(పంచభూతములయిన పృధివి మొదలగువాటి గుణములు - గంధము మొదలగునవి)
ద్విగుణస్తు తతోవాయుః శబ్ద స్పర్శాత్మాకో అభవత్ |
రూపం తదైవా విశితాం శబ్దస్పర్శగుణామభీ |
త్రిగుణస్తు తతో అగ్నిః స శబ్దస్పర్శరూపవాన్ |
శబ్దస్పర్శరూపమాత్రం రసమాత్రం సమావిశత్ |
తస్మాచ్చతుర్గుణా ఆపో విజ్ఞేయాస్తు రసాత్మకాః |
శబ్దస్పర్శంచ రూపంచ రసశ్చ గంధమావిశత్ |
తస్మాత్ పంచగుణా భూమిః స్థూలభూతేషు శస్యతే ||“, (లింగపురాణం).
“గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్ద స్పర్శంబులును, దేజంబునకు శబ్దస్పర్శ రూపంబులును, సలిలంబునకు శబ్దస్పర్శరూప రస గంధంబులును గుణంబులై యుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 -)
“నభో అసాధారణ గుణశబ్ద విశేష గ్రాహకంబు శ్రోత్రంబును, వాయ్వసాధారణ గుణవిశేష గ్రాహకంబు స్పర్శంబును, దేజో(అ)సాధారణ గుణవిశేష గ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభో(అ)సాధారణ గుణవిశేష గ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్యసాధారణ గుణవిశేష గ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును నాకాశాదిగుణంబులగుచు శబ్దాదికార్యంబులగు వాయ్వాదులందు గారణాన్వయంబున నన్నింటికిం బృధ్వీసంబంధంబు గలుగుటంజేసి భూమియందు శబ్దస్పర్శరూపరసగంధంబులు గలుగుట మహదాది పృధివ్యాంతంబులగు నీ యేడు తత్వంబులు పరస్పర మిళితంబులై భోగాయతనంబగు పురుషునిం గల్పింప సమర్థంబులై యున్నం జూచి - - - సర్వేశ్వరుండందు ప్రవేశించె” (శ్రీమధాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)
ఆకాశమునకు గుణము శబ్దము. వాయువు స్పర్శగుణము కలది. అది ఆకాశమునుండి పుట్టినదికనుక ఆకాశగుణమైన శబ్దముకూడ కలిగియుండును - అందుచేత వాయువునకు రెండుగుణములు - శబ్దము, స్పర్శము - అగ్నికి రూపము గుణము. అది వాయువునుండి పుట్టినది, దాని గుణములు కూడా కలిగియుండును - అనగా, శబ్ద స్పర్శ రూపములు గుణములుగా గలది. జలమునకు రజసము గుణము. అది అగ్నిలోనుండి పుట్టినది కనుక దాని గుణములు కూడా కలిగియుండును. అందుచేత అది నాలుగు గుణములు కలది - శబ్దము, స్పర్శము, రూపము, రసము గలది. భూమికి గుణము గంధము - అది జలములోనుండి పుట్టినది కనుక దాని గుణములు కూడా కలిగియుండును - అందుచేత అది అయిదు గుణములు కలిగియుండును - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు కలిగియుండును
(1).”ఆకాశమునందు ప్రతిధ్వని రూపశబ్దము గుణము.
(2).వాయువునందు బీశి, బీశి శబ్దము శీతోష్ణమృదు కఠోరతలకన్న విలక్షణమైన స్పర్శము గుణము.
(3). తేజస్సునందు భుగ భుగ శబ్దము ఉష్ణస్పర్శము, ప్రభారూపము, గుణము
(4). జలమునందు బులు బులు శబ్దము, శీతస్పర్శము శుక్లరూపము, మధురరసము
(5). పృధ్వియందు కట కట శబ్దము, ఉష్ణశీతములకన్న విషక్షణమైన కఠిన స్పర్శము, శత పీతాది సప్తవిధరూపము, మధురామ్లాది షడ్విధరసము, సుగంధ దుర్గంధ రూపమైన ద్వివిధగంధము - ఈ విధముగా భూతములందు గుణములున్నవి. సర్వభూతములకు మూలకారణము ఈశ్వరుడు. వానియందు మాయ, మఱియు చైతన్యము అని రెండు భాగములు గలవు. అందువలన మిధ్యాత్వము మాయది; సత్తాస్ఫూర్తి చైతన్యముది. ఈ రెండును సర్వభూతములందు పరిపూర్ణముగా నిండియున్నవి“.
