← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ సాక్షాత్కారము brahma sākṣātkāramu

Original — తెలుగు
  1. “ఎప్పుడు స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యక్ జ్ఞానంబునం బ్రతిషేధింపబడు ననియును - తొలగింపబడుననియును - అవిద్యం జేసి యాత్మను గల్పింప బడుననియు తెలియు, అప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబునకు అధికారియగు, దర్శనంబున జ్ఞానైక స్వరూపంబు. విశారదుండైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ ఉపరతయై (ఆగినదై) యెప్పుడు తాను విద్యారూపంబున పరిణతయగు, జీవోపాధియైన స్థూల సూక్ష్మ రూపంబు దహించి జీవుడు, కాష్టంబు లేక తేజరిల్లు - వహ్ని చందంబున, తాన యుపరతుండయి బ్రహ్మ స్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుండగు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 65)

  1. బ్రహ్మానుభవము -

  2. “మ. భగవంతుం బురుషోత్తమున్ - - -

- - - నా

జగదాత్ముం గనుచుందురార్యులు తపశ్శక్తిన్ స్ఫుట జ్ఞానులై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 373)

  1. “ఉ. ఏలకుమార, శోషిలగ నీ జననంబున నన్ను గానగా

జాలవు నీవు; కామ ముఖషట్కము నిర్దళితంబు సేసి ని

ర్మూలిత కర్ముడైన ముని ముఖ్యుడు గాని కుయోగి గానగా

జాలడు, నీదు కోర్కి గొనసాగుటకై నిజమూర్తి జూపితిన్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 6 - 88)

  1. “చ. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస

స్ఫురణగలప్పుడవ్విభుని భూరి కళా కలిత స్వరూపముం

దరమిడి చూతురెప్పుడు; కుతర్కత మోహతిచేత నజ్ఞతం

బొరసిన యప్పు డవ్విభుని మూర్తిగనుంగొనలేరు, నారదా!“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 111).

  1. “ఉ. కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్

గానని భంగి. గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై

కానరు విష్ణు; గొందరటగందుర కించన వైష్ణవాంఘ్రి సం

స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు, దానవేశ్వరా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 182)

  1. “మ. అరవిందాక్ష, భవత్స్వరూపమిల ప్రత్యక్షంబునన్ గాన నె

వ్వరికింబోలదు; శాస్త్రగోచరుడవై వర్తింతు వీసృష్టి ముం

దర సద్రూపుడవైన నీవలననే ధాత్రాద్యమర్త్యుల్ జనిం

చిరి; నిన్నంతకమున్నెఱుంగ గలమే చింతింపనేమచ్యుతా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా - 1215)

  1. “మ. ఒకవేయర్కులు గూడి గట్టి కదుపై యుద్యత్ ప్రభాభూతితో

నొకరూపై చనుదెంచు మాడ్కి హరి తానొప్పారె; నా వేలుపుల్

వికలా లోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగా

నక శంకించిరి కొంత ప్రొద్దు; విభుగానం బోలునే వారికిన్”

(భగవంతుడు జ్యోతి స్వరూపుడు) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 6 - 159)

  1. పరబ్రహ్మ తన సగుణ రూపముతో సాక్షాత్కరించినపుడు ఈ క్రిందవిధముగా వర్ణింపబడెను : -

“సీ. ’ హారకిరీట కేయూరకుండలపాద కటకకాంచీలతా కంకణాది

కౌస్తుబోపేతంబు. గౌమోదకీ శంఖచక్ర శరాసన సం యుతంబు,

మరకత శ్యామంబు సరసిజ నేత్రంబు గర్ణాభరణ కాంతి గండయుగము

గలిత కాంచన పర్ణ కౌశేయ వస్త్రంబు, శ్రీవనమాలికా సేవితంబు

ఆ. నై మనోహరంబునై, దివ్య సౌభాగ్య

మైన యతని రూపు| హర్షమెసగ

జూచి బ్రహ్మ, హరుడు, సురలును దానును

బొంగి నమ్రుడగుచు బొగడదొడగె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 4 - 161)

