← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భోక్తృభోగ్యవిభాగము bhōktṛbhōgyavibhāgamu

Original — తెలుగు
  1. ప్రసిద్ధోహ్యయం భోక్తృ భోగ్యవిభాగో లోకే - భోక్తా చేతనశ్శారీరః, భోగ్యాః శబ్దాదయో విషయా ఇతి - యథా భోక్తా దేవదత్తః, భోజనః జీవన ఇతి. తస్య చ విభాగస్యా భావః ప్రసజ్యేత యది భోక్తా భోగ్య భావమాపద్యేత, భోగ్యం వా భోక్తృ భావ మా పద్యేత, తయేశ్చేతరేతర భావా పత్తిః పరమ కారణాత్ బ్రహ్మణః అనన్యత్వాత్ ప్రసజ్యతే - ఉపపద్యత ఏవ. అయం అస్మత్ పక్షే అపి విభాగః, ఏవం లోకే దృష్టత్వాత్. తథాహి సముద్రాదుదకాత్మనో అనన్యత్వేపి తద్వికారణాం ఫేనవీ చీ తరంగ బుద్బుదాదీనాం ఇతరేతర విభాగః, ఇతరేతర సంశ్లేషాది లక్షణశ్చ వ్యవహారః ఉపలభ్యతే. న చ సముద్రా దుదకాత్మనో అనన్యత్వేపి, తద్వికారాణాంఫేన తరంగాదీనాం ఇతరేతర భావా పత్తిర్భవతి, న చ తేషాం ఇతరేతర భావానా పత్తానపి సముద్రాత్మనో అన్యత్వం భవతి. ఏవ మహాపి న చ భోక్తృ భోగ్యయోః ఇతరేతర భావాపత్తిర్ని చ పరస్మాత్ బ్రహ్మణః అన్యత్వమితి భవిష్యతి. యద్యపి భోక్తాన బ్రహ్మణో వికారః ||

తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ “ఇతి స్రష్టురేవ అనికృతస్య కార్యాను ప్రవేశేన భోక్తృత్వ శ్రవణాత్. తథాపి కార్యమను ప్రవిష్టస్యాప్యుపాధి నిమిత్తో విభాగః. ఆకాశస్యేవ ఘటాద్యుపాధి నిమిత్తః ఇత్య్తుతః. పరమకారణాత్ బ్రహ్మణో అనన్యత్వేపి భోక్తృ భోగ్య లక్షణో విభాగః సముద్ర తరంగాది న్యాయేన ఇత్యుక్తం” (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 1 - 13)

(భోక్తయనగా చేతనుడగు శరీరుడు - శరీరముగల జీవుడు - భోగ్యములనగా శబ్దము మొదలగు విషయములు - శబ్ద స్పర్శ, రూప, రస, గంధములు - అని ఈ భోక్తృ భోగ్యవిభాగ లోకములో ప్రసిద్ధిగా నున్నది. దేవదత్తుడు అనువాడు భోక్త, అతను భుజించునది అన్నము భోగ్యము - భోక్తయగువాడు భోగ్య వస్తువగుటయు, భోగ్య వస్తువు భోక్త యగుటయు కలదు - ఒక చిన్నచేప పెద్దచేపకు ఆహారమగును - ఆ పెద్దచేప ఇంకొకదానికి ఆహారము - దీనికికారణమేమనగా - ఈ భోక్తృ భోగ్య వస్తువులన్నింటికి మూలకారణమైన భగవంతుడు అన్నింటిలోనుండుట అన్ని వస్తువులు భోక్తలు, భోగ్యములు భగవంతుడే యగుట –

వ. “సకల దేహి దేహంబులందును జీవుణ్డు కలుగుటంజేసి జీవుండే జీవునకు జీవికయగు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 1 - 326)

