dvṛṣṇayaḥ snēhā dyūyaṃ bhaktyāvayaṃ vibhō ||". (śrīmadbhāgavataṃ - - )

"kāmōtkaṃṭhita gōpikal, bhayamunaṃ gaṃsuṃḍu, vairakriyā

sāmagrin śiśupāla mukhya nṛpatul.saṃbaṃdhulaivṛṣṇuluṃ

brēman mīralu, bhaktinēmunide cakriṃ gaṃṭi meṭlaina nu

ddhāma dhyāna gariṣṭuḍaina hariceṃdan vaccu, dhātrīśvarā". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 18)

  1. "ka. nīpādakamalasēvayu,

nī pādārcakulatōḍi neyyamu, nitāṃ

tāpāta bhūtadaya yunu

tāpasamaṃdāra, nāku dayasēya gadē ||".

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.