(భక్తియనగా భగవంతుని గుఱించి చేయు భజన, భక్తియే యోగము - భక్తియోగము) (భక్తియేఒక యోగముగా సలుపుట).
(భక్తియే యోగము - యోగమువలె భక్తి సలుపుట - యోగమనగా ఉపాయము - భగవంతుని చేరుటకు - ముక్తి నొందుటకు - ఉపాయమగునది భక్తి).
భగవత్ప్రీతిచే నిరంతరము భగవతస్మృతి కలిగియుండుట భక్తియోగము.
“సర్వయోగ సంప్రాప్యుండగు నిర్గుణుండు భగవంతుండని చెప్పిన జ్ఞానయోగంబును మదీయ భక్తియోగంబును నను రెండు నొక్కటియ”- (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1022)
“ఆ. పద్మనయనుమీది భక్తియోగంబెల్ల
ముక్తి యోగమనుచు మొదలెఱుంగు
వారి వారి, వారివారి, వారి జేరినవారి
త్రోవ బోవవలదు, దూతలార”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 3 - 191)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 955)
(త్రిపాద్విభూతి మహా నారాయణోపనిషత్)
(అధికారులైనవారికిన్నీ - వేదాధ్యయనమునకు తగినవారికిన్నీ - అధికారులు కానివారికిన్నీ భక్తియోగమే ప్రశస్తమైనది. భక్తియోగములో ఉపద్రవము - ఏవిధమైన కష్టముకాని హానికాని - కలుగదు. భక్తియోగమువలన ముక్తి కలుగును. భక్తియోగులకు అచిరకాలములోనే కష్టము లేకుండగనే భగవంతుని తత్వము గుఱించి యగు జ్ఞానము కలుగును - - - కారణము లేనిదే కార్యవస్తువు పుట్టదు. భక్తిలేనిదే బ్రహ్మజ్ఞానము ఎన్నడునూ కలుగనేరదు.
(కర్మయోగముకన్న, జ్ఞానయోగముకన్న భక్తియోగము, ఫలరూపమగుటవలన, అత్యంతము అధికమైనది).
“రూపరహితుండవైన నీకు బీజాంకురంబులకైవడి గారణకార్యంబులయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబగు. ఆ రెంటియందును భక్తియోగంబున బుద్ధిమంతులు, మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్ను చూడగందురు”.
“తస్మిన్ స్వాశ్రమే వ్యాసో బదరీ షండ మండితే |
ఆసీనోపి ఉపస్పృశ్య ప్రణిదధ్యే మనః స్వయం |
భక్తియోగేన మనసి సమ్యక్ ప్రణహతే మలే |
అపశ్యత్ పురుషం పూర్ణం మాయాంచ తధపాశ్రయం ||“. (శ్రీమద్భాగవతం - 1 - 7 - 3, 4)
(బదరికాశ్రమములో వ్యాసమహర్షి తన ఆశ్రమములో మనః ప్రణిధానము చేసి భక్తియోగముచేత మనస్సులోని మలమును క్షీణింపచేసి ప్రపంచమంతటిలోను - అందులోని అన్ని వస్తువులలోను పూర్తిగానిండియున్న పరమపురుషుని, అతనిని ఆవరించియున్న మాయను చూచెను - కనుగొనెను).
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యత్బ్రహ్మదర్శనం ||“. (శ్రీమద్భాగవతం - 3 - 32 - 23)
(భగవంతుడైన వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తియోగము శీఘ్రముగా వైరాగ్యమును, బ్రహ్మసాక్షాత్కారమును కలుగచేయు జ్ఞానమును - బ్రహ్మజ్ఞానమును,కలుగచేయును).
“గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీసమేతుండనై శంఖ, చక్ర,గదా శార్ఙాదియుక్తుడనైన నన్ను శుక సనకాది యోగీంద్రులును, నంబరీష, విభీషణ, రుక్మాంగదులు మొదలుగాగల భాగవతులును - - - భక్తిభావనా విశేషంబున నేమఱక నిత్యంబును జింతనాయత్తులై యెఱింగిరి. మధురాపురంబునకు హలాయుధ సమేతుండనై యేనరుగుచో గోపికలోపికలు లేక భక్తియోగంబున జింతించి ముక్తులైరిది భక్తి యోగప్రకారంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 103)
“ఉదాసీనవదాసీనో గుణైర్యో విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవం యో(అ)వ తిష్టతి నేంగనే |
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిందాత్మ సంస్తుతిః ||
మానావమానయో స్తుల్యో మిత్రారి పక్షయోః |
సర్వారంభ పరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే ||
మాంచయో (అ)వ్యభిచారేణ భక్తియోగేన సేవతే స గుణా
స్సమతీత్యైతాన్బ్రహ్మ భూయాయ కల్పతే ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 23 to 26)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 7 - 98)
“నాయందు తలంపు నిలిపి కర్మయోగంబునందును, భక్తియోగంబునందును వాత్సల్యంబుగలిగి జనకాదులు కైవల్యంబు జెందిరి. భక్తియోగంబునం జేసి శబరి, బలి, ప్రహ్లాదముచికుందులు పరమపదప్రాప్తులైరి. కావున నిది యెఱింగి నిరంతరభక్తి యోగంబధికంబుగా నీమనంబున నిలుపుము”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)
“శుశ్రూషోః అశ్రద్ధ ధానస్య వాసుదేవ కథా రుచిః |
స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థ నిషేవణాత్ |
శృణ్వతాం స్వకథాం కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః |
హృద్యం తస్థోహ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం |
నష్టప్రాయే ష్వ భద్రేషు నిత్యం భగవత్సేవయా |
భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నెష్టకీ |
తదా రజస్తమో భావాః కామ లోభాదియశ్చ యే |
చేత ఏ తైరనావిద్ధం స్థితా సర్వే ప్రసీదతి |
ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః |
భగవత్తత్వ విజ్ఞానం ముక్తసంగస్య జాయతే |
భిద్యతే హృదయగ్రంధి శ్చిద్యంతే సర్వ సంశయాః |
క్షీయతే చాస్య కర్మాణి దృష్ట ఏవమాత్మనీశ్వరే ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 16 to 20)
(మహాత్ముల సేవ శ్రద్ధతో చేయుటచేతను, పుణ్యతీర్థములను సేవించుటచేతను, భగవంతుడైన వాసుదేవుని కథలందు రుచి పుట్టును, భగవంతుని కథలు వినువారి హృదయమందు పుణ్యశ్రవణకీర్తనుడైన భగవంతుడుండి మంగళములను సమకూర్చును - ఎల్లపుడు భగవంతుని సేవ చేయుటవలన అమంగళములు నశించుటచే భగవంతునియందు నిష్టారూపమగు భక్తి కలుగును. అప్పుడు మనసును ఆవరించియున్న రజస్తమోభావములు, కామము, లోభము మొదలుగా గలవన్నియు క్షీణించగా మనసు సుప్రసన్నమగును - ఈ ప్రకారముగా భగవంతునియడల కలుగు భక్తియోగమువలన ముక్తసంగుడగువానికి భగవంతుని తత్వము గుఱించి అయిన జ్ఞానము - బ్రహ్మజ్ఞానము - కలుగును. ఈ ప్రకారముగ భగవంతుని దర్శనము కలిగిన హృదయమందున్న గ్రధి - ముడి - తెగిపోవును, అన్ని సంశయములు తీరిపోవును, కర్మలన్నియు ఫలమునీయక క్షీణించిపోవును).
నా కంటె నన్యుల గైకొని తగిలిన యాత్మలు భవ భయంబందుదు రది
గావున నాయాజ్ఞగడవంగనోడుట జేసి వాయువు వీచు, శిఖి వెలుంగు
నినుడు తపించు, దానింద్రుడువర్షించు, భయమంది మృత్యువు పరువు వెట్టు
తే. గాన, విజ్ఞాన వైరాగ్య కలితమైన
భక్తి యోగంబునంజేసి పరమపదము
కొఱకు నయ్యోగివరులు మచ్చరణ భజను
లగుచు జరియింపుదురు నిర్భయాత్ములగుచు ".
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 882)
(కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 22)
సీ. గాధి - - -
తే. - - - ఆదులైన మహాత్ములెలమి
దవిలి యద్దేవు భక్తి జిత్తములనిలిపి
తత్పరాయణులౌట దుర్దాంతమైన
విష్ణుమాయ దరింతురు విమలచరిత”
"మ. అనఘా వీరలనెన్న నేమిటికి దిర్యగ్జంతు సంతాన ప
క్షి నిశాటాట వికాఘజీవ నివహ స్త్రీశూద్ర హోణాదులై
నను నారాయణభక్తియోగ మహితా నందాత్ములై రేని వా
రనయంబున్ దరియింతు రవ్విభుని మాయా వైభవాంభో నిధిన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 203 to 205).
నిరతము గల్గువారు భవనీరజగర్భులకందరాని భా
సుర పదమందు జేరుదురు; సూరిజనస్తవనీయ, యట్టి స
త్పురుషుల పూర్వజన్మ ఫలమున్ గణుతింపనౌనె యేరికిన్ ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 7 - 243)
(bhaktiyanagā bhagavaṃtuni guṟiṃci cēyu bhajana, bhaktiyē yōgamu - bhaktiyōgamu) (bhaktiyēoka yōgamugā salupuṭa).
