← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భోక్తా bhōktā

Original — తెలుగు
  1. చేసిన కర్మఫలముననుభవించువాడు.

  2. “ప్రకృతిం భోగ్యాం అచేతనాం భుంక్తే ఇతి - జగత్పాలయ తీతివా భోక్తా -” (శ్రీశంకరః)

(అచేతనమైన, జడమైన, భోగ్యవస్తువైన ప్రకృతిని - ప్రకృతిలోనుండి పుట్టిన వస్తువులను భుజించువాడు, తినువాడు - అనుభవించువాడు) (జగత్తును పాలించువాడు).

  1. “పాలకత్వాత్ భోక్తా, పరమానంద సందోహ సంభోగాద్వా భోక్తా”. (శ్రీశంకరః)

(పాలించువాడుకనుక భోక్తా; లేక పరమానందముననుభవించువాడు - అనుభవింపచేయువాడు - మోక్షము నిచ్చువాడు, మోక్షరూపుడైనవాడు).

  1. “భోజ్యరూపతయా ప్రకృతిః మాయా భోజనముచ్యతే. పురుషరూపేణ తాం భుంక్తే ఇతి భోక్తా”.

(మాయ యను ప్రకృతి భోజ్యరూపముగానుండుటచేత - భోజనమని చెప్పబడినది. పురుషరూపముతో దానిని భుజించువాడు, అనుభవించువాడు).

  1. కార్యోపాధిః జీవిః భోక్తా.

(కార్యవస్తువు ఉపాధిగా గలవాడు - జీవుడు)

  1. చేతనశ్శారీరః (చైతన్యముగల శరీరుడు - శరీరముగలవాడు)
  1. “అచిత్వర్గం స్వాత్మనో భోగ్యత్వేన హరతీతి భోక్తా, హరః” (శ్రీమాన్ రామానుజః)

(అచిద్వస్తువులన్నియు - జడవస్తువులన్నియు, చైతన్యవంతమైన తనకు భోగించవలసినవగుటచేత - అనిభవించవలసిన వస్తువులగుటచేత వాటిని హరించువాడు కనుక భోక్త - హరించువాడు - సమ్హరించువాడు కనుక హరుడు) (హరి).

  1. ’అసౌ గుణమయైర్భావై ర్భూత భూతసూక్ష్మేంద్రియాధిభిః |

స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్ ||’ (శ్రీమద్భాగవతం - 2 - 32)

(త్రిగుణములతోనిండియున్న భూతముల సూక్ష్మేంద్రియములతో తనచేతనే నిర్మింపబడిన భూతములనుండి వాటి గుణములను అనుభవించునుకనుక భోక్త).

  1. “ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ||”. (కఠవల్లి)

(ఆత్మ, ఇంద్రియములు, మనస్సు - నీటితో కలిసి భోక్తయని చెప్పబడుచున్నాడు)

  1. “మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |

మనః షష్టాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 7)

(జీవలోకమందు - జీవులందు - సనాతనుడైన పరమాత్మ యొక్క అంశయే జీవుడై - జీవుడని చెప్పబడుచు - ప్రకృతిలోనుండు మనస్సును, ఇంద్రియములను ఆకర్షించుచున్నది - వాటిద్వారా ప్రకృతిలోని విషయములను అనుభవించుచున్నది. అందుచేత ఆ పరమాత్మ అంశయే, లేక, పరమాత్మయే వాటి భోక్త).

  1. “పురుషః ప్రకృతిస్థోహి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ |

కారణం గుణ సంగో(అ)స్య సదసద్యోని జన్మసు |

ఉపద్రష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వరః |

పరమాత్మేతి చాప్యుక్తో దేహే(అ)స్మిన్ పురుషః పరః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 20 to 22)

(పురుషుడు - (ప్రకృతి, దానివికారములు - వీటిలో ప్రవవేశించి యుండుటచేత పురుషుడు). అనగా పరమాత్మ ప్రకృతిలో ప్రవేశించి ఆ ప్రకృతి గుణములైన సత్వరజస్తమములను - ప్రకృతి కార్యములైన జీవరాసుల గుణములను - అనుభవించును. దీనికి కారణమేమనగా పరమాత్మ సదసద్యోనులలో పుట్టి, వాటితో సంపర్కము కలిగియుండుటే. ఆ పరమాత్మయే యీ ప్రకృతివలన కలిగిన శరీరములలో ప్రవేశించి వాటికి భర్త (భరించువాడు, పోషించువాడు) భోక్తా (ఆ శరీరముద్వారా సుఖదుఃఖములు మొదలగువాటిని అనుభవించువాడు).

