(భూతములకు యోని - జన్మస్థానము - ప్రథానం - భూతములకు కారణమై నది.
“ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ -”. (శ్రీమద్భగవద్గీత - 7 - 6)
“ఏతే పరావరే ప్రోక్తే క్షేత్ర క్షేత్రజ్ఞలక్షణే |
ప్రకృతీ యోనిరస్త్యేషాం ఏతద్యోనీని తానివై |
చరా చరాణి సర్వాణి భూతానీత్యుప థారయ |“. (గీతాభావప్రకాశము - 78 - 37, 38)
(క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అను లక్షణములుగల పరా అపరా ప్రకృతులు చరాచరరూపమైన సమస్త భూతములకు యోని - పుట్టుక స్థానము -). (చూడుము - ‘భూతములు - 15’)
భూతకారణం - (భూతముల పుట్టుటకు కారణమైనది)
“మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం |
సంభవః సర్వ భూతానాం తతో భవతి భారత |
సర్వయోనిషు కౌంతేయ, మూర్తయః సంభమతి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః సితా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 34) (చూడుము ‘భూతములు – 15’)
భూతానాం యోనిం - ప్రకృతిం (భూతములకు యోని అయినది - ప్రకృతి)
“కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం”; ఇతి - ‘యత్’ భూతయోనిం పరిపశ్యతి ధీరాః ఇతి చ (ముండకోపనిషత్ -1 -1 - 6)
(బ్రహ్మ - అనగా - చతుర్ముఖబ్రహ్మ - లేక ప్రకృతి యోనిగా గల పురుషుడు - ఈశ్వరుడు, జగత్కర్త).
(భూతములు పుట్టుటకు యోని - కారణమైనవానిని ధీరులు - బుద్ధిమంతులు, పండితులు చూచెదరు).
(చూచుటకు శక్యముకానిది, గ్రహించుటకు వీలుకానిది, నామరూపములు లేనిది, ఇంద్రియములు లేనిది, నిత్యముండునది, వ్యాపకము - (అన్నింటిలోను వ్యాపించి యుండునది), మిక్కిలి సూక్ష్మమైనది, అన్నింటిలోని ప్రవేశించి యుండునది, అవ్యయ మైనది, సర్వభూతములకు కారణమైనది అని బ్రహ్మజ్ఞానులు చెప్పుదురు - ఈ లక్షణములుగల పరమాత్మయే సమస్త భూతములకు యోని - పుట్టుక స్థాన మైనవాడు. పరబ్రహ్మమే ప్రకృతి - అపరాప్రకృతి, పరాప్రకృతి అతనేకనుక ప్రకృతి రూపములో పరబ్రహ్మయే భూతములకు యోని - ఉపాదానకారణము, నిమిత్తకారణమున్నూ. ఓషధులకు - వనస్పతులకు భూమి యోని - పుట్టుటకు స్థానము - ఒక్కొక్కచోట స్త్రీ యోని యని, గర్భము ధరించు ఇతర అవయవము లనిన్నీ కూడ అర్థమగుచున్నది. అందుచేత ఉపాదానకారణమని కూడ అర్థమగును - సాలెపురుగు నోటినుండి దారములు పుట్టించుచున్నది. ఈ విషయ ములో దాని నోరు ఉపాదానకారణము, అది దారములు తీయుట నిమిత్తకారణము) - “యోని శబ్దశ్చ ప్రకృతి వచనః సమధిగతో లోకే - పృధ్వీ యోనిరోషధి వనస్పతీనామితి స్త్రీ యోనే రప్యన్యైరవయవ ద్వారేణ గర్భం ప్రత్యుపా దాన కారణత్వం క్వచిత్ స్థాన వచనోపి యోనిశబ్దో దృష్టః - యధోర్ణనాభిః సృజతే గృహ్ణతేచ.”
(bhūtamulaku yōni - janmasthānamu - prathānaṃ - bhūtamulaku kāraṇamai nadi.
