← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భక్తిసాధనములు bhaktisādhanamulu

Original — తెలుగు
  1. భక్తి సాధకం విషయత్యాగాత్, సంగత్యాగాచ్చ సంపన్నం భవతి.

(విషయములను త్యజించుటవలనను, సంగమునువదలివేయుటవలనను - దేనియందును ఆసక్తి లేకుండుటవలనను భక్తికలగును).

  1. లోకే అపి భగవద్గుణశ్రవణేన, తత్కీర్తనేన చ, భక్తి సాధనం సంపన్నం భవతి - కర్ణాభ్యాం భగవతః గుణానాం నామ్నాంచ, శ్రవణం, వా చాచ తేషాం కీర్తనం కర్తవ్యం –

"తాయే శృణ్వంతి గాయంతి హ్యనుమోదంతి చాదృతాః |

మత్పరాః శ్రద్ధధానాశ్చ భక్తిం విందంతి తేమయి ||" (శ్రీమద్భాగవతం - 11 - 26)

"యే జనాః మత్పరాః మయి సమర్పిత చిత్తాః భూత్వా శ్రద్ధయా సమాదరేణచ సహ మమ నామగుణలీలానాం కథాం శృణ్వంతి,గాయంతి, అనుమోదం తేచ, తేషాం మయి అనన్య భక్తిర్భవతి".

(నాయందే సమర్పించబడిన మనస్సుగలవాడై శ్రద్ధతో నా నామములను, అనంత కల్యాణగుణములను లీలలను, నాగుఱించి అయిన కథలను వినుచు, పాడుచు, సంతోషించువారికి నాయందు - భగవంతునియందు - అనన్య భక్తి కలుగును).

  1. అఖండేన భజనేన భక్తేః సాధనం సపన్నం భవతి.

(ఎడతెగకుండ భగవంతుని భజన చేయుటవలన భక్తి సాధనము సమకూరును).

  1. తస్యాః జ్ఞానమేవ సాధనం ఇత్యేకే. (నారదభక్తిసూత్రములు - 28).

(భక్తికి - భక్తి కలుగుటకు - జ్ఞానమే సాధనమని ఒకరి అభిప్రాయము) - " తస్యాః భక్తేః సాధనం జ్ఞానమేవ అస్తి కేషాం చిదాచార్యాణాం మతం-".

(భక్తిసాధనము జ్ఞానమే యని కొందఱి ఆచార్యుల మతము - అభిప్రాయము).

"తత్తు విషయ త్యాగాత్ సగత్యాగాచ్చ; అవ్యావృత భజనాత్, లోకే(అపి) భగవద్గుణ శ్రవణ కీర్తనాత్, ముఖ్యతస్తు మహత్కృపయైవ, భగవత్కృపాలేశాద్వా - దుస్సంగః సదైవ త్యాజ్యః ". (నారద భక్తిసూత్రములు - 35 to 38 & 43)

(భగవంతునియందు ప్రేమ - భక్తి - విషయములను వదలివేయుటవలనను - విషయములందాసక్తి లేకుండుటవలనను, భగవంతుని అనంతకల్యాణగుణములను వినుటవలనను, వాటిని కీర్తించుట వలనను, ముఖ్యముగా మహాత్ముల కృపవలనను, లేక, భగవంతునియొక్క లేశమాత్రమైన దయచేతను కలుగును).

  1. "యదహం యం భజామి స ఏవ సర్వేషాం స్వామీ, సర్వేషామాధారః, సర్వ మహేశ్వరో జగతః ఉత్పాదకః, పాలకః, సంహారకశ్చ, మాయాయాః పతిః, అజో, అవినాశీ, సర్వశక్తిమాన్, సర్వజ్ఞః సర్వాత్మా, నిర్గుణో, నిర్వికారో, నిరాకారః, సగుణః, సాకారో, భగవాన్ అస్తి. తతః శ్రేష్టమన్యత్ కిమపి నాస్తి యతః యతావదపి జ్ఞానం చేన్నస్యాత్, తథా శ్రద్ధా న భవిష్యతి, శ్రద్ధాం వినా ప్రీతర్నస్యాత్, ప్రీతించ వినా భక్తిర్ద్విధా నస్యాత్|".

