శివుడు
సకల దురిత భంజన జ్యోతీరూపం
(సమస్తమైన దురితములను - పాపములను - భంజించేటటువంటి (పటాపంచలు చేయునటువంటి) జ్యోతిస్వరూపము - తేజస్వరూపము).
(తను సాక్షాత్కరించుటచేత అవిద్యవలన, దాని కార్యములవలన కలుగు దోషములను దహించునది).
(జననమరణ రూపమైన సంసారమును దహించువాడు, మరల జన్మించినవసరము లేకుండునట్లు చేయువాడు).
(ఆధ్యాత్మకము, ఆధిదైవికము, ఆధి భౌతికము అను మూడువిధముల బాధలు లేకుండునది).
తేజస్స్వరూపము - పరమాత్మస్వరూపము -
“తేజః తేజస్వినామహం”.
(ప్రకాశస్వరూపములైన వాటి తేజస్సు నేనే అయిన వాడను). (శ్రీమద్భగవద్గీత - 10 - 36)
(దుఃఖములకు కారణమైన సకలపాపములను నాశముచేయు తేజస్సు; శుద్ధమైనది (ఏ విధమైన మలినములు - దోషములు లేనిది). పరమపురుషార్థమైన మోక్షములేక పరబ్రహ్మస్వరూపమును తెలియచేయు జ్ఞానరూపమైనది).
భ్రాజతే దీప్యతే యస్మాత్ జగదంత్యేహరత్యపి |
కాలాగ్ని రూపమాస్థాయ సప్తార్చిః సస్తరశ్మిభిః |
భ్రాజతే తత్స్వరూపేణ తస్మాత్ భర్గః స ఉచ్యతే |
భేతి భాసయతే లోకాన్ రేతిరం జయతే ప్రజాః |
గ ఇత్యాగచ్ఛతే అజస్రంభరగో భర్గ ఉచ్యతే |
ఆదిత్యాంతరగతం యచ్చ జ్యోతిషాం జ్యోతిరుత్తమం |
హృదయే సర్వభూతానాం జీవ భూతస్స తిష్టతి |
హృద్యోమ్ని తపతి హ్యేష భాష్యే సూర్యస్య చాంతరే |
అగ్నౌవా ధూమికేతే చ జ్యోతిశ్చిత్రకరం చ యత్ |
హృద్యాకాశేచ యోదేవః సాధకై రుపవర్ణ్యతే |
స ఏవ ఆదిత్యరూపేణ బహిర్నభసి రాజతే |
వరేణ్యం వరణీయం చ జన్మ సంసార భీరుభిః |
ఆదిత్యాంతర్గతం యచ్చ భర్గాఖ్యం వైముముక్షిభిః |
జన్మ మృత్యు వినాశాయ దుఃఖస్య త్రివిధస్య చ |
ధ్యానేన పురుషో యస్తు ద్రష్టవ్యః సూర్యమండలే |
ఈశ్వరం పురుషాఖ్యంతు సత్యధర్మాణ మిచ్యుతం |
భర్గాఖ్య రుద్రసం జ్ఞంతు జ్ఞాత్వా త్వమమృతమిచ్చతి |
రవి మధ్యే స్థితః సోమః సోమమధ్యే హుతాశనః |
తేజోమధ్యే స్థితం సత్యం సత్యమధ్యే స్థితో చ్యుతః |
అంగుష్టమాత్రః పురుషః పూర్వమేవ మయేరితః |
శంకరేణ తథా దృష్టః ప్రభవః సర్వ తేజసాం |
స విష్ణుర్భువనాధారో యస్యేదంసకలం జగత్ ||“.