  1. “అగ్న్యుష్ణవత్ నిత్య చైతన్య స్వరూపేణ బుద్ధేః సుఖదుఃఖ మోహాత్మకాః ప్రత్యయాః సర్వ విషయాః చైతన్యాత్మ గ్రస్తా ఇవజాయమానాః విభక్తాః విభావ్యంతే ఇతి భోక్తా ఆత్మా ఉచ్యతే” (శ్రీశంకరః)

(అగ్ని, దానివలన కలిగి దానిలోనే అడగునట్టి - దాని వేడిమివలెనే, చైతన్య స్వరూపుడు (చైతన్యమే స్వరూపముగా గల భగవంతుడు) - వలన బుద్ధి ప్రత్యయములైన సుఖదుఃఖములు - మోహము మొదలగు విషయములు - ఆ చైతన్యాత్మయగు భగవంతుని చేత గ్రహించబడినవై (అనుభవించబడినవై) విభక్తములై తిరిగి పుట్టుచున్నవై కనబడుచున్నవి. ఇందువలన ఆ చైతన్యరూపమగు ఆత్మయే భోక్త - ఆ విషయములననుభవించుచున్నది - అని చెప్పబడుచున్నది).

  1. “న సర్వప్రాణిహృదయ సంబంధాత్ చిద్రూపతయా చ శారీరవద్బ్రహ్మణః సంభోగప్రసంగః దేశేష్యాత్ - విశేషోహి భవతి శరీర పరమేశ్వరయోః - ఏకః కర్తా, భోక్తా, ధర్మాధర్మాదిసాధనః, సుఖదుఃఖాదిమాంశ్చ ఏకః తద్విపరీతో, అపహత పాప్మత్వాదిగుణః. ఏతస్మాత్ అనయోః విశేషాత్ భోగో, నేతరస్య - - - అధ గృహీతం శారీరస్య బ్రహ్మణైకత్వం తథా మిధ్యా జ్ఞాన నిమిత్తః - శారీరస్యోపభోగో న తేన పరమార్థ రూపస్య బ్రహ్మణస్సం స్పర్శః నహి బాలైః తల మలిన తాదిభిః వ్యోమ్ని వికల్ప్యమానే తలమలినతాది విశిష్టమేవ పరమార్థ తః వ్యోమ భవతి. తథాహ -”న వైశేష్యా దితి” నైకత్వేపి శారీరస్యోపభోగప్రసంగో వైశేష్యాత్ విశేషో హి భవతి. మిథ్యాజ్ఞాన సమ్యజ్ఞానయోః మిథ్యాకల్పితోప భోగః సమ్యజ్ఞాన మృష్టమేకత్వం న చ మిథ్యాకల్పితే నోపభోగేన సమ్యజ్ఞానదృష్ట యేకత్వం వస్తు సంస్సృశ్యతే. తస్మాత్ నోప భోగ గంధోపి శక్య ఈశ్వరస్య కల్పయితుం“. (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 - 2 - 8)

(సమస్త ప్రాణుల హృదయముతో సంబంధము కలిగి యుండుటచేతను (హృదయమందుండుట చేతను) చైతన్యమే రూపముగా కలిగియుండుటచేతను, శరీరముగల జీవుడు వలెనే బ్రహ్మకు భోక్తృత్వము (బ్రహ్మను భోక్తయనుట) కుదరదు - ఎందుచేతననగా ఇద్దరిలో విశేషముండుటవలన. పరమేశ్వరు నకు శారీరునకు (శరీరముగల జీవునకును) విశేషము కలదు - ఒకడు (అనగా జీవుడు) కర్త (కర్మలుచేయువాడు), భోక్త (చేసిన కర్మల ఫలమును, లేక విషయభోగముల ననుభవించువాడు, ధర్మాధర్మములను (పాప పుణ్యములను) చేయువాడు, సుఖదుఃఖములు కలవాడు. రెండవవాడు దీనికి విపరీతమైనవాడు - పాపాది దోషములు లేనివాడు - అందుచేత ఈ యిద్దరికి విశేషముండుటవలన - భేదముండుటవలన – ఒకరికి (జీవునికి) భోగము - ఒకరు భోక్త (భోగముననుభవించువాడు), రెండవవాడు (పరమాత్మ, బ్రహ్మ) భోగముననుభవించనివాడు (భోక్తకానివాడు); శరీరమును పొందిన జీవుడు పరబ్రహ్మ ఒకటే - ఇది సమ్యక్ జ్ఞానము - అందుచేత శరీరి అయిన జీవుడు భోక్త (శరీరభోగముల ననుభవించువాడు) అనుట మిధ్యాజ్ఞానము - అందుచేత శరీరి అయిన జీవుడు భోక్త (శరీరభోగములననుభవించువాడు) అనుట మిధ్యాజ్ఞానము - అందుచేత పరమార్థరూపుడైన బ్రహ్మకు శరీరభోగములతో సంస్పర్శ (సంబంధము) లేదు - ఆకాశములో మలినముగా - నల్లగా - ఉన్నదియని బాలురు (అజ్ఞానులు) చెప్పినంతమాత్రమున ఆకాశము నల్లగా నుండునా? మిధ్యాజ్ఞానమునకు సమ్యక్ జ్ఞానమునకు తేడా యున్నది - విశేషమున్నది. సమ్యక్ జ్ఞానము కుదరకుండు ముందుకాలమందు - అనగా, పరబ్రహ్మ జీవుడు ఒకటే యనుజ్ఞానము కలుగకముందు (కలగనంతకాలము) మిధ్యాజ్ఞానమువలన పరబ్రహ్మ భోక్త (భోగములననుభవించుచున్నాడు) అనుట మిధ్యాజ్ఞానము).

