← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మకర్మసమాధి brahmakarmasamādhi

Original — తెలుగు
  1. బ్రహ్మైవకర్మబ్రహ్మకర్మ, బ్రహ్మకర్మణి సమాధిః యస్య సః బ్రహ్మకర్మ సమాధిః (శ్రీశంకరః).\

(బ్రహ్మమే కర్మ కనుక అది బ్రహ్మకర్మ యనబడుచున్నది; బ్రహ్మ కర్మయందు సమాధికలవాడు).

  1. సర్వకర్మ బ్రహ్మాత్మకతయా బ్రహ్మ మయం ఇతి యః సమాధత్తే స బ్రహ్మ కర్మ సమాధిః - బ్రహ్మాత్మకతయా బ్రహ్మ తాత్పర్యత్వేన తచ్చరీరతయాదా, తదాత్మకత్వాత్ తత్ఇతి వ్యపదేశార్హః ఇత్యర్థః -

(కర్మ అంతయు బ్రహ్మమే యగుటవలన బ్రహ్మ మయము అని ఎవడు సమాధానము కలిగియుండునో అతను బ్రహ్మ కర్మ సమాధి కలవాడు. బ్రహ్మాత్మకమనగా బ్రహ్మనుద్దేశించి చేసినది. అట్టి కర్మ బ్రహ్మరూపమే - “యజ్ఞో వైవిష్ణుః” (విష్ణువే యజ్ఞము - యజ్ఞమను కర్మ. కర్మ బ్రహ్మాత్మకము)

  1. “బ్రహ్మాత్మికే కర్మణి సమాధిః అనుసంధానం యస్య సతధోక్తః; బ్రహ్మ రూపం కర్మ సమాధిత్తే అను సంధత్తే”

(బ్రహ్మరూపమైన కర్మయందు అనుసంధానము చేయువాడు - సమాధి కలవాడు).

  1. “బ్రహ్మ భూతౌ అగ్నౌ బ్రహ్మణా కర్త్రా హుతం ఇతి సర్వం కర్మ బ్రహ్మాత్మకతయా బ్రహ్మమయమితి యస్సమాధత్తే సబ్రహ్మకర్మ సమాధిః”

(అగ్ని బ్రహ్మము, కర్మ చేయువాడు అనగా అగ్నిలో హోమము చేయువాడు బ్రహ్మ, అందుచేత కర్మ అంతయు బ్రహ్మమే యగుటవలన ఆ కర్మ అంతయు బ్రహ్మమయమని ఎవడు సమాధానమగునో వాడు బ్రహ్మకర్మ సమాధికలవాడు).

  1. యత్ ఖలుబ్రహ్మ స్వరూపేణ యజమానేన బ్రహ్మాగ్నౌ బ్రహ్మహవిర్హుతం బ్రహ్మణి బ్రహ్మ స్వభావ దేవతోద్దేశేన అర్పణం యస్య తదేవం భూతం యత్ బ్రహ్మకర్మ తదేవసమాధిఃఆత్మ స్వరూప లాభోదాయత్వాత్. (శ్రీ అభినవగుప్తాచార్య వ్యాఖ్యా)

(బ్రహ్మస్వరూపుడే యజ్ఞము చేయువాడు - యజమాని. అతను బ్రహ్మమే అయిన అగ్నియందు బ్రహ్మ స్వరూపమే అయిన హవిస్సును, బ్రహ్మస్వరూపమే అయిన దేవత నుద్దేశించి అర్పించుట - హుతము చేయుట - అను కర్మ అంతయు బ్రహ్మమే యని, అదియే సమాధిగా తలచువాడు - ఆత్మ స్వరూపమును పొందుటకుపాయముగా తలచువాడు).

  1. సమాధినా సహ బ్రహ్మైవ కర్మ - సమాధిరపి బ్రహ్మ - ఇత్యర్థః.

(చేయుకర్మ అంతయు సమాధితో కలిసి బ్రహ్మ కర్మ - అనగా సమాధి కూడ బ్రహ్మయేయని అర్థము).

  1. యజ్ఞము (కర్మ) చేయునపుడు దానికి సంబంధించిన వన్నియు బ్రహ్మమేయని సమాధానపఱచుకొనుట - అది యెట్లంటే –

“బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం |

బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 24)

“త్యాగాది క్రియాకర్మ హవిర్బ్రహ్మైవ వస్తుసత్ |

యత్ర ప్రక్షిప్యతే అగ్నౌ తత్సాపి బ్రహ్మైవ కేవలం |

త్యజ్యతే, క్షిప్యతేయేన సకర్తా బ్రహ్మ చిన్మయం |

త్యాగ ప్రక్షేప రూపాయా క్రియా బ్రహ్మైవ తద్ధృతం |

హుతేన తేన గంతవ్యం ఫలం బ్రహ్మస్వర్గాది తత్ |

కర్మణ్యనేన రూపేణ సమాధిః యస్య ధీమతః |

తేన బ్రహ్మవిదా బ్రహ్మ గంతవ్యం చిత్సుఖాద్వయం ||” (గీతాభావప్రకాశము - 4 - 167 to 170)

(యజ్ఞము చేయునపుడు చేయువాడు, చేయించువాడు, చేయు క్రియ యంతయు బ్రహ్మమే, అన్నియు బ్రహ్మ రూపములే - త్యాగక్రియ బ్రహ్మ, ప్రక్షేపక్రియ బ్రహ్మము; అగ్ని బ్రహ్మ, యజ్ఞము చేయు యజమాని బ్రహ్మ, యజ్ఞము చేయించు అధ్వర్యుకు బ్రహ్మ యజ్ఞఫలమయిన, స్వర్గాదులు బ్రహ్మమే. ఈ ప్రకారముగా భావన చేసిన యజ్ఞము అను కర్మ ఒక సమాధియే - అందుచేత అది అంతయు బ్రహ్మకర్మ సమాధి. ఇది చేయుటవలన బ్రహ్మ వేత్త - (బ్రహ్మ తత్వమును తెలిసినవాడు) చిద్రూపము, ఆనందరూపము అద్వయము అయిన బ్రహ్మను పొందును).