(భర్గః అను పదము ‘భృజ్’ అను ధాతువు నుండి పుట్టినది. దానికి పాకము అని అర్థము - పాకము చేయువాడు, పచనము చేయువాడు, దీపించువాడు, ప్రకాశించువాడు - భ్రాజ మానుడు - గనుక భర్గుడు - ప్రళయకాలమందు జగత్తును కాలాగ్ని రూపముతో - సంకర్షణాగ్నితో - హరించువాడు - సప్తార్బిః అయి తన ఏడు విధములగు కాంతులతో కాలాగ్నిరూపముతో ప్రకాశించువాడు కనుక రుద్రుడు - అని చెప్పబడినాడు - భర్గుడు అను పదములోని ‘భ’ అను అక్షరమునకు లోకములను ప్రకాశింపచేయువాడు అని అర్థము. ‘ర’ అను అక్షరమునకు ప్రజలను రంజింపచేయువాడని యర్థము, ‘గ’ అను అక్షరమునకు తరుచుగా, మరల మరల, తిరిగి వచ్చు చుండువాడు అని అర్థము - ఈ మూడు అక్షరములు (భ,ర,గ) కలిసి భర్గుడు అని చెప్పబడుచున్నాడు. సూర్యుని లోపల నుండువాడు, జ్యోతీరూపములన్నింటిలోను ఉత్తమమైనది. సమస్త భూతముల యొక్క హృదయమందు జీవరూపముతో నుండునది. ఇదియే హృదయాకాశమును తపింప చేయునది - చైతన్యమును కలుగచేయును. సూర్యుని లోపల పైన, అగ్నిలోను విచిత్రమైన జ్యోతీరూపమున నుండునది. హృదాయాకాశమందుండు దేవుడని సాధకులచేత (యోగులచేత, జ్ఞానులచేత) వర్ణింపబడినవాడే పైన సూర్యరూపమున ప్రకాశించు చున్నాడు. జననమరణ రూపమైన సంసారమువలన భయపడువారు వరేణ్యం, వరణీయం అనిన్నీ సూర్యమండలమధ్యనున్న తేజస్సునిన్నీ - (“తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి”) (“ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ - - - ఆదిత్య వర్గాభిః”). - మోక్షము కోరువారు జననమరణములు లేకుండుటకును, మూడువిధములైన ఆధులు (అధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము) నశించుటకును - సూర్యమండలమధ్యనున్న ఏ పరమ పురుషుని ధ్యానింతురో అచ్యుతుని రుద్రుడని, భర్గుడని తెలిసికొని మరణము లేని మోక్షమును కోరుచున్నారు - అదియే భర్గుడు. రవి మధ్యమందు సోముడు, సోముని మధ్యమందు (లోపల) అగ్ని, ఆ అగ్ని తేజస్సులో సత్యము, ఆ సత్యము మధ్యమందు అచ్యుతుడు, అంగుష్టమాత్ర పురుషుడు (అతి సూక్ష్ముడు) సమస్త తేజోరూపములకు కారణమైనవాడు (పుట్టించువాడు, మూలమైనవాడు). లోకములన్నింటికి ఆధారమైనవాడు - అతనే విష్ణువు).
గాయత్రి
śivuḍu
sakala durita bhaṃjana jyōtīrūpaṃ
(samastamaina duritamulanu - pāpamulanu - bhaṃjiṃcēṭaṭuvaṃṭi (paṭāpaṃcalu cēyunaṭuvaṃṭi) jyōtisvarūpamu - tējasvarūpamu).
(tanu sākṣātkariṃcuṭacēta avidyavalana, dāni kāryamulavalana kalugu dōṣamulanu dahiṃcunadi).
(jananamaraṇa rūpamaina saṃsāramunu dahiṃcuvāḍu, marala janmiṃcinavasaramu lēkuṃḍunaṭlu cēyuvāḍu).
(ādhyātmakamu, ādhidaivikamu, ādhi bhautikamu anu mūḍuvidhamula bādhalu lēkuṃḍunadi).
tējassvarūpamu - paramātmasvarūpamu -
“tējaḥ tējasvināmahaṃ”.
(prakāśasvarūpamulaina vāṭi tējassu nēnē ayina vāḍanu). (śrīmadbhagavadgīta - 10 - 36)
(duḥkhamulaku kāraṇamaina sakalapāpamulanu nāśamucēyu tējassu; śuddhamainadi (ē vidhamaina malinamulu - dōṣamulu lēnidi). paramapuruṣārthamaina mōkṣamulēka parabrahmasvarūpamunu teliyacēyu jñānarūpamainadi).
