(పూజ్యుల యడల కలుగు అనురాగము భక్తి యని చెప్పబడినది).
(మహనీయుల యడల - మహాత్ముల యడల - ప్రీతి కలిగియుండుట భక్తియని చెప్పబడినది, ప్రీతితో నిరంతరము ధ్యానించుట భక్తియని చెప్పబడినది.
(ప్రేమపూర్వకముగా - భగవంతునియందు ప్రేమతో - అతనిని నిరంతరము ధ్యానించుట భక్తి యని చెప్పబడుచున్నది అని ఆగమము).
(భగవంతుడుకాని ఇతర విషయములందు కాక కేవలము ఒక్క భగవంతుని యందే ప్రేమ కలిగియుండుట).
(భగవంతుని భజించుటయందు గల అనురాగము భక్తి).
(భగవంతుని గుఱించి నోటితో చెప్పుటకు వీలుకాని ప్రేమయే భక్తి).
(భక్తి యనగా భగవంతుని భజన చేయుట - అనగా సేవ చేయుట).
(భగవంతుని ఆకారమును అంతఃకరణమందు భజించుట భక్తి).
తస్మాత్ సేవా బుధైః ప్రోక్తా భక్తిస్సాధన భూయసే ||“.
(‘భజ’ అను ధాతువునకు సేవచేయుట యని యర్థము. అందుచేత పండితులు సేవచేయుట భక్తికి సాధనమని చెప్పిరి).
(మూగవాడు ఆస్వాదనము చేయుటయే గాని దాని రుచి నోటితో చెప్పలేనట్లు నోటితో చెప్పుటకు అలవికాని ప్రేమరూపమైనది ప్రేమ).
(గుణములు లేనిది - సత్వరజస్తమోగుణములకు అతీతమైనది, కోరికలేనిది, క్షణక్షణము వృద్ధిని పొందునది, ఎడతెగనిది, మిక్కిలి సూక్ష్మమైనది, అనుభవరూపమైనది - అనుభవించవలసినదేకాని నోటితో చెప్పుటకు వీలుకానిది).
(దానిని పొంది - (‘తత్’ అనగా పరబ్రహ్మ), ఆ పరబ్రహ్మను పొంది, సాక్షాత్కరించుకొనినదానినే చూచునది - ఇతరమును చూడనిది -) దానిని గుఱించియే వినునది, చింతించునది).
(భక్తి ఉపాసనకు పర్యాయపదము - ఉపాసనకు మఱియొక పేరు - అందుచేత పైన చెప్పిన ప్రకారము - నారద భక్తిసూత్రములలో చెప్పిన ప్రకారము - భగవంతునియందు స్థిరమైన అనుస్మృతియే (భగవంతుని ఎల్లపుడు చింతించుటయే) భక్తి యని చెప్పబడినది).
(భగవంతునియందు - అతని దాసునియందువలె, లేక భార్యవలె, కేవలము ప్రేమ కలిగియుండుము).
“మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ |
స్వస్వరూపానుసంథానం భక్తిరిత్యభిధీయతే ||“.
(అవిచ్ఛిన్నముగా - ఎడతెగకుండునట్లు - శుద్ధాత్మస్వరూపమునందు (నిర్మలమైన, నిష్కలంకమైన పరమాత్మస్వరూపమునందు ఎల్లపుడు నిష్టకలిగియుండుట ఆత్మరతియని చెప్పబడినది. ఇట్టి ఆత్మరతియందు ఎల్లపుడు నుండుటయే భక్తియని అవ్యక్తోపాసకమహానుభావులు - వ్యక్తముకాని - కంటికి కనబడని - నిరాకార పరబ్రహ్మను, నిర్గుణపరబ్రహ్మను - ఉపాసించు మహానుభావులు చెప్పుచున్నారు. ఈ విషయము శ్రీమచ్ఛంకరభగవద్పాదులవారు ఈ విధముగా వివేకచింతామణిలో చెప్పియున్నారు -మోక్షమునకు సహాయపడు సాధనసామగ్రిలో భక్తియే గొప్పది. స్వస్వరూపమును -ఆత్మయొక్క నిజస్వరూపమును - అనుసంధానము చేయుటే భక్తియని చెప్పబడుచున్నది).
(శ్రీరంగరామానుజః)
(ఎవనికి పరమాత్మయందు నిరతిశయమైన ప్రీతికలదో అట్టివాడు పరమాత్మను పొందును అని చెప్పబడినది. దీని వలన భగవంతుని ఉపాసించువానికి ప్రీతిరూపముగా భక్తికలుగునపుడు భగవత్ప్రీతిద్వారా = భగవంతుని కటాక్షమువలన - లేక, భగవంతునియందు అట్టి ప్రీతి రూపమైన భక్తి కలిగియుండుటయే భగవత్ప్రాప్తికి (భగవంతుని పొందుటకు) హేతువు - కారణము సాధనము) అటువంటి ఉపాసకునియొక్క ఆత్మ (జీవాత్మ) తన స్వస్వరూపమును (పరమాత్మ స్వరూపమును) ప్రకాశము చేయును - తానే ఆ పరమాత్మయను అనుభవమును కలుగచేయును అని అర్థము).
(భగవంతుని యొక్క యధార్థరూపము ననుసంధానము చేయుటయే భక్తి యని స్మృతి చెప్పుచున్నది.)
“స్వాత్మ తత్వానుసంధానం భక్తిరిత్యపరే” (శ్రీశంకరః) (వివేక చూడామణీ)
(పరమాత్మ తత్వమును గుఱించి అనుసంధానము చేయుటయే భక్తి యని మరికొందరి యభిప్రాయము). “స్నేహపూర్వ మనుధ్యానం భక్తిరిత్యుచ్యతే బుద్ధైః” (స్నేహముతో కూడిన ధ్యానము - (అనుధ్యానము - తదేక నిష్ఠతో ధ్యానించుట) భక్తి యని పండితులు చెప్పుదురు).
(ఈశ్వరునియందు - భగవంతునియందు - నిరతిశయమైన (ఉత్కృష్టమైన) (మిక్కుటమగు) అనురక్తి కలిగి యుండుట భక్తి).
(పురుషోత్తముని యందు కారణములేకనే, కోరిక లేకనే, ఎడతెగనిదగు అనురాగము భక్తి).
(భగవతి యగు దేవియందు నిమిత్తములేకనే, కారణములేకనే, ఫలమునాసించక, కేవలము స్వభావమువలన నిరవధిక స్నేహరూపమైన నిర్వృత్తికలిగియుండుట భక్తి యని చెప్పబడినది).
(భగవంతుడే శరణమను బుద్ధితో అతనియందు ప్రీతికలిగియుండుట).
(భగవంతుని గుఱించి భజన చేయుటయందు తత్పరుడై యుండుట).
(భక్తి అనేకప్రకారములుగా నున్నది - కాని నారదమహర్షిచే వ్యాఖ్యానించబడినది పరమ ప్రేమరూపమైనది - భగవంతునియందు గొప్ప ప్రేమకలిగి యుండుటయే భక్తి. అది యెట్లనగా భగవంతుని గుఱించి పరమప్రేమ కలిగియుండుట అమృతస్వరూపమైనది - అనగా మోక్షమువలె అత్యంతము సౌఖ్యము కలిగించునది) ‘భగవంతం ప్రతి అనన్య ప్రేమైన వస్తుతః అమృతమస్తి, తత్సర్వతః అధికం మధురమస్తి, తథా యేన తత్ప్రేమామృతం లభ్యతే సతత్సత్వా అమృతో భవతి’. (అన్నింటిని మఱచి - విడిచిపెట్టి - భగవంతునియందే ప్రేమ కలిగియుండుటయే వాస్తవమైన భక్తి. అందుచేత ఎవనికి యిట్టి ప్రేమామృతము - భగవంతునియందు ప్రేమ యను అమృతము - లభించునో అట్టివాడు దానిని సేవించి (పానముచేసి) అమృతుడగును - మరణములేని స్థితి అయిన మోక్షమును పొందును).
