← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూమా bhūmā

Original — తెలుగు
  1. “యత్ర నాన్యత్ పశ్యతి, నాన్యత్ శ్రుణోతి, నాన్యత్ విజానాతిసభూమా; యత్రాన్యత్ పశ్యతి, అన్యత్ శ్రుణోతి, అన్యత్ విజానాతి తదల్పం; యోవై భూమా తదమృతం, అధయదల్పం తన్మర్త్యం” (ఛాందోగ్యోపనిషత్)

(ఏ అవస్థయందు, ఏ స్థలమందుగాని కంటికి భగవంతునికంటె ఇతర వస్తువు కనబడదో, చెవికి ఇతర శబ్దము వినబడదో, మనసులో ఇతర వస్తువును గుఱించిన ఆలోచన రాదో ఆ అవస్థ భూమా. ఏ అవస్థలో భగవంతునికంటె ఇతర వస్తువు కంటికికనుపించునో, ఇతర శబ్దము వినబడునో, ఇతర వస్తువుయొక్క జ్ఞానము కలుగునో అది అల్పము. భూమా అనునది అమృతము - శాశ్వతమైనది. అల్పము అనునది నశించునది)

  1. “యో వై భూమా తత్సుఖం, నాల్పే సుఖమస్తి, భూమై వ సుఖం, తథా చ సత్యత్వం, స్వ మహిమ ప్రతిష్టితత్వం, సర్వ గతత్వం, సర్వాత్మకత్వం ఇతి చ ఏతే ధర్మాః శ్రూయమాణాః పరమాత్మని ఏవ ఉపపద్యంతే, నాన్యత్ర. తస్మాత్ భూమా పరమాత్మేతి సిద్ధం.”

(భూమా అనునదే సుఖము; అల్పమని చెప్పబడినదానిలో సుఖము లేదు - సత్యత్వము, స్వమహిమలో ప్రతిష్టించియుండుట, సమస్త వస్తువులలోను ప్రవేశించియుండుట సమస్త వస్తువులకు ఆత్మ - అంతరాత్మ - గా నుండుట అని చెప్పబడు ఈ ధర్మములు పరమాత్మయందే కలవు - మఱొకచోట లేవు. అందుచేత భూమా అనగా పరమాత్మయే యనుట సిద్ధము). “అయ మర్థః - అనవధికాతిశయ సుఖరూపే బ్రహ్మణి అనుభూయమానే, తతో(అ)న్యత్ కిమపి న పశ్యత్యనుభవతా, బ్రహ్మ స్వరూప తద్విభూత్యంతర్గత త్వాచ్చ కృత్స్నస్య వస్తు జాతస్య. అతః ఐశ్వర్యా పరపర్యాయ విభూతి విశిష్టం నిరతిశయ సుఖరూపం బ్రహ్మానుభవన్ తద్వ్యతిరిక్తస్య వస్తునః అభావారేవ కిమప్యన్యన్న పశ్యతి. అనుభావ్యస్య సర్వస్య సుఖరూపత్వాత్ ఏవ దుఃఖ నపశ్యతి. తదేవహి సుఖం యదనుభూయమానం పురుషానుకూలం భవతి.”

(దీని యర్థమేమనగా - పరిమితిలేక అన్నింటిని మించిన సుఖరూపము పరబ్రహ్మ అగుటవలన అట్టి బ్రహ్మమును అనుభవించుచున్నపుడు - బ్రహ్మానుభవము కలిగినపుడు - ఆ అనుభవముకలవానికి ఇతరమేమియు కనబడదు. ఎందుచేతననగా సమస్తమైన వస్తువులూ బ్రహ్మస్వరూపము లోనే అంతర్గతమై యుండుటచేత. అందుచేత నిరతిశయ సుఖరూపమైన (దానిని మించిన సుఖము లేదు - అదియే అత్యంత సుఖమైన మోక్షము కనుక) పరబ్రహ్మానుభవము కలిగినపుడు దానికి - పరబ్రహ్మకు వ్యతిరేకమైన (పరబ్రహ్మకాని) వస్తువేదియును లేకుండుటచేత ఇతర వస్తువేదియు కనబడదు. అంతా పరబ్రహ్మమే కనుక అన్ని వస్తువులు పరబ్రహ్మగానే అవన్నియు కలిసి (విశ్వరూపముగా) పరబ్రహ్మముగానే కనబడును. అవన్నియు అప్పుడు పరమాత్మవలె సుఖరూపములే. అందుచేత దుఃఖము ఎక్కడను కనబడదు - పురుషున కనుకూలమై అనుభవించుచున్న సుఖమదియే.)

