← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భక్తిప్రకారము bhaktiprakāramu

Original — తెలుగు
  1. “కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్ధ్యా త్మనావా ప్రకృతేః ప్రభావాత్ |

కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి” (శ్రీమద్భాగవతం - )

(శరీరముచేతగాని, వాక్కుచేతగాని, మనస్సుచేతగాని, ఇతరేంద్రియములచేతగాని, బుద్ధిచేతగాని, నా స్వభావముచేతగాని నేనేపనిని చేసినను దానిని (దానిఫలమంతయు) పరబ్రహ్మ అయిన నారాయణునకే సమర్పించుచున్నాను).

  1. “యత్కరోషి యదశ్నాపి, యజ్జుహోషి, దదానియత్ |

యత్త పన్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం |

శుభా శుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః |

సన్యాసయోగ యుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 27, 28)

“యత్కరోషి స్వతః ప్రాప్తం యదశ్నాపి స్వతృప్తయే |

శ్రౌతంవా స్మార్తమధవా యజ్జు హోషివిధేర్భలాత్ |

అతిధి బ్రాహ్మణాదిభ్యో హేమాన్నాది దదాసియత్ |

ఛాంద్రాయాణాదికం దోష శాంత్యై చరసి యత్తవః |

ఉచ్ఛృంకల ప్రవృత్తేర్వా నిరాసాయాత్మ సం యమం |

లౌకికం వైదికం ప్రాణి స్వభావాద్వా కరోషయత్ |

మయ్యర్పితం యథా తత్స్యాత్కురుష్వత్వం తథా |

సమర్పకగతం సర్వం సమర్పణ ఫలం యతః |

అవశ్యం భావినాం సర్వ కర్మణాం పరమేశ్వరే |

ప్రీత్యా సమర్పణం నిత్యం భజనం మే మయేరితం |

నతుక్వ చిత్తదర్థేస్తి కర్తవ్యా వ్యాపృతిః పృధక్ ||“. (గీతాభావప్రకాశము - 9 - 178 to 183)

(నీవు యే పని చేసినను దానిని నాకర్పించుము - నీకు దొరికినది, నీ తృప్తికొఱకు నీవుతినునది, నాకర్పింపుము - శ్రుతిలో చెప్పనదికాని, స్మృతులలో చెప్పినదికాని యే యజ్ఞము నువ్వు చేసినను దానిని నాకర్పింపుము - అతిధికొఱకుగని, బ్రాహ్మణుడు మొదలగువారి కొఱకు గాని, నీవు దేనిని దానముగా ఇచ్చినను అది నా కర్పింపుము - దోష శాంతికొఱకు ఏ తపము చేసినను దానిని నాకర్పింపుము - ఈ రీతిగా నీవి నాకు సమర్పించుదాని ఫలమంతయు నీదే, నీవు చేయు సర్వకర్మలను భక్తితో పరమేశ్వరుడనైన నాకు సమర్పించుటయే నన్ను నిత్యము భజించుట. ఈ ప్రకారముగ అనాయాసముగ నా భజనము సిద్ధించును. కనుక ఇష్టానిష్టఫలములుగల కర్మబంధమునుండి విడివడుదువు. కర్మలను భగవంతునికి సమర్పించుట వలన సంసారము మరికలుగదు. గోవిందుడనైన నాయందు సర్వకర్మలను సమర్పించి కర్మఫల సన్యాసము చేయుటచిత్తశుద్ధికలుగుటచేత, యోగమగును - ఇట్టి యోగముచేత సమాహిత మనస్కుడగును - జీవించియుండగనే ముక్తుడగును. ప్రారబ్దకర్మ నశించుటవలన ఆత్మతత్వమును సాక్షాత్కరించుకొనినవాడై యీ శరీరపతనానంతరము కైవల్యపదమని చెప్పబడుచున్న నన్ను పొందెదవు. సమస్త ఉపాదులు లేనందువలన బ్రహ్మరూపుడవై స్వమహిమయందు (బ్రహ్మమహిమ యందు) ప్రతిష్టుడవై యుండెదవు).