  1. “యధా ప్రకాశస్సౌరశ్చాంధ్రమసోవా వియద్వ్యాప్య అవతిష్టమానో అంగుళ్యాద్యుపాది సంబంధాత్ తేషు ఋజువక్రాది భావం ప్రతిపద్యమానేషు తత్తద్భావమివ ప్రతిపద్యమానోపి న పరమార్థ తః తద్భావం ప్రతి పద్యతే; యథా చాకాశే ఘటాదిషు గచ్ఛత్సు గచ్ఛన్నివ విద్యమానోపి న పరమార్థతః గచ్ఛతి, యథా చోదక శరావాది కంపనాత్ తద్గతే సూర్య ప్రతిబింబే కంపమానేపి, న తద్వాన్ సూర్యః కంపతే. ఏవమ విద్యా ప్రత్యుపస్థాపితే బుద్ధ్యాద్యుపాద్యుపహితే, జీవాఖ్యే అంశే దుఃఖాయమానే అపి న తద్వాన్ ఈశ్వరః దుఃఖాయతే, జేఏవస్యాపితు దుఃఖప్రాప్తిః అవిద్యా నిమితైవ ఇత్యుక్తం. తథా చా విద్యా నిమిత్త జీవ భావవ్యుదాసేన బ్రహ్మభావమేవ జీవస్యప్రతిసాధయంతి వేదాంతాః -” తత్వమసి ” ఇత్యేవమాదయః. తస్మాన్నాస్తి జైవేన దుఃఖేన పరమాత్మనః దుఃఖిత్వ ప్రసంగః “. (శ్రీశంకరః)

(సూర్య చంద్రుల కాంతి ఆకాశములో ప్రకాశించుచున్నను చేతి వ్రేళ్ళు మొదలగు ఉపాధి సంబంధమువలన, ఆ వేళ్ళు వంకరగాను తిన్నగానుండుటను బట్టి సూర్యచంద్రుల కాంతి తిన్నగాను వంకరగానున్నట్లు కనుపించినను నిజముగా వంకరగా లేనివే. ఆ ప్రకారముగానే ఘటము మొదలగువాటిలోని జలముకదులుచున్నపుడు ఆకాశములో సూర్య చంద్రులు కదులుచున్నట్లు కనుపించినను నిజానికి అవి కదలనివే. నీటితోనుండు మూకుడు కదలుచున్నపుడు దానిలోనున్న సూర్య చంద్రుల ప్రతిబింబము కదలునట్లుండును గాని ఆకాశములోని సూర్య చంద్రులు కదలుటలేదు. ఆ ప్రకారముగానే అవిద్యవలన (అజ్ఞానమువలన) బుద్ధి మొదలగు నుపాధుల నాశ్రయించి యుండుటవలన పరబ్రహ్మయొక్క అంశయే యని చెప్పబడు జీవుడు దుఃఖము పొందువాడైనను పరబ్రహ్మ మట్టుకు దుఃఖము ననుభవించువాడుకాడు.- జీవునికి దుఃఖము కలుగుట అవిద్యవలననే - అనగా జీవుడే పరబ్రహ్మ యను జ్ఞానము లేకపోవుటచేతనే. జీవుడు అజ్ఞానముచేత తనపరమాత్మ స్వరూపమును మఱచినందున, ‘జీవుడే పరబ్రహ్మ’ అని ఉపనిషత్తులు మహావాక్యములద్వారా ” తత్వమసి ” (ఆ పరబ్రహ్మము నీవే) యని ప్రతిపాదించుచున్నవి. అందుచేత జీవుడు దుఃఖము ననుభవించువాడు పరబ్రహ్మ దుఃఖముననుభవించనివాడను ప్రసంగము లేదు).

  1. “శ్రూయంతాం భోక్తృ దోషాశ్చ భోక్తారో బహుథామితాః |

దేహాభిమానినో జీవాః ఉత్తమాధమ మధ్యమాః |

దరిద్రా అధమాః జ్ఞేయా, మధ్యమాశ్చక్రవర్తినః |

గంధర్వాద్యా ఉత్తమా స్యుస్తే సర్వేపి ష యిష్ణవః |

ఉత్పన్న ధ్వంసినో యద్వత్ స్యుర్దంశ మశకాదయః |

తధైవ సర్వభోక్తారో మ్రియంతే స్వాయుషః స్వయే |

భోక్తా న మ్రియతే కింతు దేహ ఏవేతి చేచ్ఛృణు |

దేవస్థస్యైవ భోక్తృత్వం తన్నశ్యేత్ వపుషా సహ |

దరిద్రాణాం భోగహేతు శ్శ్రీర్భృత్యాశ్చ న సంత్యథ |

సుద్యుమ్న ప్రముఖానాం తే విద్యంతే చక్రవర్తినాం |

ఇతిచేత్సంతుసర్వేషాం మిషతామపి మథ్యగః |

మ్రియతే చక్రవర్తీతాం సంత్యజ్య మహతీం శ్రియం |

అంతర్థానాది శక్తిశ్చేద్గంధర్వాధిషు విద్యతే |

విద్యతాన్నామ మృత్యుస్తు తేషాం శాస్త్రేషు కథ్యతే |

భోకృఊణాం నశ్వరాణాం కో భోగః స్యాన్మృత్యు చింతయా |

భోగకాలే కృతంకర్మ భూయో జన్మదదాతిహి ||” (అనుభూతిప్రకాశికాయాం)