  1. భూమా బహుత్వ మిత్యర్థః.

(భూమా యనగా అనేకమైనది, లేక బహుళమైనది, వ్యాపించు స్వభావము (శక్తి) కలది).

  1. నిజమహిమావస్థానం

(తన మహిమయందు, తన స్వస్వరూపమందుండుట జీవాత్మ తాను పరమాత్మయే యని తెలుసుకొని పరమాత్మవలెనుండుట, పరమాత్మలో కలిసియుండుట)

  1. “సుఖం కిమితిచేత్ భూమా సుఖమల్పేతు తన్నహి |

క్లిశ్యత్యల్పధనో(అ)న్యస్మిన్ ధనభాహుళ్య దర్శనాత్ |

భూమ్నః సుఖత్వే భూమాకః కిమల్పమితి చేత్ శ్రుణు |

జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ హీనో భూమో విచ్జ్ఛేద వర్జనాత్ |

జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం మాయాకార్యమిదం జగత్ |

బహు విచ్ఛేదయుక్తత్వాదల్ప మిత్యభిధీయతే |

అచ్ఛేద్యో య మదాహ్యా (అ)యమక్లేద్యో (అ)శోష్య ఏవహి |

భూమా తస్మాదమర్త్యో (అ)యమిల్పం మర్త్యమతద్విధం |

సంసారకాల ఏవాస్తే సముక్తా నల్పతా తతః |

ముక్తౌ జ్ఞాన నివర్త్యత్వా న్మర్త్యం జగది తీర్యతే |

సంసార మీక్షయోర్భూమా విద్యతే(అ)మృత స్తతః |

అఖండైక రసానందస్సో (అ)యమాత్మా స్వయం ప్రభః |

సమాధి సుప్తి మూర్ఛాసు భాసతే సాధనం వినా |

మూర్చా సుప్తోస్తాదృశో (అ)యమజ్ఞానేన తిరోహితః |

మేఘే నాచ్ఛాదితో సూర్యో యథా తద్వత్స్వయం ప్రభః |

అజ్ఞానేనా వృతో భూమో ప్రాణి భిర్న విభావ్యతే |

స్వప్రకాశాత్మ చైతన్య మజ్ఞానస్య న బాధకం |

భాసకం ప్రత్యుతైతస్య స్వానందస్య యథా తథా |

ఆనందజ్ఞానయో స్సుప్తే చైతన్యే నావ భాసనాత్ |

ఉత్థితః సుఖమస్వాప్సం న జానే(అ)న్యదితి స్మరేత్ |

అరణిస్థోయథా వహ్నిర్నదహే దరణిం తథా |

పశ్చాన్ మదనజాతో(అ)సౌ సాకల్యేనారణిం దహేత్ |

తథా వేదాంత వాక్యోత్థధీవృత్తౌ ప్రతిబింబితం |

స్వప్రకాశాత్మ చైతన్యం కృత్సా జ్ఞానస్య భాధకం |

తస్మాత్ విజ్ఞాన సహితః సమాధావనుభూయహి |

భూమానందం యథా శాస్త్రం స్మృత్వా వ్యుత్థాయ వక్తిచ |

జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపా త్రిపుణీ స్వప్న జాగ్రతోః |