లోకములో ఈ భోక్తృ భోగ్య విభాగము కనబడుచున్నది. సముద్రములోని నీటిలోనుండి పుట్టిన నీటి వికారములే - మారు రూపములే - అయిన నురగ, బుడగలు, కెరటములు సముద్రజలముకంటె వేరు కాక పోయినను, వాటిలో వాటిని, ఒకదానినుండి ఒకటి వేఱుగానే ఉన్నట్లు తోచుచున్నవి - వ్యవహరింపబడుచున్నవి. ఇట్లు అయినను అవి సముద్రముకంటె - సముద్రజలములకంటె - వేరుకావు. ఆ ప్రకారముగానే పరబ్రహ్మకంటె యీ భోక్తృ భోగ్య భావము వేరుకాదు - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్” (దానిని సృష్టించి దానిలోనే ప్రవే శించెను) అని ఉపనిషత్తు చెప్పుచున్నది - అనగా, సృష్టింపబడిన ప్రతి వస్తువులోను భగవంతుడు ప్రవేశించి యున్నాడు - “తత్ప్రవిశ్య సచ్చ త్యచ్చా భవత్” (అట్లు ప్రవేశించి తానే సద్వస్తువు అసద్వస్తువు కూడా - ఆత్మవస్తువు, అనాత్మవస్తువు కూడా ఆయెను) అని చెప్పుటచేత సృష్టించినవాడే, కర్తయే (కారణవస్తువే) కార్యవస్తువుగా మారుటవలన భోక్త యని చెప్పబడుచున్నాడు - “అత్తా చరాచర గ్రహణాత్” (చరములను, అచరములను - జంగమములను స్థావరములను గ్రహించువాడు, గ్రసియించువాడు - తినువాడు - ఒక జీవి ఇంకొక జీవికి ఆహారము. దీనికి కారణము ఉపాధియగు వస్తువు - ఆకాశము, ఘటము మొదలగు వస్తువులలో కనుపించినట్లు. ఇట్లు భోక్తృ భోగ్యములు భగవంతునికంటె వేఱుకానివైనను పైన చెప్పిన సముద్ర కెరటముల న్యాయము ప్రకారము (సముద్రము వేఱు, అందులోని కెరటములు, నురుగు, బుడగలు వేఱుగానున్నట్లు వ్యవహరించబడినట్లే) వ్యవహరింపబడుచున్నవి).

  1. “ఏక బ్రహ్మోపాదానత్వేపి భోక్తృ భోగ్య ప్రపంచస్య పరస్పరం విభాగః స్యాత్, లోకవత్ - యధా లోకే మృదాత్మనా అభిన్ననాం ఘటాదీనాం పరస్పరం భేదోస్తి తద్వత్” (భాష్యార్థరత్నమాలా)

(లోకములో కుండ, మూకుడు, మొదలగునవి మట్టితో చేసినవి మట్టికంటె వేఱుకానివైనను, వాటన్నింటికీ మట్టియే ఉపాదానకారణమైనను వ్యవహరించుటలో కుండ, మూకుడు అని వేఱు వేఱుగా ఎట్లు చెప్పబడు చున్నవో, అట్లే యీ ప్రపంచములోని భోక్తృ భోగ్య వస్తువులన్నింటికీ భగవంతుడే ఉపాదానకారణమైనను (అవన్నియు భగవంతునిలోనుండి పుట్టినవే అయినను) వేఱువేఱుగా, ఒకటి భోక్తయని, ఒకటి భోగ్యమని వ్యవహరింపబడుచున్నవి).

Transliteration
  1. prasiddhōhyayaṃ bhōktṛ bhōgyavibhāgō lōkē - bhōktā cētanaśśārīraḥ, bhōgyāḥ śabdādayō viṣayā iti - yathā bhōktā dēvadattaḥ, bhōjanaḥ jīvana iti. tasya ca vibhāgasyā bhāvaḥ prasajyēta yadi bhōktā bhōgya bhāvamāpadyēta, bhōgyaṃ vā bhōktṛ bhāva mā padyēta, tayēścētarētara bhāvā pattiḥ parama kāraṇāt brahmaṇaḥ ananyatvāt prasajyatē - upapadyata ēva. ayaṃ asmat pakṣē api vibhāgaḥ, ēvaṃ lōkē dṛṣṭatvāt. tathāhi samudrādudakātmanō ananyatvēpi tadvikāraṇāṃ phēnavī cī taraṃga budbudādīnāṃ itarētara vibhāgaḥ, itarētara saṃślēṣādi lakṣaṇaśca vyavahāraḥ upalabhyatē. na ca samudrā dudakātmanō ananyatvēpi, tadvikārāṇāṃphēna taraṃgādīnāṃ itarētara bhāvā pattirbhavati, na ca tēṣāṃ itarētara bhāvānā pattānapi samudrātmanō anyatvaṃ bhavati. ēva mahāpi na ca bhōktṛ bhōgyayōḥ itarētara bhāvāpattirni ca parasmāt brahmaṇaḥ anyatvamiti bhaviṣyati. yadyapi bhōktāna brahmaṇō vikāraḥ ||

tat sṛṣṭvā tadēvānu prāviśat “iti sraṣṭurēva anikṛtasya kāryānu pravēśēna bhōktṛtva śravaṇāt. tathāpi kāryamanu praviṣṭasyāpyupādhi nimittō vibhāgaḥ. ākāśasyēva ghaṭādyupādhi nimittaḥ itytutaḥ. paramakāraṇāt brahmaṇō ananyatvēpi bhōktṛ bhōgya lakṣaṇō vibhāgaḥ samudra taraṃgādi nyāyēna ityuktaṃ” (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 1 - 13)