(తాను చేయు వైదిక కర్మలు, లౌకికకర్మలు మొదలగు సమస్త కర్మలను భగవంతునికర్పించి, అన్నింటికంటె తనకు ప్రియమైన భగవంతుని నిరంతరము స్మరించుట ఎంత శ్రద్ధ చేయునో దాని ఫలముకూడా ఆ ప్రకారముగానే యుండును. ఆ ప్రియతముడైన భగవంతుని విస్మరించుట - మఱచిపోవుట - ఎప్పుడు జరుగునో అప్పుడు వ్యాకులతనొందును (విచారపడును, బాధపడును). ఇట్టిదియే అన్ని లక్షణములు గల భక్తి).
“ఆత్మయందలి రతి” (శాండిల్యుడు)
“భగవత్కధలయందనురాగము” (గర్గసంహిత)
ఈ క్రిందవిధముగా భగవంతునియందు భావన కలిగియుండుట -
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయాణా యేతి సమర్పయామి ||“. (శ్రీమద్భాగవతం - 2 - 36)
(శరీరముతోగాని, వాక్కుచేగాని, మనస్సుచేగాని, ఇంద్రీయములచేతగాని, బుద్ధితోగాని, ప్రకృతి ప్రభావమువలనగాని నేను ఏ పని చేసినను దాని నంతటిని పరబ్రహ్మయైన నారాయణుని కొఱకే సమర్పించుచున్నాను - ఏ పని చేసినను దానిని “శ్రీకృష్ణార్పణము” అని భగవంతునికే అర్పించుచున్నాను. దాని ఫలితము నాకు అక్కరలేదు - దాని ఫలితము నాకు కావలెనని నేను ఆ పనులు చేయుటలేదు)
ఇతి కించిత్విశేషే(అ)పి పరిణామః సమేద్వయోః || (బోధసారము - 32 - 23)
(నేను నీవాడను అని భగవంతుని నొకడు భజించును, “నీవే నేను” అని ఇంకొకడుభజించును. ఇట్లు వీటిలో కొంచెము విశేషమున్నను రెండింటి పరిణామము సమమే).
భగవచ్చరణత్వం స్యాత్ సాధనా భ్యాస పాకతః ||“. (భక్తిరసాయనం)
(నేను అతను వాడని - భగవంతుని వాడను, వీడు నావాడు అతనే నేను - అని భగవంతుని పాదపద్మములనాశ్రయించుట మూడు విధములు - ఇది భక్తుల సాధననుబట్టి, అభ్యాసమును బట్టి కలుగుచున్నది).
నీపేరంబనిసేయు హస్తయుగముల్, నీ మూర్తిపై జూపులున్
నీ పాదంబుల సొంత మ్రెఉక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా - 409)
చ్ఛిరము శిరంబు, చక్రధరు జేరిన చిత్తము చిత్తమిందిరా
వరుగను దృష్టి దృష్టి, మురవైరి నితించిన వాణి వాణి, య
క్షరు కధలాను కర్ణములు కర్ణములై విలసిల్లుచో భువిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10. ఉ.భా. - 963)
హర్షంబు తోడుత హరినామ కథనంబు పాటల నాటల బరగవలయు
నారాయణుని దివ్యనామాక్షరంబులు హృద్వీధి సతతంబు నెన్నవలయు
గంజాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా బాడవలయు
తే. వెఱ్ఱి మాడ్కిని లీలతో విశ్వమయిని
నొడుపుచును లోక బాహ్యత నొందవలయు
నింతయును విష్ణుమయమని యెఱుగవలయు
భేదమెఉనరింపవలవదు, మేదినీశ”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 44)
లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్, సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 125)
నీవే నాతోడునీడ, నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా“.
మత్తాతం మమసద్గురుం మమవరం మోహాంధవిచ్ఛేదనం |
మత్పుణ్యం మదనేక బాంధవజనం మజ్జీవనం మన్నిధిం |
మత్సిద్ధిం, మమ సర్వకర్మ సుకృతం రామం భజే తారకం ||“. (శ్రీరామ కర్ణామృతం - 2 - 38)
(శ్రీ తారకరాముడే నా జీవము - నా ప్రాణము -, నన్ను అనుగ్రహించువాడు, నా ప్రభువు, నేను ధ్యానించువాడు, నా సౌఖ్యము, నా తండ్రి, నా గురువు, నా పరమాత్మ, అజ్ఞానమను నా అంధకారమును పోగొట్టువాడు, నా పుణ్యస్వరూపుడు, నా బంధువు, నన్ను జీవింపచేయువాడు, నా నిధి, నా తపోఫలము, నా సమస్త కర్మల పుణ్యఫలము. అట్టి శ్రీరామచంద్రుని గుఱించి భజించెదను).
(నీవే నాకు శరణు, ఇతరముకాదు).
“విభిన్నై రాచార్యైః భక్తేః స్వరూపం భిన్నభిన్నరూపేణ ప్రతిపాదితం: -
(అనేకమంది (మత) గురువులు భక్తి స్వరూపమును అనేక విధములుగా చెప్పిరి: -
(1) పరాశరమహర్షి కుమారుడైన వ్యాసమహర్షిమతము ప్రకారము భగవంతుని యొక్క పూజ మొదలగువాటియందు అనురాగము కలిగియుండుట - తనయొక్క శరీరము, మనస్సు, ధనము భగవంతుని పూజా సామగ్రి - భగవంతుని పూజకు ఉపచరించు వస్తువులు - అని తెలుసుకొనవలెను, అట్టి నమ్మకముతో, గొప్ప శ్రద్ధతో శాస్త్రములో చెప్పిన ప్రకారము మనోవాక్కాయములను మూడింటితో విశ్వరూపుడైన భగవంతునియొక్క ప్రతిమను పూజ చేయవలెను - విశ్వములోనున్న (ప్రపంచములోనున్న) వస్తువులన్నియు అతనేకనుక అతనియొక్క విగ్రహమును పూజ చేయవలెను - బాహ్యముగా శరీరము చేతను (శరీరావయవముల చేతను), మనస్సు చేత, రెండింటిచేతను భగవంతుడు పూజచేయ తగినవాడు).
(శ్రీ శంకరాచార్యుని ప్రకారము - గర్గ మహాముని యొక్క అభిప్రాయము ప్రకారము భగవంతుని గుఱించి చెప్పబడిన కథలందు అనురాగము కలిగియుండుట భక్తి - మనస్సుకన్న, వేదాధ్యయనముకన్న, యజ్ఞముకన్న మంత్రముకన్న, జ్ఞానముకన్న, భగవంతునియందు కలుగు భక్తికే శాశ్వతమైన మోక్షముకలదు).
“మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ |
స్వస్వరూపాను సంథానం భక్తిరిత్యభిధీయతే ||“.
