(బ్రహ్మను గుఱించి కలిగినజ్ఞానము - అనగా బ్రహ్మ అనగా ఎవరు? ఎటువంటివాడు? ఏమి చేయుచుండును? అను మొదలగు విషయముల గుఱించి కలుగు జ్ఞానము -).
(దేనిని గుఱించి జ్ఞానము కలిగిన అంతకంటె ఉత్కృష్టమైన జ్ఞానము మఱిలేదో అదియే పరబ్రహ్మ - బ్రహ్మజ్ఞానము ఉత్కృష్టమైన జ్ఞానము - దానిని మించి ఉత్కృష్టమైన జ్ఞానము మరి లేదు - సర్వము బ్రహ్మమే కనుక బ్రహ్మజ్ఞానమనగా సర్వజ్ఞత్వము. ఈ సృష్టి పరబ్రహ్మ చేసెను. అట్లు చేయుటలో అనేక ఆధినిక శాస్త్రములిమిడియున్నవి. అవి అన్నియు తెలిసియుండి సృష్టిచేసినవాడగుటచేత బ్రహ్మ సర్వజ్ఞుడని చెప్పబడుచున్నాడు-“యస్సర్వజ్ఞః సర్వవిదౌ”).
(సత్వరజస్తమములను త్రిగుణములచేత ప్రపంచమంతయు మోహము చెందుచున్నది - అందుచేత జీవులు పరబ్రహ్మను తెలియలేకుండనున్నారు - బ్రహ్మజ్ఞానము లేనివారైరి –
“క. గర్భమున పరిజ్ఞానము
నిర్భరమైయుండు జీవునికి, దుదిన తడా
విర్భూతుడైన జెడునం
తర్భావంబైన భోధమంతయు, ననఘా ”
(తల్లి గర్భములో నున్నంతకాలము శిశువు జ్ఞానము కలవాడై యుండును; పుట్టినతోడనే యది మాయమైనట్లగును – )
“వ. అట్లుగావున జనుండు బాల కైశోర కౌమార వయోవిశేషంబులైననుం, బెద్దయైన వెనుకనైనను నిన్నెఱింగనేని కృతకృత్యుండగు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 110, 111)
“ఉ. అచ్చపు చీకటింబడి గృహద్రతులై విషయ ప్రవిష్టులై
చచ్చుచు బుట్టుచున్ మరల జర్పిత చర్వణులైన వారికం
జెచ్చక పుట్టునే బదులు సెప్పిననైన నిజేచ్చనైన, నే
మిచ్చిననైన గానలకు నేగిననైన హరిప్రభోధముల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 181)
“చ. జగదధినాధుడైన హరి సంతత లీలల నామరూపముల్
దగిలి మనో వచోగతుల దార్కిక చాతురియెంత గల్గినన్
మిగిలి కుతర్కవాది దగమేరలు సేసి యెఱుంగనేర్చునే
యగణిత నర్తన క్రమము నజ్ఞుడెఱింగి నుతింప నోపునే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 33)
“తర్కా ప్రతిష్టానాత్”.
(బ్రహ్మజ్ఞానము విషయములో తర్కము పనిచేయదు. తెలిసిన విషయము గుఱించి, ప్రకృతికి సంబంధించిన విషయము గుఱించి ప్రకృతికి సంబంధించిన విషయము గుఱించి, తర్కము చేయవచ్చును - కాని బ్రహ్మము ప్రకృతికి అతీతుడు - అవాఙ్మానస గోచరుడు - అందుచేత బ్రహ్మ తర్కమునకతీతుడు - తర్కము వలన తెలియబడువాడుకాడు).
“సీ. పరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు దిరముగా నెవ్వరు తెలియగలరు
దేవాది దేవుండు త్రిపుర సమ్హరుడొండె| గమలసంబహవుడొండె; గార్తికేయ
కపిల నారదులొండె, గంగాత్మజుండొండె, మనువొండె, బలి యొండె జనకుడుండె
బ్రహ్లాదుడుండె నేర్పాటుగా శుకుడుండె భాసురతరమతి వ్యాసుడొండె
తే. గాక, యనులతరమె ఈ లోకమందు
నీ సుబోధంబు సద్భోధమీ పదార్థ
మీ సదానంద చిన్మయమీ యగమ్య
మీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు.
క. ఈ పన్నిద్దఱు దక్కగ
నోపరు తక్కొరులు దెలియ నుపనిషదుచిత
శ్రీపతినామ మహాద్భుత
దీపిత భాగవత దివ్య క్రమమున్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 3 - 178, 179)
“భక్తిలేక భవదీయ జ్ఞానంబు లేదు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 366)
(పరబ్రహ్మ లోకములను సృజించెను - అట్లు సృజించి వాటిలోనే తాను ప్రవేశించెను - అట్లు ప్రవేశించి సచ్చత్యచ్చ (ఆత్మ, అనాత్మ వస్తువులు తానే ఆయెను).