(భోక్తయగువాని భోక్తృదోషములు దోషములు చెప్పుచున్నాను వినుడు - ఇవి అనేక విధములు. దేహాభిమానులు - అనగా, యీ దేహము నేనే యను అభిమానము గలవారు - మూడువిధములు - (జీవులు) - ఉత్తములు, అధములు, మధ్యములు - దరిద్రులు అధములు, చక్రవర్తులు మధ్యములు, గంధర్వులు ఉత్తములు. వీరందరూ క్షీణించు (నశించు) స్వభావము గలవారు. మశకములవలె పుట్టి శీఘ్రకాలములో చనిపోవువారు. ఆ ప్రకారముగానే భోక్తలందరు వారి వారి ఆయుర్దాయము క్షీణించగనే చనిపోవుచున్నారు.. దేహమే నశించును కాని అందులోని భోక్త నశించడు అనెదవా ? వినుము - దేహము నశించిన తోడనే ఆ దేహములలో నుండువాని (దేహియొక్క) భోక్తృత్వము నశించును. దరిద్రులగు భోక్తల భోగ్యకారణమైన ధనము (ఐశ్వర్యము), లేక బాని సత్వము (భృత్యుడుగానుండి పనిచేయుట) వారి శరీరము నశించిన తోడనే నశించును - మధ్యమ విధమునకు చెందినవారైన చక్రవర్తులు మొదలగువారు చనిపోయినపుడు వారి చక్రవర్తి ఐశ్వర్యమును భోగభాగ్యము లను వదలివేయుదురు. అవి నాటితోనే నశించును - గంధర్వులకు అంతర్థాన శక్తులుగలవు. కాని వారికికూడ శాస్త్రములలో నాశము చెప్పబడినది. నశించు స్వభావముగల యీ భోక్తులందరి భోగము (భోగ్య వస్తువుల) గుఱించి చెప్పెడిదేమున్నది - భోగకాలమందు చేసిన కర్మ తిరిగి దాని ఫలరూపముగా జన్మను కలుగచేయును).

  1. “నమే కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా |

ఇతి మాం యో(అ)భిజానాతి కర్మభిర్న స బద్యతే“. (శ్రీమద్భగవద్గీత - 4 -14)

“కర్తృత్వంచ నిరాకృత్య నిరాచష్టే(అ)ధి భోక్తృతాం |

కర్మాణి విశ్వసృష్ట్వా దీన్య నహంకారమీశ్వరం |

దేహాద్యారంభకత్వే నమాం బధ్నంతి చిద్ఘనం |

నవా మమాప్త కామస్య తృష్ణా కర్మఫలే యతః |

కర్తృత్వాభి నివేశేన తధైవ ఫలతృష్ణయా |

లింపంత్యజ్ఞాస్తు కర్మాణి తద భావాన్న మాం హరిం |

ఏవం యో (అ)న్యోపి మామీశమాత్మ త్వేన శ్రుతేర్నయాత్ |

అకర్తారమ భోక్తారం వేత్తి స్వానుభవేన చ |

ధర్మా ధర్మాది రూపాణి కర్మాణి బంధకాన్యపి |

తస్యాపి నైవ దేహాద్యా రంభకాణి భవంతి వై |

సచా కర్త్రాత్మభోదేన ముచ్యతే కర్మ బంధనైః ||” (గీతాభావప్రకాశము - 4 - 92 to - 97)

(అహంకార విహీనుడు, ఈశ్వరుడు అయిన నన్ను ఈ ప్రపంచమును సృష్టించుట అను మొదలగు కర్మలు ప్రాకృత దేహమును కలిగించుట మొదలగు వాటిచేత బంధించవు. ఆప్తకాముడనైన (కోరికలు లేకపోవుట చేత అన్ని కోరికలు తీరిపోయినట్టే), తీరవలసిన కోరికలు లేనివాడనైన నాకు నేనుచేయుకర్మ యొక్క ఫలమందు స్పృహలేదు - చేసిన కర్మ యొక్క ఫలమందు స్పృహయుండి, నేను కర్తను, ఈ కర్మను చేయుచున్నాను అని అభినివేశము కలిగియుండుట చేత అజ్ఞులను (ఈ కర్మజ్ఞానము లేనివారిని) వారు చేసిన కర్మలు బంధించును. వారివలె నాకు అటువంటి కర్తృత్వాభిమానము లేదు -, ఆ కర్మఫలమందు స్పృహలేదు - అందుచేత ఆ కర్మలు నన్ను బంధించవు, నేను ఆ కర్మ ఫలములకు భోక్తనుకాని - (వాటి ఫలమనుచవించవలసిన వాడనుకాను - ఈ ప్రకారముగా ఎవరు ఆత్మ అయిన నన్ను శ్రుతివాక్యముల వలనను, స్వంతానుభవము వలనను అకర్తయని, అభోక్తయని తెలుసుకొనునో అట్టివానిని ధర్మా ధర్మరూపమైన కర్మలు - పుణ్యపాపరూపమైన కర్మలు - సాధారణముగా బంధమును కలిగించినవైనప్పటికీ, వాటి ఫలము ననుభవింపచేయుటకు అవసరమైన దేహమును కలుగచేయవు. ఆత్మ అకర్త, అభోక్త అను భావము కలుగగానే అట్టి వాడు అన్ని విధముల బంధముచేతను విడువబడును).