(నేను ఎవరిని భజించుచున్నానో అతనే అందఱికి స్వామి (ప్రభువు), అందఱికి ఆధారమైనవాడు, అన్నింటికి ఈశ్వరుడు - శాచించువాడు, జగత్తునకు సృష్టిస్థితిలయములు చేయువాడు, మాయను తన స్వాధీనములో నుంచుకొనినవాడు, జన్మ లేనివాడు, నాశములేనివాడు, సమస్త శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు - అన్నియును తెలిసినవాడు - అన్నింటికి ఆత్మ అయినవాడు - నిర్గుణుడు (సత్వరజస్తమోగుణములు లేనివాడు), త్రిగుణములకు అతీతుడు, వికారములు లేనివాడు (తనలో ఏ విధమైన మార్పులు లేక ఎల్లకాలమందు ఒకే విధముగ నుండువాడు), ఆకారము - రూపము - లేనివాడు, సమస్త కల్యాణగుణములు కలవాడు, (లేక, త్రిగుణములతో కలిసి యుండునపుడు ఆ గుణములు కలవాడు - అనగా, ప్రకృతి దాని వికారములతో కలిసినపుడు, అవతారములలో ఆ కల్యాణగుణములు కలవాడు, లేక తనలోనుండి పుట్టిన సమస్త వస్తువుల ఆకారము తనవే అయినవాడు, కనుక రూపము కలవాడు - త్రిమూర్తులవలె రూపమునొందినవాడు, - ఇట్టివాడైన భగవంతుడు (షడ్గుణైశ్వర్యములు గలవాడు) ఒకడు కలడు - అతని కంటె శ్రేష్టమైన వాడు ఇంకొకడు లేడు, శ్రేష్టమైనవాడు ఇంకొకడు లేదు " అని భగవంతుని గుఱించి పైన చెప్పబడినమాత్ర జ్ఞానము లేకుండిన శ్రద్ధ కలుగదు, శ్రద్ధ లేనపుడు ప్రీతి - భగవంతునియందు ప్రేమ - కలుగదు. ప్రీతి లేనపుడు భగవంతునియందు ధృఢమైన భక్తి కుదరదు).

" పరంతు అత్ర అద్వైతజ్ఞాన సాధనస్య అవశ్యకతా న భవతి. గృధ్రిరాజ, గజేంద్ర, శబరీ ప్రభృతయః భక్తాః కేవలాయా ఏతాదృశ్యైవం భగవద్భక్త్యా భగవంతం ప్రాప్నువన్ ".

(భక్తి విషయములో అద్వైత బ్రహ్మజ్ఞానమవసరములేదు - జటాయువు, గజేంద్రుడు, శబరి మొదలగువారు ఈ మాత్రము భగవంతునియందు భక్తి కలిగియుండుటచేతనే భగవంతుని పొందిరి - ముక్తిని పొందిరి. అందుచేత ఈ మాత్రము కొంచెమైనను భగవత్ జ్ఞానమవసరము. అదియే భక్తికి సాధనము).

  1. "శరీరం విషయ భోగే సంలగ్నం భవేన్మనశ్చ విషయేషు ఆసక్తంస్యాత్. తదాపునః ప్రియతమస్య భగవతః సేవా కేన శరీరేణ, మనసావా భవిష్యతి? అతి ఏవ విషయత్యాగస్య మహాత్యాగస్యావశ్యకతా అస్తి ".

(శరీరము విషయములననుభవించడమందు లగ్నమై యుండును. మనస్సు విషయములందు ఆసక్తి కలిగియుండును. ఇట్టి స్థితిలో ప్రియుడైన భగవంతునియొక్క సేవ చేయుటకు శరీరమేది? మనస్సేది? అందుచేతనే విషయములను త్యజించుట - విషయములందాసక్తిని వదలివేయుట - అను మహాత్యాగము భక్తికి అవసరము).

  1. "ప్రధమం మహతాం సేవా తద్దయా పాత్రతా, తతః |

శ్రద్దాధ తేషాం ధర్మేషు. తతోహరిహరిగుణ స్తుతిః |

తతోరత్యం కురోత్పత్తిః స్వరూపాధిగతిస్తతః |

ప్రేమ వృద్ధిః పరానందే తస్యాధి స్ఫురణం తతః |

భగవద్దర్మ నిష్ఠాతః స్వస్మిం స్తద్గుణ శాలితా |

ప్రేమ్ణో (అ)ధపరాకాష్టే త్యుదితా భక్తి భూమికా ||". (మధుసూధనసరస్వతి)

(భక్తి భూమికలు - మొదట మహాపురుషులసేవ, వారి దయపొందుట, వారి ధర్మములందు శ్రద్ధ కలిగియుండుట, భగవంతుని గుణములను స్తోత్రముచేయుట, తర్వాత భగవంతుని యందు ప్రేమ కలిగియుండుట, భగవద్ధర్మములందు నిష్ట కలిగియుండుటచేత సద్గుణములు కలిగియుండుట).

