జీవేశ్వరులకు భేదమున్నదను వాదమును ఖండించుట.
(ఒక చంద్రునందు కాచకాదిదృష్టిదోష భ్రాంతివల్ల “చంద్రమసౌ ద్వౌ” (చంద్రులిద్దరు) అనెడి భేదజ్ఞానము ప్రాప్తమైనదిగాబట్టి చంద్రుడు ఒక్కడేకాని యిద్దరులేరని అభేదజ్ఞానము ప్రతిషేధించినట్లే మునుపు గలిగిన ఒక్క వస్తువునందు అవిద్యావశంవల్ల భేదభ్రాంతి తోచగాను, తత్ప్రతిషేధార్థమై అద్వైతమనెడిది రూఢంగాను ప్రతిపాదించవలసెను. ఈ కారణాన ఆశ్రుత్యనుమాన ప్రమాణాలచేతను అతద్వ్యావృత్తి ముఖాన స్వరూపలక్షణమై సాక్షాత్కరించినటువంటి సత్యజ్ఞానాత్మకమైన బ్రహ్మమొక్కటే అనెడిదిప్పుడు సిద్ధాంతము - ఈ యర్థమందు శ్రుతి - “ఏకో దేవ స్సర్వభూతేషు గూఢః, సర్వవ్యాపీ, సర్వభూతాంతరాత్మా, కర్మాధ్యక్ష క్షస్సర్వభూతాది వాస స్సాక్షీ చేతః కేవలో నిర్గుణశ్చ”, “ఏకం సత్ బహుధా కల్పయంతి” అనిన్నీ సిద్ధమైయున్నదికనుక భేదవాదఖండనం చెప్పబడింది.)
(దేవుడైనవాడొక్కడే సమస్త భూతములందు గూఢముగా నున్నాడు - లోపలనున్నట్లు పైకి కనబడడు, అందుచేత గూఢముగానున్నాడని చెప్పబడినది. అట్టి దేవుడు అన్నింటిలోను - లోపల పైన - పూర్తిగా వ్యాపించి యున్నాడు, సమస్త భూతములందు అంతరాత్మగా నున్నాడు, కర్మాధ్యక్షుడు - జీవులు చేసిన కర్మానుసారము వారికి ఫలము కలుగచేయువాడు -, భూతములన్నింటిలోను అధివసించి యుండువాడు, సమస్తమునకు సాక్షి అయినవాడు - అన్నింటి లోపల నుండువాడగుటచేత అందఱు చేయు పనులకు సాక్షిగా చూచువాడు, ఒక్కడే అయినవాడు - దేనితోను కలియక యుండువాడు - అటువంటివాడు మఱియొకడు లేడు - సత్వరజస్తమోగుణములు లేనివాడు) అనిన్నీ - (సత్పదార్థమనునది - శాశ్వతముగా నుండునది - ఒకటే; అయినను అనేక విధములుగా, అనేక వస్తువులుగా సృష్టి చేయుచున్నది) అనిన్నీ శ్రుతి చెప్పుచున్నది)
నాత్రస్వాభావికో భేదోప్యాత్మనో హరిణేరితః |
త్వం పదార్థ విశుద్ధ్యర్థం భేదముద్ధిశ్య లౌకికం |
ఆత్మనో నిత్యతాద్వారా వైలక్షణ్యం శరీరతః |
శాస్త్రస్యోపక్రమే యస్మాత్సిసాధ యిషితం హరేః |
- - - అహం త్వం వయమిత్యాది వ్యవహారే(అ)స్తి కల్పితః |
భేదస్తే నైవ తత్సిద్ధిః సవాస్తవ ఇహేష్యతే |
“న విరోధో నచోత్పత్తిర్నబద్ధో నచ సాధకః |
నముముక్షుర్నవైముక్తః ఇత్యేషా పరమార్థతా |”
“ఇత్యాది శ్రుతి నిర్ణీతా(అ)ద్వైత తత్వ విమర్శనాత్ |
భేదవాదో(అ)సతామిష్టో న స తత్ర విమర్శినా ||“. (గీతాభావప్రకాశము - 2 - 110 to 112)
(నేను, నువ్వు, మేము అను భేదభావము దేహము మొదలగు గల భేదము వలన కలుగుచున్నది. అది ఆత్మకు స్వాభావికమైన భేదము కాదు - “త్వం బ్రహ్మస్మి” (నీవు బ్రహ్మవు అయితివి) అను మహావాక్యములోని “త్వం” (నీవు) అనుదానికి అర్థము చెప్పుటకు లోకవ్యవహారములో ‘నీవు, నేను’ అను భేదము చెప్పబడినది. ఆత్మ నిత్యమైనదనికూడ అందుకనే చెప్పబడినది. నేను, నీవు, మేము అనునవి వ్యవహారమందు కల్పితము - వ్యవహారము కొఱకు కల్పించబడినవి, వాస్తవమైనవి కాదు - విరోధములేదు, ఉత్పత్తిలేదు, బంధములేదు, సాధకుడులేడు, మోక్షముకోరువాడు లేడు, మోక్షము పొందినవాడు లేడు - ఇదియే పరమార్థము - అనగా, అంతా, అన్నీ భగవంతుడే కాని భగవంతునికంటె వేఱైనదేదియు లేదు -“హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు” - ఇదియే పరమార్థము - వాస్తవమైన విషయం - అని శ్రుతులలో చెప్పబడిన అద్వైతతత్వము ననుసరించి భేదవాదము - భగవంతుడు వేఱు, ప్రపంచము వేఱు అను వాదము - ఖండింపబడినది).
jīvēśvarulaku bhēdamunnadanu vādamunu khaṃḍiṃcuṭa.
