(పుట్టినవి కనుక భూతములు - భవము అనగా పుట్టుక (జన్మ) భవముకలది - పుట్టినవి - భూతములు - శరీరములు, జీవులు)
(జన్మకలది భూతము - పుట్టినది - జగత్తు, సమస్త ప్రాణులు.)
(భూమి మొదలగు పంచభూతములు - భూతము, జలము,. అగ్ని, వాయువు, ఆకాశము)
(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను అయిదు భూతములని చెప్పబడుచున్నవి - ఇవే పంచ భూతములు - భూతము అనగా బాహ్యేంద్రియములచేత గ్రహించబడు గుణములు గలవి).
(ఆకాశము మొదలగునవి; వాటి వికారములు - జరాయుజములు మొదలగునవి).
(పంచభూత్రముల కలియకవలన కలుగునవి - దేహములు).
(దెవ్బతలు, రాక్షసులు, మనుష్యులు మొదలగునవి, దేహములు, జన్మ మొదలగునవి వికారములు (మార్పులు) గలవి)
(చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంబమువఱకుగల అన్ని భూతములు)
(దేహముగల చరములు, అచరములు - జంగమములు, స్థావరములు - అనగా చేతనములు - చైతన్యముగలవి)
ప్రాణినః. (ప్రాణులు, ప్రాణముగలవి)
భూతశబ్దః ఆత్మ పర్యంత దేహ వచనః -
(ఆత్మవరకు గల దేహములన్నియు భూతములని చెప్పబడుచున్నవి)
(కనబడు వస్తువు)
(అవ్యక్తమనగా వ్యక్తముకానిది - ప్రకృతి లేక మాయ, చతుర్ముఖ బ్రహ్మ అది మొదలు స్థావరములవఱకుగలవన్నియు భూతములే - భూతములనగా పుట్టినవి. అవ్యక్తము మొదలు సృష్టిలోనున్న వస్తువులన్నియు పుట్టుక కలవే - భగవంతుడొక్కడే పుట్టుక లేనివాడు - అజుడు).
(భూతము అనగా సత్యము, మూడుకాలములందుండునది - పరమార్థసత్యము - మోక్షరూపమైనది, కేవలము సత్పదార్థము - అవితథ స్వరూపమైనది, ఎల్లపుడు ఒకే రూపముతో నుండునది, ఇతర వస్తువులయొక్క ఆధీనములోలేక స్వతంత్రముగానుండునది; పరబ్రహ్మ - ఎప్పుడైనను, ఒకప్పుడైనను అసత్పదార్థము కానిది)
భగవంతునికి రెండు శక్తులు గలవు - పరాశక్తి (చైతన్య శక్తి లేక చిచ్ఛక్తి), అపరాశక్తి (జడశక్తి)
“భూమిరాపో (అ)నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా |
అపరేయ మతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం |
జీవభూతాం, మహాబాహో యయేదంధార్యతౌ జగత్ |
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ||” (శ్రీమద్భగవద్గీత - 7 - 4 to 6)
(అపరాశక్తి యనునది జడము, ఏకార్యమును చేయలేదు - (Matter is inert). అందుచేత భగవంతుడు ఈ అపరాశక్తిలో తన శక్తితో ప్రవేశించి దానికి చైతన్యము కలిగించెను - అప్పుడు ఆ అపరాశక్తి తనలోనుండి వివిధ వస్తువులను ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టించగలిగెను - స్వర్ణకారుడు బంగారపు ఆభరణములను చేయుటకు బంగారమును ముడిసరుకు (raw material) గా వాడినట్లు, కుమ్మరివాడు మట్టికుండలు చేయుటకు మట్టిని ముడుసరుకుగా వాడినట్లు, భగవంతుడు ఈ అపరా ప్రకృతుని (అపరాశక్తిని) సృష్టిలోని వస్తువులుగా చేయుటకు ముడిసరుకుగా వాడెను, అట్లు పుట్టినవస్తువులే భూతములు - వీటిలో భగవంతుని అపరా ప్రకృతి అంశయు, పరాశక్తి అంశయు కలవు. అందుచేత భగవంతుడు ప్రకృతి - ప్రకృతి పురుషుల సం యోగము వలననే యీ సృష్టిలోని వస్తువులన్ని కలుగుచున్నవి.(creation is the result of the combination of matter (ప్రకృతి) and ENERGY (పురుషుడు). ఇట్లు పుట్టినవస్తువులే భూతములు. ప్రతివస్తువులోను యీ రెండు అంశలు - ప్రకృతి అంశ, పురుషుని అంశ - కలిసియే యున్నవి. అందుచేత ఈ భూతములన్నింటికి ప్రకృతి (అపరాప్రకృతి) యోని - పుట్టుచోటు, భగవంతుడు - వాటిని పుట్టించువాడు, నశింపచేయువాడును –
“బీజం మాం సర్వభూతానాం విద్ధిపార్థ సనాతనం” (శ్రీమద్భగవద్గీత - 7 - 10)
“మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |
సంభవః సర్వభూతానాం తతో భవతి భారతి |
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మమహ్ద్యోనిరహం బీజప్రదః పితా” (శ్రీమద్భగవద్గీత - 14 - 3, 4)
మహద్బ్రహ్మ అనగా జడప్రకృతి చతుర్ముఖ బ్రహ్మ - అట్టి మహద్బ్రహ్మను యోనిగా ఉపయోగించుకొని భగవంతుడు తన చైతన్య శక్తి యగు బీజమును దానిలో నుంచి (అది గర్భము ధరించుదానివలె చేసి) దానిలోనుండి వస్తువులు - భూతములు - పుట్టినట్లు చేయుచున్నాడు - అందుచేత సృష్టి అంతటికీ, సృష్టిలోని వస్తువులన్నిటికీ, ప్రకృతి తల్లి, భగవంతుడు తండ్రి. ” జగతః పిత రే వందే పార్వతీ పరమేశ్వరౌ ” (జగత్తునకు తలిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము చేయుచున్నాను)
“యచ్చాపి సర్వభూతానాం బీజం తదహ మర్జున |”
నతదస్తి వినాయత్స్యాన్మయా భూతం చరాచరం (శ్రీమద్భగవద్గీత - 10 - 39)
సమస్త భూతములకు - ప్రతి భూతమునకు - బీజము నేనే - చరాచరరూపములైన అన్నింటిలోను నేను లేని భూతము లేదు - ఉన్న ప్రకృతి అంశ, భగవదంశ నేనే కనుక ప్రతిభూతములోను నేనే పూర్తిగా నిండి వ్యాపించియున్నాను - అందుచేత ఆ భూతములన్నియు నా రూపములే - “హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)
“మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్ స్థాని సర్వభూతాని నబాహం తేష్వవస్థితః |
యధాకాశ స్థితో నిత్యం వాయుః సర్వత్రగోమహాన్ |
తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ |“.