Transliteration
  1. bhakti sādhakaṃ viṣayatyāgāt, saṃgatyāgācca saṃpannaṃ bhavati.

(viṣayamulanu tyajiṃcuṭavalananu, saṃgamunuvadalivēyuṭavalananu - dēniyaṃdunu āsakti lēkuṃḍuṭavalananu bhaktikalagunu).

  1. lōkē api bhagavadguṇaśravaṇēna, tatkīrtanēna ca, bhakti sādhanaṃ saṃpannaṃ bhavati - karṇābhyāṃ bhagavataḥ guṇānāṃ nāmnāṃca, śravaṇaṃ, vā cāca tēṣāṃ kīrtanaṃ kartavyaṃ –

"tāyē śṛṇvaṃti gāyaṃti hyanumōdaṃti cādṛtāḥ |

matparāḥ śraddhadhānāśca bhaktiṃ viṃdaṃti tēmayi ||" (śrīmadbhāgavataṃ - 11 - 26)

"yē janāḥ matparāḥ mayi samarpita cittāḥ bhūtvā śraddhayā samādarēṇaca saha mama nāmaguṇalīlānāṃ kathāṃ śṛṇvaṃti,gāyaṃti, anumōdaṃ tēca, tēṣāṃ mayi ananya bhaktirbhavati".

(nāyaṃdē samarpiṃcabaḍina manassugalavāḍai śraddhatō nā nāmamulanu, anaṃta kalyāṇaguṇamulanu līlalanu, nāguṟiṃci ayina kathalanu vinucu, pāḍucu, saṃtōṣiṃcuvāriki nāyaṃdu - bhagavaṃtuniyaṃdu - ananya bhakti kalugunu).

  1. akhaṃḍēna bhajanēna bhaktēḥ sādhanaṃ sapannaṃ bhavati.

(eḍategakuṃḍa bhagavaṃtuni bhajana cēyuṭavalana bhakti sādhanamu samakūrunu).

  1. tasyāḥ jñānamēva sādhanaṃ ityēkē. (nāradabhaktisūtramulu - 28).

(bhaktiki - bhakti kaluguṭaku - jñānamē sādhanamani okari abhiprāyamu) - " tasyāḥ bhaktēḥ sādhanaṃ jñānamēva asti kēṣāṃ cidācāryāṇāṃ mataṃ-".

(bhaktisādhanamu jñānamē yani koṃdaṟi ācāryula matamu - abhiprāyamu).

"tattu viṣaya tyāgāt sagatyāgācca; avyāvṛta bhajanāt, lōkē(api) bhagavadguṇa śravaṇa kīrtanāt, mukhyatastu mahatkṛpayaiva, bhagavatkṛpālēśādvā - dussaṃgaḥ sadaiva tyājyaḥ ". (nārada bhaktisūtramulu - 35 to 38 & 43)

(bhagavaṃtuniyaṃdu prēma - bhakti - viṣayamulanu vadalivēyuṭavalananu - viṣayamulaṃdāsakti lēkuṃḍuṭavalananu, bhagavaṃtuni anaṃtakalyāṇaguṇamulanu vinuṭavalananu, vāṭini kīrtiṃcuṭa valananu, mukhyamugā mahātmula kṛpavalananu, lēka, bhagavaṃtuniyokka lēśamātramaina dayacētanu kalugunu).

  1. "yadahaṃ yaṃ bhajāmi sa ēva sarvēṣāṃ svāmī, sarvēṣāmādhāraḥ, sarva mahēśvarō jagataḥ utpādakaḥ, pālakaḥ, saṃhārakaśca, māyāyāḥ patiḥ, ajō, avināśī, sarvaśaktimān, sarvajñaḥ sarvātmā, nirguṇō, nirvikārō, nirākāraḥ, saguṇaḥ, sākārō, bhagavān asti. tataḥ śrēṣṭamanyat kimapi nāsti yataḥ yatāvadapi jñānaṃ cēnnasyāt, tathā śraddhā na bhaviṣyati, śraddhāṃ vinā prītarnasyāt, prītiṃca vinā bhaktirdvidhā nasyāt|".