(oka caṃdrunaṃdu kācakādidṛṣṭidōṣa bhrāṃtivalla “caṃdramasau dvau” (caṃdruliddaru) aneḍi bhēdajñānamu prāptamainadigābaṭṭi caṃdruḍu okkaḍēkāni yiddarulērani abhēdajñānamu pratiṣēdhiṃcinaṭlē munupu galigina okka vastuvunaṃdu avidyāvaśaṃvalla bhēdabhrāṃti tōcagānu, tatpratiṣēdhārthamai advaitamaneḍidi rūḍhaṃgānu pratipādiṃcavalasenu. ī kāraṇāna āśrutyanumāna pramāṇālacētanu atadvyāvṛtti mukhāna svarūpalakṣaṇamai sākṣātkariṃcinaṭuvaṃṭi satyajñānātmakamaina brahmamokkaṭē aneḍidippuḍu siddhāṃtamu - ī yarthamaṃdu śruti - “ēkō dēva ssarvabhūtēṣu gūḍhaḥ, sarvavyāpī, sarvabhūtāṃtarātmā, karmādhyakṣa kṣassarvabhūtādi vāsa ssākṣī cētaḥ kēvalō nirguṇaśca”, “ēkaṃ sat bahudhā kalpayaṃti” aninnī siddhamaiyunnadikanuka bhēdavādakhaṃḍanaṃ ceppabaḍiṃdi.)
(dēvuḍainavāḍokkaḍē samasta bhūtamulaṃdu gūḍhamugā nunnāḍu - lōpalanunnaṭlu paiki kanabaḍaḍu, aṃducēta gūḍhamugānunnāḍani ceppabaḍinadi. aṭṭi dēvuḍu anniṃṭilōnu - lōpala paina - pūrtigā vyāpiṃci yunnāḍu, samasta bhūtamulaṃdu aṃtarātmagā nunnāḍu, karmādhyakṣuḍu - jīvulu cēsina karmānusāramu vāriki phalamu kalugacēyuvāḍu -, bhūtamulanniṃṭilōnu adhivasiṃci yuṃḍuvāḍu, samastamunaku sākṣi ayinavāḍu - anniṃṭi lōpala nuṃḍuvāḍaguṭacēta aṃdaṟu cēyu panulaku sākṣigā cūcuvāḍu, okkaḍē ayinavāḍu - dēnitōnu kaliyaka yuṃḍuvāḍu - aṭuvaṃṭivāḍu maṟiyokaḍu lēḍu - satvarajastamōguṇamulu lēnivāḍu) aninnī - (satpadārthamanunadi - śāśvatamugā nuṃḍunadi - okaṭē; ayinanu anēka vidhamulugā, anēka vastuvulugā sṛṣṭi cēyucunnadi) aninnī śruti ceppucunnadi)
nātrasvābhāvikō bhēdōpyātmanō hariṇēritaḥ |
tvaṃ padārtha viśuddhyarthaṃ bhēdamuddhiśya laukikaṃ |
ātmanō nityatādvārā vailakṣaṇyaṃ śarīrataḥ |
śāstrasyōpakramē yasmātsisādha yiṣitaṃ harēḥ |
- - - ahaṃ tvaṃ vayamityādi vyavahārē(a)sti kalpitaḥ |
bhēdastē naiva tatsiddhiḥ savāstava ihēṣyatē |
“na virōdhō nacōtpattirnabaddhō naca sādhakaḥ |
namumukṣurnavaimuktaḥ ityēṣā paramārthatā |”
“ityādi śruti nirṇītā(a)dvaita tatva vimarśanāt |
bhēdavādō(a)satāmiṣṭō na sa tatra vimarśinā ||“. (gītābhāvaprakāśamu - 2 - 110 to 112)
(nēnu, nuvvu, mēmu anu bhēdabhāvamu dēhamu modalagu gala bhēdamu valana kalugucunnadi. adi ātmaku svābhāvikamaina bhēdamu kādu - “tvaṃ brahmasmi” (nīvu brahmavu ayitivi) anu mahāvākyamulōni “tvaṃ” (nīvu) anudāniki arthamu ceppuṭaku lōkavyavahāramulō ‘nīvu, nēnu’ anu bhēdamu ceppabaḍinadi. ātma nityamainadanikūḍa aṃdukanē ceppabaḍinadi. nēnu, nīvu, mēmu anunavi vyavahāramaṃdu kalpitamu - vyavahāramu koṟaku kalpiṃcabaḍinavi, vāstavamainavi kādu - virōdhamulēdu, utpattilēdu, baṃdhamulēdu, sādhakuḍulēḍu, mōkṣamukōruvāḍu lēḍu, mōkṣamu poṃdinavāḍu lēḍu - idiyē paramārthamu - anagā, aṃtā, annī bhagavaṃtuḍē kāni bhagavaṃtunikaṃṭe vēṟainadēdiyu lēdu -“harimayamu kāni dravyamu paramāṇuvu lēdu” - idiyē paramārthamu - vāstavamaina viṣayaṃ - ani śrutulalō ceppabaḍina advaitatatvamu nanusariṃci bhēdavādamu - bhagavaṃtuḍu vēṟu, prapaṃcamu vēṟu anu vādamu - khaṃḍiṃpabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.