(బ్రహ్మకు నాలుగు పాదములు గలవు). (నాలుగు పాదములుగలది బ్రహ్మ).
-విశ్వః (వైశ్యానరః) ప్రథమః పాదః, తైజసః ద్వితీయః పాదః, ప్రాజ్ఞః తృతీయః పాదః; చతుర్ధః పాదః ఆత్మైవ - ఏష సర్వేశ్వరః.
బ్రహ్మకు నాల్గు పాదములు గలవు - ఈ ప్రపంచములోనున్న భూతములన్నియు బ్రహ్మకు ఒకపాదము. మిగిలిన మూడు పాదములు ద్యులోకములో నున్నవి. విశ్వుడు, (వైశ్యానరుడు), తైజసుడు రెండవపాదము, ప్రాజ్ఞుడు మూడవపాదము, ఆత్మయే (పరబ్రహ్మమే) నాలుగవపాదము -).- (చూడుము - ‘ఆత్మ’ -11 - 19).
“కిమనేన పరిచ్ఛిన్న దర్శనేన తవార్జున |
మద్దృష్టింకురు సర్వత్ర సర్వానర్థక్షయం కరం |
పాదో(అ)స్య విశ్వభూతానీత్యాది శృత్యాహమీశ్వరః |
ఏక ఏవ వివిర్ణీతః తం త్వం మాం విద్ధి సర్వదా ||“. (గీతాభావప్రకశము - 10 - 171 to 173)
(ఈ సృష్టిలోనున్న తన విభూతులన్నింటిలోను ముఖ్యమైనవి కొన్ని చెప్పి, ఇట్లు ఒక్కొక్కటి నేనే అని చెప్పుటవలన ఏమి ప్రయోజనము? ఇవన్నియు కలిసి ఏకరూపముగా నేనే యున్నాను. నా విభూతులన్నింటితోను కలిసి ఒకే రూపముగా - విశ్వముగా, ప్రపంచముగా, విశ్వరూపుడుగా నున్నది నేనే. ఈ విభూతులన్నియు నా విశ్వరూపములోని భాగములే - నా విశ్వరూపములోని భాగముగా కానిది ఏదియును లేదు. ఈ ప్రపంచములోనున్న సమస్త భూతములు నా నాలుగు పాదములలో నొకటి. మిగిలిన మూడు పాదములు ద్యులోకమున నున్నవి “అని శ్రుతి చెప్పుచున్నది. ఈ భూతములన్నియు, వాటితో కలిసి ఏకమైయున్న ప్రపంచరూపమంతయు నాలోనొక భాగము - మిగిలిన పాదములు ద్యులోకమున నున్నవి” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పెను -).
(సృష్టికి పూర్వము పరబ్రహ్మ ఒకడేయుండెను. తానే యీ సృష్టిలోని వస్తువులన్నింటిగా మారెను. ఒకే దీపముతో అనేక వత్తులను వెలిగించి అనేక దీపములుగా చేయునట్లు ఒకే పరబ్రహ్మ ప్రపంచములోని వస్తువులన్నింటిగా మారి, వాటిలో తాను ప్రవేశించి, తన చైతన్యశక్తితో వాటిని ప్రకాశింపచేయుచున్నాడు. అందుచేత ప్రపంచములోనున్న వస్తువులన్నింటిలో నున్నది పరబ్రహ్మ యొక్క ఒకే ఒక అంశ. అది ఎన్ని వస్తువులను సృష్టించి, వాటిలో ప్రవేశించియున్నను తరగనిది, అంతట, అన్నింటిలోను ఒకేసారి ఒకే అంశగా ప్రకాశించు చున్నది. అందుచేత సృష్టి అంతయు - దానిలోని వస్తువులన్నియు - ఒకే దానినుండి (ఒకే భగవంతుని నుండి) పుట్టినవి. రూపములు వేరైనను, వాటి నామములు వేరైనను, మనుష్యులు, పశువులు, పన్నగములు, కొండలు, ఏరులు, నక్షత్రములు మొదలగు వస్తువులన్నియు ఒకే వస్తువునుండి పుట్టినవే. ఆ వస్తువే పరబ్రహ్మ - అతని అంశయే వీటి అన్నింటిలోనున్నది) (చూడుము - ‘ఆత్మ’, ‘బ్రహ్మ’).