(కంటికి కనబడి రూపముగల నేను - (భగవంతుడు) ఈ జగత్తు అంతటిలోను పొడుగు పేకవలె పూర్తిగా వ్యాపించియున్నాను - అందుచేత భూతములన్నియు నాలోనే యున్నవి - ఆకాశములోనున్న వాయువు అన్నింటిలోను ఉన్నట్లు భూతములన్నియు నాలోనే యున్నవి)
“భూతగ్రామోయ ఏవాసీ త్పూర్వకల్పే స ఏవహి |
చరాచరాత్మకో నాన్యో భూత్వా భూత్వా ప్రలీయతే |
నిశాగమే దైనాదౌచ స ఏవాయం ప్రజాయతే |
స్వా విద్యాది పరాధీనో భూతగ్రామోహ్యనే కథా |
అవిద్యాది క్లేశ మూల కర్మాశయ వశాదయం |
భూతగ్రామః పరాయత్తో జాయతే లీయతే పునః |
స ఏవేతి విరాగాది సిద్ధయే హరిణోచ్యతే ||“. (గీతాభావప్రకాశము - 8 - 114 to 117)
(చరాచరాత్మకమగు భూతములన్నియు యింతకుముందు కల్పమందు ఏవి యుండెనో అవియే చతుర్ముఖ బ్రహ్మ (అవ్యక్తము) రాత్రి సమయమున అతనిలో లీనమై అతని పగటికాలమున తిరిగి పుట్టుచున్నవి. అవిద్య (అజ్ఞానము - జ్ఞానము లేకపోవుట) మొదలగువాటి ఆధీనములో (ప్రభావములో) నుండుటవలన భూతములు అనేక విధములుగా నున్నవి. అవిద్య మొదలగు క్లేశములవలన కలుగు కర్మ ఫలితముగా భూతములు స్వతంత్రములేక పరతంత్రులై ఇట్లు మరల మరల నశించుచు, మరల మరల పుట్టుచు ఉన్నవి. ఇదియే సంసారము. ఈ విధముగా జననమరణములు లేకుండుటయే ముక్తి, లేక మోక్షము - సంసారమునుండి విడుదల -)
(అవ్యక్తమనగా భూతములన్నియు వ్యక్తముగాని స్థితిలో నుండునది - దానినే చతుర్ముఖ బ్రహ్మ యందురు - దానిలో భూతములన్నియు లయమైనది మొదలు, కాలము, స్వభావము భగవంతుని చైతన్యశక్తి అనువాటివలనక్రమేన చైతన్యవంతములై తిరిగి నామరూపములతో అవ్యక్తములోనుండి పైకి వచ్చువరకు గలకాలము అవ్యక్తమునకు (చతుర్ముఖ బ్రహ్మకు) రాత్రికాలమని చెప్పబడినది. అవ్యక్తమునుండి అవి పైకి వ్యక్తమగుకాలము చతుర్ముఖ బ్రహ్మకు పగటికాలమని చెప్పబడినది. అప్పుడు సృష్టి జరుగుచున్నదికనుక పగటికాలము, సృష్టి జరుగకముందుకాలము రాత్రియని చెప్పబడినది. ఇటువంటి ఒక పగలు ఒకరాత్రి కలిసి చతుర్ముఖ బ్రహ్మకు ఒక దినము - నాలుగువేల యుగములు ఒక రాత్రి, నాలుగువేల యుగములు ఒక పగలు. దీనిని బట్టి తెలియునదేమనగా యీ భూతములన్నియు ప్రలయకాలమందు అవ్యక్తములో లీనమై తిరిగి సృష్టికాలమందు పుట్టుచుండును -)
అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 28)
“జన్మనః ప్రాక్ శరీరాణి భూతకార్యాణి సర్వధా |
అదృష్టాని, తధామధ్యే జనేరూర్ధ్వం మృతేః పురా |
ఉపలబ్దాని సంత్యన్యేప్యదృష్టాని భవంతి చ |
యథా స్వప్నేంద్ర జాలాదౌ ప్రతిభాసమానివై |
భూతీనిహ తథా జ్ఞానాత్ ప్రాగూర్థ్వం న స్థితాని చ |”
ఆదానంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా |
“ఇతి న్యాయేన మధ్యేపి న సంత్యేతాని సర్వశః |
- - - అదర్శనాద పతితః పునశ్చా దర్శనం గతః |
నాసే తవ న తస్యత్వంవృథాపరి దేవనా” (గీతాభావప్రకాసము - 2 - 328 to 331, 333, 334)
(పంచభూతముల కారణముగా కలిగినటువంటి - అనగా - పంచభూతములవలన కలిగిన శరీరములు పుట్టుటకుముందు కనబడవు. పుట్టినతర్వాత, మరణమునకు ముందు కనబడుచున్నవి, చనిపోయినతర్వాత మరల కనబడవు. స్వప్నము (కల), ఇంద్రజాలము మొదలగువాటియందు కనబడు భూతములు, అంతకుముందుగాని, అటుతర్వాతగాని కనబడకుండునట్లే - మొదటిలో లేనివస్తువు అంతములో లేనిదే, అది వర్తమానదశలోకూడ లేనిదే. అని న్యాయశాస్త్రము చెప్పుచున్నది. మొదటిలో లేనిది మధ్యలో ఉన్నట్లు కనబడినను అది భ్రమయే - కనబడనిదానినుండి వచ్చి, కనబడనిదానిలోకి వెళ్ళిపోయి దానిలో కలిసిపోయే శరీరములు నీవికావు, నువ్వు వాటి వాడివికావు. అందుచేత వాటిగుఱించి నీకేల విచారము).