“ētadyōnīni bhūtāni sarvāṇī tyupadhāraya -”. (śrīmadbhagavadgīta - 7 - 6)
“ētē parāvarē prōktē kṣētra kṣētrajñalakṣaṇē |
prakṛtī yōnirastyēṣāṃ ētadyōnīni tānivai |
carā carāṇi sarvāṇi bhūtānītyupa thāraya |“. (gītābhāvaprakāśamu - 78 - 37, 38)
(kṣētramu, kṣētrajñuḍu anu lakṣaṇamulugala parā aparā prakṛtulu carācararūpamaina samasta bhūtamulaku yōni - puṭṭuka sthānamu -). (cūḍumu - ‘bhūtamulu - 15’)
bhūtakāraṇaṃ - (bhūtamula puṭṭuṭaku kāraṇamainadi)
“mama yōnirmahadbrahma tasmin garbhaṃ dadhāmyahaṃ |
saṃbhavaḥ sarva bhūtānāṃ tatō bhavati bhārata |
sarvayōniṣu kauṃtēya, mūrtayaḥ saṃbhamati yāḥ |
tāsāṃ brahma mahadyōni rahaṃ bījapradaḥ sitā ||“. (śrīmadbhagavadgīta - 14 - 34) (cūḍumu ‘bhūtamulu – 15’)
bhūtānāṃ yōniṃ - prakṛtiṃ (bhūtamulaku yōni ayinadi - prakṛti)
“kartāramīśaṃ puruṣaṃ brahmayōniṃ”; iti - ‘yat’ bhūtayōniṃ paripaśyati dhīrāḥ iti ca (muṃḍakōpaniṣat -1 -1 - 6)
(brahma - anagā - caturmukhabrahma - lēka prakṛti yōnigā gala puruṣuḍu - īśvaruḍu, jagatkarta).
(bhūtamulu puṭṭuṭaku yōni - kāraṇamainavānini dhīrulu - buddhimaṃtulu, paṃḍitulu cūcedaru).
(cūcuṭaku śakyamukānidi, grahiṃcuṭaku vīlukānidi, nāmarūpamulu lēnidi, iṃdriyamulu lēnidi, nityamuṃḍunadi, vyāpakamu - (anniṃṭilōnu vyāpiṃci yuṃḍunadi), mikkili sūkṣmamainadi, anniṃṭilōni pravēśiṃci yuṃḍunadi, avyaya mainadi, sarvabhūtamulaku kāraṇamainadi ani brahmajñānulu ceppuduru - ī lakṣaṇamulugala paramātmayē samasta bhūtamulaku yōni - puṭṭuka sthāna mainavāḍu. parabrahmamē prakṛti - aparāprakṛti, parāprakṛti atanēkanuka prakṛti rūpamulō parabrahmayē bhūtamulaku yōni - upādānakāraṇamu, nimittakāraṇamunnū. ōṣadhulaku - vanaspatulaku bhūmi yōni - puṭṭuṭaku sthānamu - okkokkacōṭa strī yōni yani, garbhamu dhariṃcu itara avayavamu laninnī kūḍa arthamagucunnadi. aṃducēta upādānakāraṇamani kūḍa arthamagunu - sālepurugu nōṭinuṃḍi dāramulu puṭṭiṃcucunnadi. ī viṣaya mulō dāni nōru upādānakāraṇamu, adi dāramulu tīyuṭa nimittakāraṇamu) - “yōni śabdaśca prakṛti vacanaḥ samadhigatō lōkē - pṛdhvī yōnirōṣadhi vanaspatīnāmiti strī yōnē rapyanyairavayava dvārēṇa garbhaṃ pratyupā dāna kāraṇatvaṃ kvacit sthāna vacanōpi yōniśabdō dṛṣṭaḥ - yadhōrṇanābhiḥ sṛjatē gṛhṇatēca.”
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.