“తద్బుద్ధయః = బ్రహ్మ చిత్తాః; తదాత్మనో = బ్రహ్మ స్వరూపాః; తన్నిష్ఠాః = శ్రవణాదిపరాః; తత్పరాయణాః = బ్రహ్మప్రేప్సవః, నిష్కామాః ఇతి యావత్” -
(బ్రహ్మ సంస్థమనగా ఇతర వ్యాపారము మాని బ్రహ్మమందే నిష్ఠకలిగియుండుట. ఇది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్తాశ్రమములకు సంభవింపదు - ఎందుచేతననగా - ఆయా ఆశ్రమములకు విధించబడిన కర్మలను చేయనియడల ప్రత్యవాయము కలుగును - కనుక, సన్యాసి సమస్త కర్మలను విడిచిపెట్టినందున అతనికి ప్రత్యవాయము కలుగదు - సన్యాసికి శమ దమాదులవలన కలిగిన తన ఆశ్రమధర్మములను చేయుటయే, బ్రహ్మ సంస్థ యందుండుటయే ధర్మము - ఇతరులకు యజ్ఞ యాగాదులు చేయుట ధర్మము - అవి చేయనిచో ప్రత్యవాయము కలుగును - శ్రుతి యీ విధముగా చెప్పుచున్నది - “న్యాసమే బ్రహ్మ, బ్రహ్మమే పరము, పరమే బ్రహ్మము - తపస్సు మొదలగునవి. సన్యాసము కంటె తక్కువైనవి. సన్యాసము వీటికంటె ఉత్కృష్టమైనది”.అనియు, “ఉపనిషత్తులలో బోధవలన కలిగిన జ్ఞానముచేత సంశయములు తీర్చుకొని నిశ్చయమైన జ్ఞానము గలవారు సన్యాసయోగమువలన శుద్ధసత్వగుణము గల యోగులు” అనియు మొదలగునవి కలవు. స్మృతులు ఈ రీతిగా చెప్పుచున్నవి - బ్రహ్మమందే మనస్సు కలవారు, బ్రహ్మస్వరూపమే అయిన వారు శ్రవణమననములు మొదలగు వాటియందు పరాయణత్వము గలవారు, అనగా, బ్రహ్మమును కోరువారు, నిష్కాములు, ఇట్టివారు బ్రహ్మ సంస్థులు).
బ్రహ్మసంస్థత్వమనగా సర్వభావములను పరబ్రహ్మమునందే నిలిపి ఇతర వ్యాపారములను మాని యుండుట
బ్రహ్మణి ప్రత్యగ్రూపే సంస్థా సమ్యక్ నిష్ఠా యస్య సః.
(పరబ్రహ్మయందు నిష్ఠకలిగియుండుట).
(బ్రహ్మమందు నిష్ఠగలవాడు శాశ్వతఫలమగుముక్తిని పొందును). (సంస్థ = సమాప్తి - బ్రహ్మయందు సమాప్తి యనగా వేరే వ్యాపారము లేకుండుట).
“tadbuddhayaḥ = brahma cittāḥ; tadātmanō = brahma svarūpāḥ; tanniṣṭhāḥ = śravaṇādiparāḥ; tatparāyaṇāḥ = brahmaprēpsavaḥ, niṣkāmāḥ iti yāvat” -
(brahma saṃsthamanagā itara vyāpāramu māni brahmamaṃdē niṣṭhakaligiyuṃḍuṭa. idi brahmacaryamu, gṛhasthāśramamu, vānaprastāśramamulaku saṃbhaviṃpadu - eṃducētananagā - āyā āśramamulaku vidhiṃcabaḍina karmalanu cēyaniyaḍala pratyavāyamu kalugunu - kanuka, sanyāsi samasta karmalanu viḍicipeṭṭinaṃduna ataniki pratyavāyamu kalugadu - sanyāsiki śama damādulavalana kaligina tana āśramadharmamulanu cēyuṭayē, brahma saṃstha yaṃduṃḍuṭayē dharmamu - itarulaku yajña yāgādulu cēyuṭa dharmamu - avi cēyanicō pratyavāyamu kalugunu - śruti yī vidhamugā ceppucunnadi - “nyāsamē brahma, brahmamē paramu, paramē brahmamu - tapassu modalagunavi. sanyāsamu kaṃṭe takkuvainavi. sanyāsamu vīṭikaṃṭe utkṛṣṭamainadi”.aniyu, “upaniṣattulalō bōdhavalana kaligina jñānamucēta saṃśayamulu tīrcukoni niścayamaina jñānamu galavāru sanyāsayōgamuvalana śuddhasatvaguṇamu gala yōgulu” aniyu modalagunavi kalavu. smṛtulu ī rītigā ceppucunnavi - brahmamaṃdē manassu kalavāru, brahmasvarūpamē ayina vāru śravaṇamananamulu modalagu vāṭiyaṃdu parāyaṇatvamu galavāru, anagā, brahmamunu kōruvāru, niṣkāmulu, iṭṭivāru brahma saṃsthulu).
brahmasaṃsthatvamanagā sarvabhāvamulanu parabrahmamunaṃdē nilipi itara vyāpāramulanu māni yuṃḍuṭa
brahmaṇi pratyagrūpē saṃsthā samyak niṣṭhā yasya saḥ.
(parabrahmayaṃdu niṣṭhakaligiyuṃḍuṭa).
(brahmamaṃdu niṣṭhagalavāḍu śāśvataphalamagumuktini poṃdunu). (saṃstha = samāpti - brahmayaṃdu samāpti yanagā vērē vyāpāramu lēkuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.