భూమానందం తిరోధత్తే విద్వాం స్త్వ భిభవత్యముం |

చిచ్ఛాయావానహంకారో జ్ఞాత్వాస్యాచ్చక్షురాది జా |

బుద్ధవృత్తిర్భవే జ్ఞానం జ్ఞేయా రూపరసాదయః |

త్రిపుటీ మాయికీ మిధ్యేత్యేవం విజ్ఞా య తత్వవిత్ |

తాముపేక్ష్య కరోత్యేవ భూమానం దే భరం సదా ||“. (అనుభూతప్రకాశే)

(సుఖము అనగా ఏమిటి? - ‘భూమా’ యే సుఖము - అల్పమనునది సుఖము కాదు. గొప్ప ధనవంతులను చూచి అల్ప ధనవంతులు క్లేశపడుదురు - ‘భూమ’ ఏది ‘అల్పము’ ఏది - వినుము - జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము అను త్రిపుటి లేనిది ‘భూమ’ - ఈ మూడింటికి భేదము లేనిది. ఈ జగత్తు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమైనది, మాయ వలన కలిగినది, అనేకములుగా కనబడునది కనుక అల్పము అని చెప్ప బడినది. భూమా అనునది ఛేదింపనలవి కానిది, దహింప శక్యముకానిది, తడప శక్యముకానిది, యెండింప శక్యముకానిది - అనగా, పంచభూతముల వలన నష్టము పొందనది. అందుచేత ‘భూమ’ అమర్త్యము - మరణములేనిది, నశించునదికాదు, శాశ్వతముగా నుండునది. అల్పమనునది మర్త్యము, నశించునది. సంసారకాలమందే ఉండునది. ముక్తిని పొందినపుడుండనిది. అందుచేత అల్పమని చెప్పబడుచున్నది. సంసారమునందు మోక్షదశలోను ఉండునది భూమా, అందుచేత అమౄతము, నశించనిది. అఖండైక రసానందము - ఎన్నింటిలోనున్నను ఎల్లపుడు ఒకే రసము కలిగియుండునది భూమా - అదియే సుఖరసము; మోక్షమే అత్యంతసుఖము - ఆత్మ స్వయంప్రకాశము - తనంతట తానే ప్రకాశించునది. ఇతర ప్రకాశవస్తువులమీద ఆధారపడి ప్రకాశించు నదికాదు. తానే ఇతర ప్రకాశవస్తువులలోనుండి వాటిని ప్రకాశింపచేయునది. “తత్తేజో విద్ధిమామకం”. (సూర్యుడు మొదలగు ప్రకాశవస్తువులలోనున్న ప్రకాశము నాదే యని తెలుసుకొనుము). సమాధి అవస్థలోను, మూర్చావస్థ లోను, సుప్తావస్థలోను సాధనము లేకుండగనే ప్రకాశించునది. మేఘముచే నావరించబడిన - కప్పబడిన - సూర్యునివలె యీ ‘భూమా’ అజ్ఞానముచేత ఆవరించబడియున్నది. అందుచేత ప్రాణులు దీనిని చూడలేరు - స్వయం ప్రకాశమైన ఆత్మచైతన్యము అజ్ఞానమునకు బాధకముకాదు - కట్టెలోనున్న అగ్ని కట్టెను దహింపలేదు - దానిని మధించగా లోనున్న అగ్ని పైకి వచ్చి ఆ కట్టెను దహించును. ఆ ప్రకారముగానే వేదాంతవాక్యముల - ఉపనిషద్వాక్యముల బోధవలన కలిగిన ధీవృత్తి - మనోవృత్తి - లో ప్రతిబింబించిన స ప్రకాశమైన ఆత్మ చైతన్యము. అజ్ఞానము నంతటినీ పోగుట్టును. అందుచేత విజ్ఞానముతోకూడిన సమాధి అనుభవముగల భూమానందము శాస్త్ర ప్రకారము స్మరణ చేయవలెను - స్వప్న జాగ్రదవస్థలయందు జ్ఞాతృ జ్ఞేయములను త్రిపుటిని భూమానందము పోవునట్లు చేయును - బుద్ధి వృత్తియే జ్ఞానము, జ్ఞేయము, రూపము, రసము మొదలగునవిగా నగును. తత్వమును తెలిసినవాడు జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానములను త్రిపుటిని మాయకు సంబంధించినది, మిధ్యయని తెలుసుకొని వాటిని ఉపేక్షించి (వదలివేసి) భూమానందమందే ఎల్లపుడు నిరతుడై యుండును).