Transliteration
  1. cēsina karmaphalamunanubhaviṃcuvāḍu.

  2. “prakṛtiṃ bhōgyāṃ acētanāṃ bhuṃktē iti - jagatpālaya tītivā bhōktā -” (śrīśaṃkaraḥ)

(acētanamaina, jaḍamaina, bhōgyavastuvaina prakṛtini - prakṛtilōnuṃḍi puṭṭina vastuvulanu bhujiṃcuvāḍu, tinuvāḍu - anubhaviṃcuvāḍu) (jagattunu pāliṃcuvāḍu).

  1. “pālakatvāt bhōktā, paramānaṃda saṃdōha saṃbhōgādvā bhōktā”. (śrīśaṃkaraḥ)

(pāliṃcuvāḍukanuka bhōktā; lēka paramānaṃdamunanubhaviṃcuvāḍu - anubhaviṃpacēyuvāḍu - mōkṣamu niccuvāḍu, mōkṣarūpuḍainavāḍu).

  1. “bhōjyarūpatayā prakṛtiḥ māyā bhōjanamucyatē. puruṣarūpēṇa tāṃ bhuṃktē iti bhōktā”.

(māya yanu prakṛti bhōjyarūpamugānuṃḍuṭacēta - bhōjanamani ceppabaḍinadi. puruṣarūpamutō dānini bhujiṃcuvāḍu, anubhaviṃcuvāḍu).

  1. kāryōpādhiḥ jīviḥ bhōktā.

(kāryavastuvu upādhigā galavāḍu - jīvuḍu)

  1. cētanaśśārīraḥ (caitanyamugala śarīruḍu - śarīramugalavāḍu)
  1. “acitvargaṃ svātmanō bhōgyatvēna haratīti bhōktā, haraḥ” (śrīmān rāmānujaḥ)

(acidvastuvulanniyu - jaḍavastuvulanniyu, caitanyavaṃtamaina tanaku bhōgiṃcavalasinavaguṭacēta - anibhaviṃcavalasina vastuvulaguṭacēta vāṭini hariṃcuvāḍu kanuka bhōkta - hariṃcuvāḍu - samhariṃcuvāḍu kanuka haruḍu) (hari).

  1. ’asau guṇamayairbhāvai rbhūta bhūtasūkṣmēṃdriyādhibhiḥ |

svanirmitēṣu nirviṣṭō bhuṃktē bhūtēṣu tadguṇān ||’ (śrīmadbhāgavataṃ - 2 - 32)

(triguṇamulatōniṃḍiyunna bhūtamula sūkṣmēṃdriyamulatō tanacētanē nirmiṃpabaḍina bhūtamulanuṃḍi vāṭi guṇamulanu anubhaviṃcunukanuka bhōkta).

  1. “ātmēṃdriya manōyuktaṃ bhōktētyāhurmanīṣiṇaḥ ||”. (kaṭhavalli)

(ātma, iṃdriyamulu, manassu - nīṭitō kalisi bhōktayani ceppabaḍucunnāḍu)

  1. “mamaivāṃśō jīvalōkē jīvabhūtaḥ sanātanaḥ |

manaḥ ṣaṣṭāṇīṃdriyāṇi prakṛtisthāni karṣati ||“. (śrīmadbhagavadgīta - 15 - 7)

(jīvalōkamaṃdu - jīvulaṃdu - sanātanuḍaina paramātma yokka aṃśayē jīvuḍai - jīvuḍani ceppabaḍucu - prakṛtilōnuṃḍu manassunu, iṃdriyamulanu ākarṣiṃcucunnadi - vāṭidvārā prakṛtilōni viṣayamulanu anubhaviṃcucunnadi. aṃducēta ā paramātma aṃśayē, lēka, paramātmayē vāṭi bhōkta).

  1. “puruṣaḥ prakṛtisthōhi bhuktē prakṛtijān guṇān |

kāraṇaṃ guṇa saṃgō(a)sya sadasadyōni janmasu |

upadraṣṭānumaṃtāca bhartā bhōktā mahēśvaraḥ |

paramātmēti cāpyuktō dēhē(a)smin puruṣaḥ paraḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 20 to 22)

(puruṣuḍu - (prakṛti, dānivikāramulu - vīṭilō pravavēśiṃci yuṃḍuṭacēta puruṣuḍu). anagā paramātma prakṛtilō pravēśiṃci ā prakṛti guṇamulaina satvarajastamamulanu - prakṛti kāryamulaina jīvarāsula guṇamulanu - anubhaviṃcunu. dīniki kāraṇamēmanagā paramātma sadasadyōnulalō puṭṭi, vāṭitō saṃparkamu kaligiyuṃḍuṭē. ā paramātmayē yī prakṛtivalana kaligina śarīramulalō pravēśiṃci vāṭiki bharta (bhariṃcuvāḍu, pōṣiṃcuvāḍu) bhōktā (ā śarīramudvārā sukhaduḥkhamulu modalaguvāṭini anubhaviṃcuvāḍu).

