← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మలింగం brahmaliṃgaṃ

Original — తెలుగు
  1. బ్రహ్మణా వేదేన లింగ్యతే ద్యోతతే ఇతి బ్రహ్మలింగం -

(బ్రహ్మ అనగా వేదము - వేదముద్వారా తెలియబడునది).

  1. బ్రహ్మమును తెలుపునది - ప్రపంచ కర్తృత్వము మొదలగునవి.

  2. నాహం స్త్రీ నపుమాంశ్చాహం నక్లీబం సర్గ సంక్షయే |

సర్గేసతి విభేదస్యాత్ కల్పితోయం ధియా పునః ||“. (దేవీభాగవతం)

“అహం మాయావిశిష్ట బ్రహ్మరూపిణీ ఏవ, న పురుష రూపా, న క్లీబరూపా, నవా స్త్రీరూపా, సర్వం సంక్షయే ప్రలయే ఇదం కిమపినాస్తి. అహం పురుషోవా, స్త్రీవా, ఇతి. పునః సర్గేసతి జీవానుగ్రహార్థం అయంభేదో మయాధియా స్వవృత్యాత్మకయా కల్పితః”. (నేను స్త్రీనికాను, పురుషుడనుకాను నపుంసకుడనుకాను, సృష్టిసమయమున, ప్రళయ సమయమందు ఈ లింగభేదములేదు - మాయతోకూడిన పరబ్రహ్మమును నేను జీవుల ననుగ్రహించుటకు నేను ప్రురుషుడనని, స్త్రీని అని భేదము నా శక్తిరూపమైన బుద్ధివలన కల్పింపబడినది).

  1. ఉభయలింగం సర్వత్రహి - యతః సర్వత్ర శ్రుతి స్మృతిషు పరబ్రహ్మ ఉభయలింగం ఉభయ లక్షణ మభిధీయతే - నిరస్త నిఖిల దోషత్వ కల్యాణగుణాకరత్వ లక్షణోపేత మిత్యర్థః - అపహతపాప్మా, విజరో, విమృత్యుర్విశోకో విజిఘత్సో(అ)పిపాసస్సత్య(అ)సౌస్వ శక్తిలేశాద్ధత భూతసర్గః “తేజో బలైశ్వర్య మహావబోధ సువీర్య శక్త్యాది గుణైకరాశిః పరః పరాణాం సకలా న యత్ర క్లేశాదయ స్సంతి పరావరే శే” సమస్త హేయ రహితః వైష్ణవాఖ్యం పరమం పదం. “ఇత్యాది శ్రుతి స్మృతి భ్యః ఉభయ లక్షణం హి బ్రహ్మావగతం”

(శ్రీరామానుజః)

(బ్రహ్మము అన్ని శ్రుతులలోను స్మృతులలోను పురుషుడని, స్త్రీయని రెండు విధముల చెప్పబడీనది - పురుషలక్షణములు, స్త్రీ లక్షణములు కలవని చెప్పబడినది. ఏ విధమైన దోషములు లేక కల్యాణగుణములకు నిధి అయినది అని చెప్పబడుచున్నది. - పాపములు లేనిది, ముసలితనములేనిది, మరణములేనిది, శోకములేనిది, పిపాసలేనిది, సత్యకాముడు, సత్య సంకల్పుడు అని చెప్పబడినది. ఇంకను ” తేజస్సు, బలము, ఐశ్వర్యము, జ్ఞానము, వీర్యము మొదలగు (భగవంతుని) శక్తులను గుణములరాశి (గుణసముదాయము) అయినవాడు, ఉత్కృష్టమైనవాటిలో (వాటికంటె) ఉత్కృష్టమైనవాడు ఏ విధమైన క్లేశములు లేనివాడు, పరాపరేశుడు (పరశక్తికి, అపరశక్తికి ఈశ్వరుడైనవాడు), హేయ గుణములు లేనివాడు, విష్ణువునకు సంబంధించినదైన పరమపదము - గమ్యస్థానము, మోక్షరూపము - అయినవాడు” అని యీ ప్రకారముగా పురుషుడు, స్త్రీయను రెండు లక్షణములు కలవాడు పరబ్రహ్మ యని శ్రుతులలోను స్మృతులలోను చెప్పబడుచున్నాడు).