అవ్యక్తాదీన్యవక్త మదర్శన మనుపలబ్ధి రాదిర్యేషాం భూతానాం, పుత్ర మిత్రాది కార్యకారణ సంఘాతాత్మకానాం తాన్యవక్తాదీని భూతాని ప్రాగుత్పత్తేః ఉత్పన్నాని చ ప్రాఙ్మరణాద్వ్యక్త మథ్యాని. అవ్యక్త నిధనాన్యేవ పునరవ్యక్తమదర్శనం నిధనమ్మరణం ఏషాం తాన్యవ్యక్త నిధనాని, మరణాదూర్ద్వ మవ్యక్తతామేవ ప్రతి పద్యంత ఇత్యర్థః - తథా చోక్తం “అదర్శనాదా పతితః పునశ్చా దర్శనం గతః” (శ్రీశంకరః)
(పుత్రమిత్రాది కార్యములను చేయునట్టి యీ భూతములు అవి పుట్టకముందు కనబడనివి - ఎక్కడనుండునవియో, యెట్లుండునవియో తెలియబడనివి. పుట్టిన తర్వాత చనిపోవువఱకుగల మధ్యకాలమందు మట్టుకు కంటికి కనబడునవి. తర్వాత మరణకాలమందు అగుపడనివి - చనిపోయిన తర్వాత ఏమైపోయినవో, ఎక్కడనున్నవో తెలియనివి. అటువంటివి మిధ్యలే.
(అవ్యక్తమనగా అవ్యాకృతమగు అవిద్యోపహితమగు చైతన్యము - అది ఆదిగా (కారణముగా) గలవి భూతములు. అందుచేత భూతములు ‘అవ్యక్తాదీని’ - అవ్యక్తము కారణముగా గలవి. భూతములు పుట్టకముందు - వ్యక్తముకాకముందు - ప్రకృతిలోనుండు అవస్థ అవ్యక్తము (matter). భగవంతునియొక్క చిచ్ఛక్తి అవ్యక్తములో ప్రవేశించియుండుటవలన మొదటిలో నామరూపములులేని భూతములు కాలక్రమేణ నామరూపములు కలిగి వ్యక్తమగును - కనబడునపుడు - అవి వ్యక్తమధ్యములు - మధ్యస్థితిలో, అనగా, పుట్టుటకు లయించుటకు మధ్యకాలమందు వ్యక్తమైనవి. అవి అవ్యక్తమునందే లయమగుచున్నవి, అందుచేత అవ్యక్త నిధనములు - అని చెప్పబడుచున్నవి. హేమరూపాదిభిర్నవ్యజ్యతే ఇత్యవ్యక్తం, మాయా తస్యాస్సకాశాదాదిర్జన్మ యేషాం తాన్య వ్యక్తాదీని భూతాని శరీరాణి ” -
(నామరూపములు వ్యక్తముగాని మాయ - ప్రకృతి - అవ్యక్తమనబడును. ఆ అవ్యక్తము ’ ఆది ’ లేక జన్మకారణముగా గలవి భూతములు ’ అన్యక్తాదీని ’ (అవ్యక్తము పుట్టుకస్థానముగా గలవి) అని చెప్పబడుచున్నది. తిరిగి ఆ భూతములు అవ్యక్తమునందే లీనమగుచున్నవి - లయమగుచున్నవి. వాటికి అవ్యక్తము నిధనము - లయమగుస్థానము - అందుచేత ఆ భూతములు అవ్యక్త నిధనములు. ఈ మధ్యకాలమందు - వ్యక్తముగాకనుండు స్థితికి, లీనమైన స్థితికి మధ్యనుండు కాలమందు - వ్యక్తమగుచున్నవి - (ఆ స్థితిలో భూతములు నామరూపములు కలిగి కనబడుచున్నవి. కనుక ఆ స్థితిలో భూతములు వ్యక్తమధ్యములు)
“ప్రమాణై స్సర్వైర్నవ్యజ్యతే ఇత్యవ్యక్తం, పరంబ్రహ్మ తదగ్రహణాదాదిర్జన్మ యేషాంతే, తాన్యవ్యక్తాదీని.”
(ఏ ప్రమాణములచేతనైనను తెలియబడనివాడు కనుక భగవంతుడు అవ్యక్తుడని చెప్పబడుచున్నాడు - అట్టి పరబ్రహ్మ. అట్టి పరబ్రహ్మ జ్ఞానము లేకపోవుటచేత జన్మముకలది యగుచున్నదికనుక భూతములు ’ అవ్యక్తాదీని ’ (భగవంతుడు ’ ఆది ’ గా - కారణముగా గలవి యని చెప్పబడుచున్నవి. “సర్వంవ్యం జయతీతి వ్యక్తమంతఃకరణం మధ్యేస్థితికాలే యేషాతాని ’ వ్యక్త మధ్యాని ’ -” (అంతఃకరణమువలననే ప్రపంచములో నేను, నాది యను అభిప్రాయములు కలుగుచు సర్వ వ్యవహారములు జరుగుచున్నవికనుక అంతఃకరణము వ్యక్తమనబడును - అట్టి అంతఃకరణముచే భూతముల వ్యాపారములు కలుగుచున్నవి కనుక ’ భూతమధ్యములు ’ - “మనోవృత్తిమయం ద్వైతమద్వైతం పరమార్థతః”. (ప్రపంచమనునది భగవంతునికంటె వేఱుగానున్నదియని తలంచుట మనస్సుయొక్క - అంతఃకరణముయొక్క - వృత్తి (వ్యాపారము) వలననే. “అవ్యక్తేస్వాధిష్ఠానే బ్రహ్మణి నిధన మేషాంతాన్యవ్యక్తనిధనాని” వాటికి అధిష్ఠానమై అవ్యక్తమైన పరబ్రహ్మలో లీనమగుచున్నవి కనుక భూతములు ’ అవ్యక్త నిధనాని ’ అని చెప్పబడినవి.
