← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భావనా bhāvanā

Original — తెలుగు
  1. ఆత్మ చింతన - (ఆత్మ గుఱించి ఆలోచించుట) - (తను ఎవరో ఆలోచించుట)

  2. ధ్యానరూపా సక్తిః

(భగవంతుని గుఱించి ధ్యానించుటయందాసక్తి గలిగి యుండుట) (ధ్యానము, తలంపు).

  1. ఆత్మజ్ఞానాభినివేశః; ధ్యానం-

(ఆత్మజ్ఞానమందాసక్తి కలిగియుండుట) (ధ్యానించుట)

  1. భావనాతు అతివాసనా ఇత్యభిధానాత్ -

(భావన యనగా అతివాస అని చెప్పబడియున్నది)

  1. నిధిధ్యాసనాత్మకా విజాతీయ ప్రత్యయానంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహరూపా -

(నిధిధ్యాసనరూపమైనది, విజాతీయ విషయము లేనిది, సజాతీయ విషయమే ఎల్లపుడు భావించుట)

  1. “బ్రహ్మాకారాంతఃకరణ వృత్తి ప్రవాహః” (నీలకంఠవ్యాఖ్యా)

(బ్రహ్మభావనయందు దృఢమైన ప్రవాహరూపముగా ఎడతెగని అంతఃకరణవృత్తి)

  1. “భావాభావ వినుర్ముక్తం భావనామాత్ర గోచరం |

భక్తిగమ్యం పరం తత్వమంతర్లీనేన చేతసా |

భావనామాత్రమే వాత్రకారణం భావనా నృణాం |

విషయం ధ్యాయతః పుంసో విషయే రమతే మనః |

మామనుస్మర తశ్చిత్తం మయ్యేవాత్ర విలీయతే |

సర్వజ్ఞత్వం పరేశత్వం సర్వసంపూర్ణశక్తితా |

అనంతశక్తి మత్వం చ మదనుస్మరణాత్ భవేత్ ||“. (యోగశిఖోపనిషత్)

(భావాభావము లేనటువంటిన్నీ భావనవలననే గోచరించునది అయిన పరతత్వము - భగవంతుడు - లోపల మనసులోని ఆలోచనయను భావనచేతనే పొందతగినది. నరులకు విషయములగుఱించి ఎల్లపుడూ ఆలోచించుచు మనస్సు విషయములందే ఆసక్తి కలిగియుండును - నాయందు (భగవంతుని గుఱించి ధ్యానించు మనస్సు నాయందే లీనమగును - నిమగ్నమైయుండును - సర్వజ్ఞత్వము, (అన్ని విషయములను తెలిసియుండుట), అన్నింటిమీద అధికారము కలిగియుండుట, సమస్త శక్తులు కలిగియుండుట (పరిమితిలేని శక్తులు కలిగియుండుట), నన్ను నిత్యము స్మరించుచుండుట చేతనే, నన్ను భావన చేయుచుండుటచేతనే కలుగుచున్నది).

  1. “నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |

న చా భావయుతః శాంతిరశాంతస్య కుతస్సుకం ||” (శ్రీమద్భగవద్గీత - 2 - 66)

“పుంసోహ్యజితచిత్తస్య బుద్ధేర్వేదాంత వాక్యజా |

నోత్పద్యతే(అ)స్య తద్బుద్ధ్యభావే నాస్త్యేవ భావనా |

నిధి ధ్యాసనరూపాయా శాంతి హేతుః స్థిరాత్మికా |

నిధుధ్యాసన శూన్యస్య నాస్త్యవిద్యా పరీక్షయః ||“. (గీతాభావప్రకాశము - 2 - 626 to 628)

(మనస్సును జయించి తనమనసులో నుంచుకొనిన వానికి వేదాంతశ్రవణము కలిగెడి బుద్ధి (జ్ఞానము) కలుగదు. ఆ జ్ఞానము కలుగనియడల భావన కుదరదు. శాంతికి కారణమైన నిధిధ్యాసనమే భావన - ఈ భావన లేనివానికి అవిద్యానాశనము (శాంతి) కలుగదు).

  1. దేవే తీర్థే ద్వీజే మంత్రే దైవజ్ఞే భేష ఔగురౌ |

యాదృశీభావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ ||“.

(దేవతయందుగాని, తీర్థమందుగాని, బ్రహ్మనిష్ఠునియందుగాని, మంత్రమందుగాని, జ్యోతిష్కునియందుగాని, వైద్యునియందుగాని, గురువునందుగాని ఎవరికి ఎట్టిభావనయుండునో ఆ ప్రకారమే ఫలితము సిద్ధించును) -

“యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ” -

(దేనియందెట్టి భావన కలుగునో అట్టి లక్ష్యానుసారముగనే సిద్ధియు కలుగును)

  1. భావనాపి త్రివిధా - భావనా, అసంభావనా విపరీత భావనాచేతి.

(భావన మూడు విధములు - భావన, అసంభావన, విపరీత భావన –

(1) బాహ్య వస్తువులందు కరచరణాదులతో కూడిన - రూపముగల - ఒక దేవతాకారమును - (విగ్రహమును) కల్పించుకొని దానిని భావనచేయుట - ఇది తామసము –

(2) తన హృదయమందున్న భగవంతుని ధ్యానించుట - ఇది రాజసము –

(3) శిరస్సులో సహస్రారపద్మమందు ఉన్న చిత్కళయందు తన అహంకారమును లయము చేయుట - ఇది సాత్వికము)

Transliteration
  1. ātma ciṃtana - (ātma guṟiṃci ālōciṃcuṭa) - (tanu evarō ālōciṃcuṭa)

  2. dhyānarūpā saktiḥ

(bhagavaṃtuni guṟiṃci dhyāniṃcuṭayaṃdāsakti galigi yuṃḍuṭa) (dhyānamu, talaṃpu).