(bhōktayanagā cētanuḍagu śarīruḍu - śarīramugala jīvuḍu - bhōgyamulanagā śabdamu modalagu viṣayamulu - śabda sparśa, rūpa, rasa, gaṃdhamulu - ani ī bhōktṛ bhōgyavibhāga lōkamulō prasiddhigā nunnadi. dēvadattuḍu anuvāḍu bhōkta, atanu bhujiṃcunadi annamu bhōgyamu - bhōktayaguvāḍu bhōgya vastuvaguṭayu, bhōgya vastuvu bhōkta yaguṭayu kaladu - oka cinnacēpa peddacēpaku āhāramagunu - ā peddacēpa iṃkokadāniki āhāramu - dīnikikāraṇamēmanagā - ī bhōktṛ bhōgya vastuvulanniṃṭiki mūlakāraṇamaina bhagavaṃtuḍu anniṃṭilōnuṃḍuṭa anni vastuvulu bhōktalu, bhōgyamulu bhagavaṃtuḍē yaguṭa –

va. “sakala dēhi dēhaṃbulaṃdunu jīvuṇḍu kaluguṭaṃjēsi jīvuṃḍē jīvunaku jīvikayagu”

(śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 1 - 326)

lōkamulō ī bhōktṛ bhōgya vibhāgamu kanabaḍucunnadi. samudramulōni nīṭilōnuṃḍi puṭṭina nīṭi vikāramulē - māru rūpamulē - ayina nuraga, buḍagalu, keraṭamulu samudrajalamukaṃṭe vēru kāka pōyinanu, vāṭilō vāṭini, okadāninuṃḍi okaṭi vēṟugānē unnaṭlu tōcucunnavi - vyavahariṃpabaḍucunnavi. iṭlu ayinanu avi samudramukaṃṭe - samudrajalamulakaṃṭe - vērukāvu. ā prakāramugānē parabrahmakaṃṭe yī bhōktṛ bhōgya bhāvamu vērukādu - “tat sṛṣṭvā tadēvānu prāviśat” (dānini sṛṣṭiṃci dānilōnē pravē śiṃcenu) ani upaniṣattu ceppucunnadi - anagā, sṛṣṭiṃpabaḍina prati vastuvulōnu bhagavaṃtuḍu pravēśiṃci yunnāḍu - “tatpraviśya sacca tyaccā bhavat” (aṭlu pravēśiṃci tānē sadvastuvu asadvastuvu kūḍā - ātmavastuvu, anātmavastuvu kūḍā āyenu) ani ceppuṭacēta sṛṣṭiṃcinavāḍē, kartayē (kāraṇavastuvē) kāryavastuvugā māruṭavalana bhōkta yani ceppabaḍucunnāḍu - “attā carācara grahaṇāt” (caramulanu, acaramulanu - jaṃgamamulanu sthāvaramulanu grahiṃcuvāḍu, grasiyiṃcuvāḍu - tinuvāḍu - oka jīvi iṃkoka jīviki āhāramu. dīniki kāraṇamu upādhiyagu vastuvu - ākāśamu, ghaṭamu modalagu vastuvulalō kanupiṃcinaṭlu. iṭlu bhōktṛ bhōgyamulu bhagavaṃtunikaṃṭe vēṟukānivainanu paina ceppina samudra keraṭamula nyāyamu prakāramu (samudramu vēṟu, aṃdulōni keraṭamulu, nurugu, buḍagalu vēṟugānunnaṭlu vyavahariṃcabaḍinaṭlē) vyavahariṃpabaḍucunnavi).

  1. “ēka brahmōpādānatvēpi bhōktṛ bhōgya prapaṃcasya parasparaṃ vibhāgaḥ syāt, lōkavat - yadhā lōkē mṛdātmanā abhinnanāṃ ghaṭādīnāṃ parasparaṃ bhēdōsti tadvat” (bhāṣyārtharatnamālā)

(lōkamulō kuṃḍa, mūkuḍu, modalagunavi maṭṭitō cēsinavi maṭṭikaṃṭe vēṟukānivainanu, vāṭanniṃṭikī maṭṭiyē upādānakāraṇamainanu vyavahariṃcuṭalō kuṃḍa, mūkuḍu ani vēṟu vēṟugā eṭlu ceppabaḍu cunnavō, aṭlē yī prapaṃcamulōni bhōktṛ bhōgya vastuvulanniṃṭikī bhagavaṃtuḍē upādānakāraṇamainanu (avanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē ayinanu) vēṟuvēṟugā, okaṭi bhōktayani, okaṭi bhōgyamani vyavahariṃpabaḍucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.