(భూతములవల్;అన పుట్టునటువంటి మూకుడు మొదలగువాటికి ఆకాశము మొదలగు పంచమహాభూతములు ఎట్లు ఆది, మధ్యాంతములో - భూతములనుండి పుట్టి పెరిగి వాటిలోనే కలిసిపోవుచున్నవో - లీనమైపోవుచున్నవో ఆ ప్రకారముగానే సమస్తభూతములకు - జరాయుజములు, అండజములు, మొదలగువాటికి భగవంతుడైన పరమేశ్వరుడే ఆది, అంతము మొదలగుమొదలగునవి అయినవాడు - అనగా, భగవంతునిలో పుట్టి, భగవంతుని వలననేపెరిగి భగవంతునిలోనే లీనమగుచున్నవి)
(భూతములకు ఆది మధ్యాంతములు నేనే, సృష్టి స్థితి సంహారములు చేయువాడను నేనే) (భగవంతుడే).
ఈ సృష్టిలోనున్న వస్తువులన్నియు పంచభూతముల సమ్మేళనమువలన కలిగినవే కనుక అవన్నియు పాంచభౌతికములని చెప్పబడుచున్నవి.
పుట్టినభూతములన్నియు ఒక్కమాదిరిగా నుండకుండుటకు కారణమేమనగా - ”
“ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప||“. (శ్రీమద్భగవద్గీత 7 - 27)
“ఇచ్ఛాద్వేష సముద్భూత సుఖాది ద్వంద్వ హేతునా |
మోహేనాహం సుఖే, దుఃఖేత్యాది భ్రాంతిమయే నచ |
సమస్తాన్యపి భూతాని వివేకాయోగ్యతాం |
పరాం స్థూల దేహాద్భవే యాంతి ||“. (గీతాభావప్రకాశము - 7 - 189 to 191)
(ఇచ్ఛాద్వేషములవలన కలుగు సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములు కారణములుగా నేను సుఖించుచున్నాను, నేను దుఃఖించుచున్నాను అను మొదలగు భ్రాంతియను మోహముచేత సమస్తభూతములు స్థూలదేహమును పొందినపుడు - జన్మించునపుడు వివేకమును కోలుపోవుచున్నారు).
(వర్షము కురియుటవలన అన్నము - సస్యములు కలుగుచున్నవి. ఆ అన్నమువలన భూతములు కలుగుచున్నవి - ఆ అన్నమే భూతములకు శరీరములుగా మారుచున్నది).
“శుక్ల శోణితరూపేణ హ్యన్నాత్పరిణతాత్కిల |
శరీరాణి ప్రజాయంతే వృష్టేరిన్నస్య జన్మచ”. (గీతాభావప్రకాశము - 3 - 9 -)
(వర్షము కురియుటవలన సస్యములు - అన్నము, ఆహారము - కలుగుచున్నది. ఆ సస్యములు శుక్లశోణితములుగా మారుటచేత శరీరము భూతములకు కలుగుచున్నవి)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 253)
(యోగ వాశిష్టము - 31 - 53)
(బీజమందు చెట్టు ఉన్నట్లు ఈ చైతన్యశక్తి రూపుడగు భగవంతునియందే మూడుకాలములందు కలిగెడు భూతములున్నవి) “భూతంబులవలన భూతంబులు పుట్టుచుండు - ఆ బూతంబులు భూతంబుల చేతం భక్షింపబడుచుండు)
ప్రపంచములోని అన్ని వస్తువులలోను పూర్తిగా భగవంతుడు వ్యాపించియున్నాడుకనుక భగవంతుడుకూడ భూతమే - పెద్దభూతము - “భూతమయత్వంబువలన భూతశబ్ద వాచ్యుండవయ్యును.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1- - పూ.భా. 682)
“జీవనం సర్వభూతానాం” (శ్రీమద్భగవద్గీత - 7 - 9)
(సమస్త జీవులకు జీవనము నేనే - జీవనమనగా బ్రతికియుండుట కాధారమైనది - ప్రాణరూపములో భగవంతుని శక్తి –
“జీవనంబు తనకు జీవనంబై యుంట
అలవు బలము నంతకంతకెక్కె
మకరమెఉప్పె; డస్సె మత్తేభమల్లంబు
- - - బహుళపక్ష శీతభానుపగిది ” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
జీవనము అనగా నీరు - మకరమునకు నీటిలో బలము - ఏనుగునకు భూమిమీదనుండ బలము)
అతీతం జగత్ - (గడిచిపోయిన జగత్తు; జరిగిపోయిన కాలము; భూతకాలము).
“గగన పవన తేజోవారి మహ్యా వివర్తా |
భగవతి ఇతి సిద్ధంసర్వవేదాంతజాలే |
నహి తృణమపి విష్ణోర్భిన్న సత్తాం
భేత విధిశతమపి తద్వనైవ విష్ణోర్విభిన్నం ||“. (గీతాభావప్రకాశము - 9 - 5 - 63)
(ఆకాశము, వాయువు, అగ్ని - తేజస్సు - జలము, భూమి ఈ భూతములు భగవంతుని వివర్తములు - అని ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి - గడ్డిపోచ కూడ శ్రీమహావిష్ణువునికంటె వేరైనది లేదు - అంతా భగవత్తత్వమే).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -)
“క. భూతములవలన నెప్పుడు
భూతములకు జన్మమరణ పోషణములు ని
ర్ణీతము సేయుచుండును
భూతమయుండీశ్వరుండు భూతశరణ్యా||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15 - 340)
(puṭṭinavi kanuka bhūtamulu - bhavamu anagā puṭṭuka (janma) bhavamukaladi - puṭṭinavi - bhūtamulu - śarīramulu, jīvulu)
(janmakaladi bhūtamu - puṭṭinadi - jagattu, samasta prāṇulu.)