  1. “agnyuṣṇavat nitya caitanya svarūpēṇa buddhēḥ sukhaduḥkha mōhātmakāḥ pratyayāḥ sarva viṣayāḥ caitanyātma grastā ivajāyamānāḥ vibhaktāḥ vibhāvyaṃtē iti bhōktā ātmā ucyatē” (śrīśaṃkaraḥ)

(agni, dānivalana kaligi dānilōnē aḍagunaṭṭi - dāni vēḍimivalenē, caitanya svarūpuḍu (caitanyamē svarūpamugā gala bhagavaṃtuḍu) - valana buddhi pratyayamulaina sukhaduḥkhamulu - mōhamu modalagu viṣayamulu - ā caitanyātmayagu bhagavaṃtuni cēta grahiṃcabaḍinavai (anubhaviṃcabaḍinavai) vibhaktamulai tirigi puṭṭucunnavai kanabaḍucunnavi. iṃduvalana ā caitanyarūpamagu ātmayē bhōkta - ā viṣayamulananubhaviṃcucunnadi - ani ceppabaḍucunnadi).

  1. “na sarvaprāṇihṛdaya saṃbaṃdhāt cidrūpatayā ca śārīravadbrahmaṇaḥ saṃbhōgaprasaṃgaḥ dēśēṣyāt - viśēṣōhi bhavati śarīra paramēśvarayōḥ - ēkaḥ kartā, bhōktā, dharmādharmādisādhanaḥ, sukhaduḥkhādimāṃśca ēkaḥ tadviparītō, apahata pāpmatvādiguṇaḥ. ētasmāt anayōḥ viśēṣāt bhōgō, nētarasya - - - adha gṛhītaṃ śārīrasya brahmaṇaikatvaṃ tathā midhyā jñāna nimittaḥ - śārīrasyōpabhōgō na tēna paramārtha rūpasya brahmaṇassaṃ sparśaḥ nahi bālaiḥ tala malina tādibhiḥ vyōmni vikalpyamānē talamalinatādi viśiṣṭamēva paramārtha taḥ vyōma bhavati. tathāha -”na vaiśēṣyā diti” naikatvēpi śārīrasyōpabhōgaprasaṃgō vaiśēṣyāt viśēṣō hi bhavati. mithyājñāna samyajñānayōḥ mithyākalpitōpa bhōgaḥ samyajñāna mṛṣṭamēkatvaṃ na ca mithyākalpitē nōpabhōgēna samyajñānadṛṣṭa yēkatvaṃ vastu saṃssṛśyatē. tasmāt nōpa bhōga gaṃdhōpi śakya īśvarasya kalpayituṃ”. (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 - 2 - 8)

(samasta prāṇula hṛdayamutō saṃbaṃdhamu kaligi yuṃḍuṭacētanu (hṛdayamaṃduṃḍuṭa cētanu) caitanyamē rūpamugā kaligiyuṃḍuṭacētanu, śarīramugala jīvuḍu valenē brahmaku bhōktṛtvamu (brahmanu bhōktayanuṭa) kudaradu - eṃducētananagā iddarilō viśēṣamuṃḍuṭavalana. paramēśvaru naku śārīrunaku (śarīramugala jīvunakunu) viśēṣamu kaladu - okaḍu (anagā jīvuḍu) karta (karmalucēyuvāḍu), bhōkta (cēsina karmala phalamunu, lēka viṣayabhōgamula nanubhaviṃcuvāḍu, dharmādharmamulanu (pāpa puṇyamulanu) cēyuvāḍu, sukhaduḥkhamulu kalavāḍu. reṃḍavavāḍu dīniki viparītamainavāḍu - pāpādi dōṣamulu lēnivāḍu - aṃducēta ī yiddariki viśēṣamuṃḍuṭavalana - bhēdamuṃḍuṭavalana – okariki (jīvuniki) bhōgamu - okaru bhōkta (bhōgamunanubhaviṃcuvāḍu), reṃḍavavāḍu (paramātma, brahma) bhōgamunanubhaviṃcanivāḍu (bhōktakānivāḍu); śarīramunu poṃdina jīvuḍu parabrahma okaṭē - idi samyak jñānamu - aṃducēta śarīri ayina jīvuḍu bhōkta (śarīrabhōgamula nanubhaviṃcuvāḍu) anuṭa midhyājñānamu - aṃducēta śarīri ayina jīvuḍu bhōkta (śarīrabhōgamulananubhaviṃcuvāḍu) anuṭa midhyājñānamu - aṃducēta paramārtharūpuḍaina brahmaku śarīrabhōgamulatō saṃsparśa (saṃbaṃdhamu) lēdu - ākāśamulō malinamugā - nallagā - unnadiyani bāluru (ajñānulu) ceppinaṃtamātramuna ākāśamu nallagā nuṃḍunā? midhyājñānamunaku samyak jñānamunaku tēḍā yunnadi - viśēṣamunnadi. samyak jñānamu kudarakuṃḍu muṃdukālamaṃdu - anagā, parabrahma jīvuḍu okaṭē yanujñānamu kalugakamuṃdu (kalaganaṃtakālamu) midhyājñānamuvalana parabrahma bhōkta (bhōgamulananubhaviṃcucunnāḍu) anuṭa midhyājñānamu).

