← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భారతవర్షము bhāratavarṣamu

Original — తెలుగు
  1. “భరతస్య రాజ్ఞ ఇదం భారతం, భారతాఖ్యం వర్షం”.

(భరతుడను రాజునకు సంబంధించినది - భారతము - భారతమను పేరుగల వర్షము).

  1. “ఋషభస్య జ్యేష్ట పుత్రః భరతః, తస్య నామాం ఏతత్ అజనాభం నామవర్షం భారతం ఇత్యద్భుతం విఖ్యాతం ఆసీత్”.

(ఋషభుని పెద్దకుమారుడు భరతుడు. అతని పేరుమీద అజనాభి (బ్రహ్మనాభి) యను వర్షము (భూమి), (భూభాగము) భారతము (భారతవర్షము) అని విఖ్యాతి పొందినది).

  1. “అట మున్నజనాభంబను పేరంబరగు వర్షంబు భరతుండు పాలించుగతంబున భారతవర్షంబునాబరగె”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 7 - 92)

  1. “నాభికి సత్పుత్రుండయి ఋషభుండు పుట్టె, నతండు హరిదాసుండై సుతశతంబుబడసె. నందగ్రజుండయిన భరతుండను మహానుభావుండు నారాయణ పరాయణుండై యిహలోక సుఖంబుల పరిహరించి, ఘోర తపంబాచరించి, జన్మ త్రితయంబున నిర్వాణ సుఖపారవశ్యంబున సకల బంధ విముక్తుండై వాసుదేవపదంబు నొందె; నాతని పేర నతడేలిన భూఖండంబు భారతవర్షంబను వ్యవహారంబున నెగడి జగంబుల ప్రసిద్ధంబయ్యె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 35)

  2. “ఆ మహాభారతవర్షంబునందు దమతమ పేరంబరగు భూములకుం గుశావర్త ఇలావర్త బ్రహ్మావర్త, ఆర్యావర్త మలయకేతు, భద్రసేన నిద్రస్పృగ్విదర్భ కీకటులను తొమ్మండ్రు కుమారులను” (నియమించె) - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 4 - 63)

  3. “సీ. జంబూ ద్వీపమందు భారతవర్షమరయ గర్మ

భూమి, దక్కిన వర్షముల దివంబుననుండి భువికి వచ్చినవారు పుణ్య శేష

ములు భజించుచు నుండ్రు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 11 - 35)

  1. “ఉ. భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు నీ

భారతవర్షమందు హరి పల్మరు బుట్టుచు జీవ కోటికిన్

ధీరతతోడ దత్త్వముపదేశము చేయుచు జెల్మి సేయుచు

న్నారయ బాంధవాకృతి కృతార్థుల జేయుచునుండు నెంతయున్“. –

“బ్రహ్మ కల్పాతంబు బ్రతికెడి యితర స్థానంబునం పునర్జన్మ భయంబున భీతిల్లుచునుండుటకన్న భారతవర్షంబునందు క్షణమాత్రంబు మనంబున సర్వసంగ త్యాగంబు సేసిన పురుష శ్రేష్టునకు శ్రీమన్నారయణ పదప్రాప్తి యతి సులభంబుగ సంభవించుంగావున నట్టి యుత్తమంబగు నీ భరతవర్షంబె గోరుచుండుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 7 - 54, 56)

Transliteration
  1. “bharatasya rājña idaṃ bhārataṃ, bhāratākhyaṃ varṣaṃ”.

(bharatuḍanu rājunaku saṃbaṃdhiṃcinadi - bhāratamu - bhāratamanu pērugala varṣamu).

  1. “ṛṣabhasya jyēṣṭa putraḥ bharataḥ, tasya nāmāṃ ētat ajanābhaṃ nāmavarṣaṃ bhārataṃ ityadbhutaṃ vikhyātaṃ āsīt”.

(ṛṣabhuni peddakumāruḍu bharatuḍu. atani pērumīda ajanābhi (brahmanābhi) yanu varṣamu (bhūmi), (bhūbhāgamu) bhāratamu (bhāratavarṣamu) ani vikhyāti poṃdinadi).

  1. “aṭa munnajanābhaṃbanu pēraṃbaragu varṣaṃbu bharatuṃḍu pāliṃcugataṃbuna bhāratavarṣaṃbunābarage”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 7 - 92)

  1. “nābhiki satputruṃḍayi ṛṣabhuṃḍu puṭṭe, nataṃḍu haridāsuṃḍai sutaśataṃbubaḍase. naṃdagrajuṃḍayina bharatuṃḍanu mahānubhāvuṃḍu nārāyaṇa parāyaṇuṃḍai yihalōka sukhaṃbula parihariṃci, ghōra tapaṃbācariṃci, janma tritayaṃbuna nirvāṇa sukhapāravaśyaṃbuna sakala baṃdha vimuktuṃḍai vāsudēvapadaṃbu noṃde; nātani pēra nataḍēlina bhūkhaṃḍaṃbu bhāratavarṣaṃbanu vyavahāraṃbuna negaḍi jagaṃbula prasiddhaṃbayye”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 35)

  2. “ā mahābhāratavarṣaṃbunaṃdu damatama pēraṃbaragu bhūmulakuṃ guśāvarta ilāvarta brahmāvarta, āryāvarta malayakētu, bhadrasēna nidraspṛgvidarbha kīkaṭulanu tommaṃḍru kumārulanu” (niyamiṃce) - (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 4 - 63)

  3. “sī. jaṃbū dvīpamaṃdu bhāratavarṣamaraya garma

bhūmi, dakkina varṣamula divaṃbunanuṃḍi bhuviki vaccinavāru puṇya śēṣa

mulu bhajiṃcucu nuṃḍru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 11 - 35)

  1. “u. bhāratavarṣa jaṃtuvula bhāgyamu lēmani ceppavaccu nī

bhāratavarṣamaṃdu hari palmaru buṭṭucu jīva kōṭikin

dhīratatōḍa dattvamupadēśamu cēyucu jelmi sēyucu

nnāraya bāṃdhavākṛti kṛtārthula jēyucunuṃḍu neṃtayun”. –

“brahma kalpātaṃbu bratikeḍi yitara sthānaṃbunaṃ punarjanma bhayaṃbuna bhītillucunuṃḍuṭakanna bhāratavarṣaṃbunaṃdu kṣaṇamātraṃbu manaṃbuna sarvasaṃga tyāgaṃbu sēsina puruṣa śrēṣṭunaku śrīmannārayaṇa padaprāpti yati sulabhaṃbuga saṃbhaviṃcuṃgāvuna naṭṭi yuttamaṃbagu nī bharatavarṣaṃbe gōrucuṃḍuduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 7 - 54, 56)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.