(bhaktiyē yōgamu - yōgamuvale bhakti salupuṭa - yōgamanagā upāyamu - bhagavaṃtuni cēruṭaku - mukti noṃduṭaku - upāyamagunadi bhakti).
bhagavatprīticē niraṃtaramu bhagavatasmṛti kaligiyuṃḍuṭa bhaktiyōgamu.
“sarvayōga saṃprāpyuṃḍagu nirguṇuṃḍu bhagavaṃtuṃḍani ceppina jñānayōgaṃbunu madīya bhaktiyōgaṃbunu nanu reṃḍu nokkaṭiya”- (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1022)
“ā. padmanayanumīdi bhaktiyōgaṃbella
mukti yōgamanucu modaleṟuṃgu
vāri vāri, vārivāri, vāri jērinavāri
trōva bōvavaladu, dūtalāra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 3 - 191)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 955)
(tripādvibhūti mahā nārāyaṇōpaniṣat)
(adhikārulainavārikinnī - vēdādhyayanamunaku taginavārikinnī - adhikārulu kānivārikinnī bhaktiyōgamē praśastamainadi. bhaktiyōgamulō upadravamu - ēvidhamaina kaṣṭamukāni hānikāni - kalugadu. bhaktiyōgamuvalana mukti kalugunu. bhaktiyōgulaku acirakālamulōnē kaṣṭamu lēkuṃḍaganē bhagavaṃtuni tatvamu guṟiṃci yagu jñānamu kalugunu - - - kāraṇamu lēnidē kāryavastuvu puṭṭadu. bhaktilēnidē brahmajñānamu ennaḍunū kaluganēradu.
(karmayōgamukanna, jñānayōgamukanna bhaktiyōgamu, phalarūpamaguṭavalana, atyaṃtamu adhikamainadi).
“rūparahituṃḍavaina nīku bījāṃkuraṃbulakaivaḍi gāraṇakāryaṃbulayina sadasadrūpaṃbulu reṃḍunu brakāśamānaṃbagu. ā reṃṭiyaṃdunu bhaktiyōgaṃbuna buddhimaṃtulu, mathanaṃbuna dāruvulaṃdu vahniṃ ganiyeḍu teṟaṃguna ninnu cūḍagaṃduru”.
“tasmin svāśramē vyāsō badarī ṣaṃḍa maṃḍitē |
āsīnōpi upaspṛśya praṇidadhyē manaḥ svayaṃ |
bhaktiyōgēna manasi samyak praṇahatē malē |
apaśyat puruṣaṃ pūrṇaṃ māyāṃca tadhapāśrayaṃ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 7 - 3, 4)
(badarikāśramamulō vyāsamaharṣi tana āśramamulō manaḥ praṇidhānamu cēsi bhaktiyōgamucēta manassulōni malamunu kṣīṇiṃpacēsi prapaṃcamaṃtaṭilōnu - aṃdulōni anni vastuvulalōnu pūrtigāniṃḍiyunna paramapuruṣuni, atanini āvariṃciyunna māyanu cūcenu - kanugonenu).
janayatyāśu vairāgyaṃ jñānaṃ yatbrahmadarśanaṃ ||“. (śrīmadbhāgavataṃ - 3 - 32 - 23)
(bhagavaṃtuḍaina vāsudēvuni yaṃdu prayōgiṃpabaḍina bhaktiyōgamu śīghramugā vairāgyamunu, brahmasākṣātkāramunu kalugacēyu jñānamunu - brahmajñānamunu,kalugacēyunu).
“gaṃdha puṣpa dhūpa dīpa naivēdyaṃbula lakṣmīsamētuṃḍanai śaṃkha, cakra,gadā śārṅādiyuktuḍanaina nannu śuka sanakādi yōgīṃdrulunu, naṃbarīṣa, vibhīṣaṇa, rukmāṃgadulu modalugāgala bhāgavatulunu - - - bhaktibhāvanā viśēṣaṃbuna nēmaṟaka nityaṃbunu jiṃtanāyattulai yeṟiṃgiri. madhurāpuraṃbunaku halāyudha samētuṃḍanai yēnarugucō gōpikalōpikalu lēka bhaktiyōgaṃbuna jiṃtiṃci muktulairidi bhakti yōgaprakāraṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 103)
“udāsīnavadāsīnō guṇairyō vicālyatē |
guṇā vartaṃta ityēvaṃ yō(a)va tiṣṭati nēṃganē |
samaduḥkhasukhaḥ svasthaḥ samalōṣṭāśmakāṃcanaḥ |
tulyapriyāpriyō dhīrastulyaniṃdātma saṃstutiḥ ||
mānāvamānayō stulyō mitrāri pakṣayōḥ |
sarvāraṃbha parityāgī guṇātītassa ucyatē ||
māṃcayō (a)vyabhicārēṇa bhaktiyōgēna sēvatē sa guṇā
ssamatītyaitānbrahma bhūyāya kalpatē ||“. (śrīmadbhagavadgīta - 14 - 23 to 26)