(శాండిల్యముని మతము ప్రకారము ఆత్మయందు రమించుటకు ఏ విధమైన అడ్డులేని, అంతులేని అనురాగము కలిగియుండుట భక్తి - శుద్ధాత్మస్వరూపమైన భగవంతునియందు ఎల్లపుడు ధ్యానము కలిగియుండుటయే ఆత్మరతి. ఆత్మరూపములో ప్రతి జీవియుభగవంతుడే. అందుచేత సర్వాత్ముడైన (అందఱి ఆత్మలు తానే అయిన) భగవంతునియందు రతి కలిగియుండుట - ఎడతెగని ప్రేమ కలిగియుండుటయే భక్తి. మోక్షమును కలుగచేయు సాధనములలో భక్తియే గొప్పది. భగవంతుయొక్క స్వస్వరూపమును (యదార్థరూపమును) అనుసంధానము చేయుటయే భక్తియని చెప్పబడుచున్నది)
(దేవఋషియైన నారదుని మతము ప్రకారము తన సమస్త కర్మలను భగవంతునికి సమర్పించుట, అట్లే భగవంతుని యేమాత్రము మఱచియుండినను వ్యాకులత పడుట భక్తి. గోపికా స్త్రీలకు శ్రీకృష్ణునియందుగల భక్తివలె - గోపికలకు శ్రీకృష్ణుని మహాత్మ్యము తెలిసియున్నందున వారి ప్రేమవలన అపవాదు లేదు - శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే యను జ్ఞానము వారికి లేకుండినయడల వారు శ్రీకృష్ణుని గుఱించి సలిపిన ప్రేమ జారస్త్రీలు సలిపెడి ప్రేమయే యగును - తల్లి, తండ్రి, భర్త అందఱూ శ్రీకృష్ణుడే కనుక అందరూ అతని రూపములే కనుక వారి చర్యలో దోషములేదు - “నఖలు గోపికానాం నందనో భవాన్ అఖిల దేహి నామాంతరాత్మా దృక్ | విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదే యివాన్ సాత్వ తాంకులే” (శ్రీమద్భాగవతం)
(నీవు యశోద కుమారుడవుకావు - సమస్త జీవుల అంతరాత్మవు, సాక్షివి – బ్రహ్మ ప్రార్థన చేయగా ప్రపంచమును రక్షించుటకు ఈ గోపకుల వంశములో పుట్టితిని).
“మ.పతులన్ బిడ్డల బంధులన్ సతులకున్ బాటించుటే ధర్మ ప
ద్దతి యేనంటిని దేహి ధారిణులకున్ ధర్మజ్ఞ చింతింపుమా
పతి పుత్రాదిక నామమూర్తి వగుహున్ భాసిల్లు నీయందు ద
త్పతిపుత్రాదిక వాంఛలన్ జలిపి సంభావించుట న్యాయమే “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. 990)
“ద్రవీ భావ పూర్వకా మనసో భగవదాకారరూపా భక్తిః - -”.
(భగవంతుని ఆకారమందు మనస్సు ద్రవీభావమును పొంది - ఎడతెగకుండ ద్రవమువలె సాగుచు లగ్నమై యుండుట భక్తి).
భగవంతునియందు భక్తి యెట్లు కలుగుననగా -
వైరాగ్యము లేనిచో జ్ఞానభక్తులు కలుగవు.
“నష్ట ప్రాయేష్య భద్రేషు నిత్యం భగవతసేవయా భగవత్యుత్తమ శ్రోక్లే భక్తిర్భవతినైష్టికీ ||”.
(శ్రీమద్భాగవతము - 1 - 2 - 18)
“అశుభంబులు నష్టంబులయిన భాగవతసేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 -)
భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 13 - )
నరాణాం కృత్స్న పాపానాం కృష్ణే భక్తిః ప్రజాయతే ||“.
(వేలాది జన్మలందు చేసిన తపస్సు, ధ్యానము, సమాధి మొదలగువాటివలన పాపాత్ములగు నరులకు భగవంతునియందు భక్తి కలుగును).
(పురుషోత్తముడైన పరబ్రహ్మమందు భక్త్యుద్రేకము కలుగుటకు అతని గుణములు స్తోత్రము చేయబడుచున్నవి).
కుర్వంత్య హైతుకీం భక్తిం ఇత్థం భూతగుణో హరిః ||“. (శ్రీమద్భాగవతము - 1 - 7 - )
“క. ధీరులు, నిరపేక్షులు, నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణము చేయుచుందురు
నారాయణుడెట్టివాడు నవ్య చరిత్రా” (శ్రీమదాంధ్రమహాభాగవతము - )
నప్పుడే బంధములన్నియు దెగిపోవు, బంధ మోక్షంబైన బ్రాప్తమగును
సత్సంగమంబు సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు; నీ భక్తివలన
సన్ముక్తి యగు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1665)
భావింపగ నాదు భక్తి, బాలక, వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 6 - 89)
స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్య తీర్థ నిషేవణాత్ | (శ్రీమద్భాగవతం 1 - 2 - 16)
(భగవంతుడైన వాసుదేవుని కథలను వినుటయందు రుచి - అందువలన అతనియందు భక్తి శ్రద్ధ కలిగియుండుటవలన, శుశ్రూష చేయుటవలన, మహాత్ముల సేవ వలనను పుణ్య తీర్థములను సేవించుటవలనను కలుగును). “ఎవ్వండేని” శ్రద్ధా భక్తియుక్తుండై కృష్ణ గుణ కీర్తనంబులు వినుచుం బలుకుచుండు నట్టివాని హృదత పద్మంబునందు గర్ణ రంధ్ర మార్గంబులం బ్రవేశించి కృష్ణుండు విశ్రమించి, సలిల గతంబైన కలుషంబును శర్త్కాలంబు నివారించు చ్నదంబున నాత్మగతంబైన మాలిన్యంబు నపకర్షించు ” అట్టి వానికి భక్తి కలుగును.
భగవంతునియందు ఎందుకు భక్తి కలుగవలెననగా -
“వ. భగవంతుడు నిజయోగ మాయా మహిమంబునంజేసి స్వేచ్చా పరికల్పిత చిద్ఘనలీలా విగ్రహుండు గావున భగవంతుడైన ఈశ్వరుండు స్వభజనంబు ముక్తి సాధన జ్ఞానార్థంబు కల్పితంబు అని చతుర్ముఖునకు తదీయ నిష్కపట తపశ్చర్యాది సేవితుండయి నిజ జ్ఞానానంద ఘనంబయిన స్వరూపంబు చూపుచు నానతిచ్చెను. అవి గావున జీవునికి భగవద్భక్తి మోక్షప్రదాయకంబు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 224)
“వ . నిర్గతకర్మంబైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న విశే షంబుగ శోభితంబు గాదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 61)
మ్మనమందుం దలపోసి యెంతయు బరామర్శించి, మోక్షంబు ద
క్కిన మార్గంబున లేదటంచు ఖరి భక్తిం జింత సేసెన్ జనా
ర్దను నాత్మాకృతి నిర్వికారుదగుహ్చున్ దన్మార్గ నిర్ణేతయై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 35)
(కర్మ, జ్ఞానము, యోగము అనునవిమూడే భగవత్ప్రాప్తికి సాధనములు. కాని యీ మూడింటిలో భక్తియే అన్నివిధముల ఎక్కువ శ్రేష్టమైనది. ఆ కర్మ మొద;అగు సాధనములందు వ్ర్ణాశ్రమములు మొదలగు వాటిని గు~ఇంచి అధికారి యగు వానికే ఆ సాధనములు చేయ వీలగును. అట్టి వర్ణాశ్రమములకు సంబంధించిన కర్మ యోగముల నభ్యసించుటలో యే లోపము గలిగినను పతనము కలుగును - భ్రష్టుడగును - భక్తిసాధన విషయములో భగవంతుని పూర్ణ సహాయమందగుటచేత ఏ విధమైన భయముండదు - అంతేగాక యీ భక్తివిషయములో స్త్రీయనికాని, పురుషుడనికాని, శూద్రుడనికాని విచక్షణలేక వారందఱికి అధికారము గలదు).
