← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భోగములు bhōgamulu

Original — తెలుగు
  1. భోజ్యంతే ఇతి భోగాః -

(అనుభవించబడునవి - అనుభవించ బడుచున్నవి)

  1. సుఖాని; భుక్తయః, సుఖదుఃఖాది సాక్షాత్కారాః -

(సుఖములు, అనుభవించబడునవి; సుఖదుఃఖములు మొదలగువాటిని కలుగచేయునవి).

  1. స్రక్చందన వినితా సంభోగ సుఖానుభవాః.

(పూలమాలలు, మంచిగంధము, స్త్రీ సంభోగము మొదలగువాటివలన కలుగు సుఖకరమైన అనుభవములు).

  1. సుఖదుఃఖ సాక్షాత్కారో భోగః

(సుఖదుఃఖములను సాక్షాత్తుగా అనుభవించుటే భోగము).

  1. స్వర్గాది సత్యాంత లోక సముదాయస్థః

(స్వర్గలోకము మొదలు సత్యలోకమువఱకుగల లోకములన్నింటియందుగల అనుభవములు).

  1. “సుధాపానోర్వశీ క్రీడా సుగంధాది నిబంధనః”. (గీతాభావప్రకాశము - 2 - 463)

(మధ్యపానము - కల్లు ద్రావుట, లేక స్వర్గములో అమృతము త్రాగుట. ఊర్వశితో సంభోగము, మంచిగంధము మొదలగువాటి వలన కలుగు సుఖము).

  1. “విషయేంద్రియ సంబంధిజాః, క్షుద్రసుఖలవానుభవాః, రాగద్వేషాది వ్యాప్తత్వేన దుఃఖ యోనయః (దుఃఖ హేతువః), ఏతాదృశాః అపి న స్థిరాః, మిధ్యాః క్షణికభూతాః”.

(ఇంద్రియములకు విషయములతోడి సంబంధమువలన కలుగు సుఖములు, క్షుద్రమైనవి (నీచమైనవి). ఏ మాత్రమో కొంచెము సుఖము కలుగచేయునవి. రాగము, ద్వేషము విషయములయడల కలుగుటవలన దుఃఖమును కలుగచేయునవి - దుఃఖమునకు కారణమైనవి - ఇటువంటివైనను స్థిరముగానుండనివి - మిధ్యలు).

  1. బాహ్య విషయ భోగాః, సర్వే దుఃఖకారణరూపాః, తథా విథా అపి అనిత్యాః.

(బాహ్య విషయములవలన కలుగు భోగములు అన్నియు దుఃఖమునకు కారణమైనవి; దుఃఖమును కలుగచేయునవి - అటువంటివైనను నిత్యముగా నుండనివి, ఎల్లకాలములందుండనివి, నశించునవి)

  1. ఆధివ్యాది జరామరణాది సహితేభ్యః సమాగమనాది క్లేశరూప భాగభ్యశ్చ, విషయేంద్రియ సంబంధేభ్యః భోగాః సుఖలవానుభవాః జాయంతే, తస్మాత్ తే దుఃఖహేతువః భవంతి.

(ఆధులు అనగా ఆధిభౌతికము, ఆధ్యాత్మికము, ఆధిదైవికము అనునవి. వ్యాధులు అనగా జబ్బులు - ముసలితనము, మరణము వీటికి కారణమైనవి. వీటితో కూడియున్న క్లేశరూపములగునట్టియు, విషయములందు ఇంద్రియములకు కలుగు సంబంధమువలన కలుగు భోగము తగుమాత్రము సుఖము కలవి. అందుచేత నవి దుఃఖమునకు కారణమగుచున్నవి - ఈ సుఖము, అయ్యో, అప్పుడే అయిపోయినది, ఇంకను కొంతకాలముండిన బాగుండును - అను దుఃఖమును కలుగచేయునవి).

