భూతానాం స్రష్టా - (భూతములను సృష్టించువాడు)
భూతాదీని క్షిత్యాదీని భావయతి జనయతి.
(భూమి మొదలగు భూతములను పుట్టించువాడు - పుట్టింపచేయువాడు)
(సమస్త భూతములను పుట్టించువాడు - పుట్టునట్లు చేయువాడు)
(భూతములను పుట్టుంచువాడు, వృద్ధిపొందించువాడు - తాను భూతములలోనుండి వాటిలోనుండి ఇతరభూతములను పుట్టింపచేయువాడు; పుట్టిన భూతములను తన సత్తస్ఫూర్తిచేత వృద్ధిపొందునట్లు చేయువాడు).
(భూతములను ప్రకాశింపచేయువాడు - వాటి కారణవస్తువులలో తానుండి వాటిని కార్యవస్తువులుగా పుట్టింపచేయువాడు - అవి అట్లు పుట్టుటకు కారణమైనవాడు)
(సృష్టిచేయుటలో తన సంకల్పమునకు భూతములను విషయములుగా చేయువాడు - భూతములను సృష్టిచేయవలయునని సంకల్పము చేయువాడు)
(నా మనస్సులో సృష్టిచేయవలయునను సంకల్పమే భూతములను పుట్టించునది, వాటిని ధరించునది, వాటిని పోషించునది)
సుఖం దుఃఖం భవో(అ)భావో భయం చా భయమేవ చ |
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో(అ)యశః |
భవంతి భావాః భూతానాం మత్త ఏవ పృధగ్విదాః |
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమాఃప్రజాః |“. (శ్రీమద్భగవద్గీత - 10 - 4 to 6)
“ఏతే బుద్ధ్యాదయో భావాః కార్య భేదాః సహేతుకాః |
ధర్మా ధర్మాని హేతూనాం వై చిత్ర్యేణ పృథద్విధాః |
సర్వేషాం ప్రాణనః మత్తో భవంతి పరమేశ్వరాత్ |
తస్మాల్లోక మహేశత్వం కిం వాచ్యం శ్రీహరేర్మమ |
వేద వేదార్థ ద్రష్టారః సర్వజ్ఞాయే మహర్షయః |
సర్గాద్యకాలే సంభూతాః సంప్రదాయ ప్రవర్తకాః |
సావర్ణా మనవస్తద్వచ్చత్వారో యదివా (అ)పరే |
సప్త భృగ్వాదయస్తేభ్యః ప్రథమాః సనకాదయః |
స్వాయంభువాదయస్తద్వన్మనవో యే చతుర్దశ |
మయీశే భావనా యేషాం మచ్చింతనపరా హితే |
మద్భావనా వశా దా నిర్భూత మజ్ఞాత శక్తయః |
సంకల్పాదేవ సంభూతాః నతు యోని సముద్భవాః |
అతో విశుద్ధజన్మత్వాత్ సర్వప్రాణి వరా మతాః |
ప్రాదుర్భూతా హి సర్గాదౌ మత్తో విశ్వసృగాత్మనః |
యేషాం సప్తమహర్షీణాంచమనూనాంచ తదైవచ |
చతుర్ణాం సనకాదీనా మస్మిం లోకే చ జన్మనా |
విద్యయా చ ప్రజాః సర్వాః బ్రాహ్మణాద్యా ఇమాః కిల ||“. (గీతాభావప్రకాశము - 10 - 26 to 31)
(బుద్ధి, జ్ఞానము, అసమ్మోహము, క్షమా, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, భవము, అభవము, భయము, అభయము, అహింస, సమతా, తుష్టి, తపస్సు, దానము, యశస్సు, అయశస్సు - ఇవన్నియు భూతముల భావములు. వేరు వేరు కార్యములు, కారణములు వలన కలుగునవి - పాపపుణ్యములవలన కలుగునవి, అనేక విధములుగా నుండునవి. ఈవన్నియు అన్ని ప్రాణులకు పరమేశ్వరుడనైన నావలన కలుగుచున్నవి. అందుచేత వీటినన్నింటికీ - ఈ లోకమంతటికీ ఈశ్వరుడను - శాసించువాడను నేను - వేద వేదార్థములను గ్రహించినవారు సర్వజ్ఞులు