← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మణిస్థితః brahmaṇisthitaḥ

Original — తెలుగు
  1. “అకర్మకృత్, సర్వకర్మ సన్యాసీత్యర్థయః” (శ్రీశంకరః)

(కర్మ చేయనివాడు - బ్రహ్మధ్యానమందే యుండువాడు, అనగా, కర్మ చేయనివాడు - సమస్త కర్మలను సన్యసించిన వాడు).

  1. “ఉపదేశేన బ్రహ్మ విత్ సన్ బ్రహ్మణి అభ్యానయుక్తః తత్వవిదాం ఉపదేశేన ఆత్మ,యాధాత్మ్యవిద్ భూత్వా తత్రైవ యత మానో దేహాత్మాభిమానం పరిత్యజ్య స్థిరరూపా త్మావలోకన ప్రియానుభవే వ్యవస్థితః అస్థిరే ప్రాకృతే ప్రియాప్రియే ప్రాప్యహర్షోద్వేదౌ న కుర్యాత్ ఇతి ఉక్తః భవతి” (శ్రీమాన్ రామానుజః)

(ఉపదేశము పొందుటవలన బ్రహ్మజ్ఞానముగలవాడు బ్రహ్మ గుఱించి అభ్యాసము చేయువాడు - బ్రహ్మ తత్వమును తెలిసినవారు చేసిన ఉపదేశమువలన ఆత్మయొక్క యధార్థ్య రూపమును తెలుసుకొనినవాడై, ప్రయత్నము చేసి, దేహమే యాత్మ అను అభిమానము వదలి ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు స్థిరమైన అనుభవము నందుండువాడు - శాశ్వతము కానివి, ప్రకృతికి సంబంధించినవి అయిన ప్రియాప్రియములందు (సుఖ దుఃఖములందు) సంతోషమును, దుఃఖమును పొందనివాడు).

Transliteration
  1. “akarmakṛt, sarvakarma sanyāsītyarthayaḥ” (śrīśaṃkaraḥ)

(karma cēyanivāḍu - brahmadhyānamaṃdē yuṃḍuvāḍu, anagā, karma cēyanivāḍu - samasta karmalanu sanyasiṃcina vāḍu).

  1. “upadēśēna brahma vit san brahmaṇi abhyānayuktaḥ tatvavidāṃ upadēśēna ātma,yādhātmyavid bhūtvā tatraiva yata mānō dēhātmābhimānaṃ parityajya sthirarūpā tmāvalōkana priyānubhavē vyavasthitaḥ asthirē prākṛtē priyāpriyē prāpyaharṣōdvēdau na kuryāt iti uktaḥ bhavati” (śrīmān rāmānujaḥ)

(upadēśamu poṃduṭavalana brahmajñānamugalavāḍu brahma guṟiṃci abhyāsamu cēyuvāḍu - brahma tatvamunu telisinavāru cēsina upadēśamuvalana ātmayokka yadhārthya rūpamunu telusukoninavāḍai, prayatnamu cēsi, dēhamē yātma anu abhimānamu vadali ātma sākṣātkāramunu poṃduṭaku sthiramaina anubhavamu naṃduṃḍuvāḍu - śāśvatamu kānivi, prakṛtiki saṃbaṃdhiṃcinavi ayina priyāpriyamulaṃdu (sukha duḥkhamulaṃdu) saṃtōṣamunu, duḥkhamunu poṃdanivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.