  1. “యేహి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవ తే |

ఆద్యంతవంతః, కౌంతేయ, న తేషు రమతే బుధః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 22)

“శ్రుణు బాహ్యరుచి త్యాగే దోష దృష్టిర్హి కారణం |

విషయేంద్రియ సంబంధ జన్యాయే క్షుద్ర రూపిణిః |

సుఖాంశాను భవా భోగా ఇహలోకే పరత్రచ |

విషయేంద్రియ సం యోగ ఆది రంతస్తు తత్ క్షయః |

తద్వంతః స్వప్నవన్మధ్యే ప్రాదుర్భూతా మృషాత్మాకాః |”

“ఆదావంతే చ యన్నాసి వర్తమానేపి తత్తథా” |

ఇతి న్యాయేన తే మిథ్యా క్షణికానంద కారిణః |

యస్మా దేవం తతస్తేషు రతిమేతి న పండితః |

రజ్జు సర్వవదధ్యస్థా భోగా మిధ్యా భ్రమా కరాః |

స్వప్నవత్ దృష్టి సృష్టిత్వాద విద్యా మూలకా జడాః |

అధిష్ఠా నాన భోదేన నష్టా విద్యా భ్రమో బుధః |

న తేషు రమతే యద్వత్తజ్ఞః ఉ షర వారిషు |

న సంసారే సుఖస్యాస్తి గంధోస్యథా తతః సుధీః |

బాహ్య భోగరుచిం త్యక్త్వా స్వసుఖానుభవో భవేత్ ||. (గీతాభావప్రకాశము - 5 - 184 to 191)

(ఇంద్రియములకు విషయములతో కలుగు సంబంధమువలన కలుగు భోగముల సుఖములు ఈ లోకమునందు పరలోకమునందు కలుగు సుఖములు ఆది, అంతములు కలవి, కలుగుచూ, లేకుండునవి - క్షీణించునవి, కలవలె కలుగునవి. మొదట లేనిది, అంతమందు లేనిది అయిన వస్తువు మధ్యకాలమునందు కూడ లేనిదే - అందుచేత మొత్తముమీద లేనిదే. ఈ న్యాయము వలన ఈ భోగసుఖములు క్షణికములు - క్షణకాలము మాత్రముండునవి, కొంచెము కాలము మాత్రము సుఖమును కలుగచేయునవి. ఈ కారణమువలన పండితులైనవారు - జ్ఞానులు - ఇట్టి భోగములందాసక్తి చూపరు, (అదే పనిగ అనుభవించు చుండరు -చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమపడినట్లే ఈ భోగములు నిజమైనవికావు, భ్రమను కలుగచేయునవి, అవిద్యవలన కలుగునవి, జడములు, వాటి అధిష్ఠానము నశించగనే నశించునవి. ఎండమావులవలె - (దూరముగా నున్న స్థలము సూర్యకిరణములవలన జలమువలె కనబడి భ్రమ కలుగచేసినట్లుండునివి. వాటియందు పండితుడైనవాడు (జ్ఞాని అయినవాడు) (ఈ యదార్థమును తెలిసినవాడు) దానియందు నిమగ్నుడై యుండడు. ఈ సంసారమందు సుఖమనునది లేశమాత్రమైనను లేదు - అందుచేత ఈ బాహ్యభోగములను విడిచిపెట్టి స్వస్వరూపమైన పరబ్రహ్మ ధ్యానమను సుఖమునే అనుభవించుచుండును).

  1. “భోగాః మేఘవితాన మధ్య విలత్సౌదామినీ చంచలాః”. (భర్తృహరి) - (వైరాగ్యశతకము -)

(మేఘములమధ్యను విలసిల్లు మెరుపుతీగవలె చంచలములు - ఒక్క క్షణముండి పోవునది).

  1. “ఇష్టాన్ భోగాన్హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః |

తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 12)

(దేవతులను మానవులను బ్రహ్మ సృష్టించినపుడు ఒకరికొకరు సహకరించునట్లు చేసెను. మానవులు దేవతులను గుఱించి యజ్ఞము చేసిన, వారు సంతోషించి మానవులు కోరిన భోగములనిచ్చెదరు - అట్లు దేవతలవలన పొందిన భోగములలో కొంత భాగము వారికి అర్పించనిది అంతయు తానే తినువాడు కుక్కయే).