“తరలాక్షులార మద్భక్తి చేతనులకు మోక్ష సంథాయకంబు”.
“భక్తి లేక భవదీయ జ్ఞానంబులేదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 366)
(భక్తివలన చిత్తశుద్ధి కలుగును - చిత్తశుద్ధి కలిగిన బ్రహ్మజ్ఞానంబు కలుగును).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 64)
వ్వారునులేరు, తండ్రి భగవంతుననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావశులు దాత్తమతిం గొని యాడ కుండినం
జేరవు చిత్తముల్ ప్రకృతి జెందని నిర్గుణమైన బ్రహ్మమున్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము = 2 - 7 - )
(భక్తితో సగుణోపాసన చేసిన పిమ్మటగాని నిర్గుణోపాసన కుదరదు).
దానాధ్యయనాది కర్మముల,మోక్షప్రాప్తి సేకూరద
చ్చపు భక్తిన్ హరి బుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమా
ధిపు బాపఘ్న, బరేశు నచ్యుతుని నర్ధిన్ గొల్వలేకుండినన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
(భగవంతుని భక్తితో సేవించనియడల ఉపవాసములు, వ్రతములు, మఖములు, జపము, తపము, దానము, అధ్యయనము మొదలగునవెన్ని చేసినను మోక్షము చేకూరదు).
షముల ప్రబోధితంబయగు, శాంతవహింపదు, విష్ణు సేవచే
గ్రమమున శాంతి గైకొనిన కైవడి - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 6 - 95)
(భగవంతుని యందలి భక్తిచే చిత్తము శాంతిని పొందును - చిత్తశుద్ధి కలుగును, చిత్తశుద్ధికలిగిన బ్రహ్మజ్ఞానము కలుగును - బ్రహ్మజ్ఞానమువలన మోక్షము కలుగును).
“క. గురుమతులు తపసులంతః
కరణంబుల శుద్ధిసేయ ఘనతర భక్తిన్
హరియందు సమర్పింతురు
పరమానందమున భిన్నభవ బంధనులై ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 57)
శాంత, దాస్య, సఖ్య వాత్సల్య, మాధుర్య భావముల భక్తి కలుగు - శాంతులు, తపస్విలయిన నారదాది మునీంద్రులు; దాస్య భక్తి - కుబ్జ, హనుమంతుడు, సఖ్యభక్తి - సుగ్రీవుడు, అర్జునుడు, కుచేలుడు మొదలగువారు; వాత్సల్య భక్తి - దేవకీ వసుదేవులు, నందయశోదలు మొదలగువారు; మాధుర్యభక్తి - గోపికలు మొదలగువారు; శరణాగత భక్తి - ప్రహ్లాదుడు, గజేంద్రుడు మొదలగువారి - భగవంతునితో శతృత్వమునొందినవారు - అతనిచే చంపబడి ముక్తులైరి).
ర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబులు ల్లంబులో
దలపన్నంతన మెచ్చి యార్తిహరుడై తన్నైన నిచ్చున్, స ని
శ్చలభక్తిన్ భజియించువారికిడడే సంపద్విశేషోన్నతుల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 971)
(కట్టెలనిమధించనిదే అగ్ని యెట్లు కలుగదో అట్లే అందఱి హృదయములలోను భగవంతుడున్నను, ఆలోచించి, ధ్యానించి భక్తి సలుపనిదే భగవంతుడు తనలో తోచడు. అగ్నినుపయోగించువారికే, చీకటిలోనున్నవారికే, చలిబాధ పడినవారికే అగ్నియొక్క ఉపయోగము తెలిసినట్లు భగవంతుని భక్తులకే భగవంతుని మహిమ తెలియును).
(కంటికి మందు పెట్టుకొనిన ఎట్లు చూడకలుగుచున్నవో, అట్లే భగవంతుని పుణ్యకథలను వినుట మొదలగు వాటివలన ఆత్మ శుద్ధియగును, తత్వముయొక్క సూక్ష్మరూపము చూడనగును - భక్తియొక్క అవాంతరవ్యాపారమే జ్ఞానము, వేరుకాదు - భక్తివలన బ్రహ్మజ్ఞానముకలిగి, జ్ఞానమువలన మోక్షము కలుగును).
“శ్లో||. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యోపిస్యః పాపయోనయః
స్త్రియోవైశ్యా స్తథా శూద్రాస్తేపి యాం తి పరాంగతిం“. (శ్రీమద్భగవద్గీత - 9 - 32)
“భగవంతునియందు భక్తిసలుపువారు కొందరుందురు, వారిలో అల్పులని, గొప్పవారని, స్త్రీలని, పురుషులని వివక్షలేదు - (భేదము లేదు).; మనుష్యులు, పశువులు అను వివక్ష కూడలేదు - భక్తి ప్రభావమువలన ఈ భక్తులందరు సమానమే, శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ విషయమీ క్రిందవిధముగా చెప్పెను -” నన్నాశ్రయించినవారు - నా భక్తులు - పాపులైనను - పుణ్యులైనను, స్త్రీలైనను వైశ్యులైనను, శూద్రులైనను - వారందరూ పరమగతిని - ఉత్కృష్టము, గమ్యస్థానము అయిన వైకుంఠమును పొందుదురు).
భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే |
భిద్యతే హృదయగ్రంధిశ్చిద్యంతే సర్వసంశయాః |
క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే ||.
అతోవై కవయో నిత్యం భక్తిం పరమయాముదా |
వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మ ప్రసాదనం ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 20 to 22)
(దేనియందైనను అభిలాష లేనివానికి ప్రసన్నమైన మనస్సుగల భక్తియోగమువలన భగవత్తత్త్వముయొక్క జ్ఞానము కలుగును. తన మనస్సులో భగవంతుని ధ్యానించి ప్రసన్నము చేసుకొనినయడల అట్టివాని హృదయగ్రంధులు (హృదయమందు ముడులవలె నున్నవి) వీడిపోవును, సంశయములన్నియు తీరిపోవును, కర్మలన్నియు ఫలముననుభవింప చేయక నశించిపోవును. ఇందుచేతనే జ్ఞానులు ఎల్లపుడు గొప్ప.సంతోషముతో భగవంతుడైన వాసుదేవునియందు ఆత్మశాంతిని కలుగచేయు - చిత్తశుద్ధిని కలుగచేయు - భక్తిని సలుపుదురు).
క. “దళమైన పుష్పమైనను
ఫలమైన సలిలమైనను బాయని భక్తిం
గొలిచిన జనులర్పించిన
నెలమి రుచిరాన్నముగనే యేను భుజింతున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. - 1010)
(సృష్టిలోనున్న సమస్త వస్తువులు భగవంతునిచే సృష్టించబడినవే - అందుచేత అవన్నీ అతనివే - అతని వస్తువు అతనికిచ్చుట గొప్పకాదు - కలిగినవారున్నారు, లేమిలోనున్నవారున్నారు, అందఱు విలువగల వస్తువులనే భగవంతునకు సమర్పించవలెనంటె సాధ్యముకాదు - భగవంతునికి అర్పించుటలో వస్తువుయొక్క విలువ ప్రధానముకాదు - భక్తియే ప్రధానము, భక్తితో నిచ్చినదే విలువకలది).
(pūjyula yaḍala kalugu anurāgamu bhakti yani ceppabaḍinadi).
(mahanīyula yaḍala - mahātmula yaḍala - prīti kaligiyuṃḍuṭa bhaktiyani ceppabaḍinadi, prītitō niraṃtaramu dhyāniṃcuṭa bhaktiyani ceppabaḍinadi.
