← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భవుడు bhavuḍu

Original — తెలుగు
  1. శివుడు.

  2. భవతి అస్మాత్ సర్వమిదం జగత్ ఇతి భవః శివః; కార్య వర్గస్య ఉద్భవః యస్మాత్, సః -

(ఈ జగత్తు అంతయు, ఎవనినుండి పుట్టినదో అతడు భవుడు - శివుడు. పుట్టినవస్తువులన్నియు కార్య వస్తువులే - కార్య వస్తువులు ఎవనినుండి పుట్టినవి - అవి పుట్టుటకు కారణమైనవాడు - భవుడు, శివుడు.)

  1. యస్మాత్ భవంతి భూతాని తాభస్తా భాయంతి చ |

భవనాత్ భావనాచ్ఛైవ భూతానాం నభవస్స్మృతః ||“.

(ఎవనినుండి భూతములు పుట్టుచున్నవో, పుట్టినవి ఎవనిని భావించుచున్నవో - ద్యానించుచున్నవో - అతను భవుడు - భూతములు అతని నుండు పుట్టుచున్నవి కనుకను అతనిని ధ్యానించుచున్నవి కనుకను అతడు భవుడని చెప్పబడుచున్నాడు).

  1. “దేవ దేవస్త్వ చింత్యాత్మా అజయ్యో విష్ణురవ్యయః |

సర్వరూపం భవం జ్ఞాత్వా లింగే (అ)ర్చయతి తం ప్రభుం |

తస్మిన్న త్యధికాం ప్రీతిం కరోతి వృషభ ధ్వజః ||“.

(దేవదేవుడు, చింతించుటకు - ఇటువంటివాడని చింతించుటకు (ఊహించుటకు) వీలుకానివాడు, జన్మలేనివాడు, క్షీణించని వాడు అయిన విష్ణువు సమస్త రూపములు ఇవుడే యగుట యెఱింగి అతనిని లింగరూపములో అర్చించును - ఆ లింగరూపమునందు అధికప్రీతి కలిగియుండును).

Transliteration
  1. śivuḍu.

  2. bhavati asmāt sarvamidaṃ jagat iti bhavaḥ śivaḥ; kārya vargasya udbhavaḥ yasmāt, saḥ -

(ī jagattu aṃtayu, evaninuṃḍi puṭṭinadō ataḍu bhavuḍu - śivuḍu. puṭṭinavastuvulanniyu kārya vastuvulē - kārya vastuvulu evaninuṃḍi puṭṭinavi - avi puṭṭuṭaku kāraṇamainavāḍu - bhavuḍu, śivuḍu.)

  1. yasmāt bhavaṃti bhūtāni tābhastā bhāyaṃti ca |

bhavanāt bhāvanācchaiva bhūtānāṃ nabhavassmṛtaḥ ||“.

(evaninuṃḍi bhūtamulu puṭṭucunnavō, puṭṭinavi evanini bhāviṃcucunnavō - dyāniṃcucunnavō - atanu bhavuḍu - bhūtamulu atani nuṃḍu puṭṭucunnavi kanukanu atanini dhyāniṃcucunnavi kanukanu ataḍu bhavuḍani ceppabaḍucunnāḍu).

  1. “dēva dēvastva ciṃtyātmā ajayyō viṣṇuravyayaḥ |

sarvarūpaṃ bhavaṃ jñātvā liṃgē (a)rcayati taṃ prabhuṃ |

tasminna tyadhikāṃ prītiṃ karōti vṛṣabha dhvajaḥ ||“.

(dēvadēvuḍu, ciṃtiṃcuṭaku - iṭuvaṃṭivāḍani ciṃtiṃcuṭaku (ūhiṃcuṭaku) vīlukānivāḍu, janmalēnivāḍu, kṣīṇiṃcani vāḍu ayina viṣṇuvu samasta rūpamulu ivuḍē yaguṭa yeṟiṃgi atanini liṃgarūpamulō arciṃcunu - ā liṃgarūpamunaṃdu adhikaprīti kaligiyuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.