(paṃcabhūtamulayina pṛdhivi modalaguvāṭi guṇamulu - gaṃdhamu modalagunavi)
dviguṇastu tatōvāyuḥ śabda sparśātmākō abhavat |
rūpaṃ tadaivā viśitāṃ śabdasparśaguṇāmabhī |
triguṇastu tatō agniḥ sa śabdasparśarūpavān |
śabdasparśarūpamātraṃ rasamātraṃ samāviśat |
tasmāccaturguṇā āpō vijñēyāstu rasātmakāḥ |
śabdasparśaṃca rūpaṃca rasaśca gaṃdhamāviśat |
tasmāt paṃcaguṇā bhūmiḥ sthūlabhūtēṣu śasyatē ||“, (liṃgapurāṇaṃ).
“gaganaṃbunaku śabdaṃbunu, vāyuvunaku śabda sparśaṃbulunu, dējaṃbunaku śabdasparśa rūpaṃbulunu, salilaṃbunaku śabdasparśarūpa rasa gaṃdhaṃbulunu guṇaṃbulai yuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 -)
“nabhō asādhāraṇa guṇaśabda viśēṣa grāhakaṃbu śrōtraṃbunu, vāyvasādhāraṇa guṇaviśēṣa grāhakaṃbu sparśaṃbunu, dējō(a)sādhāraṇa guṇaviśēṣa grāhakaṃbu cakṣuriṃdriyaṃbunu, naṃbhō(a)sādhāraṇa guṇaviśēṣa grāhakaṃbu rasanēṃdriyaṃbunu, bhūmyasādhāraṇa guṇaviśēṣa grāhakaṃbu ghrāṇēṃdriyaṃbunu nākāśādiguṇaṃbulagucu śabdādikāryaṃbulagu vāyvādulaṃdu gāraṇānvayaṃbuna nanniṃṭikiṃ bṛdhvīsaṃbaṃdhaṃbu galuguṭaṃjēsi bhūmiyaṃdu śabdasparśarūparasagaṃdhaṃbulu galuguṭa mahadādi pṛdhivyāṃtaṃbulagu nī yēḍu tatvaṃbulu paraspara miḷitaṃbulai bhōgāyatanaṃbagu puruṣuniṃ galpiṃpa samarthaṃbulai yunnaṃ jūci - - - sarvēśvaruṃḍaṃdu pravēśiṃce” (śrīmadhāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
ākāśamunaku guṇamu śabdamu. vāyuvu sparśaguṇamu kaladi. adi ākāśamunuṃḍi puṭṭinadikanuka ākāśaguṇamaina śabdamukūḍa kaligiyuṃḍunu - aṃducēta vāyuvunaku reṃḍuguṇamulu - śabdamu, sparśamu - agniki rūpamu guṇamu. adi vāyuvunuṃḍi puṭṭinadi, dāni guṇamulu kūḍā kaligiyuṃḍunu - anagā, śabda sparśa rūpamulu guṇamulugā galadi. jalamunaku rajasamu guṇamu. adi agnilōnuṃḍi puṭṭinadi kanuka dāni guṇamulu kūḍā kaligiyuṃḍunu. aṃducēta adi nālugu guṇamulu kaladi - śabdamu, sparśamu, rūpamu, rasamu galadi. bhūmiki guṇamu gaṃdhamu - adi jalamulōnuṃḍi puṭṭinadi kanuka dāni guṇamulu kūḍā kaligiyuṃḍunu - aṃducēta adi ayidu guṇamulu kaligiyuṃḍunu - śabda, sparśa, rūpa, rasa, gaṃdhamulu kaligiyuṃḍunu
(1).”ākāśamunaṃdu pratidhvani rūpaśabdamu guṇamu.
(2).vāyuvunaṃdu bīśi, bīśi śabdamu śītōṣṇamṛdu kaṭhōratalakanna vilakṣaṇamaina sparśamu guṇamu.
(3). tējassunaṃdu bhuga bhuga śabdamu uṣṇasparśamu, prabhārūpamu, guṇamu
(4). jalamunaṃdu bulu bulu śabdamu, śītasparśamu śuklarūpamu, madhurarasamu
(5). pṛdhviyaṃdu kaṭa kaṭa śabdamu, uṣṇaśītamulakanna viṣakṣaṇamaina kaṭhina sparśamu, śata pītādi saptavidharūpamu, madhurāmlādi ṣaḍvidharasamu, sugaṃdha durgaṃdha rūpamaina dvividhagaṃdhamu - ī vidhamugā bhūtamulaṃdu guṇamulunnavi. sarvabhūtamulaku mūlakāraṇamu īśvaruḍu. vāniyaṃdu māya, maṟiyu caitanyamu ani reṃḍu bhāgamulu galavu. aṃduvalana midhyātvamu māyadi; sattāsphūrti caitanyamudi. ī reṃḍunu sarvabhūtamulaṃdu paripūrṇamugā niṃḍiyunnavi”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.