Transliteration
  1. “yatra nānyat paśyati, nānyat śruṇōti, nānyat vijānātisabhūmā; yatrānyat paśyati, anyat śruṇōti, anyat vijānāti tadalpaṃ; yōvai bhūmā tadamṛtaṃ, adhayadalpaṃ tanmartyaṃ” (chāṃdōgyōpaniṣat)

(ē avasthayaṃdu, ē sthalamaṃdugāni kaṃṭiki bhagavaṃtunikaṃṭe itara vastuvu kanabaḍadō, ceviki itara śabdamu vinabaḍadō, manasulō itara vastuvunu guṟiṃcina ālōcana rādō ā avastha bhūmā. ē avasthalō bhagavaṃtunikaṃṭe itara vastuvu kaṃṭikikanupiṃcunō, itara śabdamu vinabaḍunō, itara vastuvuyokka jñānamu kalugunō adi alpamu. bhūmā anunadi amṛtamu - śāśvatamainadi. alpamu anunadi naśiṃcunadi)

  1. “yō vai bhūmā tatsukhaṃ, nālpē sukhamasti, bhūmai va sukhaṃ, tathā ca satyatvaṃ, sva mahima pratiṣṭitatvaṃ, sarva gatatvaṃ, sarvātmakatvaṃ iti ca ētē dharmāḥ śrūyamāṇāḥ paramātmani ēva upapadyaṃtē, nānyatra. tasmāt bhūmā paramātmēti siddhaṃ.”

(bhūmā anunadē sukhamu; alpamani ceppabaḍinadānilō sukhamu lēdu - satyatvamu, svamahimalō pratiṣṭiṃciyuṃḍuṭa, samasta vastuvulalōnu pravēśiṃciyuṃḍuṭa samasta vastuvulaku ātma - aṃtarātma - gā nuṃḍuṭa ani ceppabaḍu ī dharmamulu paramātmayaṃdē kalavu - maṟokacōṭa lēvu. aṃducēta bhūmā anagā paramātmayē yanuṭa siddhamu). “aya marthaḥ - anavadhikātiśaya sukharūpē brahmaṇi anubhūyamānē, tatō(a)nyat kimapi na paśyatyanubhavatā, brahma svarūpa tadvibhūtyaṃtargata tvācca kṛtsnasya vastu jātasya. ataḥ aiśvaryā paraparyāya vibhūti viśiṣṭaṃ niratiśaya sukharūpaṃ brahmānubhavan tadvyatiriktasya vastunaḥ abhāvārēva kimapyanyanna paśyati. anubhāvyasya sarvasya sukharūpatvāt ēva duḥkha napaśyati. tadēvahi sukhaṃ yadanubhūyamānaṃ puruṣānukūlaṃ bhavati.”

(dīni yarthamēmanagā - parimitilēka anniṃṭini miṃcina sukharūpamu parabrahma aguṭavalana aṭṭi brahmamunu anubhaviṃcucunnapuḍu - brahmānubhavamu kaliginapuḍu - ā anubhavamukalavāniki itaramēmiyu kanabaḍadu. eṃducētananagā samastamaina vastuvulū brahmasvarūpamu lōnē aṃtargatamai yuṃḍuṭacēta. aṃducēta niratiśaya sukharūpamaina (dānini miṃcina sukhamu lēdu - adiyē atyaṃta sukhamaina mōkṣamu kanuka) parabrahmānubhavamu kaliginapuḍu dāniki - parabrahmaku vyatirēkamaina (parabrahmakāni) vastuvēdiyunu lēkuṃḍuṭacēta itara vastuvēdiyu kanabaḍadu. aṃtā parabrahmamē kanuka anni vastuvulu parabrahmagānē avanniyu kalisi (viśvarūpamugā) parabrahmamugānē kanabaḍunu. avanniyu appuḍu paramātmavale sukharūpamulē. aṃducēta duḥkhamu ekkaḍanu kanabaḍadu - puruṣuna kanukūlamai anubhaviṃcucunna sukhamadiyē.)