(bhūmi modalagu paṃcabhūtamulu - bhūtamu, jalamu,. agni, vāyuvu, ākāśamu)
(bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu anu ayidu bhūtamulani ceppabaḍucunnavi - ivē paṃca bhūtamulu - bhūtamu anagā bāhyēṃdriyamulacēta grahiṃcabaḍu guṇamulu galavi).
(ākāśamu modalagunavi; vāṭi vikāramulu - jarāyujamulu modalagunavi).
(paṃcabhūtramula kaliyakavalana kalugunavi - dēhamulu).
(devbatalu, rākṣasulu, manuṣyulu modalagunavi, dēhamulu, janma modalagunavi vikāramulu (mārpulu) galavi)
(caturmukha brahma modalu staṃbamuvaṟakugala anni bhūtamulu)
(dēhamugala caramulu, acaramulu - jaṃgamamulu, sthāvaramulu - anagā cētanamulu - caitanyamugalavi)
prāṇinaḥ. (prāṇulu, prāṇamugalavi)
bhūtaśabdaḥ ātma paryaṃta dēha vacanaḥ -
(ātmavaraku gala dēhamulanniyu bhūtamulani ceppabaḍucunnavi)
(kanabaḍu vastuvu)
(avyaktamanagā vyaktamukānidi - prakṛti lēka māya, caturmukha brahma adi modalu sthāvaramulavaṟakugalavanniyu bhūtamulē - bhūtamulanagā puṭṭinavi. avyaktamu modalu sṛṣṭilōnunna vastuvulanniyu puṭṭuka kalavē - bhagavaṃtuḍokkaḍē puṭṭuka lēnivāḍu - ajuḍu).
(bhūtamu anagā satyamu, mūḍukālamulaṃduṃḍunadi - paramārthasatyamu - mōkṣarūpamainadi, kēvalamu satpadārthamu - avitatha svarūpamainadi, ellapuḍu okē rūpamutō nuṃḍunadi, itara vastuvulayokka ādhīnamulōlēka svataṃtramugānuṃḍunadi; parabrahma - eppuḍainanu, okappuḍainanu asatpadārthamu kānidi)
bhagavaṃtuniki reṃḍu śaktulu galavu - parāśakti (caitanya śakti lēka cicchakti), aparāśakti (jaḍaśakti)
“bhūmirāpō (a)nalō vāyuḥ khaṃ manō buddhirēva ca |
ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛtiraṣṭathā |
aparēya matastvanyāṃ prakṛtiṃ viddhi mē parāṃ |
jīvabhūtāṃ, mahābāhō yayēdaṃdhāryatau jagat |
ētadyōnīni bhūtāni sarvāṇītyupadhāraya |
ahaṃ kṛtsnasya jagataḥ prabhavaḥ praḷayastathā ||” (śrīmadbhagavadgīta - 7 - 4 to 6)
(aparāśakti yanunadi jaḍamu, ēkāryamunu cēyalēdu - (Matter is inert). aṃducēta bhagavaṃtuḍu ī aparāśaktilō tana śaktitō pravēśiṃci dāniki caitanyamu kaligiṃcenu - appuḍu ā aparāśakti tanalōnuṃḍi vividha vastuvulanu okadānilōnuṃḍi okaṭigā puṭṭiṃcagaligenu - svarṇakāruḍu baṃgārapu ābharaṇamulanu cēyuṭaku baṃgāramunu muḍisaruku (raw material) gā vāḍinaṭlu, kummarivāḍu maṭṭikuṃḍalu cēyuṭaku maṭṭini muḍusarukugā vāḍinaṭlu, bhagavaṃtuḍu ī aparā prakṛtuni (aparāśaktini) sṛṣṭilōni vastuvulugā cēyuṭaku muḍisarukugā vāḍenu, aṭlu puṭṭinavastuvulē bhūtamulu - vīṭilō bhagavaṃtuni aparā prakṛti aṃśayu, parāśakti aṃśayu kalavu. aṃducēta bhagavaṃtuḍu prakṛti - prakṛti puruṣula saṃ yōgamu valananē yī sṛṣṭilōni vastuvulanni kalugucunnavi.(creation is the result of the combination of matter (prakṛti) and ENERGY (puruṣuḍu). iṭlu puṭṭinavastuvulē bhūtamulu. prativastuvulōnu yī reṃḍu aṃśalu - prakṛti aṃśa, puruṣuni aṃśa - kalisiyē yunnavi. aṃducēta ī bhūtamulanniṃṭiki prakṛti (aparāprakṛti) yōni - puṭṭucōṭu, bhagavaṃtuḍu - vāṭini puṭṭiṃcuvāḍu, naśiṃpacēyuvāḍunu –
“bījaṃ māṃ sarvabhūtānāṃ viddhipārtha sanātanaṃ” (śrīmadbhagavadgīta - 7 - 10)
“mamayōnirmahadbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |
saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bhārati |
sarvayōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |
tāsāṃ brahmamahdyōnirahaṃ bījapradaḥ pitā” (śrīmadbhagavadgīta - 14 - 3, 4)
mahadbrahma anagā jaḍaprakṛti caturmukha brahma - aṭṭi mahadbrahmanu yōnigā upayōgiṃcukoni bhagavaṃtuḍu tana caitanya śakti yagu bījamunu dānilō nuṃci (adi garbhamu dhariṃcudānivale cēsi) dānilōnuṃḍi vastuvulu - bhūtamulu - puṭṭinaṭlu cēyucunnāḍu - aṃducēta sṛṣṭi aṃtaṭikī, sṛṣṭilōni vastuvulanniṭikī, prakṛti talli, bhagavaṃtuḍu taṃḍri. ” jagataḥ pita rē vaṃdē pārvatī paramēśvarau ” (jagattunaku talidaṃḍrulaina pārvatī paramēśvarulaku namaskāramu cēyucunnānu)
“yaccāpi sarvabhūtānāṃ bījaṃ tadaha marjuna |”
natadasti vināyatsyānmayā bhūtaṃ carācaraṃ (śrīmadbhagavadgīta - 10 - 39)
samasta bhūtamulaku - prati bhūtamunaku - bījamu nēnē - carācararūpamulaina anniṃṭilōnu nēnu lēni bhūtamu lēdu - unna prakṛti aṃśa, bhagavadaṃśa nēnē kanuka pratibhūtamulōnu nēnē pūrtigā niṃḍi vyāpiṃciyunnānu - aṃducēta ā bhūtamulanniyu nā rūpamulē - “harimayamugāni dravyamu paramāṇuvu lēdu” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)
“mayātatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā |
mat sthāni sarvabhūtāni nabāhaṃ tēṣvavasthitaḥ |
yadhākāśa sthitō nityaṃ vāyuḥ sarvatragōmahān |
tathā sarvāṇi bhūtāni mat sthānī tyupadhāraya |“.