  1. “yadhā prakāśassauraścāṃdhramasōvā viyadvyāpya avatiṣṭamānō aṃguḷyādyupādi saṃbaṃdhāt tēṣu ṛjuvakrādi bhāvaṃ pratipadyamānēṣu tattadbhāvamiva pratipadyamānōpi na paramārtha taḥ tadbhāvaṃ prati padyatē; yathā cākāśē ghaṭādiṣu gacchatsu gacchanniva vidyamānōpi na paramārthataḥ gacchati, yathā cōdaka śarāvādi kaṃpanāt tadgatē sūrya pratibiṃbē kaṃpamānēpi, na tadvān sūryaḥ kaṃpatē. ēvama vidyā pratyupasthāpitē buddhyādyupādyupahitē, jīvākhyē aṃśē duḥkhāyamānē api na tadvān īśvaraḥ duḥkhāyatē, jēēvasyāpitu duḥkhaprāptiḥ avidyā nimitaiva ityuktaṃ. tathā cā vidyā nimitta jīva bhāvavyudāsēna brahmabhāvamēva jīvasyapratisādhayaṃti vēdāṃtāḥ -” tatvamasi ” ityēvamādayaḥ. tasmānnāsti jaivēna duḥkhēna paramātmanaḥ duḥkhitva prasaṃgaḥ “. (śrīśaṃkaraḥ)

(sūrya caṃdrula kāṃti ākāśamulō prakāśiṃcucunnanu cēti vrēḷḷu modalagu upādhi saṃbaṃdhamuvalana, ā vēḷḷu vaṃkaragānu tinnagānuṃḍuṭanu baṭṭi sūryacaṃdrula kāṃti tinnagānu vaṃkaragānunnaṭlu kanupiṃcinanu nijamugā vaṃkaragā lēnivē. ā prakāramugānē ghaṭamu modalaguvāṭilōni jalamukadulucunnapuḍu ākāśamulō sūrya caṃdrulu kadulucunnaṭlu kanupiṃcinanu nijāniki avi kadalanivē. nīṭitōnuṃḍu mūkuḍu kadalucunnapuḍu dānilōnunna sūrya caṃdrula pratibiṃbamu kadalunaṭluṃḍunu gāni ākāśamulōni sūrya caṃdrulu kadaluṭalēdu. ā prakāramugānē avidyavalana (ajñānamuvalana) buddhi modalagu nupādhula nāśrayiṃci yuṃḍuṭavalana parabrahmayokka aṃśayē yani ceppabaḍu jīvuḍu duḥkhamu poṃduvāḍainanu parabrahma maṭṭuku duḥkhamu nanubhaviṃcuvāḍukāḍu.- jīvuniki duḥkhamu kaluguṭa avidyavalananē - anagā jīvuḍē parabrahma yanu jñānamu lēkapōvuṭacētanē. jīvuḍu ajñānamucēta tanaparamātma svarūpamunu maṟacinaṃduna, ‘jīvuḍē parabrahma’ ani upaniṣattulu mahāvākyamuladvārā ” tatvamasi ” (ā parabrahmamu nīvē) yani pratipādiṃcucunnavi. aṃducēta jīvuḍu duḥkhamu nanubhaviṃcuvāḍu parabrahma duḥkhamunanubhaviṃcanivāḍanu prasaṃgamu lēdu).

  1. “śrūyaṃtāṃ bhōktṛ dōṣāśca bhōktārō bahuthāmitāḥ |

dēhābhimāninō jīvāḥ uttamādhama madhyamāḥ |

daridrā adhamāḥ jñēyā, madhyamāścakravartinaḥ |

gaṃdharvādyā uttamā syustē sarvēpi ṣa yiṣṇavaḥ |

utpanna dhvaṃsinō yadvat syurdaṃśa maśakādayaḥ |

tadhaiva sarvabhōktārō mriyaṃtē svāyuṣaḥ svayē |

bhōktā na mriyatē kiṃtu dēha ēvēti cēcchṛṇu |

dēvasthasyaiva bhōktṛtvaṃ tannaśyēt vapuṣā saha |

daridrāṇāṃ bhōgahētu śśrīrbhṛtyāśca na saṃtyatha |

sudyumna pramukhānāṃ tē vidyaṃtē cakravartināṃ |

iticētsaṃtusarvēṣāṃ miṣatāmapi mathyagaḥ |

mriyatē cakravartītāṃ saṃtyajya mahatīṃ śriyaṃ |

aṃtarthānādi śaktiścēdgaṃdharvādhiṣu vidyatē |

vidyatānnāma mṛtyustu tēṣāṃ śāstrēṣu kathyatē |

bhōkṛūṇāṃ naśvarāṇāṃ kō bhōgaḥ syānmṛtyu ciṃtayā |

bhōgakālē kṛtaṃkarma bhūyō janmadadātihi ||” (anubhūtiprakāśikāyāṃ)

