- “సా భార్యా యా గ్రుహే దక్షా, సా భార్యా యా ప్రజావతీ |
సా భార్యా యా పతిప్రాణా సా భార్యా యా పత్రివ్రతా ||“.
(గృహకృత్యములందు దక్షత కలిగినదిన్నీ, పిల్లలను కనునది, పతియే ప్రాణముగా చూచునదీ, పతివ్రత
అయినది - భార్య యని చెప్పబడును - భార్యకు ఉండవలసిన లక్షణములు)
- “పురుషునకు నంగనవలన ధర్మార్థకామంబులు సిద్ధించు. కర్ణధారుండు నావచేతం బయోధి
గడచుచందంబున గృహమేది సర్వాశ్రమవాసులనరసి రక్షించుచు నిజాశ్రమంబున వ్యసనార్ణవంబు దరియింపం జేయు
భార్య పురుషునందు నర్థంబు. భార్యయందు సకల గృహకార్యభారంబునం జేర్చి పురుషుండు నిశ్చింతుడై
సుఖియించుచుండు - మఱియు నితరాశ్రమ దుర్జయంబులయిన ఇంద్రియ శత్రువర్గంబుల భార్యాసమేతుండైన
గృహస్తుండు దుర్గాధిపతియైన రాజు శతృసంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించు -”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 14 - 459)
Transliteration
- “sā bhāryā yā gruhē dakṣā, sā bhāryā yā prajāvatī |
sā bhāryā yā patiprāṇā sā bhāryā yā patrivratā ||“.
(gṛhakṛtyamulaṃdu dakṣata kaliginadinnī, pillalanu kanunadi, patiyē
prāṇamugā cūcunadī, pativrata ayinadi - bhārya yani ceppabaḍunu -
bhāryaku uṃḍavalasina lakṣaṇamulu)
- “puruṣunaku naṃganavalana dharmārthakāmaṃbulu siddhiṃcu.
karṇadhāruṃḍu nāvacētaṃ bayōdhi gaḍacucaṃdaṃbuna gṛhamēdi
sarvāśramavāsulanarasi rakṣiṃcucu nijāśramaṃbuna vyasanārṇavaṃbu
dariyiṃpaṃ jēyu bhārya puruṣunaṃdu narthaṃbu. bhāryayaṃdu sakala
gṛhakāryabhāraṃbunaṃ jērci puruṣuṃḍu niściṃtuḍai sukhiyiṃcucuṃḍu -
maṟiyu nitarāśrama durjayaṃbulayina iṃdriya śatruvargaṃbula
bhāryāsamētuṃḍaina gṛhastuṃḍu durgādhipatiyaina rāju śatṛsaṃghaṃbula
jayiṃcu caṃdaṃbuna līlāmātraṃbunaṃ jayiṃcu -”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 14 - 459)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.