  1. “మానావమనే లాభాలాభే జయాప జయే సుఖదుఃఖాదికం చాగణయిత్వా, ఆసక్తిం ఫలేచ్ఛాంచ త్యక్త్వా శరీరే సంసారే చాత్మనః కృతో అహంతా మమతారాహిత్యేన ఏకమాత్రం పరమ ప్రియతమం, శ్రీభగవంతమేవ పరమాశ్రయం పరమాం గతిం పరమం సుహృదంమత్వా అనన్య భావేన అత్యంత శ్రద్ధయా సహప్రేమ పూర్వకం తస్యనామ గుణ ప్రభావస్వరూపాణాం తైలధారవ న్నిరంతరం చింతనపురస్సరం పరమానందే నిమగ్నీభవనం తదైవం చింతన పరాయణతా పూర్వకం కేవలం తస్య పరమ ప్రియతమస్య భగవతః కృతేతదీయాం రుచి మిచ్ఛాంచాను స్మృత్య తస్యైవ ప్రీత్యర్థం, తస్యైవ సుఖప్రాప్తి సంబంధినఃసదృఢాత్ పరమ స్వార్థాతి ప్రేరణాం ప్రాప్య సర్వథా మిస్స్వార్థభావేన సమస్త దైహిక, వాచిక, మానసిక కర్మణాం ఆచరణం యది కేనాపి కారణేన క్షణమపి తస్య చింతనం స్మరణం వా పరిత్యక్తం స్యాత్ తదా నిష్కాసితాన్ మత్స్యాదపి అనంత గుగాధికాయాః వ్యాకులతయా అనుభవనం - ఇయమేవ సర్వోత్కృష్టా భక్తిరస్తి”.

(మానావమానములను, లాభాలాభములను, జయాపజయములను, సుఖదుఃఖములను లెక్కసేయక, చేయుపనులందాసక్తిని వాటివలన కలుగు ఫలమును విడిచిపెట్టి, శరీరమందు సంసారమందు నేను, నాయది యను అహంకారమమకారములను విడిచిపెట్టి, అన్నింటికంటె ప్రియుండు ఒకడే అయిన భగవంతుని అతడే పరమాశ్రయుడని, పరమగతి, పరమ సుహృదుడు అని తలచి, ఇతరములన్నింటిని వదలి, గొప్ప శ్రద్ధతో, ప్రేమతో అతని నామములను, గుణములను, ప్రభావమును, స్వరూపమును, తైలధారవలె ఎడతెగకుండునట్లు ఎల్లపుడు చింతించుచు (ధ్యానించుచు) పరమానందమునందు మునిగియుండుట భక్తి. ఈ ప్రకారముగా పరమప్రియుడైన భగవంతునియందు అనన్యభక్తి చేయుటవలన స్వార్థభావములేక దేహమునకు, వాక్కునకు మనస్సునకు సంబంధించిన కర్మలయందు ఏ కారణముచేతనైనను ఆ భగవంతుని గుఱించి చింతించుటగాని, స్మరించుటగాని మఱచుట తటస్థించినయడల,నీళ్ళలోనున్న చేప పైనబడినట్లు, అధికమైన వ్యాకులత (బాధ) చెందుట భక్తి - ఇది భక్తి లక్షణము).

  1. “సీ. సంతతంబును కృష్ణుసంకీర్తనంబులు వీనుల కింపుగా వినగవలయు

హర్షంబు తొడుత హరినామకథనంబు పాటల నాటల బరగవలయు

నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీధి సతతంబు నెన్నవలయు

గంజాక్షు లీలలు కాంతారములనైన భక్తి యుక్తంబుగా బాడవలయు

తే. వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని

నొడవుచును;లోకబాహ్యత నొంద వలయు

నింతయును విష్ణుమయమని యెఱుగవలయు

భేదమొనరింపవలదు మేదినీశ. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 44)

  1. “శ్లో||. శ్రీకృష్ణ శ్రవణే పరీక్ష ద భవత్ వైయాసికః కీర్తనే |

ప్రహ్లాద స్మరణే తదంఘ్రి భజనే లక్ష్మీః పృధుః పూజనే |

అక్రూరస్త్వభివందనే కపిపతిర్ధ్యాసేచ సఖ్యే (అ)ర్జునః |

దేవస్యాత్మ నివేదనే బలిర భూత్ సర్వస్య సం పూజనే ||“.