  1. “నిమిష భంగుర ప్రాణులయిన మర్త్యులకు మమతాస్పదంబులును, జంచలంబులును నైన పుత్ర మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశ మణిమందిర మంత్రిమాతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్థకంబులు. యాగప్రముఖ పుణ్య లబ్దంబులైన స్వర్గాదిలోక భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులుగాని నిత్యంబులుగావు.” (శ్రీమదాంధ్రమహాభాగవాము - 7 - 7 - 241)

  2. “భరతఖండంబునందు జేసిన కర్మంబులవలన ఇళావృతాది వర్షాష్టకంబులయందును, మునుపు చేసిన ద్వీపాంతరంబులయందును, స్వర్గాది లోకంబులయందును ఆ యా భోగంబులనుభవించుటం జేసి ఈ భారతవర్షమే కర్మభూమి, తక్కినవెల్లను భోగభూములైనందున నా భోగభూములకు నీ కర్మభూమియే కారణము”. (వివేకచింతామణి)

  3. “దృష్టామయా దివి, విభో, (అ)ఖిల ధిక్ణ్యపానా మాయుః శ్రియో విభవ ఇచ్ఛతి యాంచనో(అ)యం |

యే(అ)స్మత్సితుః కుపిత హస విజృంభి త భృఊ విస్పూర్జితేన లులితాః స తు తేన నిరస్తః ||“.

(శ్రీమద్భాగవతం - ప్రహ్లాద చరిత్ర)

పై శ్లోకమునకు శ్రీమదాంధ్రమహాభాగవతములో -

“సీ. జనులు దిక్పాలుర సంపదాయుర్వి భవములు గోరుదురు భవ్యంబులనుచు

అవి యన్ని రోష హాస విజృంభితంబైన మాతండ్రి బొమముడి మహిమ జేసి

విహితంబులగు; అట్టి వీరుండు నీచేత నిమిషమాత్రంబున నేడు మడిసె

కావున ధౄవములుకావు బ్రహ్మాదుల శ్రీవిభవంబులు, జీవితములు,

తే. గాలరూపకుడగు నురుక్రముని చేత

విదళితములగు, నిలువవు; వేయునేల ?

- -“. (శ్రీమదాంధ్రమహాభాగవత్ము - 7 - 9 - 357)

Transliteration
  1. bhōjyaṃtē iti bhōgāḥ -

(anubhaviṃcabaḍunavi - anubhaviṃca baḍucunnavi)

  1. sukhāni; bhuktayaḥ, sukhaduḥkhādi sākṣātkārāḥ -

(sukhamulu, anubhaviṃcabaḍunavi; sukhaduḥkhamulu modalaguvāṭini kalugacēyunavi).

  1. srakcaṃdana vinitā saṃbhōga sukhānubhavāḥ.

(pūlamālalu, maṃcigaṃdhamu, strī saṃbhōgamu modalaguvāṭivalana kalugu sukhakaramaina anubhavamulu).

  1. sukhaduḥkha sākṣātkārō bhōgaḥ

(sukhaduḥkhamulanu sākṣāttugā anubhaviṃcuṭē bhōgamu).

  1. svargādi satyāṃta lōka samudāyasthaḥ

(svargalōkamu modalu satyalōkamuvaṟakugala lōkamulanniṃṭiyaṃdugala anubhavamulu).

  1. “sudhāpānōrvaśī krīḍā sugaṃdhādi nibaṃdhanaḥ”. (gītābhāvaprakāśamu - 2 - 463)

(madhyapānamu - kallu drāvuṭa, lēka svargamulō amṛtamu trāguṭa. ūrvaśitō saṃbhōgamu, maṃcigaṃdhamu modalaguvāṭi valana kalugu sukhamu).

  1. “viṣayēṃdriya saṃbaṃdhijāḥ, kṣudrasukhalavānubhavāḥ, rāgadvēṣādi vyāptatvēna duḥkha yōnayaḥ (duḥkha hētuvaḥ), ētādṛśāḥ api na sthirāḥ, midhyāḥ kṣaṇikabhūtāḥ”.

(iṃdriyamulaku viṣayamulatōḍi saṃbaṃdhamuvalana kalugu sukhamulu, kṣudramainavi (nīcamainavi). ē mātramō koṃcemu sukhamu kalugacēyunavi. rāgamu, dvēṣamu viṣayamulayaḍala kaluguṭavalana duḥkhamunu kalugacēyunavi - duḥkhamunaku kāraṇamainavi - iṭuvaṃṭivainanu sthiramugānuṃḍanivi - midhyalu).