(bhōktayaguvāni bhōktṛdōṣamulu dōṣamulu ceppucunnānu vinuḍu - ivi anēka vidhamulu. dēhābhimānulu - anagā, yī dēhamu nēnē yanu abhimānamu galavāru - mūḍuvidhamulu - (jīvulu) - uttamulu, adhamulu, madhyamulu - daridrulu adhamulu, cakravartulu madhyamulu, gaṃdharvulu uttamulu. vīraṃdarū kṣīṇiṃcu (naśiṃcu) svabhāvamu galavāru. maśakamulavale puṭṭi śīghrakālamulō canipōvuvāru. ā prakāramugānē bhōktalaṃdaru vāri vāri āyurdāyamu kṣīṇiṃcaganē canipōvucunnāru.. dēhamē naśiṃcunu kāni aṃdulōni bhōkta naśiṃcaḍu anedavā ? vinumu - dēhamu naśiṃcina tōḍanē ā dēhamulalō nuṃḍuvāni (dēhiyokka) bhōktṛtvamu naśiṃcunu. daridrulagu bhōktala bhōgyakāraṇamaina dhanamu (aiśvaryamu), lēka bāni satvamu (bhṛtyuḍugānuṃḍi panicēyuṭa) vāri śarīramu naśiṃcina tōḍanē naśiṃcunu - madhyama vidhamunaku ceṃdinavāraina cakravartulu modalaguvāru canipōyinapuḍu vāri cakravarti aiśvaryamunu bhōgabhāgyamu lanu vadalivēyuduru. avi nāṭitōnē naśiṃcunu - gaṃdharvulaku aṃtarthāna śaktulugalavu. kāni vārikikūḍa śāstramulalō nāśamu ceppabaḍinadi. naśiṃcu svabhāvamugala yī bhōktulaṃdari bhōgamu (bhōgya vastuvula) guṟiṃci ceppeḍidēmunnadi - bhōgakālamaṃdu cēsina karma tirigi dāni phalarūpamugā janmanu kalugacēyunu).

  1. “namē karmāṇi liṃpaṃti namē karmaphalē spṛhā |

iti māṃ yō(a)bhijānāti karmabhirna sa badyatē”. (śrīmadbhagavadgīta - 4 -14)

“kartṛtvaṃca nirākṛtya nirācaṣṭē(a)dhi bhōktṛtāṃ |

karmāṇi viśvasṛṣṭvā dīnya nahaṃkāramīśvaraṃ |

dēhādyāraṃbhakatvē namāṃ badhnaṃti cidghanaṃ |

navā mamāpta kāmasya tṛṣṇā karmaphalē yataḥ |

kartṛtvābhi nivēśēna tadhaiva phalatṛṣṇayā |

liṃpaṃtyajñāstu karmāṇi tada bhāvānna māṃ hariṃ |

ēvaṃ yō (a)nyōpi māmīśamātma tvēna śrutērnayāt |

akartārama bhōktāraṃ vētti svānubhavēna ca |

dharmā dharmādi rūpāṇi karmāṇi baṃdhakānyapi |

tasyāpi naiva dēhādyā raṃbhakāṇi bhavaṃti vai |

sacā kartrātmabhōdēna mucyatē karma baṃdhanaiḥ ||” (gītābhāvaprakāśamu - 4 - 92 to - 97)

(ahaṃkāra vihīnuḍu, īśvaruḍu ayina nannu ī prapaṃcamunu sṛṣṭiṃcuṭa anu modalagu karmalu prākṛta dēhamunu kaligiṃcuṭa modalagu vāṭicēta baṃdhiṃcavu. āptakāmuḍanaina (kōrikalu lēkapōvuṭa cēta anni kōrikalu tīripōyinaṭṭē), tīravalasina kōrikalu lēnivāḍanaina nāku nēnucēyukarma yokka phalamaṃdu spṛhalēdu - cēsina karma yokka phalamaṃdu spṛhayuṃḍi, nēnu kartanu, ī karmanu cēyucunnānu ani abhinivēśamu kaligiyuṃḍuṭa cēta ajñulanu (ī karmajñānamu lēnivārini) vāru cēsina karmalu baṃdhiṃcunu. vārivale nāku aṭuvaṃṭi kartṛtvābhimānamu lēdu -, ā karmaphalamaṃdu spṛhalēdu - aṃducēta ā karmalu nannu baṃdhiṃcavu, nēnu ā karma phalamulaku bhōktanukāni - (vāṭi phalamanucaviṃcavalasina vāḍanukānu - ī prakāramugā evaru ātma ayina nannu śrutivākyamula valananu, svaṃtānubhavamu valananu akartayani, abhōktayani telusukonunō aṭṭivānini dharmā dharmarūpamaina karmalu - puṇyapāparūpamaina karmalu - sādhāraṇamugā baṃdhamunu kaligiṃcinavainappaṭikī, vāṭi phalamu nanubhaviṃpacēyuṭaku avasaramaina dēhamunu kalugacēyavu. ātma akarta, abhōkta anu bhāvamu kalugagānē aṭṭi vāḍu anni vidhamula baṃdhamucētanu viḍuvabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.