(prēmapūrvakamugā - bhagavaṃtuniyaṃdu prēmatō - atanini niraṃtaramu dhyāniṃcuṭa bhakti yani ceppabaḍucunnadi ani āgamamu).
(bhagavaṃtuḍukāni itara viṣayamulaṃdu kāka kēvalamu okka bhagavaṃtuni yaṃdē prēma kaligiyuṃḍuṭa).
(bhagavaṃtuni bhajiṃcuṭayaṃdu gala anurāgamu bhakti).
(bhagavaṃtuni guṟiṃci nōṭitō ceppuṭaku vīlukāni prēmayē bhakti).
(bhakti yanagā bhagavaṃtuni bhajana cēyuṭa - anagā sēva cēyuṭa).
(bhagavaṃtuni ākāramunu aṃtaḥkaraṇamaṃdu bhajiṃcuṭa bhakti).
tasmāt sēvā budhaiḥ prōktā bhaktissādhana bhūyasē ||“.
(‘bhaja’ anu dhātuvunaku sēvacēyuṭa yani yarthamu. aṃducēta paṃḍitulu sēvacēyuṭa bhaktiki sādhanamani ceppiri).
(mūgavāḍu āsvādanamu cēyuṭayē gāni dāni ruci nōṭitō ceppalēnaṭlu nōṭitō ceppuṭaku alavikāni prēmarūpamainadi prēma).
(guṇamulu lēnidi - satvarajastamōguṇamulaku atītamainadi, kōrikalēnidi, kṣaṇakṣaṇamu vṛddhini poṃdunadi, eḍateganidi, mikkili sūkṣmamainadi, anubhavarūpamainadi - anubhaviṃcavalasinadēkāni nōṭitō ceppuṭaku vīlukānidi).
(dānini poṃdi - (‘tat’ anagā parabrahma), ā parabrahmanu poṃdi, sākṣātkariṃcukoninadāninē cūcunadi - itaramunu cūḍanidi -) dānini guṟiṃciyē vinunadi, ciṃtiṃcunadi).
(bhakti upāsanaku paryāyapadamu - upāsanaku maṟiyoka pēru - aṃducēta paina ceppina prakāramu - nārada bhaktisūtramulalō ceppina prakāramu - bhagavaṃtuniyaṃdu sthiramaina anusmṛtiyē (bhagavaṃtuni ellapuḍu ciṃtiṃcuṭayē) bhakti yani ceppabaḍinadi).
(bhagavaṃtuniyaṃdu - atani dāsuniyaṃduvale, lēka bhāryavale, kēvalamu prēma kaligiyuṃḍumu).
“mōkṣakāraṇa sāmagryāṃ bhaktirēva garīyasī |
svasvarūpānusaṃthānaṃ bhaktirityabhidhīyatē ||“.
(avicchinnamugā - eḍategakuṃḍunaṭlu - śuddhātmasvarūpamunaṃdu (nirmalamaina, niṣkalaṃkamaina paramātmasvarūpamunaṃdu ellapuḍu niṣṭakaligiyuṃḍuṭa ātmaratiyani ceppabaḍinadi. iṭṭi ātmaratiyaṃdu ellapuḍu nuṃḍuṭayē bhaktiyani avyaktōpāsakamahānubhāvulu - vyaktamukāni - kaṃṭiki kanabaḍani - nirākāra parabrahmanu, nirguṇaparabrahmanu - upāsiṃcu mahānubhāvulu ceppucunnāru. ī viṣayamu śrīmacchaṃkarabhagavadpādulavāru ī vidhamugā vivēkaciṃtāmaṇilō ceppiyunnāru -mōkṣamunaku sahāyapaḍu sādhanasāmagrilō bhaktiyē goppadi. svasvarūpamunu -ātmayokka nijasvarūpamunu - anusaṃdhānamu cēyuṭē bhaktiyani ceppabaḍucunnadi).
(śrīraṃgarāmānujaḥ)
(evaniki paramātmayaṃdu niratiśayamaina prītikaladō aṭṭivāḍu paramātmanu poṃdunu ani ceppabaḍinadi. dīni valana bhagavaṃtuni upāsiṃcuvāniki prītirūpamugā bhaktikalugunapuḍu bhagavatprītidvārā = bhagavaṃtuni kaṭākṣamuvalana - lēka, bhagavaṃtuniyaṃdu aṭṭi prīti rūpamaina bhakti kaligiyuṃḍuṭayē bhagavatprāptiki (bhagavaṃtuni poṃduṭaku) hētuvu - kāraṇamu sādhanamu) aṭuvaṃṭi upāsakuniyokka ātma (jīvātma) tana svasvarūpamunu (paramātma svarūpamunu) prakāśamu cēyunu - tānē ā paramātmayanu anubhavamunu kalugacēyunu ani arthamu).
(bhagavaṃtuni yokka yadhārtharūpamu nanusaṃdhānamu cēyuṭayē bhakti yani smṛti ceppucunnadi.)
“svātma tatvānusaṃdhānaṃ bhaktirityaparē” (śrīśaṃkaraḥ) (vivēka cūḍāmaṇī)
(paramātma tatvamunu guṟiṃci anusaṃdhānamu cēyuṭayē bhakti yani marikoṃdari yabhiprāyamu). “snēhapūrva manudhyānaṃ bhaktirityucyatē buddhaiḥ” (snēhamutō kūḍina dhyānamu - (anudhyānamu - tadēka niṣṭhatō dhyāniṃcuṭa) bhakti yani paṃḍitulu ceppuduru).
(īśvaruniyaṃdu - bhagavaṃtuniyaṃdu - niratiśayamaina (utkṛṣṭamaina) (mikkuṭamagu) anurakti kaligi yuṃḍuṭa bhakti).
(puruṣōttamuni yaṃdu kāraṇamulēkanē, kōrika lēkanē, eḍateganidagu anurāgamu bhakti).
(bhagavati yagu dēviyaṃdu nimittamulēkanē, kāraṇamulēkanē, phalamunāsiṃcaka, kēvalamu svabhāvamuvalana niravadhika snēharūpamaina nirvṛttikaligiyuṃḍuṭa bhakti yani ceppabaḍinadi).
(bhagavaṃtuḍē śaraṇamanu buddhitō ataniyaṃdu prītikaligiyuṃḍuṭa).
(bhagavaṃtuni guṟiṃci bhajana cēyuṭayaṃdu tatparuḍai yuṃḍuṭa).
(bhakti anēkaprakāramulugā nunnadi - kāni nāradamaharṣicē vyākhyāniṃcabaḍinadi parama prēmarūpamainadi - bhagavaṃtuniyaṃdu goppa prēmakaligi yuṃḍuṭayē bhakti. adi yeṭlanagā bhagavaṃtuni guṟiṃci paramaprēma kaligiyuṃḍuṭa amṛtasvarūpamainadi - anagā mōkṣamuvale atyaṃtamu saukhyamu kaligiṃcunadi) ‘bhagavaṃtaṃ prati ananya prēmaina vastutaḥ amṛtamasti, tatsarvataḥ adhikaṃ madhuramasti, tathā yēna tatprēmāmṛtaṃ labhyatē satatsatvā amṛtō bhavati’. (anniṃṭini maṟaci - viḍicipeṭṭi - bhagavaṃtuniyaṃdē prēma kaligiyuṃḍuṭayē vāstavamaina bhakti. aṃducēta evaniki yiṭṭi prēmāmṛtamu - bhagavaṃtuniyaṃdu prēma yanu amṛtamu - labhiṃcunō aṭṭivāḍu dānini sēviṃci (pānamucēsi) amṛtuḍagunu - maraṇamulēni sthiti ayina mōkṣamunu poṃdunu).