  1. bāhya viṣaya bhōgāḥ, sarvē duḥkhakāraṇarūpāḥ, tathā vithā api anityāḥ.

(bāhya viṣayamulavalana kalugu bhōgamulu anniyu duḥkhamunaku kāraṇamainavi; duḥkhamunu kalugacēyunavi - aṭuvaṃṭivainanu nityamugā nuṃḍanivi, ellakālamulaṃduṃḍanivi, naśiṃcunavi)

  1. ādhivyādi jarāmaraṇādi sahitēbhyaḥ samāgamanādi klēśarūpa bhāgabhyaśca, viṣayēṃdriya saṃbaṃdhēbhyaḥ bhōgāḥ sukhalavānubhavāḥ jāyaṃtē, tasmāt tē duḥkhahētuvaḥ bhavaṃti.

(ādhulu anagā ādhibhautikamu, ādhyātmikamu, ādhidaivikamu anunavi. vyādhulu anagā jabbulu - musalitanamu, maraṇamu vīṭiki kāraṇamainavi. vīṭitō kūḍiyunna klēśarūpamulagunaṭṭiyu, viṣayamulaṃdu iṃdriyamulaku kalugu saṃbaṃdhamuvalana kalugu bhōgamu tagumātramu sukhamu kalavi. aṃducēta navi duḥkhamunaku kāraṇamagucunnavi - ī sukhamu, ayyō, appuḍē ayipōyinadi, iṃkanu koṃtakālamuṃḍina bāguṃḍunu - anu duḥkhamunu kalugacēyunavi).

  1. “yēhi saṃsparśajā bhōgā duḥkha yōnaya ēva tē |

ādyaṃtavaṃtaḥ, kauṃtēya, na tēṣu ramatē budhaḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 22)

“śruṇu bāhyaruci tyāgē dōṣa dṛṣṭirhi kāraṇaṃ |

viṣayēṃdriya saṃbaṃdha janyāyē kṣudra rūpiṇiḥ |

sukhāṃśānu bhavā bhōgā ihalōkē paratraca |

viṣayēṃdriya saṃ yōga ādi raṃtastu tat kṣayaḥ |

tadvaṃtaḥ svapnavanmadhyē prādurbhūtā mṛṣātmākāḥ |”

“ādāvaṃtē ca yannāsi vartamānēpi tattathā” |

iti nyāyēna tē mithyā kṣaṇikānaṃda kāriṇaḥ |

yasmā dēvaṃ tatastēṣu ratimēti na paṃḍitaḥ |

rajju sarvavadadhyasthā bhōgā midhyā bhramā karāḥ |

svapnavat dṛṣṭi sṛṣṭitvāda vidyā mūlakā jaḍāḥ |

adhiṣṭhā nāna bhōdēna naṣṭā vidyā bhramō budhaḥ |

na tēṣu ramatē yadvattajñaḥ u ṣara vāriṣu |

na saṃsārē sukhasyāsti gaṃdhōsyathā tataḥ sudhīḥ |

bāhya bhōgaruciṃ tyaktvā svasukhānubhavō bhavēt ||. (gītābhāvaprakāśamu - 5 - 184 to 191)

(iṃdriyamulaku viṣayamulatō kalugu saṃbaṃdhamuvalana kalugu bhōgamula sukhamulu ī lōkamunaṃdu paralōkamunaṃdu kalugu sukhamulu ādi, aṃtamulu kalavi, kalugucū, lēkuṃḍunavi - kṣīṇiṃcunavi, kalavale kalugunavi. modaṭa lēnidi, aṃtamaṃdu lēnidi ayina vastuvu madhyakālamunaṃdu kūḍa lēnidē - aṃducēta mottamumīda lēnidē. ī nyāyamu valana ī bhōgasukhamulu kṣaṇikamulu - kṣaṇakālamu mātramuṃḍunavi, koṃcemu kālamu mātramu sukhamunu kalugacēyunavi. ī kāraṇamuvalana paṃḍitulainavāru - jñānulu - iṭṭi bhōgamulaṃdāsakti cūparu, (adē paniga anubhaviṃcu cuṃḍaru -cīkaṭilō trāḍunu cūci pāmu ani bhramapaḍinaṭlē ī bhōgamulu nijamainavikāvu, bhramanu kalugacēyunavi, avidyavalana kalugunavi, jaḍamulu, vāṭi adhiṣṭhānamu naśiṃcaganē naśiṃcunavi. eṃḍamāvulavale - (dūramugā nunna sthalamu sūryakiraṇamulavalana jalamuvale kanabaḍi bhrama kalugacēsinaṭluṃḍunivi. vāṭiyaṃdu paṃḍituḍainavāḍu (jñāni ayinavāḍu) (ī yadārthamunu telisinavāḍu) dāniyaṃdu nimagnuḍai yuṃḍaḍu. ī saṃsāramaṃdu sukhamanunadi lēśamātramainanu lēdu - aṃducēta ī bāhyabhōgamulanu viḍicipeṭṭi svasvarūpamaina parabrahma dhyānamanu sukhamunē anubhaviṃcucuṃḍunu).

