(బ్రహ్మరంధ్రము సాక్షాత్తుగా శివునియొక్క ఉత్తమమైనస్థానము).
“మూర్థన్యధాయాత్మనః ప్రాణమాస్తితో యోగధారణాం |
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 12, 13)
(బ్రహ్మరంధ్రము శివుని సాక్షాత్ స్థానము - అపరోక్షస్థానము. శాక్షాత్కరించు స్థానము - శివుడు పరమానందరూపుడు, జగత్తునకుపాదానమైనవాడు జగత్తు అంతయు అతని శరీరమే - మట్టితో చేసినవాటన్నింటికీ మట్టి ఉపాదానమైనట్లు; అందుచేత ప్రపంచ మంతటికీ గురుడైనవాడు. అట్లు అయినప్పటికీ బ్రహ్మ రంధ్రమందున్నట్లు ఉపాసించ బడినవాడై అపరోక్షుడే యగును -సాక్షాత్కరించు వాడగును. హృదయము, భ్రూమధ్యము మొదలగు ఇతర స్థానములందు కూడ నుండువాడైనను బ్రహ్మ రంధ్రమందు శీఘ్రకాలమందే అతిశయించి అభివ్యక్తుడగుచున్నాడు. శ్రీమద్భగవద్గీతలో ఈ విషయమిట్లు చెప్పబడినది: - ఇంద్రియవ్యాపారములన్నింటిని వశములో నుంచుకొని వాటిని బంధించి ప్రాణమును మూర్థమునకు యోగముద్వారా తీసుకొనివచ్చి ‘ఓం అను ఏకాక్షరము బ్రహ్మ’ (బ్రహ్మ వాచకము కనుక) అని జపించుచు, నన్ను (భగవంతుని స్మరించుచు బ్రహ్మరంధ్రముద్వారా ప్రాణమును వదలుట మూలముగా శరీరమును వదలివేయువాడు పరమగతిని (పరమపదమును) విష్ణుస్థానమును పొందును).
(అవ్యక్తమనగా కర్మ పరిపక్వమై ఫలోన్ముఖమైన మాయా ప్రకృతి యుండుస్థితి. ఇదియే బిందువు. (చూడుము - “ఆద్యా మంత్రము”). సృష్టి ప్రారంభముననున్న ప్రకృతియొక్క స్థితి. ఈ బిందువు ఘనీభవించి బ్రహ్మాండముగా మారి (Cosmic egg), పేలి, తునాతునకలుగా అయినప్పుడు ఒక పెద్దరవము (శబ్దము) పుట్టినది. అదియే ఓంకారము, ఆ శబ్దము ప్రతి తునకలోను అంతర్గతమై యుండి జీవుల శరీరములో మూలాధార మందుండి, అక్కడనుండి కుండలినీ శక్తి ద్వారా నాభి వరకు, నాభినుండి హృదయమునకు, హృదయమునుండి కంఠమునకు; కంఠమునుండి భ్రూమధ్యమువరకు, అక్కడనుండి బ్రహ్మరంధ్రమువరకు వ్యాపించియుండును సూక్ష్మరూపములో నుండు యీ శబ్దము కంఠగతమైనపుడు వాయువుతో కలిసి అక్కడ రూపము పొంది వాక్కు అగుచున్నది. బిందువు పేలినపుడు విడుదల అయిన చైతన్యము (చైతన్యశక్తి) ప్రతి తునకలోను ఉండి ఇట్లు పరిణమింపచేయుచున్నది).
“సీ. అంఘ్రిమూలమున మూలాధారచక్రంబు బీడించి ప్రాణంబు బిగియబట్టి
నాభితలము జేర్చి, నయముతో మెల్లన హృత్సరోజము మీది కెగయ బట్టి
యట మీద నురమందు హత్తించి క్రమ్మఱ తాలు మూలమునకు దఱిమి నిలిపి
మతముతో భ్రూయుగమధ్యంబు సేర్చి దృక్కర్ణ నాశాస్య మార్గములుమూసి
తే. యిచ్చలేని యోగి యెలమి ముహూర్తార్థ
మింద్రియానుషంగమింతలేక
ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి
బ్రహ్మమందు గలయు బౌరవేంద్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 29)
(brahmaraṃdhramu sākṣāttugā śivuniyokka uttamamainasthānamu).
