“స్వగతభేద, స్వజాతి భేద, విజాతీయ భేదంబులే దృక్కునందు నిరాకరించ తగిన భేదత్రయంబులు. వీటికి దృష్టాంతము - లోకమందొకానొక వృక్షానకు పత్ర పుష్ప ఫలాదికమే స్వగత భేదమనంబడు - వృక్షాంతరమే స్వజాతీయ భేదమనంబడు, పాషాణిదికం విజాతీయ భేదము - మఱియు సద్రూప బ్రహ్మము గగనముంబోలె నిరవయమై యుండుట బట్టిన్నీ, సత్తుకు మఱొక సత్తు లేకుండుటబట్టిన్నీ, బ్రహ్మమందు స్వగత భేద స్వజాతీయ భేదంబులు లేకుండుటంజేసి జగత్కారణంబైన మాయ కలుగం బట్టి విజాతీయ భేదంబు లేదనెడిది చెప్పేము. లోకమందు చిత్రకుని చిత్రశక్తికి వేరే తోపులేని విధంబున సన్మాత్ర బ్రహ్మమందు గల మాయకు విలక్షణత్వములేదు గాబట్టి బ్రహ్మంబునకు విజాతీయ భేదంబులేదనుట సిద్ధంబు -” (వివేకచింతామణి - పరమానందతీర్థ)
“వృక్షస్య స్వగతో భేదః పత్ర పుష్ప ఫలాదితః |
వృక్షాంతరాత్ సజాతీయో విజాతీయో శిలారితః ||“.
ఈ శ్లోకమునకర్థము పైన 1 లో చెప్పబడినది –
“బ్రహ్మమందు ఈ మూడు భేదములు వర్తించుటకు వీలులేదు -
(1) సర్వము ఒకటే బ్రహ్మస్వరూపమై ఉండుటవలన సజాతీయమగు అన్యబ్రహ్మము లేనందువలన బ్రహ్మము సజాతీయ భేదరహితము –
(2) బ్రహ్మముకన్న అన్యముగాతోచు ప్రపంచము విజాతీయమనవలయు ఆ ప్రపంచము సత్యముకాదు - రజ్జు సర్వమువలె మిధ్యగానున్నది. ఏది మిధ్యయో అది అధిష్ఠానముకన్న వేఱుకాదు, కనుక బ్రహ్మము విజాతీయరహితము –
(3) ఘతపటాదికమువలె ఏది అవయవముగలదియో అది స్వగత భేదముకలదిగా నుండును - బ్రహ్మము నిరవయవము - కనుక బ్రహ్మము స్వగతభేదరహితము - చక్కెరయొక్క శ్వేతమృధుమధుర లక్షణములవలె సచ్చిదానందములు బ్రహ్మమునకు లక్షణములుగాని అవయవములుకావు - ఈ విధముగా బ్రహ్మము త్రివిధ భేదరహితము -”
“svagatabhēda, svajāti bhēda, vijātīya bhēdaṃbulē dṛkkunaṃdu nirākariṃca tagina bhēdatrayaṃbulu. vīṭiki dṛṣṭāṃtamu - lōkamaṃdokānoka vṛkṣānaku patra puṣpa phalādikamē svagata bhēdamanaṃbaḍu - vṛkṣāṃtaramē svajātīya bhēdamanaṃbaḍu, pāṣāṇidikaṃ vijātīya bhēdamu - maṟiyu sadrūpa brahmamu gaganamuṃbōle niravayamai yuṃḍuṭa baṭṭinnī, sattuku maṟoka sattu lēkuṃḍuṭabaṭṭinnī, brahmamaṃdu svagata bhēda svajātīya bhēdaṃbulu lēkuṃḍuṭaṃjēsi jagatkāraṇaṃbaina māya kalugaṃ baṭṭi vijātīya bhēdaṃbu lēdaneḍidi ceppēmu. lōkamaṃdu citrakuni citraśaktiki vērē tōpulēni vidhaṃbuna sanmātra brahmamaṃdu gala māyaku vilakṣaṇatvamulēdu gābaṭṭi brahmaṃbunaku vijātīya bhēdaṃbulēdanuṭa siddhaṃbu -” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
“vṛkṣasya svagatō bhēdaḥ patra puṣpa phalāditaḥ |
vṛkṣāṃtarāt sajātīyō vijātīyō śilāritaḥ ||“.
ī ślōkamunakarthamu paina 1 lō ceppabaḍinadi –
“brahmamaṃdu ī mūḍu bhēdamulu vartiṃcuṭaku vīlulēdu -
(1) sarvamu okaṭē brahmasvarūpamai uṃḍuṭavalana sajātīyamagu anyabrahmamu lēnaṃduvalana brahmamu sajātīya bhēdarahitamu –
(2) brahmamukanna anyamugātōcu prapaṃcamu vijātīyamanavalayu ā prapaṃcamu satyamukādu - rajju sarvamuvale midhyagānunnadi. ēdi midhyayō adi adhiṣṭhānamukanna vēṟukādu, kanuka brahmamu vijātīyarahitamu –
(3) ghatapaṭādikamuvale ēdi avayavamugaladiyō adi svagata bhēdamukaladigā nuṃḍunu - brahmamu niravayavamu - kanuka brahmamu svagatabhēdarahitamu - cakkerayokka śvētamṛdhumadhura lakṣaṇamulavale saccidānaṃdamulu brahmamunaku lakṣaṇamulugāni avayavamulukāvu - ī vidhamugā brahmamu trividha bhēdarahitamu -”
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.