(నేను, నాది అని ఆత్మకాని వస్తువులందు, తనవికాని వస్తువులందు ఇది నాది యనెడి భ్రాంతి, ఆత్మకాని దేహమందు ఇది నేను అను భ్రాంతి).
(నేను బ్రహ్మనుకాను, కాని, పుణ్యపాపములను చేయువాడను, వాటికర్తను. ఆ పుణ్యపాపములవలన కలుగు సుఖదుఃఖములను అనుభవించువాడను, జీవుడను అని తలంచుట).
(నీళ్ళు కదలుచున్నపుడు నీటి ఒడ్డున యున్న చెట్లయొక్క ప్రతిబింబము నీటిలో కదులుచున్నట్లు కనబడును. భ్రమచేత కండ్లు చెదిరితే భూమి తిరిగిచున్నట్లు కనబడును. కాని, ఇట్లు చెట్లు, భూమి కదులుచుండుట భ్రాంతియే. ఆ ప్రకారముగానే సత్వరజస్తమోగుణముల పరిణామములే అయిన దేహము ఇంద్రియములు మొదలగువాటితో కలిసి మనసు భ్రమించినను, లేక, విషయములైన శబ్ద స్పర్శ రూపరస గంధములచేత మనస్సు భ్రమించినప్పుడు జీవుడు అవికలుడైనప్పటికీ (అవయవములు లేనివాడైనప్పటికీ, దేహముకంటె వేరైనవాడైనను) దేహముతో సమానుడు, దేహమే నేను అని అనుకొనుచు ఇదియే భ్రాంతి).
“త్రిగుణముల పరిణామములగు దేహము, ఇంద్రియములు మొదలగు వాటియందు ‘నేను, నాది’ యను బుద్ధి కలుగుట భ్రాంతి. దేహమునకు, ఇంద్రియములకు తన సత్తాస్ఫూర్తినిచ్చి వాటిచే వాటి వాటి పనులను చేయించుచుండు భగవంతుడైనను, ఆ వ్యాపారములన్నియు నావే, అవన్నియు నేనే చేయుచున్నాను అనుకొనుట భ్రాంతి”.
“యన్మూహూర్తం క్షణం వాపి వాసుదేవో న చింత్యతే |
సాహానిః తన్మహచ్ఛిద్రం సా భ్రాంతిః సాచ విక్రియా ||“.
(ముహూర్తమైనను, క్షణకాలమైనను వాసుదేవుని చింతించకపోయినట్లైన అదియే హాని. అదియే మహాచ్ఛిద్రము, అదియే భ్రాంతి, అదియే విక్రియము).
ఆరోపము, అధ్యాసము, అవిద్య, భ్రాంతి, అజ్ఞానము - ఇవన్నియు వేఱు వేఱు పేర్లతో చెప్పబడినను ఇవన్నియు ఒకటే - ఒకే వస్తువు మఱియొక వస్తువుగా కనబడుటయే దీని యర్థము.
“క. భూతములలోన వెలి బ్ర
ఖ్యాతుండగునట్టి వాని గాంతలు కాళిం
దీ తీర వనాంతరముల
భ్రాంతిన్ వెదకంగ జనిరి పాడుచు నధిపా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. -)
“నల్లనివాడు పద్మనయనంబులవాడు - - - ఓ
మల్లియలార, మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. -)
(nēnu, nādi ani ātmakāni vastuvulaṃdu, tanavikāni vastuvulaṃdu idi nādi yaneḍi bhrāṃti, ātmakāni dēhamaṃdu idi nēnu anu bhrāṃti).
(nēnu brahmanukānu, kāni, puṇyapāpamulanu cēyuvāḍanu, vāṭikartanu. ā puṇyapāpamulavalana kalugu sukhaduḥkhamulanu anubhaviṃcuvāḍanu, jīvuḍanu ani talaṃcuṭa).
(nīḷḷu kadalucunnapuḍu nīṭi oḍḍuna yunna ceṭlayokka pratibiṃbamu nīṭilō kadulucunnaṭlu kanabaḍunu. bhramacēta kaṃḍlu cediritē bhūmi tirigicunnaṭlu kanabaḍunu. kāni, iṭlu ceṭlu, bhūmi kadulucuṃḍuṭa bhrāṃtiyē. ā prakāramugānē satvarajastamōguṇamula pariṇāmamulē ayina dēhamu iṃdriyamulu modalaguvāṭitō kalisi manasu bhramiṃcinanu, lēka, viṣayamulaina śabda sparśa rūparasa gaṃdhamulacēta manassu bhramiṃcinappuḍu jīvuḍu avikaluḍainappaṭikī (avayavamulu lēnivāḍainappaṭikī, dēhamukaṃṭe vērainavāḍainanu) dēhamutō samānuḍu, dēhamē nēnu ani anukonucu idiyē bhrāṃti).
“triguṇamula pariṇāmamulagu dēhamu, iṃdriyamulu modalagu vāṭiyaṃdu ‘nēnu, nādi’ yanu buddhi kaluguṭa bhrāṃti. dēhamunaku, iṃdriyamulaku tana sattāsphūrtinicci vāṭicē vāṭi vāṭi panulanu cēyiṃcucuṃḍu bhagavaṃtuḍainanu, ā vyāpāramulanniyu nāvē, avanniyu nēnē cēyucunnānu anukonuṭa bhrāṃti”.
“yanmūhūrtaṃ kṣaṇaṃ vāpi vāsudēvō na ciṃtyatē |
sāhāniḥ tanmahacchidraṃ sā bhrāṃtiḥ sāca vikriyā ||“.
(muhūrtamainanu, kṣaṇakālamainanu vāsudēvuni ciṃtiṃcakapōyinaṭlaina adiyē hāni. adiyē mahācchidramu, adiyē bhrāṃti, adiyē vikriyamu).
ārōpamu, adhyāsamu, avidya, bhrāṃti, ajñānamu - ivanniyu vēṟu vēṟu pērlatō ceppabaḍinanu ivanniyu okaṭē - okē vastuvu maṟiyoka vastuvugā kanabaḍuṭayē dīni yarthamu.
“ka. bhūtamulalōna veli bra
khyātuṃḍagunaṭṭi vāni gāṃtalu kāḷiṃ
dī tīra vanāṃtaramula
bhrāṃtin vedakaṃga janiri pāḍucu nadhipā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. -)
“nallanivāḍu padmanayanaṃbulavāḍu - - - ō
malliyalāra, mī podalamāṭuna lēḍu gadamma cepparē ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.