“mūrthanyadhāyātmanaḥ prāṇamāstitō yōgadhāraṇāṃ |
ōmityēkākṣaraṃ brahma vyāharan māmanusmaran |
yaḥ prayāti samadbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 12, 13)
(brahmaraṃdhramu śivuni sākṣāt sthānamu - aparōkṣasthānamu. śākṣātkariṃcu sthānamu - śivuḍu paramānaṃdarūpuḍu, jagattunakupādānamainavāḍu jagattu aṃtayu atani śarīramē - maṭṭitō cēsinavāṭanniṃṭikī maṭṭi upādānamainaṭlu; aṃducēta prapaṃca maṃtaṭikī guruḍainavāḍu. aṭlu ayinappaṭikī brahma raṃdhramaṃdunnaṭlu upāsiṃca baḍinavāḍai aparōkṣuḍē yagunu -sākṣātkariṃcu vāḍagunu. hṛdayamu, bhrūmadhyamu modalagu itara sthānamulaṃdu kūḍa nuṃḍuvāḍainanu brahma raṃdhramaṃdu śīghrakālamaṃdē atiśayiṃci abhivyaktuḍagucunnāḍu. śrīmadbhagavadgītalō ī viṣayamiṭlu ceppabaḍinadi: - iṃdriyavyāpāramulanniṃṭini vaśamulō nuṃcukoni vāṭini baṃdhiṃci prāṇamunu mūrthamunaku yōgamudvārā tīsukonivacci ‘ōṃ anu ēkākṣaramu brahma’ (brahma vācakamu kanuka) ani japiṃcucu, nannu (bhagavaṃtuni smariṃcucu brahmaraṃdhramudvārā prāṇamunu vadaluṭa mūlamugā śarīramunu vadalivēyuvāḍu paramagatini (paramapadamunu) viṣṇusthānamunu poṃdunu).
(avyaktamanagā karma paripakvamai phalōnmukhamaina māyā prakṛti yuṃḍusthiti. idiyē biṃduvu. (cūḍumu - “ādyā maṃtramu”). sṛṣṭi prāraṃbhamunanunna prakṛtiyokka sthiti. ī biṃduvu ghanībhaviṃci brahmāṃḍamugā māri (Cosmic egg), pēli, tunātunakalugā ayinappuḍu oka peddaravamu (śabdamu) puṭṭinadi. adiyē ōṃkāramu, ā śabdamu prati tunakalōnu aṃtargatamai yuṃḍi jīvula śarīramulō mūlādhāra maṃduṃḍi, akkaḍanuṃḍi kuṃḍalinī śakti dvārā nābhi varaku, nābhinuṃḍi hṛdayamunaku, hṛdayamunuṃḍi kaṃṭhamunaku; kaṃṭhamunuṃḍi bhrūmadhyamuvaraku, akkaḍanuṃḍi brahmaraṃdhramuvaraku vyāpiṃciyuṃḍunu sūkṣmarūpamulō nuṃḍu yī śabdamu kaṃṭhagatamainapuḍu vāyuvutō kalisi akkaḍa rūpamu poṃdi vākku agucunnadi. biṃduvu pēlinapuḍu viḍudala ayina caitanyamu (caitanyaśakti) prati tunakalōnu uṃḍi iṭlu pariṇamiṃpacēyucunnadi).
“sī. aṃghrimūlamuna mūlādhāracakraṃbu bīḍiṃci prāṇaṃbu bigiyabaṭṭi
nābhitalamu jērci, nayamutō mellana hṛtsarōjamu mīdi kegaya baṭṭi
yaṭa mīda nuramaṃdu hattiṃci krammaṟa tālu mūlamunaku daṟimi nilipi
matamutō bhrūyugamadhyaṃbu sērci dṛkkarṇa nāśāsya mārgamulumūsi
tē. yiccalēni yōgi yelami muhūrtārtha
miṃdriyānuṣaṃgamiṃtalēka
prāṇamulanu vaṃci brahmaraṃdhramu ciṃci
brahmamaṃdu galayu bauravēṃdra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 29)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.