bhrājatē dīpyatē yasmāt jagadaṃtyēharatyapi |
kālāgni rūpamāsthāya saptārciḥ sastaraśmibhiḥ |
bhrājatē tatsvarūpēṇa tasmāt bhargaḥ sa ucyatē |
bhēti bhāsayatē lōkān rētiraṃ jayatē prajāḥ |
ga ityāgacchatē ajasraṃbharagō bharga ucyatē |
ādityāṃtaragataṃ yacca jyōtiṣāṃ jyōtiruttamaṃ |
hṛdayē sarvabhūtānāṃ jīva bhūtassa tiṣṭati |
hṛdyōmni tapati hyēṣa bhāṣyē sūryasya cāṃtarē |
agnauvā dhūmikētē ca jyōtiścitrakaraṃ ca yat |
hṛdyākāśēca yōdēvaḥ sādhakai rupavarṇyatē |
sa ēva ādityarūpēṇa bahirnabhasi rājatē |
varēṇyaṃ varaṇīyaṃ ca janma saṃsāra bhīrubhiḥ |
ādityāṃtargataṃ yacca bhargākhyaṃ vaimumukṣibhiḥ |
janma mṛtyu vināśāya duḥkhasya trividhasya ca |
dhyānēna puruṣō yastu draṣṭavyaḥ sūryamaṃḍalē |
īśvaraṃ puruṣākhyaṃtu satyadharmāṇa micyutaṃ |
bhargākhya rudrasaṃ jñaṃtu jñātvā tvamamṛtamiccati |
ravi madhyē sthitaḥ sōmaḥ sōmamadhyē hutāśanaḥ |
tējōmadhyē sthitaṃ satyaṃ satyamadhyē sthitō cyutaḥ |
aṃguṣṭamātraḥ puruṣaḥ pūrvamēva mayēritaḥ |
śaṃkarēṇa tathā dṛṣṭaḥ prabhavaḥ sarva tējasāṃ |
sa viṣṇurbhuvanādhārō yasyēdaṃsakalaṃ jagat ||“.
(bhargaḥ anu padamu ‘bhṛj’ anu dhātuvu nuṃḍi puṭṭinadi. dāniki pākamu ani arthamu - pākamu cēyuvāḍu, pacanamu cēyuvāḍu, dīpiṃcuvāḍu, prakāśiṃcuvāḍu - bhrāja mānuḍu - ganuka bharguḍu - praḷayakālamaṃdu jagattunu kālāgni rūpamutō - saṃkarṣaṇāgnitō - hariṃcuvāḍu - saptārbiḥ ayi tana ēḍu vidhamulagu kāṃtulatō kālāgnirūpamutō prakāśiṃcuvāḍu kanuka rudruḍu - ani ceppabaḍināḍu - bharguḍu anu padamulōni ‘bha’ anu akṣaramunaku lōkamulanu prakāśiṃpacēyuvāḍu ani arthamu. ‘ra’ anu akṣaramunaku prajalanu raṃjiṃpacēyuvāḍani yarthamu, ‘ga’ anu akṣaramunaku tarucugā, marala marala, tirigi vaccu cuṃḍuvāḍu ani arthamu - ī mūḍu akṣaramulu (bha,ra,ga) kalisi bharguḍu ani ceppabaḍucunnāḍu. sūryuni lōpala nuṃḍuvāḍu, jyōtīrūpamulanniṃṭilōnu uttamamainadi. samasta bhūtamula yokka hṛdayamaṃdu jīvarūpamutō nuṃḍunadi. idiyē hṛdayākāśamunu tapiṃpa cēyunadi - caitanyamunu kalugacēyunu. sūryuni lōpala paina, agnilōnu vicitramaina jyōtīrūpamuna nuṃḍunadi. hṛdāyākāśamaṃduṃḍu dēvuḍani sādhakulacēta (yōgulacēta, jñānulacēta) varṇiṃpabaḍinavāḍē paina sūryarūpamuna prakāśiṃcu cunnāḍu. jananamaraṇa rūpamaina saṃsāramuvalana bhayapaḍuvāru varēṇyaṃ, varaṇīyaṃ aninnī sūryamaṃḍalamadhyanunna tējassuninnī - (“tatsaviturvarēṇyaṃ bhargō dēvasya dhīmahi”) (“dhyēyassadā savitṛmaṃḍala madhyavartī - - - āditya vargābhiḥ”). - mōkṣamu kōruvāru jananamaraṇamulu lēkuṃḍuṭakunu, mūḍuvidhamulaina ādhulu (adhyātmikamu, ādhidaivikamu, ādhibhautikamu) naśiṃcuṭakunu - sūryamaṃḍalamadhyanunna ē parama puruṣuni dhyāniṃturō acyutuni rudruḍani, bharguḍani telisikoni maraṇamu lēni mōkṣamunu kōrucunnāru - adiyē bharguḍu. ravi madhyamaṃdu sōmuḍu, sōmuni madhyamaṃdu (lōpala) agni, ā agni tējassulō satyamu, ā satyamu madhyamaṃdu acyutuḍu, aṃguṣṭamātra puruṣuḍu (ati sūkṣmuḍu) samasta tējōrūpamulaku kāraṇamainavāḍu (puṭṭiṃcuvāḍu, mūlamainavāḍu). lōkamulanniṃṭiki ādhāramainavāḍu - atanē viṣṇuvu).
gāyatri
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.