(శ్రవణముచే పరీక్షన్మహారాజు, కీర్తనముచే శుకమహర్షి, స్మరణముచే ప్రహ్లాదుడు, పాదసేవనముచే లక్ష్మీదేవి, అర్చనముచే పృధుచక్రవర్తి, వందనముచే నక్రూరుడు, దాస్య ముచే హనుమంతుడు, సమర్పణచే బలిచక్రవర్తి - ఈ భక్తిమార్గములచేత తరించిరి).

  1. “శ్లో||. మద్భక్తజనవాత్సల్యం పూజాయాంచాను మోదనం |

మత్కథాశ్రవణే సక్తిః మదర్థే దంభవర్జనం |

స్వయమభ్యర్చనం చైవ స్వనేత్రాంగవిక్రియా |

మా మనుస్మరణం నిత్యం యచ్చ మాంచోప జీవతి |

భక్తిరష్టవిధాహ్యేషా యస్మిన్ మ్లేచ్ఛే (అ)పివర్తతే |

స విప్రేంద్రోమునిశ్రేష్టః సయతి స్సచ పండితః ||’.

(భగవంతుని భక్తులయందు వాత్సల్యము కలిగియుండుట. భగవంతుని పూజ చేయుట యందు సంతోషము కలిగియుండుట, భగవంతుని కథలు వినుటయందు ఆసక్తి కలిగియుండుట, భగవంతుని గుఱించి చేయు పనులలో దంభము లేకుండుట, స్వయముగాభగవంతుని అర్చన చేయుట, భగవంతుని అనుక్షణము స్మరించుట, ఎల్లపుడు నా కొఱకేజీవించియుండుట, శరీరములోని ప్రతి అంగమునకు వికారము కలుగునట్లుండుట - ఈ ఎనిమిది విధముల భక్తి ఎవనికి కలుగునో, అట్టివాడు మ్లేచ్ఛుడైనను బ్రాహ్మణ శ్రేష్టుడే,అతనే యతి, అతనే పండితుడు).

  1. “మన్మనా భవ మద్భక్తో, మద్యాజీ, మాం నమస్కురు |

మామే వైష్యసి యెక్త్యైవ మాత్మానం మత్పరాయణం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 34)

(నాయందే మనస్సు కలిగియుండుము, నాయందు భక్తి కలిగియుండుము నాకు నమస్కరించుచుండుము - ఈ ప్రకారము యోగయుక్తుడవై నేనే ఉత్కృష్టమైన పొందదగినవాడనని నన్నే తలంచుచు, ఇతరమును తలంపక యుండుము. ఇట్లు చేసిన నన్నే పొందెదవు - ముక్తిని పొందెదవు).

  1. “శా. కామోత్కంఠిత గోపికల్ భయమునం గంసుండు వైరక్రియా |

సామగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులుం |

బ్రేమన్ మీరలు, భక్తికామునిదె చక్రింగటిమెట్లైన ను |

ద్దామధ్యాన గరిష్టుడైన హరిచెందన్ వచ్చు ధాత్రీశ్వర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 18 -)

  1. “యే యధా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం |

మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||’. (శ్రీమద్భగవద్గీత - 4 - 11). (చూడుము - భక్తః - 7)

(గీతాభావప్రకాశము 4 - 71 to 75)

Transliteration
  1. “kāyēna vācā manasēṃdriyairvā budhdhyā tmanāvā prakṛtēḥ prabhāvāt |

karōmi yadyat sakalaṃ parasmai nārāyaṇāyēti samarpayāmi” (śrīmadbhāgavataṃ - )

(śarīramucētagāni, vākkucētagāni, manassucētagāni, itarēṃdriyamulacētagāni, buddhicētagāni, nā svabhāvamucētagāni nēnēpanini cēsinanu dānini (dāniphalamaṃtayu) parabrahma ayina nārāyaṇunakē samarpiṃcucunnānu).