(kaṃṭiki kanabaḍi rūpamugala nēnu - (bhagavaṃtuḍu) ī jagattu aṃtaṭilōnu poḍugu pēkavale pūrtigā vyāpiṃciyunnānu - aṃducēta bhūtamulanniyu nālōnē yunnavi - ākāśamulōnunna vāyuvu anniṃṭilōnu unnaṭlu bhūtamulanniyu nālōnē yunnavi)
“bhūtagrāmōya ēvāsī tpūrvakalpē sa ēvahi |
carācarātmakō nānyō bhūtvā bhūtvā pralīyatē |
niśāgamē dainādauca sa ēvāyaṃ prajāyatē |
svā vidyādi parādhīnō bhūtagrāmōhyanē kathā |
avidyādi klēśa mūla karmāśaya vaśādayaṃ |
bhūtagrāmaḥ parāyattō jāyatē līyatē punaḥ |
sa ēvēti virāgādi siddhayē hariṇōcyatē ||“. (gītābhāvaprakāśamu - 8 - 114 to 117)
(carācarātmakamagu bhūtamulanniyu yiṃtakumuṃdu kalpamaṃdu ēvi yuṃḍenō aviyē caturmukha brahma (avyaktamu) rātri samayamuna atanilō līnamai atani pagaṭikālamuna tirigi puṭṭucunnavi. avidya (ajñānamu - jñānamu lēkapōvuṭa) modalaguvāṭi ādhīnamulō (prabhāvamulō) nuṃḍuṭavalana bhūtamulu anēka vidhamulugā nunnavi. avidya modalagu klēśamulavalana kalugu karma phalitamugā bhūtamulu svataṃtramulēka parataṃtrulai iṭlu marala marala naśiṃcucu, marala marala puṭṭucu unnavi. idiyē saṃsāramu. ī vidhamugā jananamaraṇamulu lēkuṃḍuṭayē mukti, lēka mōkṣamu - saṃsāramunuṃḍi viḍudala -)
(avyaktamanagā bhūtamulanniyu vyaktamugāni sthitilō nuṃḍunadi - dāninē caturmukha brahma yaṃduru - dānilō bhūtamulanniyu layamainadi modalu, kālamu, svabhāvamu bhagavaṃtuni caitanyaśakti anuvāṭivalanakramēna caitanyavaṃtamulai tirigi nāmarūpamulatō avyaktamulōnuṃḍi paiki vaccuvaraku galakālamu avyaktamunaku (caturmukha brahmaku) rātrikālamani ceppabaḍinadi. avyaktamunuṃḍi avi paiki vyaktamagukālamu caturmukha brahmaku pagaṭikālamani ceppabaḍinadi. appuḍu sṛṣṭi jarugucunnadikanuka pagaṭikālamu, sṛṣṭi jarugakamuṃdukālamu rātriyani ceppabaḍinadi. iṭuvaṃṭi oka pagalu okarātri kalisi caturmukha brahmaku oka dinamu - nāluguvēla yugamulu oka rātri, nāluguvēla yugamulu oka pagalu. dīnini baṭṭi teliyunadēmanagā yī bhūtamulanniyu pralayakālamaṃdu avyaktamulō līnamai tirigi sṛṣṭikālamaṃdu puṭṭucuṃḍunu -)
avyakta nidhanānyēva tatrakā paridēvanā ||“. (śrīmadbhagavadgīta - 2 - 28)
“janmanaḥ prāk śarīrāṇi bhūtakāryāṇi sarvadhā |
adṛṣṭāni, tadhāmadhyē janērūrdhvaṃ mṛtēḥ purā |
upalabdāni saṃtyanyēpyadṛṣṭāni bhavaṃti ca |
yathā svapnēṃdra jālādau pratibhāsamānivai |
bhūtīniha tathā jñānāt prāgūrthvaṃ na sthitāni ca |”
ādānaṃtēca yannāsti vartamānēpi tattathā |
“iti nyāyēna madhyēpi na saṃtyētāni sarvaśaḥ |
- - - adarśanāda patitaḥ punaścā darśanaṃ gataḥ |
nāsē tava na tasyatvaṃvṛthāpari dēvanā” (gītābhāvaprakāsamu - 2 - 328 to 331, 333, 334)
(paṃcabhūtamula kāraṇamugā kaliginaṭuvaṃṭi - anagā - paṃcabhūtamulavalana kaligina śarīramulu puṭṭuṭakumuṃdu kanabaḍavu. puṭṭinatarvāta, maraṇamunaku muṃdu kanabaḍucunnavi, canipōyinatarvāta marala kanabaḍavu. svapnamu (kala), iṃdrajālamu modalaguvāṭiyaṃdu kanabaḍu bhūtamulu, aṃtakumuṃdugāni, aṭutarvātagāni kanabaḍakuṃḍunaṭlē - modaṭilō lēnivastuvu aṃtamulō lēnidē, adi vartamānadaśalōkūḍa lēnidē. ani nyāyaśāstramu ceppucunnadi. modaṭilō lēnidi madhyalō unnaṭlu kanabaḍinanu adi bhramayē - kanabaḍanidāninuṃḍi vacci, kanabaḍanidānilōki veḷḷipōyi dānilō kalisipōyē śarīramulu nīvikāvu, nuvvu vāṭi vāḍivikāvu. aṃducēta vāṭiguṟiṃci nīkēla vicāramu).