(tānu cēyu vaidika karmalu, laukikakarmalu modalagu samasta karmalanu bhagavaṃtunikarpiṃci, anniṃṭikaṃṭe tanaku priyamaina bhagavaṃtuni niraṃtaramu smariṃcuṭa eṃta śraddha cēyunō dāni phalamukūḍā ā prakāramugānē yuṃḍunu. ā priyatamuḍaina bhagavaṃtuni vismariṃcuṭa - maṟacipōvuṭa - eppuḍu jarugunō appuḍu vyākulatanoṃdunu (vicārapaḍunu, bādhapaḍunu). iṭṭidiyē anni lakṣaṇamulu gala bhakti).
“ātmayaṃdali rati” (śāṃḍilyuḍu)
“bhagavatkadhalayaṃdanurāgamu” (gargasaṃhita)
ī kriṃdavidhamugā bhagavaṃtuniyaṃdu bhāvana kaligiyuṃḍuṭa -
karōmi yadyat sakalaṃ parasmai nārāyāṇā yēti samarpayāmi ||“. (śrīmadbhāgavataṃ - 2 - 36)
(śarīramutōgāni, vākkucēgāni, manassucēgāni, iṃdrīyamulacētagāni, buddhitōgāni, prakṛti prabhāvamuvalanagāni nēnu ē pani cēsinanu dāni naṃtaṭini parabrahmayaina nārāyaṇuni koṟakē samarpiṃcucunnānu - ē pani cēsinanu dānini “śrīkṛṣṇārpaṇamu” ani bhagavaṃtunikē arpiṃcucunnānu. dāni phalitamu nāku akkaralēdu - dāni phalitamu nāku kāvalenani nēnu ā panulu cēyuṭalēdu)
iti kiṃcitviśēṣē(a)pi pariṇāmaḥ samēdvayōḥ || (bōdhasāramu - 32 - 23)
(nēnu nīvāḍanu ani bhagavaṃtuni nokaḍu bhajiṃcunu, “nīvē nēnu” ani iṃkokaḍubhajiṃcunu. iṭlu vīṭilō koṃcemu viśēṣamunnanu reṃḍiṃṭi pariṇāmamu samamē).
bhagavaccaraṇatvaṃ syāt sādhanā bhyāsa pākataḥ ||“. (bhaktirasāyanaṃ)
(nēnu atanu vāḍani - bhagavaṃtuni vāḍanu, vīḍu nāvāḍu atanē nēnu - ani bhagavaṃtuni pādapadmamulanāśrayiṃcuṭa mūḍu vidhamulu - idi bhaktula sādhananubaṭṭi, abhyāsamunu baṭṭi kalugucunnadi).
nīpēraṃbanisēyu hastayugamul, nī mūrtipai jūpulun
nī pādaṃbula soṃta mreukku śiramul, nī sēvapai cittamul
nī pai buddhulu māku nimmu karuṇan nīrējapatrēkṣaṇā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā - 409)
cchiramu śiraṃbu, cakradharu jērina cittamu cittamiṃdirā
varuganu dṛṣṭi dṛṣṭi, muravairi nitiṃcina vāṇi vāṇi, ya
kṣaru kadhalānu karṇamulu karṇamulai vilasillucō bhuvin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10. u.bhā. - 963)
harṣaṃbu tōḍuta harināma kathanaṃbu pāṭala nāṭala baragavalayu
nārāyaṇuni divyanāmākṣaraṃbulu hṛdvīdhi satataṃbu nennavalayu
gaṃjākṣulīlalu kāṃtāramulanaina bhaktiyuktaṃbugā bāḍavalayu
tē. veṟṟi māḍkini līlatō viśvamayini
noḍupucunu lōka bāhyata noṃdavalayu
niṃtayunu viṣṇumayamani yeṟugavalayu
bhēdameunariṃpavalavadu, mēdinīśa”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 44)
lā nidrādulu sēyucuṃ dirugucun lakṣiṃcucun, saṃtata
śrīnārāyaṇa pādapadma yugaḷī ciṃtāmṛtāsvāda saṃ
dhānuṃḍai maṟacen surāri sutuḍētadviśvamun bhūvarā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 125)
nīvē nātōḍunīḍa, nīvē sakhuḍau
nīvē guruḍavu daivamu
nīvē nā patiyu gatiyu nijamuga kṛṣṇā”.
mattātaṃ mamasadguruṃ mamavaraṃ mōhāṃdhavicchēdanaṃ |
matpuṇyaṃ madanēka bāṃdhavajanaṃ majjīvanaṃ mannidhiṃ |
matsiddhiṃ, mama sarvakarma sukṛtaṃ rāmaṃ bhajē tārakaṃ ||“. (śrīrāma karṇāmṛtaṃ - 2 - 38)
(śrī tārakarāmuḍē nā jīvamu - nā prāṇamu -, nannu anugrahiṃcuvāḍu, nā prabhuvu, nēnu dhyāniṃcuvāḍu, nā saukhyamu, nā taṃḍri, nā guruvu, nā paramātma, ajñānamanu nā aṃdhakāramunu pōgoṭṭuvāḍu, nā puṇyasvarūpuḍu, nā baṃdhuvu, nannu jīviṃpacēyuvāḍu, nā nidhi, nā tapōphalamu, nā samasta karmala puṇyaphalamu. aṭṭi śrīrāmacaṃdruni guṟiṃci bhajiṃcedanu).
(nīvē nāku śaraṇu, itaramukādu).
“vibhinnai rācāryaiḥ bhaktēḥ svarūpaṃ bhinnabhinnarūpēṇa pratipāditaṃ: -
(anēkamaṃdi (mata) guruvulu bhakti svarūpamunu anēka vidhamulugā ceppiri: -
(1) parāśaramaharṣi kumāruḍaina vyāsamaharṣimatamu prakāramu bhagavaṃtuni yokka pūja modalaguvāṭiyaṃdu anurāgamu kaligiyuṃḍuṭa - tanayokka śarīramu, manassu, dhanamu bhagavaṃtuni pūjā sāmagri - bhagavaṃtuni pūjaku upacariṃcu vastuvulu - ani telusukonavalenu, aṭṭi nammakamutō, goppa śraddhatō śāstramulō ceppina prakāramu manōvākkāyamulanu mūḍiṃṭitō viśvarūpuḍaina bhagavaṃtuniyokka pratimanu pūja cēyavalenu - viśvamulōnunna (prapaṃcamulōnunna) vastuvulanniyu atanēkanuka ataniyokka vigrahamunu pūja cēyavalenu - bāhyamugā śarīramu cētanu (śarīrāvayavamula cētanu), manassu cēta, reṃḍiṃṭicētanu bhagavaṃtuḍu pūjacēya taginavāḍu).
(śrī śaṃkarācāryuni prakāramu - garga mahāmuni yokka abhiprāyamu prakāramu bhagavaṃtuni guṟiṃci ceppabaḍina kathalaṃdu anurāgamu kaligiyuṃḍuṭa bhakti - manassukanna, vēdādhyayanamukanna, yajñamukanna maṃtramukanna, jñānamukanna, bhagavaṃtuniyaṃdu kalugu bhaktikē śāśvatamaina mōkṣamukaladu).
“mōkṣakāraṇa sāmagryāṃ bhaktirēva garīyasī |
svasvarūpānu saṃthānaṃ bhaktirityabhidhīyatē ||“.