  1. bhūmā bahutva mityarthaḥ.

(bhūmā yanagā anēkamainadi, lēka bahuḷamainadi, vyāpiṃcu svabhāvamu (śakti) kaladi).

  1. nijamahimāvasthānaṃ

(tana mahimayaṃdu, tana svasvarūpamaṃduṃḍuṭa jīvātma tānu paramātmayē yani telusukoni paramātmavalenuṃḍuṭa, paramātmalō kalisiyuṃḍuṭa)

  1. “sukhaṃ kimiticēt bhūmā sukhamalpētu tannahi |

kliśyatyalpadhanō(a)nyasmin dhanabhāhuḷya darśanāt |

bhūmnaḥ sukhatvē bhūmākaḥ kimalpamiti cēt śruṇu |

jñātṛ jñāna jñēya hīnō bhūmō vicjchēda varjanāt |

jñātṛ jñāna jñēya rūpaṃ māyākāryamidaṃ jagat |

bahu vicchēdayuktatvādalpa mityabhidhīyatē |

acchēdyō ya madāhyā (a)yamaklēdyō (a)śōṣya ēvahi |

bhūmā tasmādamartyō (a)yamilpaṃ martyamatadvidhaṃ |

saṃsārakāla ēvāstē samuktā nalpatā tataḥ |

muktau jñāna nivartyatvā nmartyaṃ jagadi tīryatē |

saṃsāra mīkṣayōrbhūmā vidyatē(a)mṛta stataḥ |

akhaṃḍaika rasānaṃdassō (a)yamātmā svayaṃ prabhaḥ |

samādhi supti mūrchāsu bhāsatē sādhanaṃ vinā |

mūrcā suptōstādṛśō (a)yamajñānēna tirōhitaḥ |

mēghē nācchāditō sūryō yathā tadvatsvayaṃ prabhaḥ |

ajñānēnā vṛtō bhūmō prāṇi bhirna vibhāvyatē |

svaprakāśātma caitanya majñānasya na bādhakaṃ |

bhāsakaṃ pratyutaitasya svānaṃdasya yathā tathā |

ānaṃdajñānayō ssuptē caitanyē nāva bhāsanāt |

utthitaḥ sukhamasvāpsaṃ na jānē(a)nyaditi smarēt |

araṇisthōyathā vahnirnadahē daraṇiṃ tathā |

paścān madanajātō(a)sau sākalyēnāraṇiṃ dahēt |

tathā vēdāṃta vākyōtthadhīvṛttau pratibiṃbitaṃ |

svaprakāśātma caitanyaṃ kṛtsā jñānasya bhādhakaṃ |

tasmāt vijñāna sahitaḥ samādhāvanubhūyahi |

bhūmānaṃdaṃ yathā śāstraṃ smṛtvā vyutthāya vaktica |

jñātṛ jñāna jñēya rūpā tripuṇī svapna jāgratōḥ |

bhūmānaṃdaṃ tirōdhattē vidvāṃ stva bhibhavatyamuṃ |

cicchāyāvānahaṃkārō jñātvāsyāccakṣurādi jā |

buddhavṛttirbhavē jñānaṃ jñēyā rūparasādayaḥ |

tripuṭī māyikī midhyētyēvaṃ vijñā ya tatvavit |

tāmupēkṣya karōtyēva bhūmānaṃ dē bharaṃ sadā ||“. (anubhūtaprakāśē)

