హృదయ పుండరీకము -
“మనసి బ్రహ్మణో(అ)త్ర చైతన్య స్వరూపేణ నిత్యాభి వ్యక్తత్వాత్ బ్రహ్మణః పురం హృదయ పుండరీకం” (శ్రీశంకరః)
(చైతన్య స్వరూపముతో బ్రహ్మ మనస్సునందు నిత్యము వ్యక్తమగుటవలన (ఉన్నదని స్పష్టముగా తోచుటవలన) పద్మమువలెనున్న హృదయము బ్రహ్మపురము (బ్రహ్మ నివసించుస్థానము) అని చెప్పబడినది).
(శరీరములోనున్న జీవుడు బ్రహ్మ. అతనికి శరీరము పురము వంటిది. అందుచేత శరీరము బ్రహ్మపురము - బ్రహ్మ ఉండు స్థలము -, లేక పరబ్రహ్మ యొక్క పురము).
(ఇందులో బ్రహ్మ అభివ్యక్తమగుటవలన - (చేతనముద్వారా) శరీరము బ్రహ్మ పురమని చెప్పబడుచున్నది, ఈ శరీరములో హృదయపద్మమని ప్రసిద్ధికెక్కినది, మిక్కిలి చిన్నది, ఆ హృదయమందు అంతరాకాశము అనుపేర చెప్పబడుచున్నదానిలో బ్రహ్మను అన్వేష్టింపవలయును - అతను బాగుగా ఆలోచించి తెలుసుకోతగినవాడు).
(బ్రహ్మమే పురము, బ్రహ్మ అనే పురము బ్రహ్మపురము - సర్వవ్యవహారములకు ఆస్పదము కనుక శరీరము, లేక, హృదయ పుండరీకము - బ్రహ్మకు పురము వంటిది).
hṛdaya puṃḍarīkamu -
“manasi brahmaṇō(a)tra caitanya svarūpēṇa nityābhi vyaktatvāt brahmaṇaḥ puraṃ hṛdaya puṃḍarīkaṃ” (śrīśaṃkaraḥ)
(caitanya svarūpamutō brahma manassunaṃdu nityamu vyaktamaguṭavalana (unnadani spaṣṭamugā tōcuṭavalana) padmamuvalenunna hṛdayamu brahmapuramu (brahma nivasiṃcusthānamu) ani ceppabaḍinadi).
(śarīramulōnunna jīvuḍu brahma. ataniki śarīramu puramu vaṃṭidi. aṃducēta śarīramu brahmapuramu - brahma uṃḍu sthalamu -, lēka parabrahma yokka puramu).
(iṃdulō brahma abhivyaktamaguṭavalana - (cētanamudvārā) śarīramu brahma puramani ceppabaḍucunnadi, ī śarīramulō hṛdayapadmamani prasiddhikekkinadi, mikkili cinnadi, ā hṛdayamaṃdu aṃtarākāśamu anupēra ceppabaḍucunnadānilō brahmanu anvēṣṭiṃpavalayunu - atanu bāgugā ālōciṃci telusukōtaginavāḍu).
(brahmamē puramu, brahma anē puramu brahmapuramu - sarvavyavahāramulaku āspadamu kanuka śarīramu, lēka, hṛdaya puṃḍarīkamu - brahmaku puramu vaṃṭidi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.