← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతాదిం bhūtādiṃ

Original — తెలుగు
  1. భూతానాం ఆది కారణం

(భూతములకు మొదటి కారణమైనవాడు - భగవంతుడు మొదటిలో ప్రకృతిలో ప్రవేశించుటచేత దానిలోనుండి వస్తువులు - భూతములు పుట్టినవి. అట్లు పుట్టినవాటిలో భగవంతుడుండుటవలన వాటిలోనుండి మఱికొన్ని వస్తువులు పుట్టినవి. ఈ ప్రకారముగా ఏ వస్తువు - భూతము - పుట్టినప్పటికి దాని కారణవస్తువులో భగవంతుడు తన చైతన్య శక్తితోనుండుటవలననే ఇంకొక వస్తువు పుట్టినది. అందుచేత ఇట్లు ఒక భూతములోనుండి ఇంకొక భూతము పుట్టుటకేకాక మొదటిభూతము పుట్టుటకును భగవంతుడే కారణము. అప్పటినుండి ఇప్పటివఱకు, ఇకముందు కూడ, ఏ వస్తువు పుట్టినను దానికి కారణమతనే).

  1. “అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ”. (శ్రీమద్భగవద్గీత - 10 - 20)

చేతనానాం సమస్తానాం యతోహం జన్మకారణం |

మధ్యే స్థితిర్లయాంతే చ మత్తోభిన్నం నకించన |

సర్వచేతనవర్గాణాం జన్మ స్థితి లయాత్మనా |

తత్కారణాత్మనా వా హమేవ ధ్యేయః ఇతీరితః || (గీతాభావప్రకాశము - 10 - 99,100)

(చేతనా చేతనములగు భూతములన్నింటి జన్మకి కారణము నేనే. స్థితి కాలములో అవియుండి వాటికి నియమించబడిన పనులు అవి చేయుటకు కారణము నేను - వాటి నాశనమునకు - లయమునకు - కారణము నేనే. వాటి సృష్టి స్థితులు నేనే).

  1. “భూతంబులైదును పుట్టు చోటగువాని”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. 1 - 89)
Transliteration
  1. bhūtānāṃ ādi kāraṇaṃ

(bhūtamulaku modaṭi kāraṇamainavāḍu - bhagavaṃtuḍu modaṭilō prakṛtilō pravēśiṃcuṭacēta dānilōnuṃḍi vastuvulu - bhūtamulu puṭṭinavi. aṭlu puṭṭinavāṭilō bhagavaṃtuḍuṃḍuṭavalana vāṭilōnuṃḍi maṟikonni vastuvulu puṭṭinavi. ī prakāramugā ē vastuvu - bhūtamu - puṭṭinappaṭiki dāni kāraṇavastuvulō bhagavaṃtuḍu tana caitanya śaktitōnuṃḍuṭavalananē iṃkoka vastuvu puṭṭinadi. aṃducēta iṭlu oka bhūtamulōnuṃḍi iṃkoka bhūtamu puṭṭuṭakēkāka modaṭibhūtamu puṭṭuṭakunu bhagavaṃtuḍē kāraṇamu. appaṭinuṃḍi ippaṭivaṟaku, ikamuṃdu kūḍa, ē vastuvu puṭṭinanu dāniki kāraṇamatanē).

  1. “ahamādiśca madhyaṃ ca bhūtānāmaṃta ēva ca”. (śrīmadbhagavadgīta - 10 - 20)

cētanānāṃ samastānāṃ yatōhaṃ janmakāraṇaṃ |

madhyē sthitirlayāṃtē ca mattōbhinnaṃ nakiṃcana |

sarvacētanavargāṇāṃ janma sthiti layātmanā |

tatkāraṇātmanā vā hamēva dhyēyaḥ itīritaḥ || (gītābhāvaprakāśamu - 10 - 99,100)

(cētanā cētanamulagu bhūtamulanniṃṭi janmaki kāraṇamu nēnē. sthiti kālamulō aviyuṃḍi vāṭiki niyamiṃcabaḍina panulu avi cēyuṭaku kāraṇamu nēnu - vāṭi nāśanamunaku - layamunaku - kāraṇamu nēnē. vāṭi sṛṣṭi sthitulu nēnē).

  1. “bhūtaṃbulaidunu puṭṭu cōṭaguvāni”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. 1 - 89)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.