Transliteration
  1. “eppuḍu sthūla sūkṣma rūpaṃbulu reṃḍu svarūpa samyak jñānaṃbunaṃ bratiṣēdhiṃpabaḍu naniyunu - tolagiṃpabaḍunaniyunu - avidyaṃ jēsi yātmanu galpiṃpa baḍunaniyu teliyu, appuḍu jīvuṃḍu brahma darśanaṃbunaku adhikāriyagu, darśanaṃbuna jñānaika svarūpaṃbu. viśāraduṃḍaina yīśvarunidai krīḍiṃcucu navidya yanaṃbaḍucunna māya uparatayai (āginadai) yeppuḍu tānu vidyārūpaṃbuna pariṇatayagu, jīvōpādhiyaina sthūla sūkṣma rūpaṃbu dahiṃci jīvuḍu, kāṣṭaṃbu lēka tējarillu - vahni caṃdaṃbuna, tāna yuparatuṃḍayi brahma svarūpaṃbunaṃ boṃdi paramānaṃdaṃbuna virājamānuṃḍagu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 65)

  1. brahmānubhavamu -

  2. “ma. bhagavaṃtuṃ buruṣōttamun - - -

- - - nā

jagadātmuṃ ganucuṃdurāryulu tapaśśaktin sphuṭa jñānulai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 373)

  1. “u. ēlakumāra, śōṣilaga nī jananaṃbuna nannu gānagā

jālavu nīvu; kāma mukhaṣaṭkamu nirdaḷitaṃbu sēsi ni

rmūlita karmuḍaina muni mukhyuḍu gāni kuyōgi gānagā

jālaḍu, nīdu kōrki gonasāguṭakai nijamūrti jūpitin ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 6 - 88)

  1. “ca. sarasagatin munīṃdrulu prasanna śarīra hṛṣīka mānasa

sphuraṇagalappuḍavvibhuni bhūri kaḷā kalita svarūpamuṃ

daramiḍi cūtureppuḍu; kutarkata mōhaticēta najñataṃ

borasina yappu ḍavvibhuni mūrtiganuṃgonalēru, nāradā!“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 111).

  1. “u. kānanivāni nūtagoni kānanivāḍu viśiṣṭa vastuvul

gānani bhaṃgi. garmamulu gaikoni koṃdaṟu karmabaddhulai

kānaru viṣṇu; goṃdaraṭagaṃdura kiṃcana vaiṣṇavāṃghri saṃ

sthāna rajōbhiṣiktulagu saṃhṛta karmulu, dānavēśvarā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 182)

  1. “ma. araviṃdākṣa, bhavatsvarūpamila pratyakṣaṃbunan gāna ne

vvarikiṃbōladu; śāstragōcaruḍavai vartiṃtu vīsṛṣṭi muṃ

dara sadrūpuḍavaina nīvalananē dhātrādyamartyul janiṃ

ciri; ninnaṃtakamunneṟuṃga galamē ciṃtiṃpanēmacyutā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā - 1215)

  1. “ma. okavēyarkulu gūḍi gaṭṭi kadupai yudyat prabhābhūtitō

nokarūpai canudeṃcu māḍki hari tānoppāre; nā vēlupul

vikalā lōkanulai viṣaṇṇamatulai vibhrāṃtulai mrōlagā

naka śaṃkiṃciri koṃta proddu; vibhugānaṃ bōlunē vārikin”

(bhagavaṃtuḍu jyōti svarūpuḍu) (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 6 - 159)

  1. parabrahma tana saguṇa rūpamutō sākṣātkariṃcinapuḍu ī kriṃdavidhamugā varṇiṃpabaḍenu : -

“sī. ’ hārakirīṭa kēyūrakuṃḍalapāda kaṭakakāṃcīlatā kaṃkaṇādi

kaustubōpētaṃbu. gaumōdakī śaṃkhacakra śarāsana saṃ yutaṃbu,

marakata śyāmaṃbu sarasija nētraṃbu garṇābharaṇa kāṃti gaṃḍayugamu

galita kāṃcana parṇa kauśēya vastraṃbu, śrīvanamālikā sēvitaṃbu

ā. nai manōharaṃbunai, divya saubhāgya

maina yatani rūpu| harṣamesaga

jūci brahma, haruḍu, suralunu dānunu

boṃgi namruḍagucu bogaḍadoḍage” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 4 - 161)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.