దీనిని బట్టి సృష్టిలోని వస్తువులన్నియు పరబ్రహ్మమే, పరబ్రహ్మ రూపములే, అందుచేత అవన్నియు కలిసియున్న ప్రపంచమంతయు బ్రహ్మమే - ఇట్లు తెలుసుకొనుట బ్రహ్మజ్ఞానము)
ప్రపంచములోని వస్తువులన్నియు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. బ్రహ్మలోనుండి పుట్టి బ్రహ్మవలన పెరిగి, బ్రహ్మలో లయమగుటవలన ఉన్నదంతా బ్రహ్మమే, మఱియొక వస్తువు లేదు - అందుచేత బ్రహ్మ అద్వయుడు అని తెలుసుకొనుటయే బ్రహ్మజ్ఞానము -.
ఈ జగత్తులోని వస్తువులన్నింటిని పరిశీలించి, ఒక్కొక్కదానిని ‘ఇదికాదు’, ‘ఇదికాదు’ (నేతి, నేతి) - ఇది బ్రహ్మకాదు అని త్రోసిపుచ్చగ మిగిలిన ఒకే వస్తువు బ్రహ్మయని తెలుసుకొనుట బ్రహ్మజ్ఞానము -.
“దేనిని తెలుసుకొనిన జగత్తులోని వస్తువులన్నియు తెలియనగునో - మట్టితో చేసిన వస్తువు ఒకదానిని తెలుసుకొనిన మట్టితో చేసిన సమస్త వస్తువులు తెలిసినట్లే - అదియే బ్రహ్మ - జగత్తులోని వస్తువులన్నింటిలోనున్న తత్వమొకటే - కనుక ఒకదానిని తెలుసుకొనిన మిగిలినవన్నియు తెలియనగును - ఆ ఓకే తత్వము బ్రహ్మతత్వము అని తెలుసుకొనుట బ్రహ్మజ్ఞానము.
“జ్ఞానం తే(అ)హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్య శేషతః |
యత్ జ్ఞాత్వా నేహ భూయో(అ)న్యత్ జ్ఞాతస్య మవిశిష్యంతే || (శ్రీమద్భగవద్గీత - 7 - 2)
“సర్వం కర్మాఖిలం, పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||
తద్విద్ధి ప్రణివాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వ దర్శినః ||:” (శ్రీమద్భగవద్గీత - 4 - 33)
“శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” (గీత - 4 - 39)
(నిశ్శ్రేయస్సు ఫలముగా గల బ్రహ్మజ్ఞానము ఇతరానుష్టానము నపేక్షించక పరబ్రహ్మ దయవలననే కలుగును). (చూడుము - ‘బ్రహ్మ’, ‘ఆత్మ’; ‘భగవంతుడు’).
(brahmanu guṟiṃci kaliginajñānamu - anagā brahma anagā evaru? eṭuvaṃṭivāḍu? ēmi cēyucuṃḍunu? anu modalagu viṣayamula guṟiṃci kalugu jñānamu -).
(dēnini guṟiṃci jñānamu kaligina aṃtakaṃṭe utkṛṣṭamaina jñānamu maṟilēdō adiyē parabrahma - brahmajñānamu utkṛṣṭamaina jñānamu - dānini miṃci utkṛṣṭamaina jñānamu mari lēdu - sarvamu brahmamē kanuka brahmajñānamanagā sarvajñatvamu. ī sṛṣṭi parabrahma cēsenu. aṭlu cēyuṭalō anēka ādhinika śāstramulimiḍiyunnavi. avi anniyu telisiyuṃḍi sṛṣṭicēsinavāḍaguṭacēta brahma sarvajñuḍani ceppabaḍucunnāḍu-“yassarvajñaḥ sarvavidau”).
(satvarajastamamulanu triguṇamulacēta prapaṃcamaṃtayu mōhamu ceṃducunnadi - aṃducēta jīvulu parabrahmanu teliyalēkuṃḍanunnāru - brahmajñānamu lēnivārairi –
“ka. garbhamuna parijñānamu
nirbharamaiyuṃḍu jīvuniki, dudina taḍā
virbhūtuḍaina jeḍunaṃ
tarbhāvaṃbaina bhōdhamaṃtayu, nanaghā ”
(talli garbhamulō nunnaṃtakālamu śiśuvu jñānamu kalavāḍai yuṃḍunu; puṭṭinatōḍanē yadi māyamainaṭlagunu – )
“va. aṭlugāvuna januṃḍu bāla kaiśōra kaumāra vayōviśēṣaṃbulainanuṃ, beddayaina venukanainanu ninneṟiṃganēni kṛtakṛtyuṃḍagu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 110, 111)
“u. accapu cīkaṭiṃbaḍi gṛhadratulai viṣaya praviṣṭulai
caccucu buṭṭucun marala jarpita carvaṇulaina vārikaṃ
jeccaka puṭṭunē badulu seppinanaina nijēccanaina, nē
miccinanaina gānalaku nēginanaina hariprabhōdhamul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 181)
“ca. jagadadhinādhuḍaina hari saṃtata līlala nāmarūpamul
dagili manō vacōgatula dārkika cāturiyeṃta galginan
migili kutarkavādi dagamēralu sēsi yeṟuṃganērcunē
yagaṇita nartana kramamu najñuḍeṟiṃgi nutiṃpa nōpunē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 33)
“tarkā pratiṣṭānāt”.