  1. “yatkarōṣi yadaśnāpi, yajjuhōṣi, dadāniyat |

yatta panyasi kauṃtēya tatkuruṣva madarpaṇaṃ |

śubhā śubha phalairēvaṃ mōkṣyasē karma baṃdhanaiḥ |

sanyāsayōga yuktātmā vimuktō māmupaiṣyasi ||“. (śrīmadbhagavadgīta - 9 - 27, 28)

“yatkarōṣi svataḥ prāptaṃ yadaśnāpi svatṛptayē |

śrautaṃvā smārtamadhavā yajju hōṣividhērbhalāt |

atidhi brāhmaṇādibhyō hēmānnādi dadāsiyat |

chāṃdrāyāṇādikaṃ dōṣa śāṃtyai carasi yattavaḥ |

ucchṛṃkala pravṛttērvā nirāsāyātma saṃ yamaṃ |

laukikaṃ vaidikaṃ prāṇi svabhāvādvā karōṣayat |

mayyarpitaṃ yathā tatsyātkuruṣvatvaṃ tathā |

samarpakagataṃ sarvaṃ samarpaṇa phalaṃ yataḥ |

avaśyaṃ bhāvināṃ sarva karmaṇāṃ paramēśvarē |

prītyā samarpaṇaṃ nityaṃ bhajanaṃ mē mayēritaṃ |

natukva cittadarthēsti kartavyā vyāpṛtiḥ pṛdhak ||“. (gītābhāvaprakāśamu - 9 - 178 to 183)

(nīvu yē pani cēsinanu dānini nākarpiṃcumu - nīku dorikinadi, nī tṛptikoṟaku nīvutinunadi, nākarpiṃpumu - śrutilō ceppanadikāni, smṛtulalō ceppinadikāni yē yajñamu nuvvu cēsinanu dānini nākarpiṃpumu - atidhikoṟakugani, brāhmaṇuḍu modalaguvāri koṟaku gāni, nīvu dēnini dānamugā iccinanu adi nā karpiṃpumu - dōṣa śāṃtikoṟaku ē tapamu cēsinanu dānini nākarpiṃpumu - ī rītigā nīvi nāku samarpiṃcudāni phalamaṃtayu nīdē, nīvu cēyu sarvakarmalanu bhaktitō paramēśvaruḍanaina nāku samarpiṃcuṭayē nannu nityamu bhajiṃcuṭa. ī prakāramuga anāyāsamuga nā bhajanamu siddhiṃcunu. kanuka iṣṭāniṣṭaphalamulugala karmabaṃdhamunuṃḍi viḍivaḍuduvu. karmalanu bhagavaṃtuniki samarpiṃcuṭa valana saṃsāramu marikalugadu. gōviṃduḍanaina nāyaṃdu sarvakarmalanu samarpiṃci karmaphala sanyāsamu cēyuṭacittaśuddhikaluguṭacēta, yōgamagunu - iṭṭi yōgamucēta samāhita manaskuḍagunu - jīviṃciyuṃḍaganē muktuḍagunu. prārabdakarma naśiṃcuṭavalana ātmatatvamunu sākṣātkariṃcukoninavāḍai yī śarīrapatanānaṃtaramu kaivalyapadamani ceppabaḍucunna nannu poṃdedavu. samasta upādulu lēnaṃduvalana brahmarūpuḍavai svamahimayaṃdu (brahmamahima yaṃdu) pratiṣṭuḍavai yuṃḍedavu).