  1. ātmajñānābhinivēśaḥ; dhyānaṃ-

(ātmajñānamaṃdāsakti kaligiyuṃḍuṭa) (dhyāniṃcuṭa)

  1. bhāvanātu ativāsanā ityabhidhānāt -

(bhāvana yanagā ativāsa ani ceppabaḍiyunnadi)

  1. nidhidhyāsanātmakā vijātīya pratyayānaṃtarita sajātīya pratyaya pravāharūpā -

(nidhidhyāsanarūpamainadi, vijātīya viṣayamu lēnidi, sajātīya viṣayamē ellapuḍu bhāviṃcuṭa)

  1. “brahmākārāṃtaḥkaraṇa vṛtti pravāhaḥ” (nīlakaṃṭhavyākhyā)

(brahmabhāvanayaṃdu dṛḍhamaina pravāharūpamugā eḍategani aṃtaḥkaraṇavṛtti)

  1. “bhāvābhāva vinurmuktaṃ bhāvanāmātra gōcaraṃ |

bhaktigamyaṃ paraṃ tatvamaṃtarlīnēna cētasā |

bhāvanāmātramē vātrakāraṇaṃ bhāvanā nṛṇāṃ |

viṣayaṃ dhyāyataḥ puṃsō viṣayē ramatē manaḥ |

māmanusmara taścittaṃ mayyēvātra vilīyatē |

sarvajñatvaṃ parēśatvaṃ sarvasaṃpūrṇaśaktitā |

anaṃtaśakti matvaṃ ca madanusmaraṇāt bhavēt ||“. (yōgaśikhōpaniṣat)

(bhāvābhāvamu lēnaṭuvaṃṭinnī bhāvanavalananē gōcariṃcunadi ayina paratatvamu - bhagavaṃtuḍu - lōpala manasulōni ālōcanayanu bhāvanacētanē poṃdataginadi. narulaku viṣayamulaguṟiṃci ellapuḍū ālōciṃcucu manassu viṣayamulaṃdē āsakti kaligiyuṃḍunu - nāyaṃdu (bhagavaṃtuni guṟiṃci dhyāniṃcu manassu nāyaṃdē līnamagunu - nimagnamaiyuṃḍunu - sarvajñatvamu, (anni viṣayamulanu telisiyuṃḍuṭa), anniṃṭimīda adhikāramu kaligiyuṃḍuṭa, samasta śaktulu kaligiyuṃḍuṭa (parimitilēni śaktulu kaligiyuṃḍuṭa), nannu nityamu smariṃcucuṃḍuṭa cētanē, nannu bhāvana cēyucuṃḍuṭacētanē kalugucunnadi).

  1. “nāsti buddhirayuktasya na cāyuktasya bhāvanā |

na cā bhāvayutaḥ śāṃtiraśāṃtasya kutassukaṃ ||” (śrīmadbhagavadgīta - 2 - 66)

“puṃsōhyajitacittasya buddhērvēdāṃta vākyajā |

nōtpadyatē(a)sya tadbuddhyabhāvē nāstyēva bhāvanā |

nidhi dhyāsanarūpāyā śāṃti hētuḥ sthirātmikā |

nidhudhyāsana śūnyasya nāstyavidyā parīkṣayaḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 626 to 628)

(manassunu jayiṃci tanamanasulō nuṃcukonina vāniki vēdāṃtaśravaṇamu kaligeḍi buddhi (jñānamu) kalugadu. ā jñānamu kaluganiyaḍala bhāvana kudaradu. śāṃtiki kāraṇamaina nidhidhyāsanamē bhāvana - ī bhāvana lēnivāniki avidyānāśanamu (śāṃti) kalugadu).

  1. dēvē tīrthē dvījē maṃtrē daivajñē bhēṣa augurau |

yādṛśībhāvanāyasya siddhirbhavati tādṛśī ||“.

(dēvatayaṃdugāni, tīrthamaṃdugāni, brahmaniṣṭhuniyaṃdugāni, maṃtramaṃdugāni, jyōtiṣkuniyaṃdugāni, vaidyuniyaṃdugāni, guruvunaṃdugāni evariki eṭṭibhāvanayuṃḍunō ā prakāramē phalitamu siddhiṃcunu) -

“yādṛśī bhāvanā yatra siddhirbhavati tādṛśī” -

(dēniyaṃdeṭṭi bhāvana kalugunō aṭṭi lakṣyānusāramuganē siddhiyu kalugunu)

  1. bhāvanāpi trividhā - bhāvanā, asaṃbhāvanā viparīta bhāvanācēti.

(bhāvana mūḍu vidhamulu - bhāvana, asaṃbhāvana, viparīta bhāvana –

(1) bāhya vastuvulaṃdu karacaraṇādulatō kūḍina - rūpamugala - oka dēvatākāramunu - (vigrahamunu) kalpiṃcukoni dānini bhāvanacēyuṭa - idi tāmasamu –

(2) tana hṛdayamaṃdunna bhagavaṃtuni dhyāniṃcuṭa - idi rājasamu –

(3) śirassulō sahasrārapadmamaṃdu unna citkaḷayaṃdu tana ahaṃkāramunu layamu cēyuṭa - idi sātvikamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.