(sukhamu anagā ēmiṭi? - ‘bhūmā’ yē sukhamu - alpamanunadi sukhamu kādu. goppa dhanavaṃtulanu cūci alpa dhanavaṃtulu klēśapaḍuduru - ‘bhūma’ ēdi ‘alpamu’ ēdi - vinumu - jñātṛ jñāna jñēyamu anu tripuṭi lēnidi ‘bhūma’ - ī mūḍiṃṭiki bhēdamu lēnidi. ī jagattu jñātṛ jñāna jñēya rūpamainadi, māya valana kaliginadi, anēkamulugā kanabaḍunadi kanuka alpamu ani ceppa baḍinadi. bhūmā anunadi chēdiṃpanalavi kānidi, dahiṃpa śakyamukānidi, taḍapa śakyamukānidi, yeṃḍiṃpa śakyamukānidi - anagā, paṃcabhūtamula valana naṣṭamu poṃdanadi. aṃducēta ‘bhūma’ amartyamu - maraṇamulēnidi, naśiṃcunadikādu, śāśvatamugā nuṃḍunadi. alpamanunadi martyamu, naśiṃcunadi. saṃsārakālamaṃdē uṃḍunadi. muktini poṃdinapuḍuṃḍanidi. aṃducēta alpamani ceppabaḍucunnadi. saṃsāramunaṃdu mōkṣadaśalōnu uṃḍunadi bhūmā, aṃducēta amṝtamu, naśiṃcanidi. akhaṃḍaika rasānaṃdamu - enniṃṭilōnunnanu ellapuḍu okē rasamu kaligiyuṃḍunadi bhūmā - adiyē sukharasamu; mōkṣamē atyaṃtasukhamu - ātma svayaṃprakāśamu - tanaṃtaṭa tānē prakāśiṃcunadi. itara prakāśavastuvulamīda ādhārapaḍi prakāśiṃcu nadikādu. tānē itara prakāśavastuvulalōnuṃḍi vāṭini prakāśiṃpacēyunadi. “tattējō viddhimāmakaṃ”. (sūryuḍu modalagu prakāśavastuvulalōnunna prakāśamu nādē yani telusukonumu). samādhi avasthalōnu, mūrcāvastha lōnu, suptāvasthalōnu sādhanamu lēkuṃḍaganē prakāśiṃcunadi. mēghamucē nāvariṃcabaḍina - kappabaḍina - sūryunivale yī ‘bhūmā’ ajñānamucēta āvariṃcabaḍiyunnadi. aṃducēta prāṇulu dīnini cūḍalēru - svayaṃ prakāśamaina ātmacaitanyamu ajñānamunaku bādhakamukādu - kaṭṭelōnunna agni kaṭṭenu dahiṃpalēdu - dānini madhiṃcagā lōnunna agni paiki vacci ā kaṭṭenu dahiṃcunu. ā prakāramugānē vēdāṃtavākyamula - upaniṣadvākyamula bōdhavalana kaligina dhīvṛtti - manōvṛtti - lō pratibiṃbiṃcina sa prakāśamaina ātma caitanyamu. ajñānamu naṃtaṭinī pōguṭṭunu. aṃducēta vijñānamutōkūḍina samādhi anubhavamugala bhūmānaṃdamu śāstra prakāramu smaraṇa cēyavalenu - svapna jāgradavasthalayaṃdu jñātṛ jñēyamulanu tripuṭini bhūmānaṃdamu pōvunaṭlu cēyunu - buddhi vṛttiyē jñānamu, jñēyamu, rūpamu, rasamu modalagunavigā nagunu. tatvamunu telisinavāḍu jñātṛ jñēya jñānamulanu tripuṭini māyaku saṃbaṃdhiṃcinadi, midhyayani telusukoni vāṭini upēkṣiṃci (vadalivēsi) bhūmānaṃdamaṃdē ellapuḍu niratuḍai yuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.