avyaktādīnyavakta madarśana manupalabdhi rādiryēṣāṃ bhūtānāṃ, putra mitrādi kāryakāraṇa saṃghātātmakānāṃ tānyavaktādīni bhūtāni prāgutpattēḥ utpannāni ca prāṅmaraṇādvyakta mathyāni. avyakta nidhanānyēva punaravyaktamadarśanaṃ nidhanammaraṇaṃ ēṣāṃ tānyavyakta nidhanāni, maraṇādūrdva mavyaktatāmēva prati padyaṃta ityarthaḥ - tathā cōktaṃ “adarśanādā patitaḥ punaścā darśanaṃ gataḥ” (śrīśaṃkaraḥ)
(putramitrādi kāryamulanu cēyunaṭṭi yī bhūtamulu avi puṭṭakamuṃdu kanabaḍanivi - ekkaḍanuṃḍunaviyō, yeṭluṃḍunaviyō teliyabaḍanivi. puṭṭina tarvāta canipōvuvaṟakugala madhyakālamaṃdu maṭṭuku kaṃṭiki kanabaḍunavi. tarvāta maraṇakālamaṃdu agupaḍanivi - canipōyina tarvāta ēmaipōyinavō, ekkaḍanunnavō teliyanivi. aṭuvaṃṭivi midhyalē.
(avyaktamanagā avyākṛtamagu avidyōpahitamagu caitanyamu - adi ādigā (kāraṇamugā) galavi bhūtamulu. aṃducēta bhūtamulu ‘avyaktādīni’ - avyaktamu kāraṇamugā galavi. bhūtamulu puṭṭakamuṃdu - vyaktamukākamuṃdu - prakṛtilōnuṃḍu avastha avyaktamu (matter). bhagavaṃtuniyokka cicchakti avyaktamulō pravēśiṃciyuṃḍuṭavalana modaṭilō nāmarūpamululēni bhūtamulu kālakramēṇa nāmarūpamulu kaligi vyaktamagunu - kanabaḍunapuḍu - avi vyaktamadhyamulu - madhyasthitilō, anagā, puṭṭuṭaku layiṃcuṭaku madhyakālamaṃdu vyaktamainavi. avi avyaktamunaṃdē layamagucunnavi, aṃducēta avyakta nidhanamulu - ani ceppabaḍucunnavi. hēmarūpādibhirnavyajyatē ityavyaktaṃ, māyā tasyāssakāśādādirjanma yēṣāṃ tānya vyaktādīni bhūtāni śarīrāṇi ” -
(nāmarūpamulu vyaktamugāni māya - prakṛti - avyaktamanabaḍunu. ā avyaktamu ’ ādi ’ lēka janmakāraṇamugā galavi bhūtamulu ’ anyaktādīni ’ (avyaktamu puṭṭukasthānamugā galavi) ani ceppabaḍucunnadi. tirigi ā bhūtamulu avyaktamunaṃdē līnamagucunnavi - layamagucunnavi. vāṭiki avyaktamu nidhanamu - layamagusthānamu - aṃducēta ā bhūtamulu avyakta nidhanamulu. ī madhyakālamaṃdu - vyaktamugākanuṃḍu sthitiki, līnamaina sthitiki madhyanuṃḍu kālamaṃdu - vyaktamagucunnavi - (ā sthitilō bhūtamulu nāmarūpamulu kaligi kanabaḍucunnavi. kanuka ā sthitilō bhūtamulu vyaktamadhyamulu)
“pramāṇai ssarvairnavyajyatē ityavyaktaṃ, paraṃbrahma tadagrahaṇādādirjanma yēṣāṃtē, tānyavyaktādīni.”
(ē pramāṇamulacētanainanu teliyabaḍanivāḍu kanuka bhagavaṃtuḍu avyaktuḍani ceppabaḍucunnāḍu - aṭṭi parabrahma. aṭṭi parabrahma jñānamu lēkapōvuṭacēta janmamukaladi yagucunnadikanuka bhūtamulu ’ avyaktādīni ’ (bhagavaṃtuḍu ’ ādi ’ gā - kāraṇamugā galavi yani ceppabaḍucunnavi. “sarvaṃvyaṃ jayatīti vyaktamaṃtaḥkaraṇaṃ madhyēsthitikālē yēṣātāni ’ vyakta madhyāni ’ -” (aṃtaḥkaraṇamuvalananē prapaṃcamulō nēnu, nādi yanu abhiprāyamulu kalugucu sarva vyavahāramulu jarugucunnavikanuka aṃtaḥkaraṇamu vyaktamanabaḍunu - aṭṭi aṃtaḥkaraṇamucē bhūtamula vyāpāramulu kalugucunnavi kanuka ’ bhūtamadhyamulu ’ - “manōvṛttimayaṃ dvaitamadvaitaṃ paramārthataḥ”. (prapaṃcamanunadi bhagavaṃtunikaṃṭe vēṟugānunnadiyani talaṃcuṭa manassuyokka - aṃtaḥkaraṇamuyokka - vṛtti (vyāpāramu) valananē. “avyaktēsvādhiṣṭhānē brahmaṇi nidhana mēṣāṃtānyavyaktanidhanāni” vāṭiki adhiṣṭhānamai avyaktamaina parabrahmalō līnamagucunnavi kanuka bhūtamulu ’ avyakta nidhanāni ’ ani ceppabaḍinavi.