  1. “తే. స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగాక

తిర్యగమర నరాది మూర్తియునుగాక

- - - వెనుక నన్నియు, తానగు విభు తలంతు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 85)

Transliteration
  1. brahmaṇā vēdēna liṃgyatē dyōtatē iti brahmaliṃgaṃ -

(brahma anagā vēdamu - vēdamudvārā teliyabaḍunadi).

  1. brahmamunu telupunadi - prapaṃca kartṛtvamu modalagunavi.

  2. nāhaṃ strī napumāṃścāhaṃ naklībaṃ sarga saṃkṣayē |

sargēsati vibhēdasyāt kalpitōyaṃ dhiyā punaḥ ||“. (dēvībhāgavataṃ)

“ahaṃ māyāviśiṣṭa brahmarūpiṇī ēva, na puruṣa rūpā, na klībarūpā, navā strīrūpā, sarvaṃ saṃkṣayē pralayē idaṃ kimapināsti. ahaṃ puruṣōvā, strīvā, iti. punaḥ sargēsati jīvānugrahārthaṃ ayaṃbhēdō mayādhiyā svavṛtyātmakayā kalpitaḥ”. (nēnu strīnikānu, puruṣuḍanukānu napuṃsakuḍanukānu, sṛṣṭisamayamuna, praḷaya samayamaṃdu ī liṃgabhēdamulēdu - māyatōkūḍina parabrahmamunu nēnu jīvula nanugrahiṃcuṭaku nēnu pruruṣuḍanani, strīni ani bhēdamu nā śaktirūpamaina buddhivalana kalpiṃpabaḍinadi).

  1. ubhayaliṃgaṃ sarvatrahi - yataḥ sarvatra śruti smṛtiṣu parabrahma ubhayaliṃgaṃ ubhaya lakṣaṇa mabhidhīyatē - nirasta nikhila dōṣatva kalyāṇaguṇākaratva lakṣaṇōpēta mityarthaḥ - apahatapāpmā, vijarō, vimṛtyurviśōkō vijighatsō(a)pipāsassatya(a)sausva śaktilēśāddhata bhūtasargaḥ “tējō balaiśvarya mahāvabōdha suvīrya śaktyādi guṇaikarāśiḥ paraḥ parāṇāṃ sakalā na yatra klēśādaya ssaṃti parāvarē śē” samasta hēya rahitaḥ vaiṣṇavākhyaṃ paramaṃ padaṃ. “ityādi śruti smṛti bhyaḥ ubhaya lakṣaṇaṃ hi brahmāvagataṃ”

(śrīrāmānujaḥ)

(brahmamu anni śrutulalōnu smṛtulalōnu puruṣuḍani, strīyani reṃḍu vidhamula ceppabaḍīnadi - puruṣalakṣaṇamulu, strī lakṣaṇamulu kalavani ceppabaḍinadi. ē vidhamaina dōṣamulu lēka kalyāṇaguṇamulaku nidhi ayinadi ani ceppabaḍucunnadi. - pāpamulu lēnidi, musalitanamulēnidi, maraṇamulēnidi, śōkamulēnidi, pipāsalēnidi, satyakāmuḍu, satya saṃkalpuḍu ani ceppabaḍinadi. iṃkanu ” tējassu, balamu, aiśvaryamu, jñānamu, vīryamu modalagu (bhagavaṃtuni) śaktulanu guṇamularāśi (guṇasamudāyamu) ayinavāḍu, utkṛṣṭamainavāṭilō (vāṭikaṃṭe) utkṛṣṭamainavāḍu ē vidhamaina klēśamulu lēnivāḍu, parāparēśuḍu (paraśaktiki, aparaśaktiki īśvaruḍainavāḍu), hēya guṇamulu lēnivāḍu, viṣṇuvunaku saṃbaṃdhiṃcinadaina paramapadamu - gamyasthānamu, mōkṣarūpamu - ayinavāḍu” ani yī prakāramugā puruṣuḍu, strīyanu reṃḍu lakṣaṇamulu kalavāḍu parabrahma yani śrutulalōnu smṛtulalōnu ceppabaḍucunnāḍu).

  1. “tē. strī napuṃsaka puruṣa mūrtiyunugāka

tiryagamara narādi mūrtiyunugāka

- - - venuka nanniyu, tānagu vibhu talaṃtu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 85)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.