← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతే భూతే వ్యవస్థితః bhūtē bhūtē vyavasthitaḥ

Original — తెలుగు

తస్మిన్ తస్మిన్ శరీరే భూతాభ్యాసశ్చతుర్విధ శరీర సంగ్రహార్థః వ్యవస్థితః - వివిధం తత్ర తత్ర శరీరాం తః కరణాది సాదృశ్య మవలంబ్య అవస్థితః - అవస్థానం ప్రాప్తః - తథా చ పరమాత్మా ఏక ఏవసన్ సర్వేష్వడి స్థావరజంగమ శరీరేషు ప్రత్యగాత్మతయా స్థావరాద్యుపాధినాశే (అ)పి నిత్యతయా అవస్థితః ఇత్యేవ మాత్మానం సదా పశ్యేత్ –

” సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం |

వినాశ్వత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 27)

(ఏక ఏవహి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః |

ఏకథా బహుథా చైవ దృశ్యతే జలచంద్రవత్||

ఇతి శ్రుతిః -

(ఆయా శరీరములందు - అనగా, అండజములు, జరాయుజములు, ఉద్భిజ్జములు, స్వేదజములు అను నాలుగు విధముల శరీరములందు ఉన్నవాడు. ఆ యా శరీరము లందు అంతఃకరణము మొదలగువాటి రూపములో ఉండుట. పరమాత్మ ఒకడే అయినను చరాచర రూపములగు శరీరములన్నింటి యందును ప్రత్యగాత్మగా (జీవుడుగా) స్థావరములు మొదలగు ఉపాధులు నశించినను తాను నశించక నిత్యముగా నుండువాడు. ఈ ప్రకారముగా ఆత్మను ధ్యానించవలెను).

(సమస్త భూతములందు హెచ్చు తగ్గులు లేక - భేదములేక - ఉండువాడు, నశించువాటిలో నుండియు అవి నశించునప్పుడు వాటితో నశించకుండ నుండువాడు పరమేశ్వరుడు - అని ఎవడు తెలుసుకొనునో వాడే జ్ఞాని).

(చంద్రుడు ఒకడే అయినను అనేక జలాశయములందు అనేక చంద్రులున్నట్లు కనబడినట్లే భగవంతుడు ఒకడే అయినను భూతములన్నింటిలోను నుండుటవలన ఒక్కడుగాను అనేకములుగాను ఉన్నట్లు తోచును).

Transliteration

tasmin tasmin śarīrē bhūtābhyāsaścaturvidha śarīra saṃgrahārthaḥ vyavasthitaḥ - vividhaṃ tatra tatra śarīrāṃ taḥ karaṇādi sādṛśya mavalaṃbya avasthitaḥ - avasthānaṃ prāptaḥ - tathā ca paramātmā ēka ēvasan sarvēṣvaḍi sthāvarajaṃgama śarīrēṣu pratyagātmatayā sthāvarādyupādhināśē (a)pi nityatayā avasthitaḥ ityēva mātmānaṃ sadā paśyēt –

” samaṃ sarvēṣu bhūtēṣu tiṣṭaṃtaṃ paramēśvaraṃ |

vināśvatsvavinaśyaṃtaṃ yaḥ paśyati sa paśyati ||“. (śrīmadbhagavadgīta - 13 - 27)

(ēka ēvahi bhūtātmā bhūtē bhūtē vyavasthitaḥ |

ēkathā bahuthā caiva dṛśyatē jalacaṃdravat||

iti śrutiḥ -

(āyā śarīramulaṃdu - anagā, aṃḍajamulu, jarāyujamulu, udbhijjamulu, svēdajamulu anu nālugu vidhamula śarīramulaṃdu unnavāḍu. ā yā śarīramu laṃdu aṃtaḥkaraṇamu modalaguvāṭi rūpamulō uṃḍuṭa. paramātma okaḍē ayinanu carācara rūpamulagu śarīramulanniṃṭi yaṃdunu pratyagātmagā (jīvuḍugā) sthāvaramulu modalagu upādhulu naśiṃcinanu tānu naśiṃcaka nityamugā nuṃḍuvāḍu. ī prakāramugā ātmanu dhyāniṃcavalenu).

(samasta bhūtamulaṃdu heccu taggulu lēka - bhēdamulēka - uṃḍuvāḍu, naśiṃcuvāṭilō nuṃḍiyu avi naśiṃcunappuḍu vāṭitō naśiṃcakuṃḍa nuṃḍuvāḍu paramēśvaruḍu - ani evaḍu telusukonunō vāḍē jñāni).

(caṃdruḍu okaḍē ayinanu anēka jalāśayamulaṃdu anēka caṃdrulunnaṭlu kanabaḍinaṭlē bhagavaṃtuḍu okaḍē ayinanu bhūtamulanniṃṭilōnu nuṃḍuṭavalana okkaḍugānu anēkamulugānu unnaṭlu tōcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.