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 7 - 98)
“nāyaṃdu talaṃpu nilipi karmayōgaṃbunaṃdunu, bhaktiyōgaṃbunaṃdunu vātsalyaṃbugaligi janakādulu kaivalyaṃbu jeṃdiri. bhaktiyōgaṃbunaṃ jēsi śabari, bali, prahlādamucikuṃdulu paramapadaprāptulairi. kāvuna nidi yeṟiṃgi niraṃtarabhakti yōgaṃbadhikaṃbugā nīmanaṃbuna nilupumu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)
“śuśrūṣōḥ aśraddha dhānasya vāsudēva kathā ruciḥ |
syānmahatsēvayā viprāḥ puṇyatīrtha niṣēvaṇāt |
śṛṇvatāṃ svakathāṃ kṛṣṇaḥ puṇyaśravaṇa kīrtanaḥ |
hṛdyaṃ tasthōhyabhadrāṇi vidhunōti suhṛtsatāṃ |
naṣṭaprāyē ṣva bhadrēṣu nityaṃ bhagavatsēvayā |
bhagavatyuttamaślōkē bhaktirbhavati neṣṭakī |
tadā rajastamō bhāvāḥ kāma lōbhādiyaśca yē |
cēta ē tairanāviddhaṃ sthitā sarvē prasīdati |
ēvaṃ prasanna manasō bhagavadbhakti yōgataḥ |
bhagavattatva vijñānaṃ muktasaṃgasya jāyatē |
bhidyatē hṛdayagraṃdhi ścidyaṃtē sarva saṃśayāḥ |
kṣīyatē cāsya karmāṇi dṛṣṭa ēvamātmanīśvarē ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 16 to 20)
(mahātmula sēva śraddhatō cēyuṭacētanu, puṇyatīrthamulanu sēviṃcuṭacētanu, bhagavaṃtuḍaina vāsudēvuni kathalaṃdu ruci puṭṭunu, bhagavaṃtuni kathalu vinuvāri hṛdayamaṃdu puṇyaśravaṇakīrtanuḍaina bhagavaṃtuḍuṃḍi maṃgaḷamulanu samakūrcunu - ellapuḍu bhagavaṃtuni sēva cēyuṭavalana amaṃgaḷamulu naśiṃcuṭacē bhagavaṃtuniyaṃdu niṣṭārūpamagu bhakti kalugunu. appuḍu manasunu āvariṃciyunna rajastamōbhāvamulu, kāmamu, lōbhamu modalugā galavanniyu kṣīṇiṃcagā manasu suprasannamagunu - ī prakāramugā bhagavaṃtuniyaḍala kalugu bhaktiyōgamuvalana muktasaṃguḍaguvāniki bhagavaṃtuni tatvamu guṟiṃci ayina jñānamu - brahmajñānamu - kalugunu. ī prakāramuga bhagavaṃtuni darśanamu kaligina hṛdayamaṃdunna gradhi - muḍi - tegipōvunu, anni saṃśayamulu tīripōvunu, karmalanniyu phalamunīyaka kṣīṇiṃcipōvunu).
nā kaṃṭe nanyula gaikoni tagilina yātmalu bhava bhayaṃbaṃdudu radi
gāvuna nāyājñagaḍavaṃganōḍuṭa jēsi vāyuvu vīcu, śikhi veluṃgu
ninuḍu tapiṃcu, dāniṃdruḍuvarṣiṃcu, bhayamaṃdi mṛtyuvu paruvu veṭṭu
tē. gāna, vijñāna vairāgya kalitamaina
bhakti yōgaṃbunaṃjēsi paramapadamu
koṟaku nayyōgivarulu maccaraṇa bhajanu
lagucu jariyiṃpuduru nirbhayātmulagucu ".
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 882)
(kulaśēkharamahīpāla caritra - 2 - 22)
sī. gādhi - - -
tē. - - - ādulaina mahātmulelami
davili yaddēvu bhakti jittamulanilipi
tatparāyaṇulauṭa durdāṃtamaina
viṣṇumāya dariṃturu vimalacarita”
"ma. anaghā vīralanenna nēmiṭiki diryagjaṃtu saṃtāna pa
kṣi niśāṭāṭa vikāghajīva nivaha strīśūdra hōṇādulai
nanu nārāyaṇabhaktiyōga mahitā naṃdātmulai rēni vā
ranayaṃbun dariyiṃtu ravvibhuni māyā vaibhavāṃbhō nidhin". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 203 to 205).
niratamu galguvāru bhavanīrajagarbhulakaṃdarāni bhā
sura padamaṃdu jēruduru; sūrijanastavanīya, yaṭṭi sa
tpuruṣula pūrvajanma phalamun gaṇutiṃpanaune yērikin ". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 7 - 243)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.