(śāṃḍilyamuni matamu prakāramu ātmayaṃdu ramiṃcuṭaku ē vidhamaina aḍḍulēni, aṃtulēni anurāgamu kaligiyuṃḍuṭa bhakti - śuddhātmasvarūpamaina bhagavaṃtuniyaṃdu ellapuḍu dhyānamu kaligiyuṃḍuṭayē ātmarati. ātmarūpamulō prati jīviyubhagavaṃtuḍē. aṃducēta sarvātmuḍaina (aṃdaṟi ātmalu tānē ayina) bhagavaṃtuniyaṃdu rati kaligiyuṃḍuṭa - eḍategani prēma kaligiyuṃḍuṭayē bhakti. mōkṣamunu kalugacēyu sādhanamulalō bhaktiyē goppadi. bhagavaṃtuyokka svasvarūpamunu (yadārtharūpamunu) anusaṃdhānamu cēyuṭayē bhaktiyani ceppabaḍucunnadi)
(dēvaṛṣiyaina nāraduni matamu prakāramu tana samasta karmalanu bhagavaṃtuniki samarpiṃcuṭa, aṭlē bhagavaṃtuni yēmātramu maṟaciyuṃḍinanu vyākulata paḍuṭa bhakti. gōpikā strīlaku śrīkṛṣṇuniyaṃdugala bhaktivale - gōpikalaku śrīkṛṣṇuni mahātmyamu telisiyunnaṃduna vāri prēmavalana apavādu lēdu - śrīkṛṣṇuḍu sākṣāttu bhagavaṃtuḍē yanu jñānamu vāriki lēkuṃḍinayaḍala vāru śrīkṛṣṇuni guṟiṃci salipina prēma jārastrīlu salipeḍi prēmayē yagunu - talli, taṃḍri, bharta aṃdaṟū śrīkṛṣṇuḍē kanuka aṃdarū atani rūpamulē kanuka vāri caryalō dōṣamulēdu - “nakhalu gōpikānāṃ naṃdanō bhavān akhila dēhi nāmāṃtarātmā dṛk | vikhana sārthitō viśvaguptayē sakha udē yivān sātva tāṃkulē” (śrīmadbhāgavataṃ)
(nīvu yaśōda kumāruḍavukāvu - samasta jīvula aṃtarātmavu, sākṣivi – brahma prārthana cēyagā prapaṃcamunu rakṣiṃcuṭaku ī gōpakula vaṃśamulō puṭṭitini).
“ma.patulan biḍḍala baṃdhulan satulakun bāṭiṃcuṭē dharma pa
ddati yēnaṃṭini dēhi dhāriṇulakun dharmajña ciṃtiṃpumā
pati putrādika nāmamūrti vaguhun bhāsillu nīyaṃdu da
tpatiputrādika vāṃchalan jalipi saṃbhāviṃcuṭa nyāyamē “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. 990)
“dravī bhāva pūrvakā manasō bhagavadākārarūpā bhaktiḥ - -”.
(bhagavaṃtuni ākāramaṃdu manassu dravībhāvamunu poṃdi - eḍategakuṃḍa dravamuvale sāgucu lagnamai yuṃḍuṭa bhakti).
bhagavaṃtuniyaṃdu bhakti yeṭlu kalugunanagā -
vairāgyamu lēnicō jñānabhaktulu kalugavu.
“naṣṭa prāyēṣya bhadrēṣu nityaṃ bhagavatasēvayā bhagavatyuttama śrōklē bhaktirbhavatinaiṣṭikī ||”.
(śrīmadbhāgavatamu - 1 - 2 - 18)
“aśubhaṃbulu naṣṭaṃbulayina bhāgavatasēvā viśēṣaṃbuna niścala bhakti yudayiṃcu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 -)
bhaktiyutamuga cittaṃbu bhavyamagunu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 13 - )
narāṇāṃ kṛtsna pāpānāṃ kṛṣṇē bhaktiḥ prajāyatē ||“.
(vēlādi janmalaṃdu cēsina tapassu, dhyānamu, samādhi modalaguvāṭivalana pāpātmulagu narulaku bhagavaṃtuniyaṃdu bhakti kalugunu).
(puruṣōttamuḍaina parabrahmamaṃdu bhaktyudrēkamu kaluguṭaku atani guṇamulu stōtramu cēyabaḍucunnavi).
kurvaṃtya haitukīṃ bhaktiṃ itthaṃ bhūtaguṇō hariḥ ||“. (śrīmadbhāgavatamu - 1 - 7 - )
“ka. dhīrulu, nirapēkṣulu, nā
tmārāmulu naina munulu haribhajanamu ni
ṣkāraṇamu cēyucuṃduru
nārāyaṇuḍeṭṭivāḍu navya caritrā” (śrīmadāṃdhramahābhāgavatamu - )
nappuḍē baṃdhamulanniyu degipōvu, baṃdha mōkṣaṃbaina brāptamagunu
satsaṃgamaṃbu satsaṃgamaṃbuna nīdu bhakti siddhiṃcu; nī bhaktivalana
sanmukti yagu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1665)
bhāviṃpaga nādu bhakti, bālaka, viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 6 - 89)
syānmahatsēvayā viprāḥ puṇya tīrtha niṣēvaṇāt | (śrīmadbhāgavataṃ 1 - 2 - 16)
(bhagavaṃtuḍaina vāsudēvuni kathalanu vinuṭayaṃdu ruci - aṃduvalana ataniyaṃdu bhakti śraddha kaligiyuṃḍuṭavalana, śuśrūṣa cēyuṭavalana, mahātmula sēva valananu puṇya tīrthamulanu sēviṃcuṭavalananu kalugunu). “evvaṃḍēni” śraddhā bhaktiyuktuṃḍai kṛṣṇa guṇa kīrtanaṃbulu vinucuṃ balukucuṃḍu naṭṭivāni hṛdata padmaṃbunaṃdu garṇa raṃdhra mārgaṃbulaṃ bravēśiṃci kṛṣṇuṃḍu viśramiṃci, salila gataṃbaina kaluṣaṃbunu śartkālaṃbu nivāriṃcu cnadaṃbuna nātmagataṃbaina mālinyaṃbu napakarṣiṃcu ” aṭṭi vāniki bhakti kalugunu.
bhagavaṃtuniyaṃdu eṃduku bhakti kalugavalenanagā -
“va. bhagavaṃtuḍu nijayōga māyā mahimaṃbunaṃjēsi svēccā parikalpita cidghanalīlā vigrahuṃḍu gāvuna bhagavaṃtuḍaina īśvaruṃḍu svabhajanaṃbu mukti sādhana jñānārthaṃbu kalpitaṃbu ani caturmukhunaku tadīya niṣkapaṭa tapaścaryādi sēvituṃḍayi nija jñānānaṃda ghanaṃbayina svarūpaṃbu cūpucu nānaticcenu. avi gāvuna jīvuniki bhagavadbhakti mōkṣapradāyakaṃbu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 224)
“va . nirgatakarmaṃbaina jñānaṃbu haribhakti lēkunna viśē ṣaṃbuga śōbhitaṃbu gādu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 61)
mmanamaṃduṃ dalapōsi yeṃtayu barāmarśiṃci, mōkṣaṃbu da
kkina mārgaṃbuna lēdaṭaṃcu khari bhaktiṃ jiṃta sēsen janā
rdanu nātmākṛti nirvikārudaguhcun danmārga nirṇētayai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 35)
(karma, jñānamu, yōgamu anunavimūḍē bhagavatprāptiki sādhanamulu. kāni yī mūḍiṃṭilō bhaktiyē annividhamula ekkuva śrēṣṭamainadi. ā karma moda;agu sādhanamulaṃdu vrṇāśramamulu modalagu vāṭini gu~iṃci adhikāri yagu vānikē ā sādhanamulu cēya vīlagunu. aṭṭi varṇāśramamulaku saṃbaṃdhiṃcina karma yōgamula nabhyasiṃcuṭalō yē lōpamu galiginanu patanamu kalugunu - bhraṣṭuḍagunu - bhaktisādhana viṣayamulō bhagavaṃtuni pūrṇa sahāyamaṃdaguṭacēta ē vidhamaina bhayamuṃḍadu - aṃtēgāka yī bhaktiviṣayamulō strīyanikāni, puruṣuḍanikāni, śūdruḍanikāni vicakṣaṇalēka vāraṃdaṟiki adhikāramu galadu).