అయిన సృష్టిమొదటిలో పుట్టి ఋషి సాంప్రదాయమును ప్రవర్తింపచేయువారు అయిన భృగువు మొదలగు సప్త మహా ఋషులు, సావర్ణుడు మొదలగువారు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు, స్వాయంభవుడు మొదలగు పదునలుగురు మనువులు, నాయందే ధ్యానము గలవారందరు నా భావనావశము చేతనే - నా సంకల్పముచేతనే పుట్టిరి, యోనిజన్ములు కారు. అందుచేత, విశుద్ధమైన జన్మ కలిగియుండుటవలన వీరు సమస్త ప్రాణులలోను శ్రేష్టమైనవారు - వీరి వలన ఈ లోకములోని ప్రజలందరు, - భూతములన్నియు - విస్తరించినవి. దీనినిబట్టి భావనయనగా మనస్సు యొక్క సంకల్పము - సృష్టి ప్రారంభములో ” సైక్షత ” అనియు, ” స అకామయతి ” అనియు భగవంతుని గుఱించి చెప్పబడినది. ఈక్షణమాత్రమున, సంకల్పమాత్రమున సృష్టి జరిగినది. భగవంతుని ఈక్షణము, సంకల్పము అనిన ప్రకృతిలో - భగవంతుని అపరాశక్తిలో - భగవంతుని పరాశక్తి - చిచ్ఛక్తి, చైతన్యశక్తి - ప్రవేశించి, (భగవంతుడు తన పరాశక్తిరూపములో ప్రవేశించి) ప్రకృతిని చైతన్యవంతముగా చేసినందువలన కలిగిన పరిణామము). (చూడుము - ‘సృష్టి’)
bhūtānāṃ sraṣṭā - (bhūtamulanu sṛṣṭiṃcuvāḍu)
bhūtādīni kṣityādīni bhāvayati janayati.
(bhūmi modalagu bhūtamulanu puṭṭiṃcuvāḍu - puṭṭiṃpacēyuvāḍu)
(samasta bhūtamulanu puṭṭiṃcuvāḍu - puṭṭunaṭlu cēyuvāḍu)
(bhūtamulanu puṭṭuṃcuvāḍu, vṛddhipoṃdiṃcuvāḍu - tānu bhūtamulalōnuṃḍi vāṭilōnuṃḍi itarabhūtamulanu puṭṭiṃpacēyuvāḍu; puṭṭina bhūtamulanu tana sattasphūrticēta vṛddhipoṃdunaṭlu cēyuvāḍu).
(bhūtamulanu prakāśiṃpacēyuvāḍu - vāṭi kāraṇavastuvulalō tānuṃḍi vāṭini kāryavastuvulugā puṭṭiṃpacēyuvāḍu - avi aṭlu puṭṭuṭaku kāraṇamainavāḍu)
(sṛṣṭicēyuṭalō tana saṃkalpamunaku bhūtamulanu viṣayamulugā cēyuvāḍu - bhūtamulanu sṛṣṭicēyavalayunani saṃkalpamu cēyuvāḍu)
(nā manassulō sṛṣṭicēyavalayunanu saṃkalpamē bhūtamulanu puṭṭiṃcunadi, vāṭini dhariṃcunadi, vāṭini pōṣiṃcunadi)
sukhaṃ duḥkhaṃ bhavō(a)bhāvō bhayaṃ cā bhayamēva ca |
ahiṃsā samatā tuṣṭistapō dānaṃ yaśō(a)yaśaḥ |
bhavaṃti bhāvāḥ bhūtānāṃ matta ēva pṛdhagvidāḥ |
maharṣayaḥ sapta pūrvē catvārō manavastathā |
madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imāḥprajāḥ |“. (śrīmadbhagavadgīta - 10 - 4 to 6)
“ētē buddhyādayō bhāvāḥ kārya bhēdāḥ sahētukāḥ |
dharmā dharmāni hētūnāṃ vai citryēṇa pṛthadvidhāḥ |
sarvēṣāṃ prāṇanaḥ mattō bhavaṃti paramēśvarāt |
tasmāllōka mahēśatvaṃ kiṃ vācyaṃ śrīharērmama |