  1. “mānāvamanē lābhālābhē jayāpa jayē sukhaduḥkhādikaṃ cāgaṇayitvā, āsaktiṃ phalēcchāṃca tyaktvā śarīrē saṃsārē cātmanaḥ kṛtō ahaṃtā mamatārāhityēna ēkamātraṃ parama priyatamaṃ, śrībhagavaṃtamēva paramāśrayaṃ paramāṃ gatiṃ paramaṃ suhṛdaṃmatvā ananya bhāvēna atyaṃta śraddhayā sahaprēma pūrvakaṃ tasyanāma guṇa prabhāvasvarūpāṇāṃ tailadhārava nniraṃtaraṃ ciṃtanapurassaraṃ paramānaṃdē nimagnībhavanaṃ tadaivaṃ ciṃtana parāyaṇatā pūrvakaṃ kēvalaṃ tasya parama priyatamasya bhagavataḥ kṛtētadīyāṃ ruci micchāṃcānu smṛtya tasyaiva prītyarthaṃ, tasyaiva sukhaprāpti saṃbaṃdhinaḥsadṛḍhāt parama svārthāti prēraṇāṃ prāpya sarvathā missvārthabhāvēna samasta daihika, vācika, mānasika karmaṇāṃ ācaraṇaṃ yadi kēnāpi kāraṇēna kṣaṇamapi tasya ciṃtanaṃ smaraṇaṃ vā parityaktaṃ syāt tadā niṣkāsitān matsyādapi anaṃta gugādhikāyāḥ vyākulatayā anubhavanaṃ - iyamēva sarvōtkṛṣṭā bhaktirasti”.

(mānāvamānamulanu, lābhālābhamulanu, jayāpajayamulanu, sukhaduḥkhamulanu lekkasēyaka, cēyupanulaṃdāsaktini vāṭivalana kalugu phalamunu viḍicipeṭṭi, śarīramaṃdu saṃsāramaṃdu nēnu, nāyadi yanu ahaṃkāramamakāramulanu viḍicipeṭṭi, anniṃṭikaṃṭe priyuṃḍu okaḍē ayina bhagavaṃtuni ataḍē paramāśrayuḍani, paramagati, parama suhṛduḍu ani talaci, itaramulanniṃṭini vadali, goppa śraddhatō, prēmatō atani nāmamulanu, guṇamulanu, prabhāvamunu, svarūpamunu, tailadhāravale eḍategakuṃḍunaṭlu ellapuḍu ciṃtiṃcucu (dhyāniṃcucu) paramānaṃdamunaṃdu munigiyuṃḍuṭa bhakti. ī prakāramugā paramapriyuḍaina bhagavaṃtuniyaṃdu ananyabhakti cēyuṭavalana svārthabhāvamulēka dēhamunaku, vākkunaku manassunaku saṃbaṃdhiṃcina karmalayaṃdu ē kāraṇamucētanainanu ā bhagavaṃtuni guṟiṃci ciṃtiṃcuṭagāni, smariṃcuṭagāni maṟacuṭa taṭasthiṃcinayaḍala,nīḷḷalōnunna cēpa painabaḍinaṭlu, adhikamaina vyākulata (bādha) ceṃduṭa bhakti - idi bhakti lakṣaṇamu).

  1. “sī. saṃtataṃbunu kṛṣṇusaṃkīrtanaṃbulu vīnula kiṃpugā vinagavalayu

harṣaṃbu toḍuta harināmakathanaṃbu pāṭala nāṭala baragavalayu

nārāyaṇuni divya nāmākṣaraṃbulu hṛdvīdhi satataṃbu nennavalayu

gaṃjākṣu līlalu kāṃtāramulanaina bhakti yuktaṃbugā bāḍavalayu

tē. veṟṟimāḍkini līlatō viśvamayuni

noḍavucunu;lōkabāhyata noṃda valayu

niṃtayunu viṣṇumayamani yeṟugavalayu

bhēdamonariṃpavaladu mēdinīśa. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 44)

  1. “ślō||. śrīkṛṣṇa śravaṇē parīkṣa da bhavat vaiyāsikaḥ kīrtanē |

prahlāda smaraṇē tadaṃghri bhajanē lakṣmīḥ pṛdhuḥ pūjanē |

akrūrastvabhivaṃdanē kapipatirdhyāsēca sakhyē (a)rjunaḥ |

dēvasyātma nivēdanē balira bhūt sarvasya saṃ pūjanē ||“.

