“సీ. ఇలమీద మనువులీరేడ్గురు జనువేళ దివసమై యెచ్చోట దిరుగుచుండు
మహనీయ సిద్ధ విమాన సంఘములేందు దినకరప్రభములై తేజరిల్లు
శోకజరామృత్యు శోషణ భయ దుఃఖి నివహంబులెందు జనింపకుండు
విష్ణుపదధ్యాన విజ్ఞాన రహితుల శోకంబులెందుండి చూడవచ్చు
ఆ. బరమసిద్ధయోగి భాషణామృత మెందు
శ్రవణపర్వమగుచు బరగుచుండు
నట్టి బ్రహ్మలోకమందు వసించును
రాజవర్య, మఱలరాడు వాడు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 31)
“sī. ilamīda manuvulīrēḍguru januvēḷa divasamai yeccōṭa dirugucuṃḍu
mahanīya siddha vimāna saṃghamulēṃdu dinakaraprabhamulai tējarillu
śōkajarāmṛtyu śōṣaṇa bhaya duḥkhi nivahaṃbuleṃdu janiṃpakuṃḍu
viṣṇupadadhyāna vijñāna rahitula śōkaṃbuleṃduṃḍi cūḍavaccu
ā. baramasiddhayōgi bhāṣaṇāmṛta meṃdu
śravaṇaparvamagucu baragucuṃḍu
naṭṭi brahmalōkamaṃdu vasiṃcunu
rājavarya, maṟalarāḍu vāḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 31)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.