“taralākṣulāra madbhakti cētanulaku mōkṣa saṃthāyakaṃbu”.
“bhakti lēka bhavadīya jñānaṃbulēdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 366)
(bhaktivalana cittaśuddhi kalugunu - cittaśuddhi kaligina brahmajñānaṃbu kalugunu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 64)
vvārunulēru, taṃḍri bhagavaṃtunanaṃtuni viśvabhāvanō
dāruni sadguṇāvaśulu dāttamatiṃ goni yāḍa kuṃḍinaṃ
jēravu cittamul prakṛti jeṃdani nirguṇamaina brahmamun ||“. (śrīmadāṃdhramahābhāgavatamu = 2 - 7 - )
(bhaktitō saguṇōpāsana cēsina pimmaṭagāni nirguṇōpāsana kudaradu).
dānādhyayanādi karmamula,mōkṣaprāpti sēkūrada
ccapu bhaktin hari buṃḍarīka nayanun sarvātiśāyin ramā
dhipu bāpaghna, barēśu nacyutuni nardhin golvalēkuṃḍinan”. (śrīmadāṃdhramahābhāgavatamu -)
(bhagavaṃtuni bhaktitō sēviṃcaniyaḍala upavāsamulu, vratamulu, makhamulu, japamu, tapamu, dānamu, adhyayanamu modalagunavenni cēsinanu mōkṣamu cēkūradu).
ṣamula prabōdhitaṃbayagu, śāṃtavahiṃpadu, viṣṇu sēvacē
gramamuna śāṃti gaikonina kaivaḍi - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 6 - 95)
(bhagavaṃtuni yaṃdali bhakticē cittamu śāṃtini poṃdunu - cittaśuddhi kalugunu, cittaśuddhikaligina brahmajñānamu kalugunu - brahmajñānamuvalana mōkṣamu kalugunu).
“ka. gurumatulu tapasulaṃtaḥ
karaṇaṃbula śuddhisēya ghanatara bhaktin
hariyaṃdu samarpiṃturu
paramānaṃdamuna bhinnabhava baṃdhanulai ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 57)
śāṃta, dāsya, sakhya vātsalya, mādhurya bhāvamula bhakti kalugu - śāṃtulu, tapasvilayina nāradādi munīṃdrulu; dāsya bhakti - kubja, hanumaṃtuḍu, sakhyabhakti - sugrīvuḍu, arjunuḍu, kucēluḍu modalaguvāru; vātsalya bhakti - dēvakī vasudēvulu, naṃdayaśōdalu modalaguvāru; mādhuryabhakti - gōpikalu modalaguvāru; śaraṇāgata bhakti - prahlāduḍu, gajēṃdruḍu modalaguvāri - bhagavaṃtunitō śatṛtvamunoṃdinavāru - atanicē caṃpabaḍi muktulairi).
rbaluḍāpatsamayaṃbunan nijapadābjātaṃbulu llaṃbulō
dalapannaṃtana mecci yārtiharuḍai tannaina niccun, sa ni
ścalabhaktin bhajiyiṃcuvārikiḍaḍē saṃpadviśēṣōnnatul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 971)
(kaṭṭelanimadhiṃcanidē agni yeṭlu kalugadō aṭlē aṃdaṟi hṛdayamulalōnu bhagavaṃtuḍunnanu, ālōciṃci, dhyāniṃci bhakti salupanidē bhagavaṃtuḍu tanalō tōcaḍu. agninupayōgiṃcuvārikē, cīkaṭilōnunnavārikē, calibādha paḍinavārikē agniyokka upayōgamu telisinaṭlu bhagavaṃtuni bhaktulakē bhagavaṃtuni mahima teliyunu).
(kaṃṭiki maṃdu peṭṭukonina eṭlu cūḍakalugucunnavō, aṭlē bhagavaṃtuni puṇyakathalanu vinuṭa modalagu vāṭivalana ātma śuddhiyagunu, tatvamuyokka sūkṣmarūpamu cūḍanagunu - bhaktiyokka avāṃtaravyāpāramē jñānamu, vērukādu - bhaktivalana brahmajñānamukaligi, jñānamuvalana mōkṣamu kalugunu).
“ślō||. māṃ hi pārtha vyapāśritya yōpisyaḥ pāpayōnayaḥ
striyōvaiśyā stathā śūdrāstēpi yāṃ ti parāṃgatiṃ”. (śrīmadbhagavadgīta - 9 - 32)
“bhagavaṃtuniyaṃdu bhaktisalupuvāru koṃdaruṃduru, vārilō alpulani, goppavārani, strīlani, puruṣulani vivakṣalēdu - (bhēdamu lēdu).; manuṣyulu, paśuvulu anu vivakṣa kūḍalēdu - bhakti prabhāvamuvalana ī bhaktulaṃdaru samānamē, śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ī viṣayamī kriṃdavidhamugā ceppenu -” nannāśrayiṃcinavāru - nā bhaktulu - pāpulainanu - puṇyulainanu, strīlainanu vaiśyulainanu, śūdrulainanu - vāraṃdarū paramagatini - utkṛṣṭamu, gamyasthānamu ayina vaikuṃṭhamunu poṃduduru).
bhagavattattvavijñānaṃ muktasaṃgasya jāyatē |
bhidyatē hṛdayagraṃdhiścidyaṃtē sarvasaṃśayāḥ |
kṣīyaṃtē cāsya karmāṇi dṛṣṭa ēvātmanīśvarē ||.
atōvai kavayō nityaṃ bhaktiṃ paramayāmudā |
vāsudēvē bhagavati kurvaṃtyātma prasādanaṃ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 20 to 22)
(dēniyaṃdainanu abhilāṣa lēnivāniki prasannamaina manassugala bhaktiyōgamuvalana bhagavattattvamuyokka jñānamu kalugunu. tana manassulō bhagavaṃtuni dhyāniṃci prasannamu cēsukoninayaḍala aṭṭivāni hṛdayagraṃdhulu (hṛdayamaṃdu muḍulavale nunnavi) vīḍipōvunu, saṃśayamulanniyu tīripōvunu, karmalanniyu phalamunanubhaviṃpa cēyaka naśiṃcipōvunu. iṃducētanē jñānulu ellapuḍu goppa.saṃtōṣamutō bhagavaṃtuḍaina vāsudēvuniyaṃdu ātmaśāṃtini kalugacēyu - cittaśuddhini kalugacēyu - bhaktini salupuduru).
ka. “daḷamaina puṣpamainanu
phalamaina salilamainanu bāyani bhaktiṃ
golicina janularpiṃcina
nelami rucirānnamuganē yēnu bhujiṃtun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. - 1010)
(sṛṣṭilōnunna samasta vastuvulu bhagavaṃtunicē sṛṣṭiṃcabaḍinavē - aṃducēta avannī atanivē - atani vastuvu atanikiccuṭa goppakādu - kaliginavārunnāru, lēmilōnunnavārunnāru, aṃdaṟu viluvagala vastuvulanē bhagavaṃtunaku samarpiṃcavalenaṃṭe sādhyamukādu - bhagavaṃtuniki arpiṃcuṭalō vastuvuyokka viluva pradhānamukādu - bhaktiyē pradhānamu, bhaktitō niccinadē viluvakaladi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.