(śravaṇamucē parīkṣanmahārāju, kīrtanamucē śukamaharṣi, smaraṇamucē prahlāduḍu, pādasēvanamucē lakṣmīdēvi, arcanamucē pṛdhucakravarti, vaṃdanamucē nakrūruḍu, dāsya mucē hanumaṃtuḍu, samarpaṇacē balicakravarti - ī bhaktimārgamulacēta tariṃciri).

  1. “ślō||. madbhaktajanavātsalyaṃ pūjāyāṃcānu mōdanaṃ |

matkathāśravaṇē saktiḥ madarthē daṃbhavarjanaṃ |

svayamabhyarcanaṃ caiva svanētrāṃgavikriyā |

mā manusmaraṇaṃ nityaṃ yacca māṃcōpa jīvati |

bhaktiraṣṭavidhāhyēṣā yasmin mlēcchē (a)pivartatē |

sa viprēṃdrōmuniśrēṣṭaḥ sayati ssaca paṃḍitaḥ ||’.

(bhagavaṃtuni bhaktulayaṃdu vātsalyamu kaligiyuṃḍuṭa. bhagavaṃtuni pūja cēyuṭa yaṃdu saṃtōṣamu kaligiyuṃḍuṭa, bhagavaṃtuni kathalu vinuṭayaṃdu āsakti kaligiyuṃḍuṭa, bhagavaṃtuni guṟiṃci cēyu panulalō daṃbhamu lēkuṃḍuṭa, svayamugābhagavaṃtuni arcana cēyuṭa, bhagavaṃtuni anukṣaṇamu smariṃcuṭa, ellapuḍu nā koṟakējīviṃciyuṃḍuṭa, śarīramulōni prati aṃgamunaku vikāramu kalugunaṭluṃḍuṭa - ī enimidi vidhamula bhakti evaniki kalugunō, aṭṭivāḍu mlēcchuḍainanu brāhmaṇa śrēṣṭuḍē,atanē yati, atanē paṃḍituḍu).

  1. “manmanā bhava madbhaktō, madyājī, māṃ namaskuru |

māmē vaiṣyasi yektyaiva mātmānaṃ matparāyaṇaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 34)

(nāyaṃdē manassu kaligiyuṃḍumu, nāyaṃdu bhakti kaligiyuṃḍumu nāku namaskariṃcucuṃḍumu - ī prakāramu yōgayuktuḍavai nēnē utkṛṣṭamaina poṃdadaginavāḍanani nannē talaṃcucu, itaramunu talaṃpaka yuṃḍumu. iṭlu cēsina nannē poṃdedavu - muktini poṃdedavu).

  1. “śā. kāmōtkaṃṭhita gōpikal bhayamunaṃ gaṃsuṃḍu vairakriyā |

sāmagrin śiśupālamukhya nṛpatul, saṃbaṃdhulai vṛṣṇuluṃ |

brēman mīralu, bhaktikāmunide cakriṃgaṭimeṭlaina nu |

ddāmadhyāna gariṣṭuḍaina hariceṃdan vaccu dhātrīśvara”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 18 -)

  1. “yē yadhā māṃ prapadyaṃtē tāṃstadaiva bhajāmyahaṃ |

mama vartānuvartaṃtē manuṣyāḥ pārtha sarvaśaḥ ||’. (śrīmadbhagavadgīta - 4 - 11). (cūḍumu - bhaktaḥ - 7)

(gītābhāvaprakāśamu 4 - 71 to 75)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.