(bhūtamulaval;ana puṭṭunaṭuvaṃṭi mūkuḍu modalaguvāṭiki ākāśamu modalagu paṃcamahābhūtamulu eṭlu ādi, madhyāṃtamulō - bhūtamulanuṃḍi puṭṭi perigi vāṭilōnē kalisipōvucunnavō - līnamaipōvucunnavō ā prakāramugānē samastabhūtamulaku - jarāyujamulu, aṃḍajamulu, modalaguvāṭiki bhagavaṃtuḍaina paramēśvaruḍē ādi, aṃtamu modalagumodalagunavi ayinavāḍu - anagā, bhagavaṃtunilō puṭṭi, bhagavaṃtuni valananēperigi bhagavaṃtunilōnē līnamagucunnavi)
(bhūtamulaku ādi madhyāṃtamulu nēnē, sṛṣṭi sthiti saṃhāramulu cēyuvāḍanu nēnē) (bhagavaṃtuḍē).
ī sṛṣṭilōnunna vastuvulanniyu paṃcabhūtamula sammēḷanamuvalana kaliginavē kanuka avanniyu pāṃcabhautikamulani ceppabaḍucunnavi.
puṭṭinabhūtamulanniyu okkamādirigā nuṃḍakuṃḍuṭaku kāraṇamēmanagā - ”
“icchādvēṣasamutthēna dvaṃdvamōhēna bhārata |
sarvabhūtāni sammōhaṃ sargē yāṃti paraṃtapa||“. (śrīmadbhagavadgīta 7 - 27)
“icchādvēṣa samudbhūta sukhādi dvaṃdva hētunā |
mōhēnāhaṃ sukhē, duḥkhētyādi bhrāṃtimayē naca |
samastānyapi bhūtāni vivēkāyōgyatāṃ |
parāṃ sthūla dēhādbhavē yāṃti ||“. (gītābhāvaprakāśamu - 7 - 189 to 191)
(icchādvēṣamulavalana kalugu sukhaduḥkhamulu modalagu dvaṃdvamulu kāraṇamulugā nēnu sukhiṃcucunnānu, nēnu duḥkhiṃcucunnānu anu modalagu bhrāṃtiyanu mōhamucēta samastabhūtamulu sthūladēhamunu poṃdinapuḍu - janmiṃcunapuḍu vivēkamunu kōlupōvucunnāru).
(varṣamu kuriyuṭavalana annamu - sasyamulu kalugucunnavi. ā annamuvalana bhūtamulu kalugucunnavi - ā annamē bhūtamulaku śarīramulugā mārucunnadi).
“śukla śōṇitarūpēṇa hyannātpariṇatātkila |
śarīrāṇi prajāyaṃtē vṛṣṭērinnasya janmaca”. (gītābhāvaprakāśamu - 3 - 9 -)
(varṣamu kuriyuṭavalana sasyamulu - annamu, āhāramu - kalugucunnadi. ā sasyamulu śuklaśōṇitamulugā māruṭacēta śarīramu bhūtamulaku kalugucunnavi)
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 253)
(yōga vāśiṣṭamu - 31 - 53)
(bījamaṃdu ceṭṭu unnaṭlu ī caitanyaśakti rūpuḍagu bhagavaṃtuniyaṃdē mūḍukālamulaṃdu kaligeḍu bhūtamulunnavi) “bhūtaṃbulavalana bhūtaṃbulu puṭṭucuṃḍu - ā būtaṃbulu bhūtaṃbula cētaṃ bhakṣiṃpabaḍucuṃḍu)
prapaṃcamulōni anni vastuvulalōnu pūrtigā bhagavaṃtuḍu vyāpiṃciyunnāḍukanuka bhagavaṃtuḍukūḍa bhūtamē - peddabhūtamu - “bhūtamayatvaṃbuvalana bhūtaśabda vācyuṃḍavayyunu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 1- - pū.bhā. 682)
“jīvanaṃ sarvabhūtānāṃ” (śrīmadbhagavadgīta - 7 - 9)
(samasta jīvulaku jīvanamu nēnē - jīvanamanagā bratikiyuṃḍuṭa kādhāramainadi - prāṇarūpamulō bhagavaṃtuni śakti –
“jīvanaṃbu tanaku jīvanaṃbai yuṃṭa
alavu balamu naṃtakaṃtakekke
makarameuppe; ḍasse mattēbhamallaṃbu
- - - bahuḷapakṣa śītabhānupagidi ” (śrīmadāṃdhramahābhāgavatamu -)
jīvanamu anagā nīru - makaramunaku nīṭilō balamu - ēnugunaku bhūmimīdanuṃḍa balamu)
atītaṃ jagat - (gaḍicipōyina jagattu; jarigipōyina kālamu; bhūtakālamu).
“gagana pavana tējōvāri mahyā vivartā |
bhagavati iti siddhaṃsarvavēdāṃtajālē |
nahi tṛṇamapi viṣṇōrbhinna sattāṃ
bhēta vidhiśatamapi tadvanaiva viṣṇōrvibhinnaṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 5 - 63)
(ākāśamu, vāyuvu, agni - tējassu - jalamu, bhūmi ī bhūtamulu bhagavaṃtuni vivartamulu - ani upaniṣattulannī ghōṣistunnāyi - gaḍḍipōca kūḍa śrīmahāviṣṇuvunikaṃṭe vērainadi lēdu - aṃtā bhagavattatvamē).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 -)
“ka. bhūtamulavalana neppuḍu
bhūtamulaku janmamaraṇa pōṣaṇamulu ni
rṇītamu sēyucuṃḍunu
bhūtamayuṃḍīśvaruṃḍu bhūtaśaraṇyā||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15 - 340)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.