← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భోక్తృత్వము bhōktṛtvamu

Original — తెలుగు
  1. చేసిన కర్మల ఫలమనుభవించుట.

  2. “పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ |

కారణం గుణ సంగో(అ)స్య సదసద్యోని జన్మసు ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 21). (చూడుము - భోక్తా -10)

  1. “నహి శరీరాంతర్వర్తి త్వమేవ సుఖదుఃఖోప భోగేహేతుః, అపితు, పుణ్యపాప రూప కర్మపరవశత్వం తచ్చ అపహతపాప్మనః పరమాత్మనో న సంభవతి”.

(పరమాత్మ శరీరములోపలనుండి పనిచేయించుచున్నంతమాత్రమున ఆ శరీరమునకు సంబంధించిన సుఖదుఃఖములను అనుభవించు భోక్తయని చెప్పుటకు అది కారణము కానేరదు - ఈ పుణ్యపాప ఫలముల అనుభవము పుణ్యపాపకర్మలననుసరించి యుండును - అపహతపాప్మ - పాపములను నవిలేని - భగవంతునికి కలుగదు).

  1. “నహి జీవస్య సుఖ దుఃఖ యోః భోకృత్వం స్వ శరీరత్వ కృతం; అపితు, పుణ్యపాప రూప కర్మకృతం. అపహత పాప్మనస్తు పరమాత్మనః స్థూల సూక్ష్మరూప కృత్స్న జగత్ శరీరకత్వే పి కర్మ సంబంధ గంధోనాస్తి ఇతి”.

(జీవునకు తను శరీరము కలిగియుండుటవలన చేసిన సుఖదుఃఖముల అనుభవములేదు - అది పుణ్యకర్మలు, పాపకర్మలు చేయుటవలన కలుగునవి. వాటితో అతనికి సంబంధము లేదు - అపహత పాప్మయగు పరమాత్మ స్థూలరూపము, సూక్ష్మరూపము గల జగత్తు అంతయు తనశరీరమే అయినను ఆయా రూపములతో చేయు కర్మల సంబంధము ఏ మాత్రమైనను లేదు).

  1. “అవిక్రయస్య భోక్తృత్వం స్యాదహం బుద్ధి విభ్రమాత్ |

నేయాన విభ్రమాత్ యద్వన్న గేషుగతి కల్పనం ||“.

(ఓడమీద ప్రయాణము చేయుచున్నపుడు గట్టున చెట్లు కదలినట్లు కనుపించును - ఇది కల్పన. అటులనే అవికారుడైన ఆత్మకు అహంకారముచేత కలిగిన భ్రాంతివలన భోక్తృత్వము కలుగుచున్నది - అందుచేత అది భ్రాంతియేకాని నిజముకాదు).

  1. “సుఖదుఃఖాది భోగములను సంపాదించెడి సాధనములతో ఆత్మకు సంబంధము లేనందున ఆత్మ భోక్తకానేరదు. ఆత్మ అసంగభావము కలవాడైనందున ఆకాశము రజోధూమ జలాదులతో సంబంధములేనిదై యున్నటుల ‘అహం’ (నేను) అని చెప్పబడుచున్న దేహముతోనే సంబంధముగలవాడుకాదు. దేహముతోనే సంబంధము లేనప్పుడు దేహానుబంధములైన శబ్దస్పర్శాది విషయములతో సంబంధము బొత్తిగా నుండనేరదు. శబ్దస్పర్శాది విషయములు భోగములను సంపాదించు సాధనములు. అట్టి విషయములతో సంబంధము లేనందున ఆత్మకు స్వర్గాదులయందు సుఖము సంభవింపదు - కనుక ఆత్మకు భోక్తృత్వములేదు”.
Transliteration
  1. cēsina karmala phalamanubhaviṃcuṭa.

  2. “puruṣa prakṛtisthō hi bhuṃktē prakṛtijān guṇān |

kāraṇaṃ guṇa saṃgō(a)sya sadasadyōni janmasu ||“. (śrīmadbhagavadgīta - 13 - 21). (cūḍumu - bhōktā -10)

  1. “nahi śarīrāṃtarvarti tvamēva sukhaduḥkhōpa bhōgēhētuḥ, apitu, puṇyapāpa rūpa karmaparavaśatvaṃ tacca apahatapāpmanaḥ paramātmanō na saṃbhavati”.

(paramātma śarīramulōpalanuṃḍi panicēyiṃcucunnaṃtamātramuna ā śarīramunaku saṃbaṃdhiṃcina sukhaduḥkhamulanu anubhaviṃcu bhōktayani ceppuṭaku adi kāraṇamu kānēradu - ī puṇyapāpa phalamula anubhavamu puṇyapāpakarmalananusariṃci yuṃḍunu - apahatapāpma - pāpamulanu navilēni - bhagavaṃtuniki kalugadu).

  1. “nahi jīvasya sukha duḥkha yōḥ bhōkṛtvaṃ sva śarīratva kṛtaṃ; apitu, puṇyapāpa rūpa karmakṛtaṃ. apahata pāpmanastu paramātmanaḥ sthūla sūkṣmarūpa kṛtsna jagat śarīrakatvē pi karma saṃbaṃdha gaṃdhōnāsti iti”.

(jīvunaku tanu śarīramu kaligiyuṃḍuṭavalana cēsina sukhaduḥkhamula anubhavamulēdu - adi puṇyakarmalu, pāpakarmalu cēyuṭavalana kalugunavi. vāṭitō ataniki saṃbaṃdhamu lēdu - apahata pāpmayagu paramātma sthūlarūpamu, sūkṣmarūpamu gala jagattu aṃtayu tanaśarīramē ayinanu āyā rūpamulatō cēyu karmala saṃbaṃdhamu ē mātramainanu lēdu).

  1. “avikrayasya bhōktṛtvaṃ syādahaṃ buddhi vibhramāt |

nēyāna vibhramāt yadvanna gēṣugati kalpanaṃ ||“.

(ōḍamīda prayāṇamu cēyucunnapuḍu gaṭṭuna ceṭlu kadalinaṭlu kanupiṃcunu - idi kalpana. aṭulanē avikāruḍaina ātmaku ahaṃkāramucēta kaligina bhrāṃtivalana bhōktṛtvamu kalugucunnadi - aṃducēta adi bhrāṃtiyēkāni nijamukādu).

  1. “sukhaduḥkhādi bhōgamulanu saṃpādiṃceḍi sādhanamulatō ātmaku saṃbaṃdhamu lēnaṃduna ātma bhōktakānēradu. ātma asaṃgabhāvamu kalavāḍainaṃduna ākāśamu rajōdhūma jalādulatō saṃbaṃdhamulēnidai yunnaṭula ‘ahaṃ’ (nēnu) ani ceppabaḍucunna dēhamutōnē saṃbaṃdhamugalavāḍukādu. dēhamutōnē saṃbaṃdhamu lēnappuḍu dēhānubaṃdhamulaina śabdasparśādi viṣayamulatō saṃbaṃdhamu bottigā nuṃḍanēradu. śabdasparśādi viṣayamulu bhōgamulanu saṃpādiṃcu sādhanamulu. aṭṭi viṣayamulatō saṃbaṃdhamu lēnaṃduna ātmaku svargādulayaṃdu sukhamu saṃbhaviṃpadu - kanuka ātmaku bhōktṛtvamulēdu”.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.