  1. “bhōgāḥ mēghavitāna madhya vilatsaudāminī caṃcalāḥ”. (bhartṛhari) - (vairāgyaśatakamu -)

(mēghamulamadhyanu vilasillu meruputīgavale caṃcalamulu - okka kṣaṇamuṃḍi pōvunadi).

  1. “iṣṭān bhōgānhi vō dēvāḥ dāsyaṃtē yajña bhāvitāḥ |

tairdattāna pradāyaibhyō yō bhuṃktē stēna ēva saḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 12)

(dēvatulanu mānavulanu brahma sṛṣṭiṃcinapuḍu okarikokaru sahakariṃcunaṭlu cēsenu. mānavulu dēvatulanu guṟiṃci yajñamu cēsina, vāru saṃtōṣiṃci mānavulu kōrina bhōgamulaniccedaru - aṭlu dēvatalavalana poṃdina bhōgamulalō koṃta bhāgamu vāriki arpiṃcanidi aṃtayu tānē tinuvāḍu kukkayē).

  1. “nimiṣa bhaṃgura prāṇulayina martyulaku mamatāspadaṃbulunu, jaṃcalaṃbulunu naina putra mitra kaḷatra paśu bhṛtya bala baṃdhu rājyakōśa maṇimaṃdira maṃtrimātaṃga mahī pramukha vibhavaṃbulu nirarthakaṃbulu. yāgapramukha puṇya labdaṃbulaina svargādilōka bhōgaṃbulu puṇyānubhava kṣīṇaṃbulugāni nityaṃbulugāvu.” (śrīmadāṃdhramahābhāgavāmu - 7 - 7 - 241)

  2. “bharatakhaṃḍaṃbunaṃdu jēsina karmaṃbulavalana iḷāvṛtādi varṣāṣṭakaṃbulayaṃdunu, munupu cēsina dvīpāṃtaraṃbulayaṃdunu, svargādi lōkaṃbulayaṃdunu ā yā bhōgaṃbulanubhaviṃcuṭaṃ jēsi ī bhāratavarṣamē karmabhūmi, takkinavellanu bhōgabhūmulainaṃduna nā bhōgabhūmulaku nī karmabhūmiyē kāraṇamu”. (vivēkaciṃtāmaṇi)

  3. “dṛṣṭāmayā divi, vibhō, (a)khila dhikṇyapānā māyuḥ śriyō vibhava icchati yāṃcanō(a)yaṃ |

yē(a)smatsituḥ kupita hasa vijṛṃbhi ta bhṛū vispūrjitēna lulitāḥ sa tu tēna nirastaḥ ||“.

(śrīmadbhāgavataṃ - prahlāda caritra)

pai ślōkamunaku śrīmadāṃdhramahābhāgavatamulō -

“sī. janulu dikpālura saṃpadāyurvi bhavamulu gōruduru bhavyaṃbulanucu

avi yanni rōṣa hāsa vijṛṃbhitaṃbaina mātaṃḍri bomamuḍi mahima jēsi

vihitaṃbulagu; aṭṭi vīruṃḍu nīcēta nimiṣamātraṃbuna nēḍu maḍise

kāvuna dhṝvamulukāvu brahmādula śrīvibhavaṃbulu, jīvitamulu,

tē. gālarūpakuḍagu nurukramuni cēta

vidaḷitamulagu, niluvavu; vēyunēla ?

- -“. (śrīmadāṃdhramahābhāgavatmu - 7 - 9 - 357)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.