Transliteration
  1. brahmaivakarmabrahmakarma, brahmakarmaṇi samādhiḥ yasya saḥ brahmakarma samādhiḥ (śrīśaṃkaraḥ).\

(brahmamē karma kanuka adi brahmakarma yanabaḍucunnadi; brahma karmayaṃdu samādhikalavāḍu).

  1. sarvakarma brahmātmakatayā brahma mayaṃ iti yaḥ samādhattē sa brahma karma samādhiḥ - brahmātmakatayā brahma tātparyatvēna taccarīratayādā, tadātmakatvāt tatiti vyapadēśārhaḥ ityarthaḥ -

(karma aṃtayu brahmamē yaguṭavalana brahma mayamu ani evaḍu samādhānamu kaligiyuṃḍunō atanu brahma karma samādhi kalavāḍu. brahmātmakamanagā brahmanuddēśiṃci cēsinadi. aṭṭi karma brahmarūpamē - “yajñō vaiviṣṇuḥ” (viṣṇuvē yajñamu - yajñamanu karma. karma brahmātmakamu)

  1. “brahmātmikē karmaṇi samādhiḥ anusaṃdhānaṃ yasya satadhōktaḥ; brahma rūpaṃ karma samādhittē anu saṃdhattē”

(brahmarūpamaina karmayaṃdu anusaṃdhānamu cēyuvāḍu - samādhi kalavāḍu).

  1. “brahma bhūtau agnau brahmaṇā kartrā hutaṃ iti sarvaṃ karma brahmātmakatayā brahmamayamiti yassamādhattē sabrahmakarma samādhiḥ”

(agni brahmamu, karma cēyuvāḍu anagā agnilō hōmamu cēyuvāḍu brahma, aṃducēta karma aṃtayu brahmamē yaguṭavalana ā karma aṃtayu brahmamayamani evaḍu samādhānamagunō vāḍu brahmakarma samādhikalavāḍu).

  1. yat khalubrahma svarūpēṇa yajamānēna brahmāgnau brahmahavirhutaṃ brahmaṇi brahma svabhāva dēvatōddēśēna arpaṇaṃ yasya tadēvaṃ bhūtaṃ yat brahmakarma tadēvasamādhiḥātma svarūpa lābhōdāyatvāt. (śrī abhinavaguptācārya vyākhyā)

(brahmasvarūpuḍē yajñamu cēyuvāḍu - yajamāni. atanu brahmamē ayina agniyaṃdu brahma svarūpamē ayina havissunu, brahmasvarūpamē ayina dēvata nuddēśiṃci arpiṃcuṭa - hutamu cēyuṭa - anu karma aṃtayu brahmamē yani, adiyē samādhigā talacuvāḍu - ātma svarūpamunu poṃduṭakupāyamugā talacuvāḍu).

  1. samādhinā saha brahmaiva karma - samādhirapi brahma - ityarthaḥ.

(cēyukarma aṃtayu samādhitō kalisi brahma karma - anagā samādhi kūḍa brahmayēyani arthamu).

  1. yajñamu (karma) cēyunapuḍu dāniki saṃbaṃdhiṃcina vanniyu brahmamēyani samādhānapaṟacukonuṭa - adi yeṭlaṃṭē –

“brahmārpaṇaṃ brahma havirbrahmāgnau brahmaṇāhutaṃ |

brahmaivatēna gaṃtavyaṃ brahma karma samādhinā ||“. (śrīmadbhagavadgīta - 4 - 24)

“tyāgādi kriyākarma havirbrahmaiva vastusat |

yatra prakṣipyatē agnau tatsāpi brahmaiva kēvalaṃ |

tyajyatē, kṣipyatēyēna sakartā brahma cinmayaṃ |

tyāga prakṣēpa rūpāyā kriyā brahmaiva taddhṛtaṃ |

hutēna tēna gaṃtavyaṃ phalaṃ brahmasvargādi tat |

karmaṇyanēna rūpēṇa samādhiḥ yasya dhīmataḥ |

tēna brahmavidā brahma gaṃtavyaṃ citsukhādvayaṃ ||” (gītābhāvaprakāśamu - 4 - 167 to 170)

(yajñamu cēyunapuḍu cēyuvāḍu, cēyiṃcuvāḍu, cēyu kriya yaṃtayu brahmamē, anniyu brahma rūpamulē - tyāgakriya brahma, prakṣēpakriya brahmamu; agni brahma, yajñamu cēyu yajamāni brahma, yajñamu cēyiṃcu adhvaryuku brahma yajñaphalamayina, svargādulu brahmamē. ī prakāramugā bhāvana cēsina yajñamu anu karma oka samādhiyē - aṃducēta adi aṃtayu brahmakarma samādhi. idi cēyuṭavalana brahma vētta - (brahma tatvamunu telisinavāḍu) cidrūpamu, ānaṃdarūpamu advayamu ayina brahmanu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.