(brahmaku nālugu pādamulu galavu). (nālugu pādamulugaladi brahma).
-viśvaḥ (vaiśyānaraḥ) prathamaḥ pādaḥ, taijasaḥ dvitīyaḥ pādaḥ, prājñaḥ tṛtīyaḥ pādaḥ; caturdhaḥ pādaḥ ātmaiva - ēṣa sarvēśvaraḥ.
brahmaku nālgu pādamulu galavu - ī prapaṃcamulōnunna bhūtamulanniyu brahmaku okapādamu. migilina mūḍu pādamulu dyulōkamulō nunnavi. viśvuḍu, (vaiśyānaruḍu), taijasuḍu reṃḍavapādamu, prājñuḍu mūḍavapādamu, ātmayē (parabrahmamē) nālugavapādamu -).- (cūḍumu - ‘ātma’ -11 - 19).
“kimanēna paricchinna darśanēna tavārjuna |
maddṛṣṭiṃkuru sarvatra sarvānarthakṣayaṃ karaṃ |
pādō(a)sya viśvabhūtānītyādi śṛtyāhamīśvaraḥ |
ēka ēva vivirṇītaḥ taṃ tvaṃ māṃ viddhi sarvadā ||“. (gītābhāvaprakaśamu - 10 - 171 to 173)
(ī sṛṣṭilōnunna tana vibhūtulanniṃṭilōnu mukhyamainavi konni ceppi, iṭlu okkokkaṭi nēnē ani ceppuṭavalana ēmi prayōjanamu? ivanniyu kalisi ēkarūpamugā nēnē yunnānu. nā vibhūtulanniṃṭitōnu kalisi okē rūpamugā - viśvamugā, prapaṃcamugā, viśvarūpuḍugā nunnadi nēnē. ī vibhūtulanniyu nā viśvarūpamulōni bhāgamulē - nā viśvarūpamulōni bhāgamugā kānidi ēdiyunu lēdu. ī prapaṃcamulōnunna samasta bhūtamulu nā nālugu pādamulalō nokaṭi. migilina mūḍu pādamulu dyulōkamuna nunnavi “ani śruti ceppucunnadi. ī bhūtamulanniyu, vāṭitō kalisi ēkamaiyunna prapaṃcarūpamaṃtayu nālōnoka bhāgamu - migilina pādamulu dyulōkamuna nunnavi” ani śrīkṛṣṇabhagavānuḍu ceppenu -).
(sṛṣṭiki pūrvamu parabrahma okaḍēyuṃḍenu. tānē yī sṛṣṭilōni vastuvulanniṃṭigā mārenu. okē dīpamutō anēka vattulanu veligiṃci anēka dīpamulugā cēyunaṭlu okē parabrahma prapaṃcamulōni vastuvulanniṃṭigā māri, vāṭilō tānu pravēśiṃci, tana caitanyaśaktitō vāṭini prakāśiṃpacēyucunnāḍu. aṃducēta prapaṃcamulōnunna vastuvulanniṃṭilō nunnadi parabrahma yokka okē oka aṃśa. adi enni vastuvulanu sṛṣṭiṃci, vāṭilō pravēśiṃciyunnanu taraganidi, aṃtaṭa, anniṃṭilōnu okēsāri okē aṃśagā prakāśiṃcu cunnadi. aṃducēta sṛṣṭi aṃtayu - dānilōni vastuvulanniyu - okē dāninuṃḍi (okē bhagavaṃtuni nuṃḍi) puṭṭinavi. rūpamulu vērainanu, vāṭi nāmamulu vērainanu, manuṣyulu, paśuvulu, pannagamulu, koṃḍalu, ērulu, nakṣatramulu modalagu vastuvulanniyu okē vastuvunuṃḍi puṭṭinavē. ā vastuvē parabrahma - atani aṃśayē vīṭi anniṃṭilōnunnadi) (cūḍumu - ‘ātma’, ‘brahma’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.