vēda vēdārtha draṣṭāraḥ sarvajñāyē maharṣayaḥ |
sargādyakālē saṃbhūtāḥ saṃpradāya pravartakāḥ |
sāvarṇā manavastadvaccatvārō yadivā (a)parē |
sapta bhṛgvādayastēbhyaḥ prathamāḥ sanakādayaḥ |
svāyaṃbhuvādayastadvanmanavō yē caturdaśa |
mayīśē bhāvanā yēṣāṃ macciṃtanaparā hitē |
madbhāvanā vaśā dā nirbhūta majñāta śaktayaḥ |
saṃkalpādēva saṃbhūtāḥ natu yōni samudbhavāḥ |
atō viśuddhajanmatvāt sarvaprāṇi varā matāḥ |
prādurbhūtā hi sargādau mattō viśvasṛgātmanaḥ |
yēṣāṃ saptamaharṣīṇāṃcamanūnāṃca tadaivaca |
caturṇāṃ sanakādīnā masmiṃ lōkē ca janmanā |
vidyayā ca prajāḥ sarvāḥ brāhmaṇādyā imāḥ kila ||“. (gītābhāvaprakāśamu - 10 - 26 to 31)
(buddhi, jñānamu, asammōhamu, kṣamā, satyamu, damamu, śamamu, sukhamu, duḥkhamu, bhavamu, abhavamu, bhayamu, abhayamu, ahiṃsa, samatā, tuṣṭi, tapassu, dānamu, yaśassu, ayaśassu - ivanniyu bhūtamula bhāvamulu. vēru vēru kāryamulu, kāraṇamulu valana kalugunavi - pāpapuṇyamulavalana kalugunavi, anēka vidhamulugā nuṃḍunavi. īvanniyu anni prāṇulaku paramēśvaruḍanaina nāvalana kalugucunnavi. aṃducēta vīṭinanniṃṭikī - ī lōkamaṃtaṭikī īśvaruḍanu - śāsiṃcuvāḍanu nēnu - vēda vēdārthamulanu grahiṃcinavāru sarvajñulu ayina sṛṣṭimodaṭilō puṭṭi ṛṣi sāṃpradāyamunu pravartiṃpacēyuvāru ayina bhṛguvu modalagu sapta mahā ṛṣulu, sāvarṇuḍu modalaguvāru, sanaka sanaṃdana sanatkumāra sanatsujātulu, svāyaṃbhavuḍu modalagu padunaluguru manuvulu, nāyaṃdē dhyānamu galavāraṃdaru nā bhāvanāvaśamu cētanē - nā saṃkalpamucētanē puṭṭiri, yōnijanmulu kāru. aṃducēta, viśuddhamaina janma kaligiyuṃḍuṭavalana vīru samasta prāṇulalōnu śrēṣṭamainavāru - vīri valana ī lōkamulōni prajalaṃdaru, - bhūtamulanniyu - vistariṃcinavi. dīninibaṭṭi bhāvanayanagā manassu yokka saṃkalpamu - sṛṣṭi prāraṃbhamulō ” saikṣata ” aniyu, ” sa akāmayati ” aniyu bhagavaṃtuni guṟiṃci ceppabaḍinadi. īkṣaṇamātramuna, saṃkalpamātramuna sṛṣṭi jariginadi. bhagavaṃtuni īkṣaṇamu, saṃkalpamu anina prakṛtilō - bhagavaṃtuni aparāśaktilō - bhagavaṃtuni parāśakti - cicchakti, caitanyaśakti - pravēśiṃci, (bhagavaṃtuḍu tana parāśaktirūpamulō pravēśiṃci) prakṛtini caitanyavaṃtamugā cēsinaṃduvalana kaligina pariṇāmamu). (cūḍumu - ‘sṛṣṭi’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.