(brahmajñānamu viṣayamulō tarkamu panicēyadu. telisina viṣayamu guṟiṃci, prakṛtiki saṃbaṃdhiṃcina viṣayamu guṟiṃci prakṛtiki saṃbaṃdhiṃcina viṣayamu guṟiṃci, tarkamu cēyavaccunu - kāni brahmamu prakṛtiki atītuḍu - avāṅmānasa gōcaruḍu - aṃducēta brahma tarkamunakatītuḍu - tarkamu valana teliyabaḍuvāḍukāḍu).
“sī. paramahādbhutamaina vaiṣṇava jñānaṃbu diramugā nevvaru teliyagalaru
dēvādi dēvuṃḍu tripura samharuḍoṃḍe| gamalasaṃbahavuḍoṃḍe; gārtikēya
kapila nāraduloṃḍe, gaṃgātmajuṃḍoṃḍe, manuvoṃḍe, bali yoṃḍe janakuḍuṃḍe
brahlāduḍuṃḍe nērpāṭugā śukuḍuṃḍe bhāsurataramati vyāsuḍoṃḍe
tē. gāka, yanulatarame ī lōkamaṃdu
nī subōdhaṃbu sadbhōdhamī padārtha
mī sadānaṃda cinmayamī yagamya
mī viśuddhaṃbu guhyaṃbu nī śubhaṃbu.
ka. ī panniddaṟu dakkaga
nōparu takkorulu deliya nupaniṣaducita
śrīpatināma mahādbhuta
dīpita bhāgavata divya kramamun. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 3 - 178, 179)
“bhaktilēka bhavadīya jñānaṃbu lēdu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 366)
(parabrahma lōkamulanu sṛjiṃcenu - aṭlu sṛjiṃci vāṭilōnē tānu pravēśiṃcenu - aṭlu pravēśiṃci saccatyacca (ātma, anātma vastuvulu tānē āyenu).
dīnini baṭṭi sṛṣṭilōni vastuvulanniyu parabrahmamē, parabrahma rūpamulē, aṃducēta avanniyu kalisiyunna prapaṃcamaṃtayu brahmamē - iṭlu telusukonuṭa brahmajñānamu)
prapaṃcamulōni vastuvulanniyu okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. brahmalōnuṃḍi puṭṭi brahmavalana perigi, brahmalō layamaguṭavalana unnadaṃtā brahmamē, maṟiyoka vastuvu lēdu - aṃducēta brahma advayuḍu ani telusukonuṭayē brahmajñānamu -.
ī jagattulōni vastuvulanniṃṭini pariśīliṃci, okkokkadānini ‘idikādu’, ‘idikādu’ (nēti, nēti) - idi brahmakādu ani trōsipuccaga migilina okē vastuvu brahmayani telusukonuṭa brahmajñānamu -.
“dēnini telusukonina jagattulōni vastuvulanniyu teliyanagunō - maṭṭitō cēsina vastuvu okadānini telusukonina maṭṭitō cēsina samasta vastuvulu telisinaṭlē - adiyē brahma - jagattulōni vastuvulanniṃṭilōnunna tatvamokaṭē - kanuka okadānini telusukonina migilinavanniyu teliyanagunu - ā ōkē tatvamu brahmatatvamu ani telusukonuṭa brahmajñānamu.
“jñānaṃ tē(a)haṃ savijñānamidaṃ vakṣyāmya śēṣataḥ |
yat jñātvā nēha bhūyō(a)nyat jñātasya maviśiṣyaṃtē || (śrīmadbhagavadgīta - 7 - 2)
“sarvaṃ karmākhilaṃ, pārtha jñānē parisamāpyatē ||
tadviddhi praṇivātēna paripraśnēna sēvayā |
upadēkṣyaṃti tē jñānaṃ jñāninaḥ tatva darśinaḥ ||:” (śrīmadbhagavadgīta - 4 - 33)
“śraddhāvān labhatē jñānaṃ” (gīta - 4 - 39)
(niśśrēyassu phalamugā gala brahmajñānamu itarānuṣṭānamu napēkṣiṃcaka parabrahma dayavalananē kalugunu). (cūḍumu - ‘brahma’, ‘ātma’; ‘bhagavaṃtuḍu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.