← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మనాడి brahmanāḍi

Original — తెలుగు
  1. “దేహమధ్యే బ్రహ్మనాడీ సుషుమ్నా సూర్యరూపిణీ పూర్ణచంద్రాభా వర్తతే. సాతు మూలాధారారభ్య బ్రహ్మరంధ్రగామినీ భవతి. తవ్మధ్యే తటిత్కోటి సమాకాంత్యా మృణాలసూత్రవత్ సూక్ష్మాంగీ కుండలినీతి ప్రసిద్ధా అస్తి త్వాందృష్ట్వా మనసైవ నరః సర్వపాప వినాశద్వారా ముక్తోభవతి”. (అద్వయ తారకోపనిషత్)

(సూర్యునివంటి రూపముగలది, పూర్ణచంద్రునివలె ప్రకాశించునది సుషుమ్నా యను బ్రహ్మనాడి దేహమధ్యమందున్నది. అది మూలాధారపద్మము (చక్రము) మొదలుకొని(శిరస్సులోని) బ్రహ్మరంధ్రమువఱకు వ్యాపించియున్నది. ఆ సుషుమ్నానాడి మధ్యమందు కోటిమెరుపులతో సమానమైన కాంతిగల, తామరతూడులోని దారమంత సూక్ష్మమైన పరిమాణముఘలది అయిన కుండలినీ (శక్తి) అను ప్రసిద్ధిగాంచినది ఉన్నది - దానిని మనసులో చూచినవాడు సమస్తమైన పాపములను పోగొట్టుకొనిముక్తిని పొందును) - (చూడుము - “బ్రహ్మదండి”).

  1. “శతం బైకాచ హృదయస్య నాడ్యస్తాసాం మూర్థాన మభిని శ్రుతైకా తయోర్థ్వం మాయ నమృతత్వమేతి విష్వగ్జన్యా ఉత్క్రమణే భనంతి”.

(హృదయమున నూఱున్నొక్క నాడులు గలవు. అందొక్కటి బ్రహ్మనాడి మాత్రమే శిరస్సును జేరును - ఆ నాడి నాశ్రయించి నిర్గమించినవాడు పునారావృత్తి రహితమగు బ్రహ్మలోకము చెందును. తక్కిన నాడులద్వారా దేహమును విడిచినాడు కర్మానుగుణమగు జన్మముల నెత్తును).

  1. బ్రహ్మలోక ప్రాప్తి ద్వారంబగుట సుషుమ్న, బ్రహ్మనాడి యనంబరగు (శ్రీనాధుడు - కాశీఖండము)

  2. “కందమధ్యే స్థితానాశీ సుషుమ్నా సుప్రతిష్టితా |

పద్మసూత్ర ప్రతీకాశా ఋజురూర్ద్వ ప్రవృత్తినీ |

బ్రహ్మణో వివరం యావవ్విద్యుదాభాస నాలకం |

వైష్ణవీ బ్రహ్మనాడీ చ నిర్వాణ ప్రాప్తి పద్దతిః ||“.

(శరీరములోని మూలకందమందు తామరతూడులోని దారమువలె సూక్ష్మముగానుండు సుషుమ్నయను పేరుగల సూక్ష్మనాడి యున్నది. మూలకందమునుండి ఊర్థ్వముగా (మీదికి) పోవినది. ఇది శిరస్సులోని బ్రహ్మరంధ్రమువరకు వ్యాపించియుండును - మెరుపుతీగవలె ప్రకాశించునది. ఇదియే బ్రహ్మనాడి, వైష్ణవీనాడి, ముక్తినిపొందించునది).

Transliteration
  1. “dēhamadhyē brahmanāḍī suṣumnā sūryarūpiṇī pūrṇacaṃdrābhā vartatē. sātu mūlādhārārabhya brahmaraṃdhragāminī bhavati. tavmadhyē taṭitkōṭi samākāṃtyā mṛṇālasūtravat sūkṣmāṃgī kuṃḍalinīti prasiddhā asti tvāṃdṛṣṭvā manasaiva naraḥ sarvapāpa vināśadvārā muktōbhavati”. (advaya tārakōpaniṣat)

(sūryunivaṃṭi rūpamugaladi, pūrṇacaṃdrunivale prakāśiṃcunadi suṣumnā yanu brahmanāḍi dēhamadhyamaṃdunnadi. adi mūlādhārapadmamu (cakramu) modalukoni(śirassulōni) brahmaraṃdhramuvaṟaku vyāpiṃciyunnadi. ā suṣumnānāḍi madhyamaṃdu kōṭimerupulatō samānamaina kāṃtigala, tāmaratūḍulōni dāramaṃta sūkṣmamaina parimāṇamughaladi ayina kuṃḍalinī (śakti) anu prasiddhigāṃcinadi unnadi - dānini manasulō cūcinavāḍu samastamaina pāpamulanu pōgoṭṭukonimuktini poṃdunu) - (cūḍumu - “brahmadaṃḍi”).

  1. “śataṃ baikāca hṛdayasya nāḍyastāsāṃ mūrthāna mabhini śrutaikā tayōrthvaṃ māya namṛtatvamēti viṣvagjanyā utkramaṇē bhanaṃti”.

(hṛdayamuna nūṟunnokka nāḍulu galavu. aṃdokkaṭi brahmanāḍi mātramē śirassunu jērunu - ā nāḍi nāśrayiṃci nirgamiṃcinavāḍu punārāvṛtti rahitamagu brahmalōkamu ceṃdunu. takkina nāḍuladvārā dēhamunu viḍicināḍu karmānuguṇamagu janmamula nettunu).

  1. brahmalōka prāpti dvāraṃbaguṭa suṣumna, brahmanāḍi yanaṃbaragu (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)

  2. “kaṃdamadhyē sthitānāśī suṣumnā supratiṣṭitā |

padmasūtra pratīkāśā ṛjurūrdva pravṛttinī |

brahmaṇō vivaraṃ yāvavvidyudābhāsa nālakaṃ |

vaiṣṇavī brahmanāḍī ca nirvāṇa prāpti paddatiḥ ||“.

(śarīramulōni mūlakaṃdamaṃdu tāmaratūḍulōni dāramuvale sūkṣmamugānuṃḍu suṣumnayanu pērugala sūkṣmanāḍi yunnadi. mūlakaṃdamunuṃḍi ūrthvamugā (mīdiki) pōvinadi. idi śirassulōni brahmaraṃdhramuvaraku vyāpiṃciyuṃḍunu - meruputīgavale prakāśiṃcunadi. idiyē brahmanāḍi, vaiṣṇavīnāḍi, muktinipoṃdiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.