← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతవాసః bhūtavāsaḥ

Original — తెలుగు
  1. ఆకాశాద్యాశ్రయః -

(ఆకాశము మొదలగువాటికి ఆశ్రయమైనవాడు - అవి పుట్టకముందు తన లోనే సూక్ష్మరూపములో పరబ్రహ్మలోనే ఉండెడివి - భూతము లన్నింటి యందును నివసించియుండువాడను –

“వసతి నివసతి సర్వ భూతేషు అయం దేవః ఇతి వాసుదేవః”.

ఈ దేవుడు సర్వభూతములందు నివసించియుండువాడుకనుక వాసుదేవుడు).

  1. “వసంతి త్వయి భూతాని భూతావాసస్తతో భవాన్ |

ఇతి హరివంశే -“.

(భూతములు నీలో నివసించియుండుటవలన నీవు భూతావాసుడు - భూతములు పుట్టకముందు భగవంతునిలో సూక్ష్మరూపములోనుండును - భగవంతుడు విశ్వరూపుడుకనుక అతని విశ్వరూపములోనున్నవి).

  1. “భూతన్యత్రాభిముఖేన వసంతీతి భూతావాసః”.

(సమస్త భూతములు పుట్టుటకు అభిముఖముగా నున్నవై వీనియందే నివసించియున్నవి. అందుచేత భూతావాసుడు).

  1. “ఆకాశాది భూతసమాశ్రయత్వంబువలన భూతావాసుండవయ్యును -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. 682)

  2. “యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగోమహాన్ |

తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 4, 5, 6)

(నిత్యము వాయువు ఆకాశములో నున్నదైనను అన్నింటిలోను ఎట్లున్నదో అట్లే సమస్త భూతములు నాలోనున్నవి).

Transliteration
  1. ākāśādyāśrayaḥ -

(ākāśamu modalaguvāṭiki āśrayamainavāḍu - avi puṭṭakamuṃdu tana lōnē sūkṣmarūpamulō parabrahmalōnē uṃḍeḍivi - bhūtamu lanniṃṭi yaṃdunu nivasiṃciyuṃḍuvāḍanu –

“vasati nivasati sarva bhūtēṣu ayaṃ dēvaḥ iti vāsudēvaḥ”.

ī dēvuḍu sarvabhūtamulaṃdu nivasiṃciyuṃḍuvāḍukanuka vāsudēvuḍu).

  1. “vasaṃti tvayi bhūtāni bhūtāvāsastatō bhavān |

iti harivaṃśē -“.

(bhūtamulu nīlō nivasiṃciyuṃḍuṭavalana nīvu bhūtāvāsuḍu - bhūtamulu puṭṭakamuṃdu bhagavaṃtunilō sūkṣmarūpamulōnuṃḍunu - bhagavaṃtuḍu viśvarūpuḍukanuka atani viśvarūpamulōnunnavi).

  1. “bhūtanyatrābhimukhēna vasaṃtīti bhūtāvāsaḥ”.

(samasta bhūtamulu puṭṭuṭaku abhimukhamugā nunnavai vīniyaṃdē nivasiṃciyunnavi. aṃducēta bhūtāvāsuḍu).

  1. “ākāśādi bhūtasamāśrayatvaṃbuvalana bhūtāvāsuṃḍavayyunu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. 682)

  2. “yathākāśasthitō nityaṃ vāyuḥ sarvatragōmahān |

tathā sarvāṇi bhūtāni matsthānītyupadhāraya ||“. (śrīmadbhagavadgīta - 9 - 4, 5, 6)

(nityamu vāyuvu ākāśamulō nunnadainanu anniṃṭilōnu eṭlunnadō aṭlē samasta bhūtamulu nālōnunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.