(nēnu evarini bhajiṃcucunnānō atanē aṃdaṟiki svāmi (prabhuvu), aṃdaṟiki ādhāramainavāḍu, anniṃṭiki īśvaruḍu - śāciṃcuvāḍu, jagattunaku sṛṣṭisthitilayamulu cēyuvāḍu, māyanu tana svādhīnamulō nuṃcukoninavāḍu, janma lēnivāḍu, nāśamulēnivāḍu, samasta śaktulu galavāḍu, sarvajñuḍu - anniyunu telisinavāḍu - anniṃṭiki ātma ayinavāḍu - nirguṇuḍu (satvarajastamōguṇamulu lēnivāḍu), triguṇamulaku atītuḍu, vikāramulu lēnivāḍu (tanalō ē vidhamaina mārpulu lēka ellakālamaṃdu okē vidhamuga nuṃḍuvāḍu), ākāramu - rūpamu - lēnivāḍu, samasta kalyāṇaguṇamulu kalavāḍu, (lēka, triguṇamulatō kalisi yuṃḍunapuḍu ā guṇamulu kalavāḍu - anagā, prakṛti dāni vikāramulatō kalisinapuḍu, avatāramulalō ā kalyāṇaguṇamulu kalavāḍu, lēka tanalōnuṃḍi puṭṭina samasta vastuvula ākāramu tanavē ayinavāḍu, kanuka rūpamu kalavāḍu - trimūrtulavale rūpamunoṃdinavāḍu, - iṭṭivāḍaina bhagavaṃtuḍu (ṣaḍguṇaiśvaryamulu galavāḍu) okaḍu kalaḍu - atani kaṃṭe śrēṣṭamaina vāḍu iṃkokaḍu lēḍu, śrēṣṭamainavāḍu iṃkokaḍu lēdu " ani bhagavaṃtuni guṟiṃci paina ceppabaḍinamātra jñānamu lēkuṃḍina śraddha kalugadu, śraddha lēnapuḍu prīti - bhagavaṃtuniyaṃdu prēma - kalugadu. prīti lēnapuḍu bhagavaṃtuniyaṃdu dhṛḍhamaina bhakti kudaradu).

" paraṃtu atra advaitajñāna sādhanasya avaśyakatā na bhavati. gṛdhrirāja, gajēṃdra, śabarī prabhṛtayaḥ bhaktāḥ kēvalāyā ētādṛśyaivaṃ bhagavadbhaktyā bhagavaṃtaṃ prāpnuvan ".

(bhakti viṣayamulō advaita brahmajñānamavasaramulēdu - jaṭāyuvu, gajēṃdruḍu, śabari modalaguvāru ī mātramu bhagavaṃtuniyaṃdu bhakti kaligiyuṃḍuṭacētanē bhagavaṃtuni poṃdiri - muktini poṃdiri. aṃducēta ī mātramu koṃcemainanu bhagavat jñānamavasaramu. adiyē bhaktiki sādhanamu).

  1. "śarīraṃ viṣaya bhōgē saṃlagnaṃ bhavēnmanaśca viṣayēṣu āsaktaṃsyāt. tadāpunaḥ priyatamasya bhagavataḥ sēvā kēna śarīrēṇa, manasāvā bhaviṣyati? ati ēva viṣayatyāgasya mahātyāgasyāvaśyakatā asti ".

(śarīramu viṣayamulananubhaviṃcaḍamaṃdu lagnamai yuṃḍunu. manassu viṣayamulaṃdu āsakti kaligiyuṃḍunu. iṭṭi sthitilō priyuḍaina bhagavaṃtuniyokka sēva cēyuṭaku śarīramēdi? manassēdi? aṃducētanē viṣayamulanu tyajiṃcuṭa - viṣayamulaṃdāsaktini vadalivēyuṭa - anu mahātyāgamu bhaktiki avasaramu).

  1. "pradhamaṃ mahatāṃ sēvā taddayā pātratā, tataḥ |

śraddādha tēṣāṃ dharmēṣu. tatōharihariguṇa stutiḥ |

tatōratyaṃ kurōtpattiḥ svarūpādhigatistataḥ |

prēma vṛddhiḥ parānaṃdē tasyādhi sphuraṇaṃ tataḥ |

bhagavaddarma niṣṭhātaḥ svasmiṃ stadguṇa śālitā |

prēmṇō (a)dhaparākāṣṭē tyuditā bhakti bhūmikā ||". (madhusūdhanasarasvati)

(bhakti bhūmikalu - modaṭa mahāpuruṣulasēva, vāri dayapoṃduṭa, vāri dharmamulaṃdu śraddha kaligiyuṃḍuṭa, bhagavaṃtuni guṇamulanu stōtramucēyuṭa, tarvāta bhagavaṃtuni yaṃdu prēma kaligiyuṃḍuṭa, bhagavaddharmamulaṃdu niṣṭa kaligiyuṃḍuṭacēta sadguṇamulu kaligiyuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.